![Senior Actress Prema Will Share Love With Kannada Hero Upendra - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/14/prema.jpg.webp?itok=UdcTFlHI)
ఎటువంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టింది ప్రేమ. ఎయిర్ హోస్టెస్ అవుదామనుకుని అనుకోకుండా హీరోయిన్‌గా మారింది. 1995లో సవ్యసాచి అనే కన్నడ చిత్రంతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ సినిమాల్లో నటించింది. కన్నడకు చెందిన ప్రేమ.. టాలీవుడ్‌లో స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. తెలుగులోనూ ధర్మచక్రం, దేవి, ఓంకారం, మా ఆవిడ కలెక్టర్, పోలీస్ పవర్ సహా పలు చిత్రాలు చేసింది. జీవన్ అప్పాచ్చు అనే వ్యక్తిని పెళ్లాడిన ప్రేమ కొంతకాలానికే ఆయనకు విడాకులు ఇచ్చేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది.
ప్రేమ మాట్లాడుతూ.. 'నాకు చాలా సింపుల్‌గా ఉండడమే ఇష్టం. యాటిట్యూడ్ తలలో ఉంటే చాలా కష్టం. నాకు ఎలాంటి ఆస్తులు లేవు. డబ్బులే ముఖ్యం కాదు. అదే శాశ్వతం కాదు. అవసరమైన డబ్బు ఉంటే చాలు. నేను చాలా బోల్డ్‌గా మాట్లాడతా. ఉపేంద్రతో ప్రేమ గురించి రాసిన వారినే అడగాలి. అది ఒక గాసిప్. అప్పుడు నా ఫోకస్ కేవలం సినిమాలే పైనే. ఒకసారి సక్సెస్ వచ్చినప్పుడు ఇలాంటి వస్తాయి. ప్రతి విషయానికి నెగెటివ్, పాజిటివ్ రెండూ ఉంటాయి. ఎలా వచ్చినా వాటిని ఎదుర్కొవాలి. నేను బీకామ్ చదివేదాన్ని. చదువు మధ్యలో ఉండగానే ఇండస్ట్రీలోకి వచ్చా. నేను ఎక్కువగా ఆలోచించే దాన్ని కాదు. అప్పట్లో నేను సౌందర్యతో ఎక్కువగా టచ్‌లో ఉండేదాన్ని. ' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment