
ప్రేమించడం సులువే కానీ...
ప్రేమ అనేది ఎవర్‌గ్రీన్. ఈ ప్రపంచంలో ప్రేమలో పడనివాడు, వానలో తడవనివాడు ఎవ్వరూ ఉండరు. అయితే ప్రేమించడం సులువే కానీ, ప్రేమను కాపాడుకోవడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో రూపొందుతోన్న వినూత్న ప్రేమకథా చిత్రం ‘ప్రేమంటే సులువు కాదురా’. చందా గోవిందరెడ్డి దర్శకత్వంలో ఆర్.పి.ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌ప్రసాద్, శ్రీరాములు, సుధాకర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజీవ్, సిమ్మీదాస్ ఇందులో హీరో హీరోయిన్లు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూలు చిత్రీకరిస్తున్నాం. రాజీవ్‌కి ఈ సినిమా చాలా మంచి పేరు తెస్తుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: నందన్‌రాజ్, మాటలు: గోవిందరెడ్డి, సుమన్.