save democracy
-
Lok Sabha Election 2024: పెళ్లిపత్రికలోనూ ఈవీఎంపై వ్యతిరేకత!
లాతూర్: మా పెళ్లికి విచ్చేసి భోజనతాంబూలాదులు స్వీకరించి మమ్మానందింపజేయ ప్రార్థన. ఇది చాలా పెళ్లిపత్రికల్లో కనిపించే ఒక విన్నపం. కానీ ఇక్కడ ఒక పత్రికలో విజ్ఞాపనకు బదులు ‘వ్యతిరేకత’ కనిపించింది. ‘‘ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లను నిషేధించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’’ అంటూ కొటేషన్‌ను పెట్టాడు ఒక పెళ్లికొడుకు. మహారాష్ట్రలోని ఛాకూర్ తహసీల్ పరిధిలోని అజన్సోందా(ఖుర్ద్) గ్రామానికి చెందిన దీపక్ కుంబ్లే పెళ్లి వచ్చే నెల ఎనిమిదో తేదీన లాతూర్ పట్టణంలో జరగనుంది. కుంబ్లే అందరికీ పంచిన తన వివాహ ఆహా్వన పత్రికలో ఇలా ఈవీఎంలపై తన అసంతృప్తి వెళ్లగక్కాడు. సాధువులు, సంఘ సంస్కర్తలు, స్వాతంత్య్ర సమరయోధుల ఫొటోలను ఆ వెడ్డింగ్ ఇని్వటేషన్ కార్డులో ప్రచురించాడు. తనకు పాఠాలు బోధించిన స్కూలు టీచర్ల ఫోటోలకు ఈ ఆహ్వానపత్రికలో స్థానం కలి్పంచాడు. ఈయన అఖిలభారత వెనకబడిన, మైనారిటీ వర్గాల ఉద్యోగుల సంఘం(బామ్సెఫ్) సభ్యుడు. ‘‘ ఈవీఎంల వ్యతిరేక ఉద్యమం సార్వత్రిక ఎన్నికలకు ముందే ఊపందుకుంది. బంధువులు, స్నేహితుల్లోనూ ఉద్యమంపై మరింత అవగాహన పెంచాలనే ఇలా ఈవీఎంల అంశాన్ని పెళ్లికార్డులో ప్రస్తావించా’ అని కుంబ్లే చెబుతున్నారు. కార్డులో కథాకమామిషు, ఫొటోలను చూసి ముక్కున వేలేసుకున్న వాళ్లూ లేకపోలేదు. కార్డు ఎలాగుంటే మనకెందుకు? పెళ్లికెళ్లి నాలుగు అక్షింతలు వేసి భోంచేసి వచ్చేద్దాం అని ఊళ్లో చాలా మంది డిసైడ్ అయ్యారట! -
సేవ్ డెమోక్రసీ ర్యాలీలో 'ఉద్దవ్ ఠాక్రే' కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: 'కేజ్రీవాల్'ను అరెస్టు చేసిన నేపథ్యంలో ఇండియా కూటమి రాంలీలా మైదానంలో 'సేవ్ డెమోక్రసీ' ర్యాలీ నిర్వహిస్తోంది. ఈ ర్యాలీలో పార్టీ ప్రధాన నాయకులు, కార్యకర్తలు మాత్రమే కాకుండా మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన చీఫ్ 'ఉద్ధవ్ ఠాక్రే' కూడా పాల్గొన్నారు. సేవ్ డెమోక్రసీ ర్యాలీలో పాల్గొన్న ఉద్ధవ్ ఠాక్రే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో.. బీజేపీ 400 కంటే ఎక్కువ స్థానాల్లో గెలుపొందటమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఒక పార్టీ, ఒక వ్యక్తి సారథ్యంలో నడిచే ప్రభుత్వం అధికారం కోల్పోవాల్సిన సమయం ఆసన్నమైంది. మేము ఎన్నికల ప్రచారానికి రాలేదు.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి వచ్చాము అన్నారు. ఒకప్పుడు అవినీతి చేసిన వాళ్లను బీజేపీ వాషింగ్ మెషిన్లో ఉతికి శుభ్రం చేసిందని ఎద్దేవా చేశారు. అవినీతిపరులతో నిండిన పార్టీ ప్రభుత్వాన్ని ఎలా నడుపుతుంది? అని ఠాక్రే ప్రశ్నించారు. జైలులో ఉన్న ప్రతిపక్ష నాయకులు అరవింద్ కేజ్రీవాల్ & హేమంత్ సోరెన్ భార్యలకు మద్దతునిస్తూ.. వారి పోరాటానికి మద్దతుగా వారి సోదరుడు ఇక్కడ ఉన్నాడు అని వ్యాఖ్యానించారు. दिल्ली के रामलीला मैदान में पक्षप्रमुख मा. श्री. उद्धवसाहेब ठाकरे ने INDIA गठबंधन महारैली को संबोधित किया। pic.twitter.com/RdfFXDVFnL — Office of Uddhav Thackeray (@OfficeofUT) March 31, 2024 -
హస్తినలో విపక్షాల ర్యాలీ నేడే
న్యూఢిల్లీ: ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ నినాదంతో విపక్ష ఇండియా కూటమి ఆదివారం తలపెట్టిన భారీ ర్యాలీకి సర్వం సిద్ధమైంది. ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఇందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కూటమిలోని 29 పార్టీలూ ర్యాలీలో పాల్గొంటాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్‌గాంధీతో పాటు కూటమికి చెందిన పలువురు నేతలు ప్రసంగిస్తారన్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా పాల్గొనే అవకాశముందని చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు అడ్డంగా దుర్వినియోగం చేస్తోందని, ర్యాలీలో దీన్ని ప్రధానంగా ప్రస్తావిస్తామని తెలిపారు. డెరిక్ ఒబ్రియాన్ (టీఎంసీ), తిరుచ్చి శివ (డీఎంకే), అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), శరద్ పవార్ (ఎన్సీపీ–ఎస్సీపీ), తేజస్వీ యాద వ్ (ఆర్జేడీ), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), ఫరూక్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) తదితరులు పాల్గొంటారన్నారు. ఇండియా కూటమి భాగస్వామి ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ర్యాలీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. పార్టీ సారథి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ మద్యం కుంభకోణం కేసులో జైలుపాలైన నేపథ్యంలో ర్యాలీకి భారీగా జన సమీకరణ చేసి సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. -
సత్యం పక్షాన నిలబడండి
జైపూర్: ఆగస్టు 14 నుంచి రాజస్తాన్ అసెంబ్లీ సమావేశాలు జరగునున్న నేపథ్యంలో రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ‘సత్యం పక్షాన నిలవండి–ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’అంటూ లేఖ ద్వారా శాసనసభ్యులకు విజ్ఞప్తి చేశారు. సచిన్ పైలెట్ తనకు అనుకూలమైన ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయటంతో రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. విశ్వాస పరీక్ష కోసం ఈనెల 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్ర అభివృద్ధికి పార్టీ చేసిన వాగ్దానాలను పరిపూర్తి చేయడానికి ఎమ్మెల్యేలంతా సహకరించాలని ఆ లేఖలో గహ్లోత్ కోరారు. మీరు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ, మీరంతా ప్రజాపక్షం వహించాలని, తప్పుడు సాంప్రదాయాలను తిరస్కరించాలని, ప్రజల విశ్వాసాన్ని కాపాడాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఆయన ఆ లేఖలో కోరారు. ‘‘ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు రాష్ట్ర సంక్షేమం కోసం పనిచేయడానికి, ఓటర్ల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోండి’’అని లేఖలో వ్యాఖ్యానించారు. రాష్ట్రప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి జరిగే ప్రయత్నాలేవీ సఫలం కావని కూడా ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల విశాల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని, ఎమ్మెల్యేలు వ్యవహరిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సచిన్ పైలెట్ తిరుగుబాటు చేసిన అనంతరం ఆయనను ఉపముఖ్యమంత్రి పదవి నుంచి, పీసీసీ అధ్యక్ష పీఠం నుంచి తొలగించారు. ఇప్పటికీ గహ్లోత్‌కే నంబర్ గేమ్‌లో మెజారిటీ ఉంటుందని కొందరి బలమైన విశ్వాసం. 11న బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీజేపీ లెజిస్లేచర్ పార్టీ 11న భేటీ కానుంది. ఈ సమావేశానికి రావాల్సిందిగా ఎమ్మెల్యేలందరికీ ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా లేఖ రాశారు. 11న సాయంత్రం 4 గంటలకు జైపూర్‌లోని హోటల్ క్రౌన్ ప్లాజాలో సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. బీజేపీ ఇప్పటికే 18 మంది ఎమ్మెల్యేలను గుజరాత్‌కి తరలించింది. శనివారం ఆరుగురు శాసనసభ్యులు పోరుబందర్‌కి తరలివెళ్ళగా, మరో 12 మంది ఎమ్మెల్యేలు అహ్మదాబాద్ తరలి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలందర్నీ ఒకచోట ఉంచినట్లే, బీజేపీ కూడా తరలించిందని భావిస్తున్నారు. -
సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ డెమోక్రసీ
-
బీజేపీ రథయాత్రకు దక్కని ఊరట
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో రథయాత్ర నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టులో బీజేపీకి ఊరట లభించలేదు. రథయాత్రను కలకత్తా హైకోర్టు అడ్డుకోవడాన్ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. సాధారణ పిటిషన్లతో పాటే దానినీ విచారిస్తామని సోమవారం కోర్టు రిజిస్ట్రీ అధికారులు స్పష్టం చేశారు. డిసెంబర్ 21 నాటి కలకత్తా హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని బీజేపీ కోరగా, సుప్రీంకోర్టు అంగీకరించలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల ముంగిట పశ్చిమ బెంగాల్‌లోని 42 పార్లమెంట్ స్థానాల్లో ‘సేవ్ డెమొక్రసీ’ పేరిట ర్యాలీ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ యాత్రకు కలకత్తా హైకోర్టు ఏక సభ్య బెంచ్ తొలుత అనుమతి ఇవ్వగా, తరువాత డివిజన్ బెంచ్ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశాలున్నాయని రాష్ట్ర నిఘా వర్గాల ఇచ్చిన సమాచారం మేరకు ఈ కేసును మళ్లీ విచారించాలని ఏక సభ్య బెంచ్‌కే డివిజన్ బెంచ్ తిరిగి పంపింది. శాంతియుతంగా చేపట్టాలనుకున్న యాత్రను రాష్ట్ర అధికారులు లేవనెత్తిన సందేహాలు, ఊహాజనిత అభిప్రాయాల ఆధారంగా అడ్డుకోవడం తగదని బీజేపీ తన పిటిషన్లో పేర్కొంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ముఖ్య కార్యదర్శి, అదనపు డీజీపీలను కక్షిదారులుగా చేర్చాలని కోరింది. బీజేపీ కార్యక్రమంలో హింస.. రథయాత్రను ప్రభుత్వం అడ్డుకోవడాన్ని నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు ఉత్తర 24 పరగణాలు జిల్లాలో నిర్వహించిన చట్ట ఉల్లంఘన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఇందులో పలువురు పోలీసులు, పౌరులు గాయాలపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 54 మందిని అదుపులోకి తీసుకున్నారు. -
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి
విజయనగరం మున్సిపాలిటీ : గుంటూరు జిల్లా కేంద్రంలో మంగళవారం జరకిగిన సభలో పౌరులకు కల్పించిన హక్కును కాలరాస్తూ ప్రశ్నించే గళాలను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తూ ముస్లిం యువకులపై అక్రమంగా కేసులు బనాయించడం, అరెస్టులు చేయటం దుర్మార్గపు చర్యగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షుడు సయ్యద్ గౌస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి మన్వుర్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి యువకులకు రక్షణ కల్పించాలంటూ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింలకు జరుగుతున్న అన్యాయంపై శాంతియుతంగా నిరసన తెలిపిన వారిని అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో తమ సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రజలకుందని, సమస్యలు చెప్పుకునేందుకు వస్తే అరెస్టులు చేయడం అధికార ప్రభుత్వ రాక్షస తత్వానికి నిదర్శనమన్నారు. శాంతియుతంగా ప్ల కార్డులతో నిరసన తెలిపిన కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఎనిమిది మంది ముస్లిం యువకులతో పాటు పరామర్శించేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. కేసులు ఎత్తివేసి ప్రజాస్వామ్యాన్ని పరిక్షించాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఎస్.బంగారునాయుడు, విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఎంఎల్ఎన్ రాజు, మైనార్టీ సెల్ నాయకులు ఎండి.రహీమ్, షరీఫ్, సీరజ్, ఇమ్రాన్, షబీర్, రహమాన్‌తో పాటు యువజన, విద్యార్థి విభాగం నాయకులు పొట్నూరు కేశవ, కరకవలస అనిల్, చిన్ని రవి, పైడి, బైక్ రమేష్, తరుణ్, గుణ, సప్పా ప్రసాద్, సురేష్‌రెడ్డి, సంతోష్, కిట్టు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యాన్ని కాపాడండి : వామ పక్షాలు
విజయనగరం పూల్‌బాగ్ : పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రజాస్వామ్య ఖూనీని నిరసిస్తూ అఖిలభారత వామపక్షాల పిలుపు మేరకు సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో గురువారం స్థానిక కోట జంక్షన్ నుంచి కన్యకాపపరమేశ్వరి కోవెల వరకు నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, సీపీఐ నాయకులు బుగత సూరిబాబు మాట్లాడుతూ తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో, బీజేపీ త్రిపురలో అధికారం చేపట్టిన నుంచి యథేచ్ఛగా మానవ హక్కులు ఉల్లంఘించబడుతున్నాయని ఆరోపించారు. వామపక్ష కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. వామపక్ష కార్యకర్తలపైనే కాకుండా ప్రజలపైన తృణమూల్ గూండాలు దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో వామపక్ష నేతలు డి.అప్పలరాజు, గాడి అప్పారావు, సుధారాణి, అప్పారావు, రామారావు, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
నీతి మాటలు ఎక్కడికి పోయాయి చంద్రబాబు
కువైట్ : రాజ్యాంగాన్ని కాపాడవలసిన గవర్నర్ నరసింహన్ వైఎస్ఆర్సీపీ టికెట్ మీద గెలిచిన వారిని టీడీపీలో మంత్రి పదవులకు ప్రమాణస్వీకారం చేయించడం దారుణమని వైఎస్ఆర్సీపీ కువైట్ కమిటీ నాయకులు అన్నారు. ఈ పరిణామాలను చూస్తూంటే ఆయన గవర్నరా..? లేక టీడీపీ పార్టీ కార్యకర్తా..? అనే అనుమానం ప్రజలకు కలుగుతోందని తెలిపారు. వైఎస్ఆర్సీపీ టికెట్‌పై గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ ఫిరాయింపజేశారని మండిపడ్డారు. 21మంది ఎమ్మెల్యేలను రాజ్యాంగం ప్రకారం ఎమ్మెల్యే పదవులకు స్పీకర్ అనర్హులుగా ప్రకటించాలి. కానీ, ఆలా జరగకుండా స్పీకర్ ఆ 21 మంది ఎమ్మెల్యేలను కాపాడుకుంటూ వస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలా రాజ్యాంగాన్ని అవమానించే వ్వక్తి స్పీకర్‌గా ఉండటం అసెంబ్లీకే అవమానమని పేర్కొన్నారు. తెలంగాణాలో తెలుగుదేశం ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లోకి తీసుకుపోయి మంత్రి పదవి ఇస్తే సత్యహరిచంద్రుడికే తాతలా చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి నీతులు మాట్లాడారని వైఎస్ఆర్సీపీ కువైట్ కమిటీ నాయకులు గుర్తు చేశారు. మరి ఈ రోజు చంద్రబాబు నీతి మాటలు ఎక్కడికి పోయాయని నిలదీశారు. అంటే మీరు పక్కవాడికి చెప్పుకోడానికే నీతులా..? మీరు చేయడానికి కాదా..? అని మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా వెన్నుపోటు రాజకీయాలేనని వైఎస్ఆర్సీపీ కువైట్ కమిటీ నాయకులు నిప్పులు చెరిగారు. అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం.. దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. చంద్రబాబుకు దమ్ము, దైర్యం ఉంటే తమ పార్టీ చేసిన సవాల్ స్వీకరించాలని సవాలు విసిరారు. వైఎస్ఆర్సీపీ టికెట్ పై గెలిచిన 21మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లి ఎవరి సత్తా ఏమిటో తేల్చుకోవాలన్నారు. రాజ్యాంగానికి విరుద్దంగా టీడీపీ నడుచుకోవడంతో దీన్ని ప్రజాస్వామ్యంలో బ్లాక్ డేగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారని తెలిపారు. రాజ్యాంగ విరుద్దమైన పనులను వ్యతిరేకిస్తూ చంద్రబాబు మెడలు వంచేదుకు వైఎస్ఆర్సీపీ కువైట్ కమిటీ నాయకులు నిరసన ధర్నాచేపట్టారు. కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి, కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, యం.వి నరసారెడ్డి, ట్రేజరర్ నాయని మహేష్ రెడ్డి, ఆకుల చలపతి, షేక్ కలామ్, యూత్ టీం ఇంచార్జీ, మర్రి కళ్యాణ్, యూత్ నాయకులు సయ్యద్ సజ్జాద్, రఫీక్ ఖాన్, షేక్ సర్దార్, రావురి రమణ, హనుమంత్ రెడ్డి, కల్లూరి వాసు, బి.యన్.సింహ రెడ్డి, ఓబులపు మోహన్ రెడ్డి, పిడుగు సుబ్బారెడ్డి, గోవిందు రాజు, శివ బాల, రవి శంకర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కువైట్‌లో వైఎస్ఆర్సీపీ నేతల నిరసన
-
వైఎస్ఆర్సీపీ 'సేవ్ డెమోక్రసీ' ర్యాలీలు
-
సేవ్ డెమోక్రసీసేవ్ డెమోక్రసీ
- ఫిరాయింపులను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ధర్నాలు - సంఘీభావం తెలిపిన వామపక్షాలు అనంతపురం : తమ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకోవడంతో పాటు వారికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని వైఎస్సార్సీపీ నాయకులు మండిపడ్డారు. ‘ఒకపార్టీ ఎమ్మెల్యేలు మరో పార్టీలోకి వెళ్లినప్పుడు రాజీనామా చేయాలి. ఇది జరగకుండానే మంత్రివర్గంలో చోటు కల్పించడం అనైతికం, అప్రజాస్వామికం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ముఖ్యమంత్రే ఇలా వ్యవహరించడం దారుణమ’ని ఆక్షేపించారు. వెంటనే కేంద్రం జోక్యం చేసుకుని ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలే చంద్రబాబును బర్తరఫ్ చేసే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నాయకులు, కార్యకర్తలు ధర్నాలు చేపట్టారు. అనంతపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన ధర్నాలో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్, వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నదీంఅహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబు అనైతికంగా, అప్రజాస్వామికంగా వ్యవహరించి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి పిలుచుకుని ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడిచారని ఆయన మండిపడ్డారు. ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాలని తాము అసెంబ్లీ స్పీకర్‌కు అనేక మార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. పెనుకొండ ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో పార్టీ జిల్లా అధ్యక్షులు శంకరనారాయణ మాట్లాడారు. చంద్రబాబుది నీచ సంస్కృతి అని దుయ్యబట్టారు. రాయదుర్గం పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వరకు బైకు ర్యాలీ చేపట్టి.. అక్కడ ధర్నాకు దిగారు. సీఎం చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహించి వారికి మంత్రి పదవులిచ్చి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని, రాజకీయ వ్యభిచారిలా మారారని మండిపడ్డారు. తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి పాల్గొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం సిగ్గుమాలిన చర్య అన్నారు. గుంతకల్లు తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో సమన్వయకర్త వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అనైతిక చర్యలకు పాల్పడుతోందన్నారు. రాప్తాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని బంగాళా ఖాతంలో కలపడం ఖాయమని హెచ్చరించారు. శింగనమల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఆలూరి సాంబశివారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన నడుస్తోందన్నారు. కళ్యాణదుర్గం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాలో సమన్వయకర్త ఉషాశ్రీచరణ్ మాట్లాడుతూ చంద్రబాబుకు దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, మళ్లీ ఎన్నికలకు వెళ్లాలన్నారు. కదిరి పట్టణంలో సమన్వయకర్త డాక్టర్ సిద్దారెడ్డి ఆధ్వర్యంలో బైకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. మడకశిర తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి పాల్గొన్నారు. పుట్టపర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి మాట్లాడారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను సిగ్గు లేకుండా టీడీపీలోకి చేర్చుకొన్న చంద్రబాబు.. వారికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట పార్టీ జిల్లాఅధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. హిందూపురంలో నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కాగా.. పోలీసులు ఎన్నికల్ కోడ్‌ను సాకుగా చూపి నవీన్‌నిశ్చల్‌తో పాటు కార్యకర్తలను అరెస్టు చేశారు. అనంతరం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. -
సేవ్ డెమోక్రసీ ప్రదర్శనలు
► నియోజకవర్గ కేంద్రాల్లో బైక్ ర్యాలీలు ► పాల్గొన్న పార్టీశ్రేణులు, పౌరులు ► చంద్రబాబు పై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ద్వజం శ్రీకాకుళం అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబు భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం ఉదయం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ‘సేవ్ డెమోక్రసీ’ నినాదంతో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. బైక్ ర్యాలీలు, నిరసన ర్యాలీల సన్నద్ధతపై పార్టీ జిల్లా నాయకులతో రెడ్డి శాంతి శుక్రవారం ఉదయం శ్రీకాకుళంలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. కార్యక్రమాలు విజయవంతం చేయడానికి సమాలోచనలు చేశారు. ప్రభుత్వ దుర్మార్గపు విధానాలను ప్రజలకు ఏవిధంగా వివరించాలి, చంద్రబాబు చేస్తున్న అనైతిక రాజకీయాలను ఏవిధంగా ఎండగట్టాలి... అనే విషయాలపై చర్చించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలతో టీడీపీలోకి చేర్పించుకున్నారని విమర్శించారు. వారిలో నలుగురికి మంత్రి పదవులూ నిస్సిగ్గుగా కట్టబెట్టారన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం పాలుచేసేలా వ్యవహరించిన చంద్రబాబును గవర్నరు సైతం మందలించకపోగా వత్తాసు పలకడం అన్యాయమన్నారు. చంద్రబాబు రాజ్యాంగ విరుద్ధ పనులను వ్యతిరేకించి టీడీపీ ప్రభుత్వ మెడలు వంచేందుకు శుక్రవారం పార్టీ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బైక్‌ర్యాలీలు, ధర్నాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు అంధవరపు వరహానరసింహం, ఎంవీ పద్మావతి, కోణార్క్ శ్రీను, శిమ్మ రాజశేఖర్, ఎన్ని ధనుంజయ్, గుమ్మా నగేష్, సాధు వైకుంఠరావు, టి.