హీరోయిన్ ప్రేమ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట కన్నడ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తర్వాత ధర్మ చక్రం మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఓంకారం, మా ఆవిడ కలెక్టర్, దేవి వంటి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక పలు చిత్రాల్లో దేవత పాత్రలు చేసి మరింత పాపులర్ అయ్యింది. ఆ తర్వాత కొద్ది కాలానికి ఆమె సినిమాలకు దూరమయ్యారు. సుదీర్ఘ విరామం అనంతరం తాజాగా ఆమె ‘అనుకోని ప్రయాణం’ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 28న విడుదల కాబోతోంది.
చదవండి: రామ్ చరణ్ మాటలకు ఏడ్చేసిన జపాన్ ఫ్యాన్స్
ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఓ టాక్‌లో షోలో పాల్గొంది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం, సినిమా విశేషాల గురించి పంచుకుంది. తాను మొదట కన్నడ ఓం చిత్రంలో వెండితెర ఎంట్రీ ఇచ్చానంది. ఆ మూవీ షూటింగ్ సమయంలో డైరెక్టర్ తనని బాగా తిట్టారంటూ ఆసక్తికర విషయం చెప్పింది. ‘కన్నడ హీరో శివరాజ్ కుమార్‌తో నటించాలన్నది నా చిన్ననాటి కల. ఆయనతోనే నా తొలి సినిమా. ఆయనను చూస్తుంటే అసలు డైలాగ్ చెప్పడానికి రావట్లేదు. డైరెక్టర్ ఎన్నిసార్లు చెప్పిన డైలాగ్స్ అసలు నా తలకెక్కట్లేదు. పదే పదే షాట్స్ తీస్తున్నా డైలాగ్ డెలివరి రావట్లేదు. చివరికి డైరెక్టర్ నాపై అరిచారు. బ్రేక్‌లో మా అమ్మ కూడా నన్ను తిట్టింది. ‘ఎన్ని సార్లు చెప్పించుకుంటావు. ఆయన చెప్తుంటే నాకే అసహ్యంగా అనిపిస్తుంది. వాళ్లు చెప్పింది తలకెక్కట్లేదా?.
చదవండి: దీపావళి సందర్భంగా కాబోయే భర్తను పరిచయం చేసిన హీరోయిన్
15 షాట్స్ అయ్యాయి నీకు రావడం లేదా’ అని తిట్టింది. అమ్మ తిట్టాగానే కోపం వచ్చింది. షాట్ రెడీ కాగానే వెళ్లి డైలాగ్ చెప్పాను. సింగిల్ షాట్స్‌లోనే ఒకే అయిపోయింది’’ అంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తెలుగుకు ఎలా వచ్చారని అడగ్గా.. కన్నడ ఓం సినిమా చూసి రామానాయుడు గారు తనకు ధర్మ చక్రం సినిమాలో చాన్స్ ఇచ్చారని తెలిపింది. అనంతరం తెలుగులో మోహన్ బాబు గారు అంటే మొదట్లో భయమేసేదని పేర్కొంది. ‘‘రాయలసీమ రామన్న చౌదరి’ సినిమాలో మోహన్ బాబు గారితో కలిసి నటించాను. ఇందులో నాది నెగిటివ్ రోల్. ఆయనను డైరెక్ట్‌గా చూడాలంటేనే భయం.. అలాంటిది ఆయనతో పోటీపడి నటించాల్సి వచ్చింది’’ అని ప్రేమ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment