
హీరోయిన్ అనిత అంటే చాలా మంది గుర్తు పట్టడం కష్టమే గానీ నువ్వు నేను హీరోయిన్ అంటే టక్కున గుర్తుపడుతారు

తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలన విజయం సాధించింది. ఇక అప్పటి నుంచి ఈ భామ నువ్వు నేను అనిత పాపులర్ అయ్యింది

నువ్వు నేను తర్వాత కూడా అనితకు మంచి అవకాశాలే దక్కాయి

తరుణ్ తో ‘నిన్నే ఇష్టపడ్డాను’ మూవీ చేసిందిఅదేవిధంగా శ్రీరామ్, తొట్టిగ్యాంగ్, నేను పెళ్లికి రెడీ, ముసలోడికి దసరా పండగ లాంటి పలు సినిమాల్లో నటించిన అనిత క్రమంగా సినిమాలకు దూరమైంది

2013 సంవత్సరం పెళ్లి చేసుకుంది అనిత. గోవాలో బిజినెస్ మెన్ రోహిత్ ను పెళ్లి చేసుకుని నటనకు దూరమైంది

అనిత అసలు పేరు నటాషా హస్సానందని

ఈ దంపతులకు 9 ఫిబ్రవరి 2021న మొదటి సంతానంగా ఒక అబ్బాయి జన్మించాడు. తమ కుమారుడికి ఆరవ్ రెడ్డి అని పేరు పెట్టారు ఈ జంట