కామేశ్వరి, మండవిల్లి రవి, పి.జీవరత్నం, మూకళ్ళ తాతబాబు, గొండు కృష్ణ, పీస శ్రీహరి, పొన్నాడ రుషి, పడపాన సుగుణారెడ్డి, పప్పు పొట్టెమ్మ, కె.చంద్రకళ, ఆదిత్య శ్రీను, దున్న దేవా తదితరులు పాల్గొన్నారు. బైక్ ర్యాలీ సాగేదిలా....: జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్ సీపీ శ్రేణులన్నీ తొలుత బైక్ ర్యాలీ నిర్వహించాయి. అనంతరం స్థానిక ఆర్డీవో లేదా తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలో పాల్గొంటాయి. శ్రీకాకుళంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయం నుంచి ఉదయం 9.30 గంటలకు బైక్‌ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీ జీటీ రోడ్డు మీదుగా వైఎస్సార్ కూడలి వరకూ చేరుకొని, అక్కడి నుంచి పాలకొండ రోడ్డు మీదుగా డే అండ్ నైట్, అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని అక్కడ ధర్నా నిర్వహించారు. -
వైఎస్ఆర్ సీపీ 'సేవ్ డెమోక్రసీ'
అమరావతి: ప్రజాస్వామ్య పరిరక్షణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. సేవ్ డెమోక్రసీ పేరుతో అన్ని నియోజకవర్గాల్లో శుక్రవారం ఆందోళనలు చేపడుతోంది. టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న అప్రజాస్వామిక చర్యలను రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సీపీ ఎండగడుతోంది. ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ.. అన్ని జిల్లాల్లో ప్రజాస్వామిక వాదులతో కలిసి ధర్నాలు, ర్యాలీలను వైఎస్ఆర్ సీపీ చేపడుతోంది. ► వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో సేవ్ డెమోక్రసీ పేరిట వైఎస్ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ► పోరుమామిళ్లలో బద్వేల్ ఇంఛార్జ్ వెంకట సుబ్బయ్య, మండల అధ్యక్షుడు చిత్తా విజయప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ► రాజంపేట పాతబస్టాండ్ వద్ద వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, పట్టణ కన్వినర్ శ్రీనివాసుల రెడ్డి, కార్యదర్శి మురళీరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. ► మైదుకూరు ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పార్టీ నేత దస్తగిరి బాబు, తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. ► పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో ఆచంట కన్వీనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సేవ్ డెమోక్రసీ పేరుతో ధర్నా చేపట్టారు. అంబేడ్కర్, పొట్టి శ్రీరాములు, గాంధీ, వైఎస్ఆర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్సీ ఆళ్ల నాని, జిల్లా మహిళా అధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆళ్ల నాని మాట్టాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిందని మండపడ్డారు. ఫిరాయింపుదారులను ప్రోత్సహించిన చంద్రబాబు ప్రభుత్వంపై కేంద్ర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ► భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ► కర్నూలు జిల్లాలో సేవ్ డెమోక్రసీ పేరిట జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసనలు చేపట్టారు. కర్నూలులో ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, హఫీజ్ ఖాన్, బీవై రామయ్య ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ► ఎమ్మిగనూరులో ఇంఛార్జ్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ► కల్లూరు ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ఎమ్మెల్యే గూరు సుచరిత, పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ► ఆళ్లగడ్డలో గంగుల జితేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ► అనంతపురం జిల్లా ఉరవకొండలో ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సెవ్ డెమోక్రసీ పేరిట ధర్నా చేపట్టారు. ► విజయనగరం జిల్లా సాలూరులో ఎమ్మెల్యే రాజన్నదొర ఆధ్వర్యంలో సేవ్ డెమోక్రసీ పేరిట రాస్తరోకో నిర్వహించారు. అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. ► చిత్తూరు జిల్లా తిరుపతిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీ నేతలు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో నగరపాలక అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, నాయకులు మమత, రాజేంద్ర ఇమామ్ తదితరులు పాల్గొన్నారు. ► గంగాధరనెల్లూరులో ఎమ్మెల్యే నారాయణ స్మామి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ► కుప్పంలో ఇంఛార్జ్ చంద్రమౌళి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహం నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ► బి.కొత్తకోటలో ద్వారకానాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ► పీలేరులో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ► గుంటూరులో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ తాడేపల్లి ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట ఎమ్మెల్యే ఆర్కే ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ► రేపల్లెలో మాజీ మంత్రి మోపిదేవి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా. ► ప్రకాశం జిల్లా కందుకూర నియోజకవర్గంలో తుమటి మాధవరావు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం. ► అద్దంకిలో ఇంఛార్జ్ కృష్ణచైతన్య ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. పార్టీ నేతలు ఆనందరావు, జ్యోతి హన్మంతరావుతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ► ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ కృష్ణా జిల్లా తిరువురులో ఎమ్మెల్యే రక్షణనిధి ఆధ్వర్యంలో ధర్నా. ► కైకలూరులో వైఎస్ఆర్ సీపీ సేమ్ డెమోక్రసీ బైక్ ర్యాలీ. సమన్వయకర్త నాగేశ్వరరావు తదితర నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. ► తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు, సునీల్ ఆధ్వర్యంలో 'సేమ్ డెమోక్రసీ' ధర్నా. భానుగుడి జంక్షన్ నుంచి సర్పవరం వరకు బైక్ ర్యాలీ. ► జగ్గంపేట తహశీల్దార్ కార్యాలయం ఎదుట కోఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నా. వరసాల ప్రసాద్, గోవిందరెడ్డి, దొరబాబు, పెదబాబు తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. ► శ్రీకాకుళంలోని ఏడు రోడ్డుల జంక్షన్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు వైఎస్ఆర్ సీపీ భారీ బైక్ ర్యాలీని నిర్వహించింది. పార్టీ అధ్యక్షురాలు రెడ్డి శాంతి, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ► ఆముదాలవలసలో తహశీల్దార్ కార్యాలయం వద్దకు నిర్వహించిన బైక్ ర్యాలీలో మాజీ మంత్రి తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ► నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటర్లో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ► వేదాయపాలెంలోని జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద డిప్యూటీ మేయర్ ద్వారకానాథ్, తాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సేవ్ డెమోక్రసీ ర్యాలీ. -
వైఎస్ఆర్ సీపీ 'సేవ్ డెమోక్రసీ'
-
సేవ్ డెమోక్రసీ
నేడు నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు విజయవంతానికి కన్నబాబు పిలుపు కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి పిలుపు మేరకు శుక్రవారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ‘సేవ్ డెమోక్రసీ’ నినాదంతో నిరసనలు చేపట్టాలని, జయప్రదం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు పిలుపునిచ్చారు. ఆయా నియోజకవర్గాల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించే దిశగా ఆందోళనలు చేపట్టి ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని విజ్ఞప్తి చేశారు. గురువారం రాత్రి ఆయన విలేకర్లతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో టీడీపీ ఎమ్మెల్యేని టీఆర్ఎస్లోకి చేర్చుకుని మంత్రి పదవి ఇస్తే భగ్గుమన్న చంద్రబాబు ఇక్కడ మాత్రం అదే తప్పు చేసి నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. -
రాష్ట్రంలో అనైతిక, అప్రజాస్వామిక పాలన..
తిరుపతి: ‘రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా అభద్రతా భావంలో ఉన్నారు. ప్రజాస్వామ్యం అథఃపాతాళానికి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అనైతిక, అప్రజాస్వామిక పాలన సాగుతోంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పౌరులందరిపైనా ఉంది. ఇందుకోసం ‘సేవ్ డెమొక్రసీ’ పేరిట ఆన్లైన్ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నా..’అని చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్, స్పీకర్ల వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడం సిగ్గు చేటని పేర్కొన్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన శాసనసభ్యుడు మరో పార్టీలోకి వెళితే డిస్ క్వాలిఫై అవుతారని రాజ్యాంగం పదో షెడ్యూల్లో తెలియజేస్తున్నా, పట్టించుకునే పరిస్థితుల్లో లేరన్నారు. తెలంగాణలో ఒక మాట, ఇక్కడో మాట మాట్లాడుతూ పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలను రాజ్యాంగానికి విరుద్ధంగా మంత్రులుగా చేయడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. దీనివల్ల రాష్ట్రంలో చెడు సాంప్రదాయం వేళ్లూనుకుంటోందనీ, దీన్ని అడ్డుకునేందుకు ప్రజాస్వామ్య పరిరక్షణ జరగాలని చెవిరెడ్డి పిలుపునిచ్చారు. ఇందుకోసమే సేవ్ డెమొక్రసీ పేరిట ఆన్లైన్ ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు, ప్రజాస్వామ్య వాదులు దీనికి మద్దతుగా నిలబడాలని కోరారు. భావి తరాలకు న్యాయం అందించేందుకు చేయూతనివ్వాలన్నారు. నిరంతరం «నీతి వాక్యాలు వల్లించే సీఎం చంద్రబాబునాయుడు ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి తిరిగి వాళ్లను గెలిపించుకుని మంత్రి పదవులు కట్టబెట్టాలన్నారు. నిజంగా ప్రజల్లో మద్దతుంటే, మీ పాలనను ప్రజలు సమర్థిస్తున్నారన్న నమ్మకం ఉంటే రాజీనామాలు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. ఆ నలుగురూ ఉన్న ఒక్క స్థానంలోనైనా గెలువ గలరా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వాదులు ఆలోచించాలని చెవిరెడ్డి కోరారు. విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు పార్టీ నేతలు కేశవులు, మునీశ్వర్‌రెడ్డి, మాధవ్‌రెడ్డి, ఎం. చంద్రమోహన్‌రెడ్డి, చిన్ని కూడా పాల్గొన్నారు. -
