Ammonia gas leak
-
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో అమ్మోనియా గ్యాస్ లీక్.. 17 మందికి అస్వస్థత
పుణె: అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో మహారాష్ట్ర పుణె జిల్లాలోని ఓ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లోని 17 మంది కార్మికులు ఆసుపత్రి పాలయ్యారు. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భంద్‌గావ్‌లోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఓ యూనిట్లో బుధవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారాన్ని ఉత్పత్తి చేసే ఈ యూనిట్‌ను నిత్యం 18 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతను ఉంచడానికి అమ్మోనియా గ్యాస్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. అది ప్రమాదవశాత్తూ లీకైంది.ప్రమాద సమయంలో యూనిట్లో 25 మంది పనిచేస్తున్నారని.. వీరిలో చాలా మంది మహిళలేనని పోలీస్ ఇన్స్పెక్టర్ నారాయణ్ దేశ్‌ముఖ్ తెలిపారు. లీకైన తర్వాత అమ్మోనియా రెగ్యులేటర్‌ను వెంటనే ఆఫ్ చేసినట్లు వివరించారు. బాధిత కార్మికులను వేగంగా సమీపంలోని ఆసుపత్రికి తరలించామని.. అక్కడ వారు శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.అయితే గ్యాస్ లీక్ పాయింట్‌కు దగ్గరగా ఉన్న ఓ మహిళకు మాత్రం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని.. ఆమె ప్రాణాలకు ప్రమాదం లేదని డాక్టర్లు ధ్రువీకరించారని దేశ్‌ముఖ్ వెల్లడించారు. -
అమ్మోనియా గ్యాస్ లీక్.. 12 మందికి అస్వస్థత
చెన్నై: తమిళనాడులోని కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ పరిశ్రమ పైపులైన్ నుంచి అమ్మోనియా గ్యాస్ లీక్ అయింది. ఈ ప్రమాదంలో 12 మంది ఆసుపత్రి పాలైనట్లు పోలీసులు తెలిపారు. అమ్మోనియా అన్లోడ్ చేస్తున్న సబ్-సీ పైప్‌లైన్‌లో లీకులు ఏర్పడినట్లు సమాచారం. ఎన్నూర్‌లో ఉన్న కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఒక ప్రైవేట్ కంపెనీ. ఎరువులు తయారు చేస్తుంది. ఇందుకు అమ్మోనియాను ముడిసరుకుగా ఉపయోగిస్తారు. అయితే.. మంగళవారం అర్ధరాత్రి సమయంలో పరిశ్రమ పైప్‌లైన్ నుంచి అమ్మోనియా గ్యాస్ లీక్ అయింది. రాత్రి 12:45 సమయంలో పోలీసులకు సమచారం అందింది. పైప్‌లైన్ ప్రీ-కూలింగ్ ఆపరేషన్ సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. గ్యాస్ లీకేజీ వల్ల స్థానిక పెరియకుప్పం, చిన్నకుప్పం వంటి గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘాటైన వాసన రావడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడిందని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన ఆరోగ్య శాఖా అధికారులు.. ఆయా గ్రామాల్లో అంబులెన్స్‌లు, ఇతర ట్రాన్స్‌పోర్టు సదుపాయాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 12 మంది ఆస్పత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. గ్యాస్ లీకేజీతో స్థానిక గ్రామాల ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. సముద్ర తీరానికి సమీపంలో అమ్మోనియా అన్లోడ్ చేస్తున్న సబ్-సీ పైప్‌లైన్‌లో మంగళవారం రాత్రి 11.30 గంటలకు లీకు ఏర్పడినట్లు కోరమండల్ సంస్థ తెలిపింది. వెంటనే అమ్మోనియా సరఫరాను తక్కువ చేసి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చామని పేర్కొంది. ఘటనపై సంబంధిత అధికారులకు సమాచారం అందించామని వెల్లడించింది. కోరమండల్ ఎల్లప్పుడూ అత్యున్నత భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. వాహనదారులకు అవస్థలు -
