
సాక్షి, అమరావతి/కంకిపాడు: మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) మేనకోడలు వివాహ వేడుకలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. కోనేరు లీలాప్రసాద్, రాజ్యలక్ష్మి విజయ చాముండేశ్వరిదేవి కుమార్తె డాక్టర్ స్నేహ, డాక్టర్ అనురాగ్ దీపక్‌ల వివాహం గురువారం కృష్ణా జిల్లా కంకిపాడులోని అయాన్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. ఈ వేడుకకు హాజరైన సీఎం వైఎస్ జగన్ నూతన వధూవరులకు ఆశీస్సులు అందించారు. ఈ వేడుకలో మంత్రి జోగి రమేశ్, కలెక్టర్ పి.రాజాబాబు, ఎస్పీ జాషువా, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, కైలే అనిల్‌కుమార్, దూలం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment