వాటిని నిషేధించాలంటూ డిమాండ్
లాతూర్: మా పెళ్లికి విచ్చేసి భోజనతాంబూలాదులు స్వీకరించి మమ్మానందింపజేయ ప్రార్థన. ఇది చాలా పెళ్లిపత్రికల్లో కనిపించే ఒక విన్నపం. కానీ ఇక్కడ ఒక పత్రికలో విజ్ఞాపనకు బదులు ‘వ్యతిరేకత’ కనిపించింది. ‘‘ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లను నిషేధించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’’ అంటూ కొటేషన్‌ను పెట్టాడు ఒక పెళ్లికొడుకు.
మహారాష్ట్రలోని ఛాకూర్ తహసీల్ పరిధిలోని అజన్‌సోందా(ఖుర్ద్) గ్రామానికి చెందిన దీపక్ కుంబ్లే పెళ్లి వచ్చే నెల ఎనిమిదో తేదీన లాతూర్ పట్టణంలో జరగనుంది. కుంబ్లే అందరికీ పంచిన తన వివాహ ఆహా్వన పత్రికలో ఇలా ఈవీఎంలపై తన అసంతృప్తి వెళ్లగక్కాడు. సాధువులు, సంఘ సంస్కర్తలు, స్వాతంత్య్ర సమరయోధుల ఫొటోలను ఆ వెడ్డింగ్ ఇని్వటేషన్ కార్డులో ప్రచురించాడు.
తనకు పాఠాలు బోధించిన స్కూలు టీచర్ల ఫోటోలకు ఈ ఆహ్వానపత్రికలో స్థానం కలి్పంచాడు. ఈయన అఖిలభారత వెనకబడిన, మైనారిటీ వర్గాల ఉద్యోగుల సంఘం(బామ్‌సెఫ్) సభ్యుడు. ‘‘ ఈవీఎంల వ్యతిరేక ఉద్యమం సార్వత్రిక ఎన్నికలకు ముందే ఊపందుకుంది. బంధువులు, స్నేహితుల్లోనూ ఉద్యమంపై మరింత అవగాహన పెంచాలనే ఇలా ఈవీఎంల అంశాన్ని పెళ్లికార్డులో ప్రస్తావించా’ అని కుంబ్లే చెబుతున్నారు. కార్డులో కథాకమామిషు, ఫొటోలను చూసి ముక్కున వేలేసుకున్న వాళ్లూ లేకపోలేదు. కార్డు ఎలాగుంటే మనకెందుకు? పెళ్లికెళ్లి నాలుగు అక్షింతలు వేసి భోంచేసి వచ్చేద్దాం అని ఊళ్లో చాలా మంది డిసైడ్ అయ్యారట!
Comments
Please login to add a commentAdd a comment