unit
-
రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ లో విషవాయువులు లీక్
-
బీరూట్‌పై ఇజ్రాయెల్ దాడి.. హెజ్బొల్లా నేత మృతి
హెజ్బొల్లా లక్ష్యంగా లెబనాన్‌లోని బీరూట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఆపటం లేదు. బీరూట్‌లో ఉన్న హిజ్బొల్లా ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై గురువారం వైమానిక దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ శుక్రవారం ప్రకటించింది. ఈ దాడుల్లో హిజ్బొల్లా కమ్యూనికేషన్స్ నెట్వర్క్ చీఫ్ మహ్మద్ రషీద్ సకాఫీ హతమైనట్లు వెల్లడించింది.ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ వివరాల ప్రకారం.. బీరూట్‌పై గురువారం ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ దాడులు నిర్వహించింది. హెజ్బొల్లా రహస్య స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులను ఇజ్రాయెల్ సైన్యం చేపట్టింది. ఇక.. తమ దాడుల్లో మృతి చెందిన మహ్మద్ రషీద్ సకాఫీ.. 2000 సంవత్సరంలో హెజ్బొల్లాకు కమ్యూనికేషన్స్ నెట్వర్క్ చీఫ్‌గా నియమితులయ్యారు.🔴Mohammad Rashid Sakafi, the Commander of Hezbollah’s Communications Unit, during a precise, intelligence-based strike in Beirut yesterday. Sakafi was a senior Hezbollah terrorist, who was responsible for the communications unit since 2000. Sakafi invested significant efforts… pic.twitter.com/PH65nh5FLI— Israel Defense Forces (@IDF) October 4, 2024 ఆయన హెజ్బొల్లాలో సీనియర్ నేతలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారని ఐడీఎఫ్ పేర్కొంది. అన్ని కార్యక్రమాలకు కమ్మూనికేషన్ వ్యవస్థలను నిర్వహించటంలో సకాఫీ.. హిజ్బొల్లాకు కీలకంగా వ్యవహరించేవారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.చదవండి: మా శత్రువులను ఓడిస్తాం: ఇరాన్ సుప్రీం లీడర్ -
నేడు యాదాద్రిలో యూనిట్–2 సింక్రనైజేషన్
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని 800 మెగావాట్ల రెండో యూనిట్‌కు బుధవారం కీలకమైన సింక్రనైజేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా యూనిట్‌కి సంబంధించిన జనరేటర్‌ను విద్యుత్ సరఫరా వ్యవస్థ(గ్రిడ్)కు అనుసంధానం చేసి పరీక్షిస్తారు. జనరేటర్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ గ్రిడ్ ఫ్రిక్వెన్సీ, వోల్టేజీ, ఫేజ్ యాంగిల్స్‌తో మ్యాచ్ అయితే సింక్రనైజేషన్ విజయవంతమైనట్టుగా ప్రకటిస్తారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి విద్యుత్ కేంద్రానికి చేరుకొని సింక్రనైజేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. సింక్రనైజేషన్ తర్వాత కమిషనింగ్, కమర్షియల్ ఆపరేషన్ డేట్ (సీఓడీ) ప్రక్రియలను పూర్తి చేస్తేనే యూనిట్ నిర్మాణం విజయవంతంగా పూర్తయినట్టు భావిస్తారు. కమిషనింగ్లో భాగంగా ఎలక్రి్టకల్, మెకానికల్, కంట్రోల్ యూనిట్స్, ఇతర అన్ని విభాగాలు విద్యుదుత్పత్తికి సిద్ధంగా ఉన్నాయా.. లేదా..అని పరీక్షిస్తారు. ఇందుకుగాను ఆయా విభాగాల పనులు సంపూర్ణంగా పూర్తి కావాల్సి ఉంటుంది. కమిషనింగ్ తర్వాత విద్యుదుత్పత్తి కొనసాగినా, విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తయినట్టు భావించరు. పూర్తి స్థాపిత సామర్థ్యంతో నిరంతరంగా 72 గంటలపాటు యూనిట్లో విద్యుదుత్పత్తి జరిగితేనే సీఓడీ ప్రక్రియ విజయవంతమైనట్టు భావిస్తారు. ఈ క్రమంలో కొత్త విద్యుత్ కేంద్రంలో బయటపడే ఒక్కో లోపాన్ని సరిదిద్దుకుంటూ పోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సీఓడీ ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని నెలల సమయం పట్టే అవకాశముంది. అక్టోబర్‌లో 2 యూనిట్లు పూర్తి కావాలి యూనిట్–1, యూనిట్–2లు అక్టోబర్ 24, యూనిట్–3 వచ్చే ఏడాది ఫిబ్రవరి, యూనిట్–4 మార్చి, యూనిట్ –5 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని జెన్కో లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని యూనిట్లకు సింక్రనైజేషన్, కమిషనింగ్, సీఓడీ నిర్వహించాల్సి ఉంది. నల్లగొండ జిల్లా దామరచర్లలో జెన్కో ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 4000(5 ్ఠ800) మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి సంబంధించి రూ.29,965 కోట్ల అంచనాలతో నిర్మాణ పనులు ప్రారంభించగా, తాజాగా వ్యయం రూ.34,543 కోట్లకు చేరింది. ఇప్పటివరకు రూ.27,486 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. వాస్తవానికి 2021 అక్టోబర్–2022 అక్టోబర్ మధ్యకాలంలో అన్ని యూనిట్లు పూర్తికావాల్సి ఉండగా, తీవ్ర జాప్యం జరిగింది. -
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో అమ్మోనియా గ్యాస్ లీక్.. 17 మందికి అస్వస్థత
పుణె: అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో మహారాష్ట్ర పుణె జిల్లాలోని ఓ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లోని 17 మంది కార్మికులు ఆసుపత్రి పాలయ్యారు. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భంద్‌గావ్‌లోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఓ యూనిట్లో బుధవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారాన్ని ఉత్పత్తి చేసే ఈ యూనిట్‌ను నిత్యం 18 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతను ఉంచడానికి అమ్మోనియా గ్యాస్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. అది ప్రమాదవశాత్తూ లీకైంది.ప్రమాద సమయంలో యూనిట్లో 25 మంది పనిచేస్తున్నారని.. వీరిలో చాలా మంది మహిళలేనని పోలీస్ ఇన్స్పెక్టర్ నారాయణ్ దేశ్‌ముఖ్ తెలిపారు. లీకైన తర్వాత అమ్మోనియా రెగ్యులేటర్‌ను వెంటనే ఆఫ్ చేసినట్లు వివరించారు. బాధిత కార్మికులను వేగంగా సమీపంలోని ఆసుపత్రికి తరలించామని.. అక్కడ వారు శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.అయితే గ్యాస్ లీక్ పాయింట్‌కు దగ్గరగా ఉన్న ఓ మహిళకు మాత్రం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని.. ఆమె ప్రాణాలకు ప్రమాదం లేదని డాక్టర్లు ధ్రువీకరించారని దేశ్‌ముఖ్ వెల్లడించారు. -
రాష్ట్రంలోనూ పంటల బీమా!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే పంటల బీమా పథకాన్ని అమలు చేసే యోచనలో ఉంది. రైతు యూని ట్‌గా దీని రూపకల్పనకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చాక పంటల బీమా పథకంపై ఒక నిర్ణయానికి వస్తామని అధికారులు చెబుతున్నారు. వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఈ పథకం అమలు జరిగేలా కార్యా చరణ ఉంటుందన్నారు. పంటల బీమా అమలు లోకి వస్తే ప్రకృతి విపత్తులతో పంట నష్టం జరిగే రైతులకు ఆర్థికసాయం చేసేందుకు వీలుంటుంది. పంటల బీమాలో రైతులు కొంత ప్రీమియం భరిస్తే, ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో తన వాటాగా చెల్లి స్తుంది. పంటల బీమాను అమలు చేసే కంపెనీలతో ఒప్పందం చేసుకుంటారు. ఆ ప్రకారం కంపెనీలు పంట నష్టం జరిగితే రైతులకు పరిహారం ఇవ్వాలి. అయితే రైతులపై ఏమాత్రం ప్రీమియం భారం పడకుండా ప్రభుత్వమే అంతా చెల్లిస్తేనే ప్రయోజన ముంటుందని అధికారులు అంటున్నారు. పంటల బీమా లేక రైతుల అవస్థ: కేంద్రం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఉంది. ఇది 2016–17 రబీ నుంచి ప్రారంభమైంది. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు దీనిని ఏర్పాటు చేశారు. 2019–20 వరకు ఈ పథకంలో తెలంగాణ రాష్ట్రంలో కొనసాగింది. అయితే ఈ పథకం కంపెనీలనే బాగుపర్చుతుందన్న భావనతో రాష్ట్ర ప్రభుత్వం 2020లో ఫసల్ బీమా నుంచి తప్పుకుంది. అప్పటి నుంచి విపత్తులకు పంట నష్టపోయిన రైతులు ఆర్థిక సాయం అందే అవకాశమే లేకుండా పోయింది. 2020–21 వానాకాలం, యాసంగి సీజన్లు కలిపి 9 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. 2021–22లోనూ 12 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కానీ రైతులకు ఒక్కపైసా నష్టపరిహారం అందలేదు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో వడగళ్లు, భారీ వర్షాలకు జరిగిన పంట నష్టం జరిగింది. దాదాపు 10 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేయగా, చివరకు వ్యవసాయశాఖ 2.30 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు తేల్చింది. ఎకరాకు ప్రభుత్వం రూ.10 వేల చొప్పున రైతులకు రూ. 230 కోట్లు పరిహారంగా ప్రకటించింది. ఇక మొన్నటికి మొన్న ఈ నెల మొదటివారంలో రాష్ట్రంలో తుపాను కారణంగా వివిధ రకాల పంటలకు దాదాపు 5 లక్షల ఎకరాల్లో నష్టం జరిగింది. కానీ రైతులకు ఎలాంటి ఆర్థిక చేయూత అందలేదు. వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడంలోనూ విఫలమైంది. ఇలా ప్రతీ ఏడాది రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది. పంటల బీమాతోనే రైతులకు మేలు ఫసల్ బీమాకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక పంటల బీమా పథకం ప్రవేశపెడితే ఎలా ఉంటుందన్న దానిపై గత ప్రభుత్వ హయాంలోనే కసరత్తు జరిగింది. గ్రామం యూనిట్‌గా కాకుండా రైతు యూనిట్‌గా దీనిని ప్రవేశపెట్టాలని అనుకున్నారు. కానీ అమలుకు నోచుకోలేదు. ఇప్పటికే రెండు మూడు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలతో విసిగివేసారి బయటకు వచ్చి, సొంత పథకాలను రూపొందించుకున్నాయి. బెంగాల్ ప్రభుత్వం విజయవంతంగా సొంత పథకాన్ని అమలు చేస్తుంది. అక్కడ అధ్యయనం చేసి, ఆ ప్రకారం ముందుకు సాగాలని అధికారులు అనుకున్నారు. కానీ ఏదీ ముందుకు పడలేదు. కేంద్ర ఫసల్ బీమా పథకం వల్ల కంపెనీలకు లాభం జరిగిందనేది వాస్తవమే కావొచ్చు. కానీ ఎంతో కొంత రైతులకు ప్రయోజనం జరిగిందని కూడా రైతు సంఘాలు అంటున్నాయి. ► 2016–17లో తెలంగాణలో వివిధ కారణాలతో 1.58 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దీంతో 2.35 లక్షల మంది రైతులు రూ. 178 కోట్లు నష్టపరిహారం పొందారు. ► 2017–18లో వివిధ కారణాలతో 3.18 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో 4.42 లక్షల మంది రైతులు రూ. 639 కోట్లు పరిహారం పొందారు. ► 2018–19లో 1.2 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరగ్గా, 2.2 లక్షల మంది రైతులు రూ. 570 కోట్ల పరిహారం పొందారు. ► 2019–20లో 2.1 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరగ్గా, 3.24 లక్షల మంది రైతులు రూ. 480 కోట్ల పరిహారం పొందారు. ►ఫసల్ బీమా పథకం నుంచి తప్పుకున్న తర్వాత వ్యవసాయశాఖ నష్టం అంచనాలు వేయడం కూడా నిలిపివేసింది. దీంతో రైతులు నష్టపోతూనే ఉన్నారు. -
ప్రపంచంలోనే అతి పెద్దది.. ఏపీలో ఎలక్ట్రిక్ వాహన యూనిట్
సాక్షి, అమరావతి: జర్మనీకి చెందిన ప్రముఖ విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీ సంస్థ పెప్పర్ మోషన్ ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తోంది. చైనా వెలుపల ఈ స్థాయిలో భారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నామని, ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరినట్లు పెప్పర్ మోషన్ జీఎంబీహెచ్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ భారీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు జిల్లా పుంగనూరులో 800 ఎకరాలు కేటాయించడంతో పాటు పలు రాయితీలను ఇచ్చింది. సుమారు రూ.4,640 కోట్లు (600 మిలియన్ అమెరికన్ డాలర్లు) పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ పరిశ్రమ ద్వారా 8080 మందికి ఉపాధి లభిస్తుంది. టెస్లా మాదిరి అంతర్జాతీయ ప్రమాణాలతో సమీకృత ఎలక్ట్రిక్ బస్ అండ్ ట్రక్ తయారీ యూనిట్‌తో పాటు డీజిల్ బస్సులు, ట్రక్కులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే రిట్రో ఫిట్టింగ్, 20 జీడబ్ల్యూహెచ్ సామర్థ్యం ఉండే బ్యాటరీ తయారీ యూనిట్, విడిభాగాల తయారీ యూనిట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. పరిశ్రమలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న ప్రోత్సాహం, ఆయన తీసుకుంటున్న ప్రగతిశీల ఆరి్థక విధానాలకు తోడు పోర్టులు, పారిశ్రామిక మౌలిక వసతులు పెద్ద ఎత్తున సమకూరుస్తుండటంతో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకున్నట్లు పెప్పర్ మోషన్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఆండ్రియాస్ హేగర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. యూనిట్ ఏర్పాటుకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. 2025 నాటికి ఉత్పత్తి ప్రారంభం ఈ నెలాఖరులో యూనిట్ నిర్మాణం ప్రారంభించనున్నట్లు సంస్థ తెలిపింది. 2025 ప్రారంభం నాటికి వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. 2027 నాటికి ఏటా 50,000 కంటే ఎక్కువ బస్సులు, ట్రక్కులు తయారు చేసే సామర్థ్యానికి యూనిట్ చేరుకుంటుందని వెల్లడించింది. ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాలను కూడా ఇక్కడే ఉత్పత్తి చేసి, అంతర్జాతీయంగా సరఫరా చేయనున్నట్లు తెలిపింది. దేశంలోని పలు రాష్ట్రాల రవాణా సంస్థలు, ప్రైవేటు సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ఆసక్తిని వ్యక్తం చేస్తున్నాయని, ఇది తమ వ్యాపార విస్తరణకు కలిసొచ్చే అంశమని పెప్పర్ ఆ ప్రకటనలో పేర్కొంది. -
చిప్ ప్లాంట్‌కు వేదాంత ఫాక్స్‌కాన్ మళ్లీ దరఖాస్తు
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ల తయారీ ప్లాంట్లకు సంబంధించి కేంద్రం కొత్త మార్గదర్శకాలను ప్రకటించిన నేపథ్యంలో దానికి అనుగుణంగా తమ దరఖాస్తును మళ్లీ దాఖలు చేసినట్లు వేదాంత ఫాక్స్‌కాన్ జాయింట్ వెంచర్ సంస్థ వెల్లడించింది. 2027 నాటికి ఉత్పత్తి ప్రారంభించేలా రూ. 1.5 లక్షల కోట్లతో ఎలక్ట్రానిక్ చిప్ ప్లాంటును నెలకొల్పనున్నట్లు కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశీయంగా చిప్ తయారీని ప్రోత్సహించే దిశగా సెమీకండక్టర్ ఫ్యాబ్‌ల ఏర్పాటుకు ఇచ్చే ఆర్థిక ప్రోత్సాహకాలను కేంద్రం 30 శాతం నుంచి 50 శాతానికి ఇటీవల పెంచింది. దీంతో గతంలో సమర్పించిన దరఖాస్తును ఉపసంహరించుకుని వేదాంత ఫాక్స్‌కాన్ తాజాగా మరోసారి దాఖలు చేసింది. 2027 ప్రథమార్ధంలో 5,000 వేఫర్లతో ప్రారంభించి .. నెలకు 40,000 వేఫర్ల స్థాయికి ఉత్పత్తిని పెంచుకోనున్నట్లు వేదాంత ఫాక్స్‌కాన్ సంస్థ సీఈవో డేవిడ్ రీడ్ వెల్లడించారు. -
కమర్షియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ముఖేశ్ అంబానీ
సాక్షి,ముంబై: బిలియనీర్, పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపార విస్తరణలో దూసుకుపోతోంది. కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగానికి పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో తాజాగా ఈ వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. ఇందుకోసం రిలయన్స్ ఆర్ఎస్ఏయూఎల్ (RSOUL) లిమిటెడ్ అనే కొత్త యూనిట్‌ను స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లలో ప్రకటించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ బీఎస్ఈ ఫైలింగ్ ప్రకారం, రిలయన్స్ సోయు లిమిటెడ్ (Reliance SOU Ltd ) అనే పూర్తిగా యాజమాన్య అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. తద్వారా వాణిజ్య రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దూకుడుగా వస్తోంది. ఈ సంస్థలో (ఆర్ఎస్ఓఎల్ ఈక్విటీ షేర్లలో) రూ. ఒక లక్ష ప్రారంభ మూలధనాన్ని పెట్టుబడి పెట్టినట్లు తెలిపింది. అయితే రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ డెవలప్మెంట్ రంగంలో రిలయన్స్‌ది ఇదే మొదటి అడుగు కాదు. 2019లో, ముంబై వ్యాపార కేంద్రమైన బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లో 65శాతం వాటాను రూ.1,105 కోట్లకు కొనుగోలు చేసింది. నెల తరువాత, ఇది రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం రిలయన్స్ నవీ ముంబై ఇన్ఫ్రా డెవలప్మెంట్ను స్థాపించింది. జియో వరల్డ్ గార్డెన్ బాంద్రా కుర్లాలోని జియో వరల్డ్ సెంటర్ వంటి ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. అలాగే గత ఏడాది సెప్టెంబర్ నాటికి రూ. 8,000 కోట్ల పెట్టుబడితో రిలయన్స్ అనుబంధ సంస్థ, మోడల్ ఎకనామిక్ టౌన్షిప్ లిమిటెడ్ (METL), ప్రస్తుతం హర్యానాలోని ఝజ్జర్‌లో సమీకృత పారిశ్రామిక టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేస్తోంది. తాజా నిర్ణయంతో కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో అదానీ ప్రాపర్టీస్, టాటా రియల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, షాపూర్జీ పల్లోంజీ అండ్ కో వంటి దిగ్గజాలతో గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా. -
కొత్త కేంద్రం ఏర్పాటులో అంతర్జాతీయ ఐవోటీ సంస్థ హోగర్ కంట్రోల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌లో అసెంబ్లింగ్ యూనిట్, ఆర్అండ్డీ కేంద్రాలున్న అంతర్జాతీయ ఐవోటీ సంస్థ హోగర్ కంట్రోల్స్ తాజాగా కొత్త కేంద్రం ఏర్పాటుపై కసరత్తు చేస్తోంది. దీనితో ప్రత్యక్షంగా 50 పైగా ఉద్యోగాల కల్పన జరగగలదని సంస్థ సీఈవో విష్ణు రెడ్డి తెలిపారు. హోమ్ ఆటోమేషన్ సంబంధ స్మార్ట్ డివైజ్‌ల తయారీ తదితర కార్యకలాపాలకు ఇది ఉపయోగపడనుందని వివరించారు. ప్రస్తుతం ఉప్పల్‌లోని తమ కేంద్రంలో .. 100 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. దీని వార్షిక తయారీ సామర్థ్యం 6 లక్షల యూనిట్లని పేర్కొన్నారు. 2019లో హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించినప్పట్నుంచి సుమారు రూ. 100 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు విష్ణు రెడ్డి వివరించారు. ప్రస్తుతం టర్నోవరు 2.5 మిలియన్ డాలర్లుగా ఉండగా దీన్ని రెట్టింపు స్థాయికి 5 మిలియన్ డాలర్లకు పెంచుకోనున్నట్లు చెప్పారు. హోమ్ ఆటోమేషన్ సంబంధ ప్రైమాప్లస్ స్మార్ట్ టచ్ ప్యానెల్ ఉత్పత్తుల శ్రేణిని ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. సాధారణ లైట్లు, ఫ్యాన్లు మొదలైన వాటిని కూడా స్మార్ట్ ఉపకరణాలుగా మార్చేందుకు ఇది ఉపయోగపడగలదని విష్ణు రెడ్డి పేర్కొన్నారు. -
ఏపీలో దివీస్ కొత్త ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ రంగ సంస్థ దివీస్ ల్యాబొరేటరీస్ మరో ప్లాంటును నెలకొల్పుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో ఉన్న తొండంగి మండలం ఒంటిమామిడి గ్రామం వద్ద ఇది ఏర్పాటు కానుంది. యూనిట్–3 ఫెసిలిటీ కోసం రూ.1,500 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు కంపెనీ మంగళవారం ప్రకటించింది. డిసెంబర్ 7న నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్టు తెలిపింది. అంతర్గత వనరులను దశలవారీగా ఈ కేంద్రం కోసం వెచ్చించనున్నట్టు వెల్లడించింది. ప్రాజెక్టులో తొలి దశ కార్యకలాపాలు 12-18 నెలల్లో మొదలుకానున్నాయి. తయారీ ప్లాంటు ఏర్పాటుకు కావాల్సిన లైసెన్సులను కేంద్ర ప్రభుత్వంతోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి అందుకున్నట్టు దివీస్ వెల్లడించింది. కాగా, మంగళవారం కంపెనీ షేరు ధర 0.36% ఎగసి రూ.3,620.50 వద్ద స్థిరపడింది. -
ఔషధ దిగ్గజానికి కరోనా సెగ: ప్లాంట్ మూత
సాక్షి, గాంధీనగర్: ప్రముఖ ఔషధ తయారీ సంస్థ లుపిన్కు కరోనా మహమ్మారి సెగ తాకింది. గుజరాత్, అంకలేశ్వర్‌లోని సంస్థకు చెందిన తయారీ ప్లాంట్‌లో సిబ్బందికి కోవిడ్-19 పాజిటివ్ రావడంతో ప్లాంట్‌ను తాత్కాలికంగా మూసివేసింది. (కరోనాపై పోరులో మహిళా అధికారి కన్నుమూత) దేశీయ టాప్ అయిదు సంస్థల్లో ఒకటైన లుపిన్ మందుల తయారీ కర్మాగారంలో 18మంది ఉద్యోగులకు కరోనా సోకింది. దీంతో తన ప్లాంట్‌ను మూసివేయాల్సి వచ్చింది. అయితే మిగిలిన ప్లాంట్లలోని ఉద్యోగులు కరోనాకు ప్రభావితం కాలేదని ప్రభుత్వ సీనియర్ అధికారి ఎండీ మోడియా వెల్లడించారు. ఉద్యోగులకు కరోనా పాజిటివ్ ధృవీకరించిన తరువాత జూలై 12న ప్లాంట్ మూసివేసామని చెప్పారు. శానిటైజేషన్, ఐసోలేషన్ తదితర ప్రక్రియలను నిబంధనల ప్రకారం పాటిస్తున్నామని మోడియా తెలిపారు. బాధితులు వైద్య సంరక్షణలో ఉన్నారనీ, కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రోటోకాల్ పాటిస్తున్నామని లుపిన్ ప్రతినిధి తెలిపారు. అంకలేశ్వర్‌లో 40 ఎకరాలలో 11 తయారీ కర్మాగారాలను లుపిన్ కలిగి ఉంది. కాగా దేశంలో మంగళవారం నాటికి 906,752 కేసులు నమోదయ్యాయి. మరణించినవారి సంఖ్య 23,727కు చేరింది. -
హరియాణాలో విశాక మరో ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విశాక ఇండస్ట్రీస్ హరియాణాలో మరో యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. జజ్జర్ వద్ద రానున్న ఈ ప్లాంటులో డ్రై వాల్ ప్యానెళ్లను తయారు చేస్తారు. రూ.15 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రంలో 6–8 నెలల్లో ఉత్పత్తి ప్రారంభిస్తామని విశాక ఇండస్ట్రీస్ జేఎండీ జి.వంశీ కృష్ణ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు చెప్పారు. రోజుకు 1,000 ప్యానెళ్లను తయారు చేసే సామర్థ్యంతో యూనిట్‌ను నిర్మిస్తామని, దీనికి అన్ని అనుమతులూ వచ్చాయని తెలియజేశారు. ఆగస్టులో ఆటమ్ తయారీ.. ఆటమ్ పేరుతో సోలార్ రూఫ్‌టాప్స్ తయారీకి మిర్యాలగూడ వద్ద కంపెనీ ప్లాంటును ఏర్పాటు చేసింది. ఈ నెల్లోనే ఉత్పత్తి ప్రారంభమవుతోంది. ఈ ప్లాంటు సామర్థ్యం 60 మెగావాట్లు. రూఫ్‌టాప్ రంగంలో దేశంలో అనుకున్న స్థాయిలో విస్తరణ జరగలేదని వంశీకృష్ణ అభిప్రాయపడ్డారు. వినూత్న డిజైన్‌తో చేసిన ఆటమ్... మార్కెట్లో మంచి డిమాండ్‌ను సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సోలార్ ప్యానెళ్లే రూఫ్‌టాప్‌గా వినియోగించే వీలుండటం ఆటమ్ ప్రత్యేకత. జజ్జర్ వద్ద వి–బోర్డ్స్ తయారీౖకై విశాక ఇండస్ట్రీస్ ఇప్పటికే రూ.100 కోట్లతో కొత్త ప్లాంటును స్థాపించింది. సెప్టెంబర్ నుంచి ఉత్పత్తి ప్రారంభం కానుంది. వార్షిక సామర్థ్యం 72,000 టన్నులు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో ఈ ప్లాంటు నుంచి రూ.20 కోట్ల ఆదాయం ఆశిస్తోంది. ప్లాంటు పూర్తి సామర్థ్యానికి చేరితే ఈ యూనిట్ నుంచి ఆదాయం రూ.80 కోట్లు సమకూరనుంది. 50 శాతం సామర్థ్యం 2019–20లో అందుబాటులోకి రావొచ్చని కంపెనీ ధీమాగా ఉంది. -
అతిపెద్ద శాంసంగ్ ప్లాంట్‌ను ఆవిష్కరించిన మోదీ
నోయిడా : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జేతో కలిసి శాంసంగ్ నూతన మొబైల్ తయారీ యూనిట్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరవ్వడం కోసం ఇరు దేశాల అధ్యక్షులు మెట్రో రైలులో ఢిల్లీ నుంచి నోయిడా చేరుకున్నారు. దీని కంటే ముందు మహాత్మాగాంధీ స్మృతి కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ జరిగిన కచేరిలో మహాత్మనికి ఇష్టమైన భజనలను విన్నారు. ప్లాంట్ ప్రారంభోత్సవ సందర్భంగా మోదీ ‘ఒక్క కొరియన్ ఉత్పత్తి అయినా లేని మధ్యతరగతి కుటుంబాలు మన దేశంలో చాలా అరుదు. అంతగా ఈ ఉత్పత్తులు ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నాయి. ప్రస్తుతం మన ప్రభుత్వం గవర్నమెంట్ ఈ-మార్కెట్(జీఈఎమ్) విధానాన్ని అవలంభిస్తుంది. దీని ద్వారా ప్రభుత్వమే నేరుగా ఉత్పత్తిదారుల దగ్గర నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంది. అందువల్ల వల్ల చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు లాభం కలగడమే కాక పారదర్శకత కూడా పెరుగుతుందని’ అన్నారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ కూడా హాజరయ్యారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల అధ్యక్షుల మధ్య కీలక అంశాలను చర్చించనున్నట్లు సమాచారం. ఈ పర్యటన గురించి మూన్ జే.. ‘భారత ప్రభుత్వం 100 స్మార్ట్ సిటీలను నిర్మించాలని భావిస్తుంది. ఆ ప్రాజెక్టుల్లో పనిచేసేందుకు మేము ఉత్సాహాంగా ఉన్నాం’ అని తెలిపారు. భారత్‌ను ఓ స్నేహదేశంగా గుర్తిస్తామని, తమకు అవసరమైనప్పుడల్లా భారత్ సాయం చేసిందన్నారు. తమ దేశం సదరన్ పాలసీని చేపట్టిందని, దానిలో భాగంగా భారత్‌తో మరింత బలమైన బంధాన్ని ఏర్పర్చుకోవాలని భావిస్తున్నట్లు మూన్ జే తెలిపారు. శాంసంగ్ ప్లాంట్... దక్షిణ కొరియా బేస్డ్ స్మార్ట్ఫోన్ల దిగ్గజ కంపెనీ శాంసంగ్ ప్రపంచంలోకెల్ల అతి పెద్ద మొబైల్ తయారీ యూనిట్‌ను నోయిడాలో ఏర్పాటు చేసింది. ‘మేకిన్ ఇండియా’లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ యూనిట్లో మొబైల్ ఫోన్స్ మాత్రమే కాక టీవీ, రిఫ్రిజిరేటర్ వంటి ఎలాక్ట్రానిక్ వస్తువులను కూడా తయారు చేస్తున్నట్టు కంపెనీ అధికారులు తెలిపారు. ఈ ప్లాంట్‌కు సంబంధించిన వివరాలు... 35 ఎకరాల విస్తీరణంలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌ను ఉత్తరప్రదేశ్ నోయిడాలోని సెక్టార్ 81లో ఏర్పాటు చేశారు. అయితే నోయిడా ప్లాంట్‌కు 1996లోనే శంకుస్థాపన చేశారు. 1997 నుంచి తొలిసారి ఇక్కడ టెలివిజన్లను తయారుచేయడం ప్రారంభించారు. 2003 నాటికి రిఫ్రిజిరేటర్లను కూడా తయారు చేయడం ప్రారంభించారు. 2007 నుంచి ఇక్కడ మొబైల్ ఫోన్లను తయారుచేస్తున్నారు. ప్రస్తుతం శాంసంగ్ మొబైల్, ఎలాక్ట్రానిక్స్ వస్తువుల ఉత్పత్తిని రెండు రెట్లు పెంచడం కోసం ఈ నూతన ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉత్పత్తి అయిన వస్తువులను సార్క్ దేశాలకు ఎగుమతి చేయనున్నారు. ఇప్పటి వరకూ ఇండియాలో శాంసంగ్ తయారీ యూనిట్లు రెండు ఉన్నాయి. వాటిలో ఒకటి నోయిడాలో ఉండగా మరొకటి తమిళనాడులోని శ్రీపెరంబ్దూర్లో ఉంది. ఇవే కాక 5 ఆర్ అండ్ డీ సెంటర్లతో పాటు నోయిడాలో ఒక డిజైన్ సెంటర్ కూడా ఉంది. వీటిన్నింటి ద్వారా దాదాపు 70 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇవేకాక శాంసంగ్ ఔట్లెట్ల ద్వారా మరో 1.50లక్షల మందికి కంపెనీ ఉపాధి కల్పిస్తోంది. -
విప్రో మైసూరు యూనిట్ మూత
బెంగళూరు: ప్రముఖ పారిశ్రామిక వేత్త అజీం ప్రేమ్ జీ ఆధర్వంలోని విప్రో కార్యాలయాన్ని మూసి వేసింది. ఎల్ఈడీ ఉత్పత్తులకు పెరుగుతున్న భారీ డిమాండ్ కారణంగా తమ మైసూరు ఆఫీసును మూసివేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. హూటాగల్లీ ఇండస్ట్రీ ఏరియాలో సుమారు 7.5 ఎకరాల్లో విస్తరించిన ఉన్న యూనిట్‌కు సోమవారం లాకౌట్ నోటీసులు అతికించింది. దీంతో కంపెనీ కార్మికుల భవితవ్యం ఆందోళనలో పడింది. మైసూరులోని లైటింగ్ తయారీ యూనిట్‌ను మూసివేశామని విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్ పేర్కొంది. ఎల్ఈడీ ఉత్పత్తుల ప్రాధాన్యత పెరగడంతో తమ సీఎఫ్ఎల్ ఉత్పత్తులకు డిమాండ్ క్షీణించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. గత రెండేళ్ళలో డిమాండ్ తగ్గడంతో ఉత్పత్తి తగ్గుముఖం పట్టిందని కంపెనీ తెలిపింది. పరిస్థితి మెరుగుకు అన్ని రకాల అవకాశాలను పరిశీలించినప్పటికీ ఏడాదికి పైగా ఉత్పత్తి క్షీణించడంతో ఆర్థిక భారం భరించలేనిదిగా మారిందని తెలిపింది. అలాగే ఈ ప్లాంట్ ను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం, సంబంధిత అధికారులు, ఇతర రెగ్యులేటరీ సంస్థలకు రెండునెలల క్రితమే నోటిఫికేషన్ ఇచ్చామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. తద్వారాఅన్ని రెగ్యులేటరీ అవసరాలకు కట్టుబడి ఉన్నామని చెప్పింది. ఈ నేపథ్యంలో మొత్తం 84 మంది శాశ్వత కార్మికులు, 66గురు కాంట్రాక్టు ఉద్యోగులు రోడ్డున పడ్డారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ స్వచ్ఛంద విరమణ పథకాన్ని ప్రతిపాదించినట్టు వెల్లడించింది. మరోవైపు కంపెనీ లాకౌట్ పై కార్మికులు సోమవార రాత్రి నుంచి ఆందోళనకు దిగారు. నిరవధిక ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తమకు కంపెనీ తమకు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. -
’పెళ్లికి ముందు ప్రేమకథ’ యూనిట్ సందడి
అమలాపురం టౌన్ : అమలాపురం తన సొంత ఊరు అని, హీరోగా తాను నటించిన చిత్రం విజయయాత్ర ఇక్కడ జరుగుతుంటే అంతకు మించిన ఆనందం ఏముంటుందని ఇటీవల విడుదలైన ‘పెళ్లికి ముందు ప్రేమ కథ’ చిత్ర హీరో చేతన్ శ్రీను అన్నారు. ఆ చిత్ర యూనిట్లో జిల్లాలో నిర్వహిస్తున్న విజయయాత్ర అమలాపురానికి బుధవారం వచ్చింది. స్థానిక గణపతి థియేటర్లో ఆ యూనిట్ సందడి చేసింది. థియేటర్ వద్ద హీరో చేతన్ శ్రీనుకు, చిత్ర నిర్మాత, దర్శకుడు, ఇతర నటులు, సాంకేతిక సిబ్బందికి అభిమానులు స్వాగతం తెలిపారు. తొలుత హీరోతోపాటు చిత్ర నిర్మాత అవినాష్, దర్శకుడు మధు గోపు, హీరోయిన్ సునయన, సంగీత దర్శకుడు యాజమాన్య, డాన్స్ డైరెక్టర్ కిరణ్ మాస్టర్, ఫొటోగ్రాఫర్ కన్నాలకు అభిమానులు, థియేటర్ యాజమాన్యం పూల మాలలు వేసి స్వాగతం పలికారు. యూనిట్ బృందం కొద్దిసేపు ప్రేక్షకులతో కలిసి చిత్రాన్ని వీక్షించింది. ప్రేక్షకులనుద్ధేశించి హీరో చేతన్ శ్రీను మాట్లాడుతూ తన తర్వాత చిత్రం మాంగల్యం తంతునేనా త్వరలో విడుదల కానుందని... ఆ చిత్రం షూటింగ్ కోనసీమలో జరగటం ఆనందంగా ఉందని చెప్పారు. అనంతరం యూనిట్ సభ్యులు పట్టణంలో స్వర్ణ శిఖరసాయి మందిరంలో సాయిబాబాను దర్శించుకుని పూజలు చేశారు. -
కాంతివంతంగా..
పది మందికి ఉపాధి కల్పిస్తున్న గిరిజన యువతి.. ఎల్ఏడీ బల్బ్‌ల యూనిట్‌తో అద్భుతాలు సృష్టిస్తున్న వీరలక్ష్మి రాజవొమ్మంగి : గిరిజనులు అంటే కొండ చీపుర్లు, చింతకాయలు అమ్ముకొనేవారు కాదని, తాము కూడా పెద్దపెద్ద పరిశ్రమలు నెలకొల్పగలమని, పది మందికి ఉపాధి చూపగలమనే దృఢ నిశ్ఛయంతో ఉన్నారు. దీనికి నిదర్శనమే తూర్పు ఏజెన్సీ అడ్డతీగల మండలం బొడ్లంక గ్రామానికి చెందిన కొల్లపురెడ్డి వీరలక్ష్మి. ఈమె కాకినాడ జేఎన్టీయూలో బీటెక్ చదివారు. అంతకు ముందు ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్ వరకు రాజవొమ్మంగి బాలికల గురుకుల పాఠశాలలో చదివింది. రంపచోడవరంలో రూ.కోటితో ట్విలైట్ (ట్రైబుల్ విమన్ ఇన్స్టాల్డ్ లెడ్ ఇన్ ఐటీడీఏ ఆఫ్ రంపచోడవరం) పేరుతో బల్బ్‌ల అసెంబుల్డ్ యూనిట్‌ను స్థాపించింది. రంపచోడవరం ఐటీడీఏ, జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ ఈమెను ప్రోత్సహించి బ్యాంకులోన్ ఇప్పించారు. ప్రస్తుతం ఏపీఈపీడీసీఎస్ ద్వారా లక్ష బల్బ్‌లకు ఆఫర్ వచ్చిందని, ఈ నేపథ్యంలో ప్రతి పంచాయతీ పరిధిలో గిరిజన కుంటుంబానికి రెండు ఎల్ఈడీ బల్బ్‌లు రాయితీ ధరకు (రెండు బల్బ్‌లు రూ.20 మాత్రమే, అసలు ఖరీదు రూ.250) సరఫరా చేస్తున్నట్టు వీరలక్ష్మి చెబుతోంది. తాను ట్విలైట్ యూనిట్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ కాగా తనతో పాటు మరో 42 మంది చదువుకొన్న గిరిజన యువతులు ఈ కంపెనీ ద్వారా ఉపాధి పొందుతున్నారన్నారు. తామంతా సొసైటీగా (రంప గిరిజన మహిళా సమాఖ్య పారిశ్రామిక సహకార సంఘంగా) ఏర్పడి తక్కువ విద్యుత్ ఖర్చుతో ఎక్కువ కాంతినిచ్చే ఎల్ఈడీ బల్బ్‌లు, ట్యూబ్లైట్స్, స్ట్రీట్‌లైట్స్, విద్యుత్ లేనప్పుడు ఉపయోగించే ఎమర్జెన్సీ లైట్స్ తయారు చేస్తున్నామన్నారు. -
కేఎల్‌యూలో ‘ఖైదీ నెం 150’ యూనిట్
వడ్డేశ్వరం (తాడేపల్లి రూరల్): స్థానిక వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో 'ఖైదీ నంబర్ 150' చిత్ర యూనిట్ సభ్యులు గురువారం పర్యటించారు. చిరంజీవి నటించిన ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ ఎక్కడ నిర్వహించాలి అనే అంశంపై నిర్మాత అల్లు అరవింద్ అక్కడ ఉన్న వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరంజీవి 150వ చిత్రం ఆడియో ఫంక్షన్ నిర్వహణకు కృష్ణా జిల్లా ఫెర్రి, తాత్కాలిక సచివాలయం వద్ద, మంగళగిరి హాయ్‌ల్యాండ్‌ను పరిశీలించామని తెలిపారు. సినీ వర్గాలు మాత్రం దాదాపుగా యూనివర్సిటీనే ఖాయం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. -
మలికిపురంలో సినిమా షూటింగ్
మలికిపురం : బాల బాలాజీ ఫిలిమ్స్ బ్యానర్‌పై రాజమౌళి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన కె.వి.సాయి కృష్ణ దర్శకత్వంలో కొత్త చిత్రం షూటింగ్ ఆదివారం మలికిపురంలో ప్రారంభమైంది. గ్రామ సర్పంచ్ కాకి లక్ష్మిదేవి నివాసంలో జరిగిన షూటింగ్లో పలు సన్నివేశాలను చిత్రీకరించారు. రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు ఈ చిత్రంలో మంత్రి పాత్రలో నటిస్తున్నారు. ఎన్నారై డాక్టర్ గెద్దాడ నాగేశ్వరరావు పారిశ్రామిక వేత్త పాత్రలోనూ, గ్రామ నాయకుడు కాకి లక్ష్మణ్ ఎమ్మెల్యే పాత్రలో నటిస్తున్నారు. వారిపై పలు సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరించారు. హీరో అశోక్, హీరోయి¯ŒS ప్రియాంక శర్మలు షూటింగ్లో పాల్గొన్నారు. దర్శకుడు సాయి కృష్ణ మాట్లాడుతూ 25 రోజులు పాటు షూటింగ్ చేస్తామన్నారు. సినిమాకు ఇంకా పేరు ఖరారు చేయలేదని చెప్పారు. ఈ చిత్రంలో సీనియర్ నటులు సుమన్, బెనర్జీ, పృథ్వీ, పార్వతి తదితరులు నటిస్తున్నారని తెలిపారు. నిర్మాత కె.చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.