కుప్పకూలిన కోల్డ్ స్టోరేజీ భవనం
- శిథిలాల కింద పలువురు
కాన్పూర్: ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్ జిల్లాలోని శివ్‌రాజ్‌పూర్‌లో ఉన్న ఓ కోల్డ్ స్టోరేజీ భవనం బుధవారం కుప్పకూలింది. బంగాళాదుంప పంటను కోల్డ్ స్టోరేజీ భవనంలో నిల్వ ఉంచడానికి రైతులు వచ్చినపుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో చాలా మంది రైతులు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 12 మందిని శిథిలాల నుంచి రక్షించారు. శీతలీకరణ ప్లాంట్‌లో అమ్మోనియం గ్యాస్ లీకవడం వల్ల పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కోల్డ్ స్టోరేజీ యజమాని, ఆయన కుమారుడు, కోల్డ్ స్టోరేజీ సిబ్బంది(ఏడుగురు)తో పాటు పలువురు రైతులు ఇంకా శిథిలాల కిందే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అమ్మోనియం గ్యాస్ ఇంకా లీకవుతూ ఉండడం వల్ల సహాయక చర్యలకు విఘాతం కలుగుతోంది. కాన్పూర్ నుంచి మాస్క్‌లు వచ్చిన వెంటనే రక్షణ చర్యలు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.