మలికిపురంలో సినిమా షూటింగ్
Published Sun, Dec 4 2016 10:38 PM | Last Updated on Tue, Oct 2 2018 3:08 PM
మలికిపురం :
బాల బాలాజీ ఫిలిమ్స్ బ్యానర్‌పై రాజమౌళి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన కె.వి.సాయి కృష్ణ దర్శకత్వంలో కొత్త చిత్రం షూటింగ్ ఆదివారం మలికిపురంలో ప్రారంభమైంది. గ్రామ సర్పంచ్ కాకి లక్ష్మిదేవి నివాసంలో జరిగిన షూటింగ్‌లో పలు సన్నివేశాలను చిత్రీకరించారు. రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు ఈ చిత్రంలో మంత్రి పాత్రలో నటిస్తున్నారు. ఎన్నారై డాక్టర్ గెద్దాడ నాగేశ్వరరావు పారిశ్రామిక వేత్త పాత్రలోనూ, గ్రామ నాయకుడు కాకి లక్ష్మణ్ ఎమ్మెల్యే పాత్రలో నటిస్తున్నారు. వారిపై పలు సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరించారు. హీరో అశోక్, హీరోయి¯ŒS ప్రియాంక శర్మలు షూటింగ్‌లో పాల్గొన్నారు. దర్శకుడు సాయి కృష్ణ మాట్లాడుతూ 25 రోజులు పాటు షూటింగ్ చేస్తామన్నారు. సినిమాకు ఇంకా పేరు ఖరారు చేయలేదని చెప్పారు. ఈ చిత్రంలో సీనియర్ నటులు సుమన్, బెనర్జీ, పృథ్వీ, పార్వతి తదితరులు నటిస్తున్నారని తెలిపారు. నిర్మాత కె.చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement