Cold storage building collapses
-
యూపీలో ఆలూ కోల్డ్స్టోరేజీలో ప్రమాదం
లక్నో: ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలో బంగాళదుంపలు నిల్వ చేసే ఒక కోల్డ్ స్టోరేజీ పైకప్పు కుప్పకూలిపోయిన ఘటనలో 14 మంది మరణించారు. చాందౌసీ పోలీసు స్టేషన్ పరిధిలో ఇందిరా రోడ్డులో ఉన్న ఈ కోల్డ్ స్టోరేజీ పై కప్పు గురువారం రాత్రి హఠాత్తుగా కుప్పకూలింది. ఆ సమయంలో కోల్డ్ స్టోరేజీ లోపల ఆలూ బస్తాలను అన్లోడ్ చేస్తున్న వర్కర్లు శిథిలాల కింద చిక్కుకున్నారు. సహాయ సిబ్బంది 24 మందిని ఆలూ బస్తాల నుంచి బయటకు తీసుకురాగా వారిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి అయ్యాయని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) ఆఫ్ పోలీసు శలభ మాథూర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆస్పత్రిని సందర్శించిన యోగి బాధితుల్ని పరామర్శించారు. ఈ ప్రమాదం ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి ఒక కమిటీ వేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం, గాయపడిన వారికి చికిత్స కోసం రూ.50 వేలు ప్రకటించారు. ప్రమాదం జరిగిన సమయంలో కోల్డ్ స్టోరేజీలో ఉన్న వారిలో ఆరుగురు స్వల్పగాయాలకు చికిత్స తీసుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా మరో నలుగురికి చికిత్స జరుగుతోందని జిల్లా మేజిస్ట్రేట్ మనీష్ బన్సల్ తెలిపారు. పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారం ఈ కోల్డ్ స్టోరేజీని మూడు నెలల క్రితమే నిర్మించారు. ప్రభుత్వం దగ్గర్నుంచి సరైన అనుమతులు లేకుండానే హడావుడిగా దీని నిర్మాణం కొనసాగించినట్టు పోలీసులు చెప్పారు. అంతేకాకుండా కోల్డ్ స్టోరేజీ సామర్థ్యానికి మించి బంగాళ దుంప బస్తాలు నిల్వ చేసినట్టుగా తెలుస్తోంది. ఇవే ప్రమాదానికి దారి తీసినట్టు భావిస్తున్నారు. -
స్వప్నలోక్ ప్రమాదం బాధించింది: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఘటనలో ప్రాణాలు పోవడం తనను ఎంతో బాధించిందన్న ఆయన.. బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ.. గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇక స్వప్నలోక్ కాంప్లెక్స్ ఘటనలో బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి బాధిత కుటుంబాలకు ఆ సాయం అందజేయనున్నట్లు.. అలాగే గాయపడిన వాళ్లకు రూ.50వేల సాయం అందించనున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఉత్తర ప్రదేశ్లో ఇవాళ ఘోరం జరిగింది. సంబల్లోని చందౌసి ప్రాంతంలో బంగాళాదుంప కోల్డ్ స్టోరేజ్ కుప్పకూలి ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన నుంచి మరో పదకొండు మందిని రక్షించారు. ఈ ఘటనపైనా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని, పీఎంఎన్ఆర్ఎఫ్ సాయం ప్రకటించారు. Pained by the loss of lives due to a fire tragedy in Swapnalok Complex, Secunderabad. My thoughts are with the bereaved families. May the injured recover soon: PM @narendramodi — PMO India (@PMOIndia) March 17, 2023 PM @narendramodi has announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF to the next of kin of each deceased in the tragedies in Chandausi and Secunderabad. Those injured would be given Rs. 50,000. — PMO India (@PMOIndia) March 17, 2023 -
కుప్పకూలిన కోల్డ్ స్టోరేజీ భవనం
-
కుప్పకూలిన కోల్డ్ స్టోరేజీ భవనం
- శిథిలాల కింద పలువురు కాన్పూర్: ఉత్తర్ప్రదేశ్ కాన్పూర్ జిల్లాలోని శివ్రాజ్పూర్లో ఉన్న ఓ కోల్డ్ స్టోరేజీ భవనం బుధవారం కుప్పకూలింది. బంగాళాదుంప పంటను కోల్డ్ స్టోరేజీ భవనంలో నిల్వ ఉంచడానికి రైతులు వచ్చినపుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో చాలా మంది రైతులు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 12 మందిని శిథిలాల నుంచి రక్షించారు. శీతలీకరణ ప్లాంట్లో అమ్మోనియం గ్యాస్ లీకవడం వల్ల పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కోల్డ్ స్టోరేజీ యజమాని, ఆయన కుమారుడు, కోల్డ్ స్టోరేజీ సిబ్బంది(ఏడుగురు)తో పాటు పలువురు రైతులు ఇంకా శిథిలాల కిందే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అమ్మోనియం గ్యాస్ ఇంకా లీకవుతూ ఉండడం వల్ల సహాయక చర్యలకు విఘాతం కలుగుతోంది. కాన్పూర్ నుంచి మాస్క్లు వచ్చిన వెంటనే రక్షణ చర్యలు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.