షూటింగ్‌ సమయంలో నిజంగానే పాము కరిచింది: ప్రేమ | Actress Prema Interesting Comments On Devi Movie | Sakshi
Sakshi News home page

Devi@25: షూటింగ్‌ సమయంలో నిజంగానే పాము కరిచింది: హీరోయిన్‌

Published Tue, Mar 12 2024 2:53 PM | Last Updated on Tue, Mar 12 2024 3:10 PM

Actress Prema Interesting Comments On Devi Movie - Sakshi

కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన సూపర్‌ హిట్‌ చిత్రాల్లో ‘దేవి’ ఒకటి. ఈ చిత్రంలో హీరోయిన్‌ ప్రేమ టైటిల్ పాత్రను పోషించగా,  వనిత , షిజు , అబు సలీం, భానుచందర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు . ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన తొలి సినిమా ఇది. ఈ సోషియో ఫాంటసీ చిత్రం విడుదలై నేటికి(మార్చి 12, 1999న రిలీజ్‌) సరిగ్గా 25 ఏళ్లు. ఈ సందర్భంగా అలనాటి హీరోయిన్‌ ప్రేమ ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

‘అప్పట్లో లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు తక్కువగా వచ్చేవి. రిస్క్‌ చేసి మరి ‘దేవి’ చిత్రాన్ని తెరకెక్కించాడు కోడి రామకృష్ణ. ఈ మూవీ ఆ స్థాయిలో విజయం సాధించడానికి ప్రధాన కారణం ఆయనే. ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. సీన్‌ సరిగా రాకపోతే మళ్లీ మళ్లీ చేయించేవాడు. ఓక్కో సీన్‌కి 50 టేకులపైగా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. నాతో డైలాగ్స్‌ బాగా ప్రాక్టీస్‌ చేయించేవారు. దేవత ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడాలని చెప్పేవారు. గెటప్‌ వేశాక నా హావభావాలు ఆటోమెటిక్‌గా మారిపోయేవి.

టీమ్‌ అంతా రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేశాం. షూటింగ్‌ సమయంలో ఓ వ్యక్తిని నిజంగానే పాము కాటేసింది. అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లినా బతికించుకోలేకపోయాం. ఆ బాధతో రెండు రోజుల పాటు షూటింగ్‌ని నిలిపివేశాం. క్లైమాక్స్‌ షూటింగ్‌ సమయంలో కూడా చాలా ఇబ్బంది పడ్డాం. మంచులో షూటింగ్‌ చేయడం సవాల్‌గా మారింది. సినిమా రిలీజ్‌ తర్వాత మా కష్టానికి ప్రతిఫలం దక్కిందని ఫీలయ్యాం. ప్రేక్షకుల స్పందన చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇంత పెద్ద హిట్‌ అవుతుందని ఊహించలేదు. నా కెరీర్‌లో ‘దేవి’ స్పెషల్‌ మూవీ’ అని ప్రేమ చెప్పుకొచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement