Actress Prema: పెళ్లైన కొంత కాలానికే విడాకులు.. రెండో పెళ్లిపై స్పందించిన ప్రేమ | Senior Actress Prema Talk About Divorce And Second Marriage - Sakshi
Sakshi News home page

Prema: క్యాన్సర్‌ అంటూ ప్రచారం.. డిప్రెషన్‌తో ఆస్ట్రేలియాలో.. సూసైడ్‌ చేసుకోలేదు

Published Thu, Apr 13 2023 9:20 PM | Last Updated on Fri, Apr 14 2023 10:00 AM

Senior Actress Prema About Divorce And Second Marriage - Sakshi

ఎటువంటి సినీ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టింది ప్రేమ. ఎయిర్‌ హోస్టెస్‌ అవుదామనుకుని హీరోయిన్‌గా మారింది. తన అందంతో, సహజ నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. 1995లో సవ్యసాచి అనే కన్నడ చిత్రంతో తన జర్నీ మొదలైంది. తొలి సినిమా పరాజయం పాలైనా ఓం అనే రెండో సినిమాతో సూపర్‌ హిట్‌ కొట్టింది. కన్నడలో స్టార్‌ హీరోలందరితో జోడీ కట్టి టాప్‌ హీరోయిన్‌గా వెలుగొందింది. తెలుగులోనూ ధర్మచక్రం, దేవి, ఓంకారం, మా ఆవిడ కలెక్టర్‌, పోలీస్‌ పవర్‌ సహా పలు చిత్రాలు చేసింది. జీవన్‌ అప్పాచ్చు అనే వ్యక్తిని పెళ్లాడిన ప్రేమ కొంతకాలానికే ఆయనకు విడాకులు ఇచ్చేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది.

'దర్శకుడు కోడి రామకృష్ణ నాకు తెలుగు నేర్పించారు. పెళ్లైన కొంతకాలానికి విడాకులు తీసుకున్నాం. ఈ నిర్ణయాన్ని మొదట మా పేరెంట్స్‌కు చెప్పాను. వాళ్లు నా నిర్ణయానికి మద్దతు తెలిపారు. చాలామంది అలాంటి సమయంలో ఆత్మహత్య దిశగా ఆలోచిస్తుంటారు. కానీ నేను సూసైడ్‌ చేసుకోలేదు. ఇది ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నాను. పెళ్లనేదే జీవితం కాదు. ఛాలెంజ్‌లు స్వీకరిస్తేనే ధృడంగా తయారవుతారు. నేను సెన్సిటివ్‌గా, ఎమోషనల్‌గా ఉండేదాన్ని. కానీ తర్వాత స్ట్రాంగయ్యాను.

రెండో పెళ్లి అంటూ రూమర్స్‌ వచ్చాయి. జీవితంలో పెళ్లి ఉండాలి. నాకు తగిన వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటాను. నా జీవితం ఎలా ఉండాలనేది నాకు తెలుసు. నా మీద ఇంకో రూమర్‌ కూడా సృష్టించారు. నాకు క్యాన్సర్‌ వచ్చిందని ప్రచారం చేశారు. అలాంటిదేమీ లేదు. డిప్రెషన్‌ వల్ల కొంతకాలం ఆస్ట్రేలియాలో ఉన్నాను. ఆ సమయంలో నాకు క్యాన్సర్‌ ఉందని పుకార్లు వ్యాప్తి చేశారు' అని చెప్పుకొచ్చింది ప్రేమ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement