nuvvu nenu
-
Pavithra B Naik: హల్దీ ఫంక్షన్లో సీరియల్ నటి జోరు (ఫోటోలు)
-
నువ్వు నేను హీరోయిన్ అనిత ఫ్యామిలీ (ఫొటోలు)
-
మళ్లీ థియేటర్లలోకి ఉదయ్ కిరణ్.. కల్ట్ సినిమా రీ రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్లో హీరోగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వాళ్లలో ఉదయ్ కిరణ్ ఒకడు. లవ్ స్టోరీలతో చాలా తక్కువ టైమ్లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించిన ఇతడు.. ఆ తర్వాత సరైన ఛాన్సుల్లేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అతడి పుట్టినరోజు లేదా వర్థంతి సందర్భంగా ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇప్పటి జనరేషన్ కోసం ఉదయ్ కిరణ్ మరోసారి థియేటర్లలో సందడి చేయబోతున్నాడు. ఇతడి కల్ట్ మూవీ రీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. (ఇదీ చదవండి: కోట్లు విలువ చేసే కారు కొన్న 'ఆదిపురుష్' రైటర్.. రేటు ఎంతో తెలుసా?) ఉదయ్ కిరణ్, అనిత హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'నువ్వు నేను'. తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సునీల్ కామెడీ టైమింగ్, ఆర్పీ పట్నాయక్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ రచ్చ లేపాయని చెప్పొచ్చు. పెద్దగా అంచనాలు లేకుండా 2001 ఆగస్టు 10న రిలీజైంది. తొలి ఆట నుంచే సాలిడ్ బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకుంది. అప్పట్లో అద్భతమైన సక్సెస్ అందుకున్న ఈ సినిమాని తిరిగి థియేటర్లలో ఇప్పుడు విడుదల చేయబోతున్నారు. ఈ మార్చి 21న బిగ్ స్క్రీన్పై సందడి చేయనుంది. ఒకవేళ ఉదయ్ కిరణ్ స్క్రీన్ మ్యాజిక్ చూడాలనుకుంటే మాత్రం దీన్ని అస్సలు మిస్ కాకండి. (ఇదీ చదవండి: ఆ మూడు సినిమాలే నా కెరీర్ని మలుపు తిప్పాయి: మహేశ్ బాబు) -
నా జీవితంలో మరిచిపోలేని విషాదం.. అయినా వెనక్కి తగ్గలేదు!
టాలీవుడ్లో నువ్వు నేను సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న హీరోయిన్ అనిత. ఈ చిత్రంలో ఉదయ్ కిరణ్ హీరోగా నటించారు. ఆ తర్వాత తరుణ్ హీరోగా నటించిన నిన్నే ఇష్టపడ్డాను సినిమాలో సెకండ్ హీరోయిన్గా కనిపించింది. తొట్టిగ్యాంగ్, నేను పెళ్లికి రెడీ, ముసలోడికి దసరా పండుగ లాంటి సినిమాల్లో నటించింది. 2003లో కుచ్ తో హై సినిమా ద్వారా బాలీవుడ్లోనూ ప్రవేశించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో నటించిన అనిత.. పెళ్లి తర్వాత వెండితెరకు దూరమైంది. (ఇది చదవండి: Bigg Boss 7: పల్లవి ప్రశాంత్ తలకు గాయం.. కుప్పకూలిపోయిన రైతు బిడ్డ!) అయితే సినిమాలకు దూరమైనప్పటికీ బుల్లితెరపై సందడి చేసింది. హిందీ సీరియల్స్, టీవీ షోలతో బీ టౌన్ ఆడియన్స్ మనసు దోచుకుంది. అంతే కాకుండా యాడ్స్లోనూ నటిస్తూ అభిమానులను అలరించింది. 2014లో వ్యాపారవేత్త రోహిత్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఓ బాబు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోంది. అయితే తాజాగా అనిత సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరలవుతోంది. అదేంటో ఓ లుక్కేద్దాం. అనిత తన ఇన్స్టాలో రాస్తూ.. 