
నువ్వు నేను సీరియల్‌తో పద్మావతిగా తెలుగువారికి దగ్గరైంది పవిత్ర నాయక్.

ఈ సీరియల్‌లో ఎప్పుడూ నవ్వుతూ అల్లరి పిల్లగా కనిపించింది.

దీనికంటే ముందు కన్నడ ఇండస్ట్రీలో నాలుగు సినిమాల్లో నటించింది.

ఒకప్పుడు నటనే వద్దనుకున్న ఆమె తర్వాత దాన్నే కెరీర్‌గా మార్చేసుకుంది.

అయితే సీరియల్స్‌తోనే ఎక్కువమంది అభిమానుల్ని సంపాదించుకున్న ఈ బ్యూటీ తాజాగా తన కజిన్ పెళ్లి వేడుకకు హాజరైంది.

అక్కడ హల్దీ సెలబ్రేషన్స్ జరగ్గా తను కూడా పసుపు రంగు డ్రెస్‌లో ముస్తాబైంది.

అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.