చిత్తూరు: పాల ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజీ
-
చిత్తూరు: పాల ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజీ
సాక్షి, చిత్తూరు : జిల్లలోని పూతలపట్టు మండలంలో గురువారం రాత్రి అమ్మోనియం గ్యాస్ లీక్ కావడంతో 20మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో 100మందికి పైగా కార్మికులు ఉండగా వారిలో 14మంది మహిళా కార్మికులు ఆస్పత్రి పాలయ్యారు. పూతలపట్టు మండలం బండపల్లి హట్సన్ పాల డెయిరీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పాలు కోల్డ్ స్టోరేజ్ కోసం అమ్మోనియం వాయువును ఉపయోగిస్తుంటారు. ఆ వాయువు లీక్ కావడంతో 14మంది అస్వస్థతకు గురైయ్యారు. వెంటనే ఫ్యాక్టరీ నిర్వాహకులు చిత్తూరు, గుడిపాల ఆస్పత్రులకు తరలించారు. ఇద్దరు అపస్మారక స్థితిలో ఉన్నారు. పాల డెయిరీ ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తాతో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.మరోవైపు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా హట్సన్ పాల డెయిరీని పరిశీలించారు. అస్వస్థతకు గురైనవారికి మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. గ్యాస్ లీక్ సంఘటనపై ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సీరియర్ అయ్యారు. యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆయన వ్యాఖ్యానించారు. -
నంద్యాల గ్యాస్ లీక్: ఎన్నెన్నో లోపాలు
నంద్యాల శివారులోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫ్యాక్టరీ యాజమాన్యం నిబంధనలను గాలికి వదిలేసింది. కార్మికుల భద్రతను ఏ మాత్రమూ పట్టించుకోలేదు. ఫ్యాక్టరీలోని చాలా సామగ్రి తుప్పు పట్టి ఉంది. దాన్ని మార్చాలన్న ధ్యాస యాజమాన్యానికి లేకుండా పోయింది. చిన్నచిన్న షాపుల్లోనే ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేస్తుంటారు. అలాంటి ఇంత పెద్ద ఫ్యాక్టరీలో ఆక్సిజన్ సిలిండర్లు లేవంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు. నంద్యాల: ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీలోని డ్రై ఐస్ తయారీ యూనిట్లో శనివారం అమ్మోనియా గ్యాస్ లీకై మేనేజర్ శ్రీనివాసరావు మృతిచెందిన విషయం విదితమే. ఈ ఘటన నేపథ్యంలో ఫ్యాక్టరీలోని లోపాలు బయటకు వస్తున్నాయి. ఇందులో అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించామని డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకృష్ణారెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జిల్లా అధికారి గురుప్రసాద్, నంద్యాల అగి్నమాపక అధికారి యోగేశ్వరరెడ్డి తెలిపారు. ►ఫ్యాక్టరీలో పని చేసే ఉద్యోగులు, సిబ్బందికి భద్రత పరికరాలు (గ్లౌజులు, బూట్లు, అద్దాలు, మాసు్కలు) లేవు. ►అమ్మోనియా నిల్వ చేసుకోవాలంటే వైజాగ్‌లోని పీఈఎస్ఓ (పెట్రోలియం ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్) నుంచి అనుమతి తీసుకోవాలి. ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం ఎలాంటి అనుమతులూ తీసుకోలేదు. ►అమ్మోనియా ట్యాంకర్‌ను ఫ్యాక్టరీ బయట భాగంలో పెట్టాలి. కానీ ఇక్కడ లోపల ఉంచారు. ►అమ్మోనియా వాడే చోట యంత్రాలు ఎక్కువగా తుప్పుపడతాయి. వీటిని ఐదేళ్లకు ఒక సారి నిపుణులతో పరిశీలింపజేసి.. యంత్రాలు మారుస్తూ ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలను యాజమాన్యం తీసుకోలేదు. ►అమ్మోనియా గ్యాస్‌ను స్థానికంగా దొరికే సిలిండర్ల రూపంలో తెచ్చుకొని.. ట్యాంకర్లో నింపుతున్నారు. ఇలా చేయడం నేరం. ట్యాంకర్ వద్ద వాటర్ కటన్స్ పెట్టాల్సి ఉండగా.. వాటిని ఏర్పాటు చేయలేదు. ►ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అందరినీ జాగ్రత్త పరిచేందుకు ఏర్పాటు చేయాల్సిన సైరన్లు సైతం లేవు. ►సెల్ఫ్ కంటైన్డ్ బ్రీతింగ్ ఆపరేటర్లు (స్వీయ శ్వాస ఉపకరణాలు) లేవు. గాలిదిశ చూపే పరికరాలు అమర్చలేదు. ►మేనేజర్ శ్రీనివాసరావు అమ్మోనియ గ్యాస్ లీక్ అవుతుండటంతో ఆపడానికి పోయి అక్కడ అత్యవసర ద్వారం లేకపోవడంతో బయటకు రాలేక మృతి చెందినట్లు తెలుస్తోంది. ►ఫ్యాక్టరీలో అనుభవజ్ఞులైన ఉద్యోగులు కూడా లేరు. ►ఇంత పెద్ద ఫ్యాక్టరీకి అగ్నిమాపక శాఖ నుంచి ఇప్పటికీ ఎన్ఓసీ తీసుకోలేదు. ►ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థ పదార్థాలను శుద్ధి చేసే ఏర్పాటు లేదు. ►గతంలో అగి్నమాపకశాఖ, ఫ్యాక్టరీస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఇచ్చిన నోటీసులను సైతం యాజమాన్యం ఖాతరు చేయలేదు. ఉద్యోగి కుటుంబాన్ని ఆదుకోవడానికి మీనమేషాలు ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీక్ ఘటనలో మృతి చెందిన మేనేజర్ శ్రీనివాసరావు కుటుంబాన్ని ఆదుకోవడానికి ఫ్యాక్టరీ యాజమాన్యం మీనమేషాలు లెక్కించింది. శ్రీనివాసరావు పోస్టుమార్టం ముగిసిన తర్వాత కూడా ఆర్థిక సహాయం విషయంలో యాజమాన్యం స్పందించకపోవడంతో బాధితులు ఆందోళన చేశారు. రూ.2 కోట్ల నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. చివరకు రూ.50 లక్షల పరిహారం అందజేసేందుకు యాజమాన్యం అంగీకరించింది. ఫ్యాక్టరీ మూసివేతకు రంగం సిద్ధం ఎలాంటి భద్రత ప్రమాణాలు పాటించకుండా, అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్న ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీని మూసివేస్తామని కర్నూలు జిల్లా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకృష్ణారెడ్డి తెలిపారు. భద్రత ప్రమాణాలు పాటించడమే కాకుండా కారి్మకులకు అన్ని సౌకర్యాలు కలి్పంచి, అన్ని అనుమతులు తీసుకున్నాకే ఫ్యాక్టరీని తెరవడానికి అనుమతి ఇస్తామన్నారు. ఈ మేరకు సోమవారం ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఉత్తర్వులు పంపుతామని తెలిపారు. నేడు విచారణ కమిటీ రాక ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో జరిగిన గ్యాస్ లీకేజీ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ నియమించిన విచారణ కమిటీ సోమవారం ఫ్యాక్టరీలో విచారణ చేయనున్నట్లు నంద్యాల ఆర్డీఓ రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఫ్యాక్టరీలో పనులన్నీ నిలిపి వేశామన్నారు. తప్పిన భారీ ప్రమాదం ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో అమ్మోనియా వాల్వ్ పగిలి గ్యాస్ లీకైన ఘటనపై అధికారులు వెంటనే స్పందించడంతో భారీ ప్రమాదం తప్పింది. వంద కిలోల అమ్మోనియా లీక్ అయ్యింది. ఈ సమయంలో ఫ్యాక్టరీలో అనుభవజు్ఞలైన ఉద్యోగులు లేకపోవడంతో అమ్మోనియా సరఫరా అయ్యే పైపుల వాల్వ్‌లు ఎక్కడ ఉన్నాయో తెలియక అగ్నిమాపక సిబ్బంది మొదట ఇబ్బంది పడ్డారు. వెంటనే నంద్యాలకు చెందిన చిత్తూరు జిల్లా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివకుమార్‌రెడ్డి రంగంలోకి దిగి అమ్మోనియా గ్యాస్ వాల్వ్‌ను ఆఫ్ చేయించారు. ఆయన చొరవతో రెండు గంటల్లోనే లీకేజీని అదుపు చేశారు. -
ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో ‘అమ్మోనియా’ లీక్
నంద్యాల/కర్నూలు (సెంట్రల్): కర్నూలు జిల్లా నంద్యాల పట్టణ శివారులోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో శనివారం ఉదయం అమ్మోనియా గ్యాస్ లీకై ఒకరు మృతిచెందారు. మరో నలుగురు ఘటనా స్థలం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఫ్యాక్టరీ జనసేన పార్టీ నేత, మాజీ ఎంపీ దివంగత ఎస్పీవై రెడ్డి కుటుంబానికి చెందినది. ► శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో డ్రై ఐస్ తయారు చేసే యూనిట్లోకి నిర్వహణ పనుల నిమిత్తం మేనేజర్ శ్రీనివాసరావు(50), మరో నలుగురు సిబ్బంది వెళ్లారు. ► అమ్మోనియా గ్యాస్ సరఫరా అయ్యే పైపునకు వెల్డింగ్ చేస్తుండగా అది పగిలిపోయి గ్యాస్ ఒక్కసారిగా లీకైంది. జనరల్ మేనేజర్ అక్కడికక్కడే కుప్పకూలి మరణించగా, మిగిలిన నలుగురు తిప్పారెడ్డి, హరినారాయణ, రవి, తిరుమల బయటకు పరుగుదీసి ప్రాణాలు దక్కించుకున్నారు. మృతుడిది విజయవాడ కాగా, దాదాపు 15 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నారు. విషయం తెలియడంతో అదే ప్రాంగణంలోని ఇతర విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు భయంతో బయటకు పరుగులుదీశారు. ► కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ డాక్టర్ కె.ఫక్కీరప్ప, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, ఆర్డీవో రామకృష్ణారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ► మూడు ఫైరింజన్లు, రెండు అంబులెన్స్‌లను రప్పించారు. ఫైరింజన్లతో గ్యాస్ లీకయిన ప్రదేశంలో నీటిని చల్లించి.. గ్యాస్ మరింతగా వ్యాపించకుండా కట్టడి చేశారు. ► అగ్నిమాపక సిబ్బంది రెండు గంటల్లోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పరిసర ప్రాంతాల్లోని కార్మికులు, ప్రజలను అక్కడి నుంచి పంపించివేశారు. ► గ్యాస్ లీకేజీ ఘటనపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఇందుకోసం జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సోమశేఖరరెడ్డి నేతృత్వంలో నంద్యాల ఆర్డీవో రామకృష్ణారెడ్డి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నారాయణమ్మ, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ శేషగిరిరావు, జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ మునిప్రసాద్, నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డితో కమిటీని నియమించారు. ప్రజలకు ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని కలెక్టర్ చెప్పారు. కేసు నమోదు ► గ్యాస్ లీకైన ఘటనకు సంబంధించి యాజమాన్యంపై ఫ్యాక్టరీల చట్టంలోని సెక్షన్ 92, 284, 285, 304ఏ కింద కేసులు నమోదు చేసినట్టు నంద్యాల రూరల్ సీఐ దివాకర్‌రెడ్డి చెప్పారు. నిర్వహణ లోపాలే కారణం.. ► ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌లో అమ్మోనియో గ్యాస్ లీకేజీకి యాజమాన్య నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. చాలాకాలంగా ఉన్న నిర్వహణ లోపాలే ప్రస్తుత స్థితికి కారణమని అధికార వర్గాలంటున్నాయి. ► అమ్మోనియా గ్యాస్ వెళ్లే పైపులు పదేళ్ల కిందటివి. వీటిని మధ్యలో మార్చాల్సి ఉన్నా యాజమాన్యం పట్టించుకోకపోవడంతో అవి దెబ్బతిన్నాయి. ► ఇలాంటి ప్రదేశాల్లో కూలింగ్ సిస్టం ఉపయోగించాలి. ఇక్కడ ఆ ఊసే లేదు. ► అమ్మోనియా గ్యాస్ డిటెక్టర్లుంటే.. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే అవి మోగుతాయి. సిబ్బంది అప్రమత్తం అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. కనీసం అగ్నిమాపక పరికరాలను కూడా ఏర్పాటు చేసుకోలేదు. ఫ్యాక్టరీ నుంచి రసాయనాలు లీక్ అవుతున్నాయని, పట్టణం వరకూ దుర్వాసన వస్తోందంటూ ప్రజలు గతంలో పలుమార్లు యాజమాన్యం దృష్టికి తెచ్చారు. అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ► ఈ నేపథ్యంలోనే ఈ నెల 11వ తేదీన జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తనిఖీలు నిర్వహించారు. మండలి జేసీఈఈ(జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్) వెంకటేశ్వరరావు, ఈఈ మునిప్రసాద్, ఆర్వో గణేష్‌ల బృందం పలు విభాగాలను పరిశీలించింది. ► నెలరోజుల్లోగా నిర్వహణ లోపాలు సరిచేసుకోవాలంటూ యాజమాన్యానికి నోటీసులు కూడా ఇచ్చింది. లేకుంటే ఫ్యాక్టరీని సీజ్ చేసేందుకు కూడా వెనుకాడేదిలేదంటూ జేసీఈఈ హెచ్చరించారు. ► ఆ హెచ్చరికలను ఫ్యాక్టరీ యాజమాన్యం పెడచెవిన పెట్టింది. ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతంలో శుక్రవారం నుంచే గ్యాస్ కొద్ది కొద్దిగా లీకైనట్టు తమ దృష్టికి వచ్చిందని జేసీఈఈ తెలిపారు. ► నిర్వహణ సిబ్బందికి అవసరమైన రక్షణ పరికరాలు కూడా యాజమాన్యం సమకూర్చకపోవడం వల్ల ప్రాణనష్టం సంభవించినట్టు ఆయన అభిప్రాయపడ్డారు. -
కుప్పకూలిన కోల్డ్ స్టోరేజీ భవనం
-
కుప్పకూలిన కోల్డ్ స్టోరేజీ భవనం
- శిథిలాల కింద పలువురు కాన్పూర్: ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్ జిల్లాలోని శివ్‌రాజ్‌పూర్‌లో ఉన్న ఓ కోల్డ్ స్టోరేజీ భవనం బుధవారం కుప్పకూలింది. బంగాళాదుంప పంటను కోల్డ్ స్టోరేజీ భవనంలో నిల్వ ఉంచడానికి రైతులు వచ్చినపుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో చాలా మంది రైతులు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 12 మందిని శిథిలాల నుంచి రక్షించారు. శీతలీకరణ ప్లాంట్‌లో అమ్మోనియం గ్యాస్ లీకవడం వల్ల పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కోల్డ్ స్టోరేజీ యజమాని, ఆయన కుమారుడు, కోల్డ్ స్టోరేజీ సిబ్బంది(ఏడుగురు)తో పాటు పలువురు రైతులు ఇంకా శిథిలాల కిందే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అమ్మోనియం గ్యాస్ ఇంకా లీకవుతూ ఉండడం వల్ల సహాయక చర్యలకు విఘాతం కలుగుతోంది. కాన్పూర్ నుంచి మాస్క్‌లు వచ్చిన వెంటనే రక్షణ చర్యలు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. -
అమ్మోనియం గ్యాస్ లీకై నలుగురికి అస్వస్థత
ఒంగోలు: ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం మున్నంగి సీఫుడ్స్‌లో బుధవారం తెల్లవారుజామున అమ్మోనియం గ్యాస్ లీకు అయింది. ఈ నేపథ్యంలో నలుగురు సిబ్బంది తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. దీంతో సహచర సిబ్బంది వెంటనే అప్రమత్తమై... వారిని ఒంగోలు నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.