'ఈ రోజు నేను చేసింది కేవలం ఒక పోస్ట్ మాత్రమే కాదు. నా కోసం, నేను చేసిన అద్భుతమైన ప్రయాణానికి గుర్తు ఇది. నాకు ఆ టీనేజ్ రోజులు ఇంకా గుర్తున్నాయి. అప్పుడు నా జీవితం ఎన్నో కలలు, గందరగోళాల మధ్య సుడిగుండంలా గడిచింది. ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయిగా కేవలం ఒక డైరీలో నా ఆశలు గురించి రాసుకున్నా. కానీ నా జీవితంలో అప్పుడే ఓ విషాదం జరిగింది. నేను నా తండ్రి.. నా హీరోని కోల్పోయాను. ఆ సమయంలో నా దారులన్నీ మూసుకుపోయాయి. కానీ నేను వాటికి భయపడలేదు. కేవలం నా కోసమే కాదు.. నా కుటుంబానికి వెన్నెముకగా మారాను. అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నా. నా కుటుంబంతో గర్వంగా.. ఓ తల్లిగా, ప్రేమగల భర్త, నా బిడ్డే ఇప్పుడు నా ప్రపంచం. నా లైఫ్లో ప్రతిరోజును ఆస్వాదిస్తున్నా. అందుకే ఈ రోజు నుంచి నాకు నేనే కృతజ్ఞతలు చెప్పడానికి కొంత సమయం కేటాయించాలనుకుంటున్నా. నా లైఫ్ ఇంత హ్యాపీగా మారినందుకు నాకు నేనే రుణపడి ఉంటాను.' అంటూ పోస్ట్ చేసింది. తన జీవితంలో ఎన్నో బాధలు అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నందుకు ఆనందంగా ఉందంటూ అనిత ఎమోషనలయ్యారు. (ఇది చదవండి: ఆస్కార్ బరిలో చిన్న సినిమా.. అవార్డ్ దక్కేనా?) View this post on Instagram A post shared by Anita H Reddy (@anitahassanandani) -
‘చిత్రం చెప్పిన కథ’ స్టిల్స్
-
ఉదయ్కిరణ్ చివరి సినిమా చిత్రం చెప్పిన కథ
చిత్రం, నువ్వు-నేను, మనసంతా నువ్వే, కలుసుకోవాలని, నీ స్నేహం... ఉదయ్కిరణ్ని నటునిగా ప్రేక్షకులకు చేరువ చేసిన సినిమాలివి. సముద్రపు అలలా ఉవ్వెత్తున పైకిలేచాడు. తోకచుక్క మాదిరి ఒక్కసారిగా నేల రాలాడు. నిజంగా ఉదయ్ జీవితమే ఒక చిత్రం. తను నటించిన చివరి సినిమా ‘చిత్రం చెప్పిన కథ’. మోహన్ ఏఎల్ఆర్కే దర్శకుడు. సీహెచ్ మున్నా నిర్మాత. ‘నువ్వు-నేను’ ఫేం అనిత ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో గరిమ, డింపుల్, మదాలస శర్మ కథానాయికలు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలను హైదరాబాద్లో విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తూ ఉదయ్ మనకు దూరమయ్యారు. తనకు కావల్సినట్టుగా అహర్నిశలూ కష్టపడి ఈ కథను మలుచుకున్నాడు ఉదయ్. ఆయనలోని కొత్తకోణం ఇందులో చూస్తారు. ఒక ప్రత్యేకగీతం, చిన్నప్పటి సన్నివేశాల చిత్రీకరణ మినహా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే వాటిని పూర్తి చేస్తాం. ఈ నెలాఖరున పాటల్ని, ఏప్రిల్లో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ఉదయ్కిరణ్లో ఇప్పటివరకూ చూడని కొత్తకోణం ఇందులో కనిపిస్తుందని, ఆయన అభిమానులకు ఇది గొప్ప కానుకని దర్శకుడు చెప్పారు. ఇది థ్రిల్లర్ చిత్రం కాబట్టి నేపథ్య సంగీతం విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోమని ఉదయ్ సూచించారని సంగీత దర్శకుడు మున్నా కాశీ గుర్తు చేసుకున్నారు. ఇంకా మల్టీడైమన్షన్స్ వాసు, టి.ప్రసన్నకుమార్, కొడాలి వెంకటేశ్వరరావు, కాదంబరి కిరణ్, మాటల రచయిత నరేష్ అమరనేని తదితరులు మాట్లాడారు.