10న ప్రజాస్వామ్య పరిరక్షణ సదస్సు
న్యూశాయంపేట : కేంద్ర ప్రభుత్వ విధానాలు వ్యతిరేకిస్తూ, ప్రజాసామ్య పరిరక్షణ కోసం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఈ నెల 9న ధర్నా, 10న సుప్రీం కోర్టు ఎదుటనున్న ఇండియన్ సొసైటీ ఆఫ్ ఇంటర్నేషనల్ లా ఆడిటోరియంలో సదస్సు నిర్వహించనున్నారు. ఈమేరకు పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు అనంతుల సురేష్, ప్రధాన కార్యదర్శి పెంట రమేష్ మంగళవారం సంయుక్త ప్రకటనలో తెలిపారు. దేశంలోని 19 రాష్ట్రాల ప్రజాహక్కుల సంఘాలు కలిసి ప్రజాస్వామిక హక్కుల సమన్వయ సంస్థ ఐక్యవేదికగా ఏర్పడి ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
'దుష్ట శక్తుల గుప్పిట్లో ఏపీ'
చికాగో: ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ముఖ్యం అని చెప్పారు. ఏపీలోని దుష్ట శక్తుల గుప్పెట్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని రక్షించి సుఖ సంతోషాలు వెల్లి విరిసేలా చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుందని ఆయన చెప్పారు. అమెరికాలోని చికాగో నగరం ఆరోరాలో టామరిండ్ ఇండియన్ కుసిన్ లో 'శేషు రెడ్డి & కొండపల్లి సత్య (కేఎస్ఎన్) ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 'సేవ్ డెమొక్రసీ' సంఘీభావ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. వందలాదిమంది ప్రవాసాంధ్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరుతూ భారత రాజకీయ వ్యవస్థకు ఒక గట్టి సందేశాన్ని అందిస్తున్నారని చెప్పారు. మహానేత వైఎస్ఆర్ అధికారంలో వున్నప్పుడు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిపేందుకు కృషిచేస్తామని చెప్పారు. వైఎస్ జగన్ పాలనతో తిరిగి రాజన్న స్వర్ణయుగం ఖాయమన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం రాజకీయ వ్యభిచారం లాంటిదని ఆయన చెప్పారు. తప్పు ఎవరు చేసినా తప్పేనని ఇలాంటివి ఆపకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతింటుందని అన్నారు. 'తిరుగులేని నాయకత్వ పటిమ కలిగిన వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రస్తుతం నేను నిజాయితీ కలిగిన ఎమ్మెల్యేగా ప్రజల్లో ఉన్నాను. మీ ప్రలోభాలకు లొంగి పార్టీ మారితే నీతిమాలిన ఎమ్మెల్యేగా చరిత్రలో మిగిలిపోతాను' అంటూ ఆయన చెప్పారు. ప్రజలు అన్ని చూస్తున్నారని, 2019లో ప్రజలు తప్పక గుణపాటం చెప్పడం ఖాయమన్నారు. రెండేళ్ల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.1,34,295 కోట్లు సంపాదించుకోవడానికి అవకాశం కల్పించిన 31 కుంభకోణాల వివరాలతో కూడిన ఎంపరర్ ఆప్ కరప్షన్ పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చికాగో సిటి కమిటీ ఇంచార్జీ ఆర్ వెంకటేశ్వర రెడ్డి, గంగాధర్, బక్తియర్ ఖాన్ తో పటుపలు రాష్టాల నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ తెలుగువారు, విద్యార్థులు, వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదే సభలో అమెరికా తెలుగు అసోసియేషన్ (అట) కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, కేకే రెడ్డి, కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జూలై తొలివారంలో చికాగోలో జగరనున్న అట 25వ వార్షికోత్సవ సభకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా శ్రీకాంత్ రెడ్డి ద్వారా విన్నవించారు. -
సీబీఐని దుర్వినియోగం చేసి...‘సేవ్ డెమోక్రసీనా’?
ప్రజల దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్ ర్యాలీ: వెంకయ్య ధ్వజం ముంబై/న్యూఢిల్లీ: సీబీఐని అడ్డుపెట్టుకుని విపక్ష నేతల్ని జైలుకు పంపిన కాంగ్రెస్.. ‘సేవ్ డెమోక్రసీ’ ర్యాలీ నిర్వహించడం అర్థరహితమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ముంబైలో శుక్రవారం విమర్శించారు. అగస్టా స్కాం నుంచి ప్రజల దృష్టి మళ్లించేఎత్తుల్లో భాగమే ర్యాలీ అని ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వంపై ఆరోపణలు చేసేందుకు కాంగ్రెస్‌కు నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెస్ హయాంలోనే100 సార్లు రాష్ట్రాల్లోని ప్రభుత్వాల్ని కూల్చేశారని చెప్పారు. అరుణాచల్, ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనేవిధించారని, కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వాల్లీ రద్దు చేశారని గుర్తుచేశారు. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన ఘనత కాంగ్రెస్‌దేనని, ప్రతికా స్వేచ్ఛను రద్దు చేయడంతో పాటు ప్రతిపక్ష నేతల్ని జైలుకు పంపారని విమర్శించారు. ప్రభుత్వ యంత్రాగాల్ని స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారని, అందువల్ల పార్లమెంట్ వెలుపల వారి నిరసనకు అర్థంలేదన్నారు. ప్రధాని మోదీని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని వెంకయ్య విమర్శించారు. మోదీ సీఎంగా ఉన్నప్పుడు కూడా అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. కుతంత్రాలతో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. అగస్టా స్కాంలో సుప్రీం పర్యవేక్షణలో సీబీఐ విచారణకు కాంగ్రెస్ హయాంలో ఎందుకు ఆదేశించలేదని ప్రశ్నించారు. స్కాంలో నిజాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సేవ్ డెమోక్రసీ కాదు సేవ్ ఫ్యామిలీ: రవిశంకర్ కాంగ్రెస్‌ది సేవ్ డెమోక్రసీ ర్యాలీ కాదని, సేవ్ ఫ్యామిలీ ప్రచారమని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. ఎప్పుడు విచారణ వేగవంతం చేసినా దేశద్రోహం, ప్రజాస్వామ్యంపై దాడంటూ గొడవ చేయడం కాంగ్రెస్‌కు అలవాటేనన్నారు. -
సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయి
ఎన్డీఏ తీరు అలా అనిపిస్తోంది: సోనియా ♦ అన్యాయం ముందు తలవంచం ♦ ‘సేవ్ డెమోక్రసీ’ ర్యాలీలో వ్యాఖ్య ♦ జంతర్‌మంతర్ నుంచి పార్లమెంట్ వరకు ర్యాలీ, అరెస్టు న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, ప్రతిపక్షంపై నిరాధార ఆరోపణలతో దుష్ర్పచారం చేస్తున్నారంటూ ఢిల్లీ వీధుల్లో కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఆందోళన నిర్వహించింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు పలువురు సీనియర్ నేతలు జంతర్‌మంతర్ నుంచి పార్లమెంట్ వరకూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమీపంలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం విడిచిపెట్టారు. జంతర్ మంతర్ వద్ద సోనియా మాట్లాడుతూ.. తమను భయపెట్టేందుకు, అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నించవద్దని, జీవితం పోరాడడం నేర్పిందంటూ మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ను బలహీన శక్తిగా భావించి తప్పు చేయవద్దని, అన్యాయం ముందు తమ పార్టీ ఎప్పుడూ తలవంచదన్నారు. దేశంలో పరిస్థితులు దిగజారితే ఎలా గుణపాఠం చెప్పాలో ప్రజలకు తెలుసని.. ఈ విషయాన్ని మోదీ ప్రభుత్వం బాగా అర్థం చేసుకోవాలని అన్నారు. ప్రజా తీర్పుతో అధికారంలోకి వచ్చి మోసగిస్తున్నారని, చూస్తుంటే కేంద్ర ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని అనిపిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో పార్లమెంట్ వెలుపల లోపల అప్రమత్తంగా ఉంటూ పూర్తి శక్తితో ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని చెప్పారు. డబ్బు, అధికార బలంతో ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వాల్ని పడగొట్టడమంటే ప్రజాస్వామ్య పునాదుల్ని కూల్చడమే కాక హత్య చేయడం కూడా అని విమర్శించారు. దేశంలోని ప్రతి మూలకు వెళ్లి మోదీ ప్రభుత్వం నిజస్వరూపాన్ని బయటపెట్టాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. ప్రజాస్వామ్య విధానాల్ని నాశనం చేసేందుకు అధికార పార్టీని అనుమతించబోమన్నారు. మతం, ప్రాంతం, భాష, ఆహారపు అలవాట్ల ఆధారంగా ప్రజల్ని విడదీస్తున్నారని మైనార్టీలు భయం నీడలో బతుకుతున్నారని చెప్పారు. నాగ్‌పూర్ ఆదేశాల మేరకు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందంటూ ఆర్ఎస్ఎస్ను సోనియా పరోక్షంగా విమర్శించారు. ప్రజాస్వామ్యం కోసం ఎలాంటి త్యాగాలకైనా కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేయదన్నారు. బీజేపీ వాదనల్ని అంగీకరించని వారిపై దేశ ద్రోహులుగా ముద్రవేస్తున్నారని, వాటిపై ఎలా పోరాడాలో కాంగ్రెస్‌కు తెలుసన్నారు. రెండేళ్ల పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ సోనియా విమర్శించారు. తప్పుడు వాగ్దానాలతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు మరింతగా అధికార దాహం పెరిగిందని తప్పుపట్టారు. ధరల అదుపులో కేంద్ర ం విఫలమైందని, దీనివల్ల మహిళలు, పేదలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కరువుపై ప్రధాని స్పందించరే?: రాహుల్ ఇద్దరు వ్యక్తుల ఆదేశాలు మాత్రమే దేశంలో చెలామణీ అవుతున్నాయని, వారికి వ్యతిరేకంగా మాట్లాడితే తప్పుడు ఆరోపణలతో లక్ష్యంగా చేసుకుంటున్నారంటూ మోదీ, మోహన్ భాగవత్‌లను ర్యాలీలో రాహుల్ పరోక్షంగా విమర్శించారు. దేశంలో 40 శాతం కరువును ఎదుర్కొంటోందని, రోజూ 50 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా... దానిపై ప్రధాని ఏమీ మాట్లాడరంటూ తప్పుపట్టారు. ‘అచ్ఛే దిన్’ వస్తుందని వాగ్దానం చేశారని, దేశం మాత్రం కరవు కోరల్లో చిక్కుకుందన్నారు. అధికారంలోకి వస్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీనిచ్చారని, గతేడాది కేవలం 1.3 లక్షల మందికే ఉద్యోగాలు దక్కాయన్నారు. 4 రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని కూల్చే కుట్ర: మన్మోహ న్ ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ ప్రచారాన్ని తప్పుపట్టిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్... కాంగ్రెస్ పార్టీ భారతదేశ ఆత్మ అని చెప్పారు. దేశంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు, న్యాయస్థానాలపై భయంకరమైన దాడుల్ని ఎదుర్కొనేందుకు సోనియా, రాహుల్‌తో కలిసి పనిచేయాలన్నారు. మణిపూర్, మిజోరాం, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్‌ల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాల్ని కూల్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గంగా నది లాంటిదని, ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా తన దారి నుంచి వైదొలగదని చెప్పారు. -
అమెరికాలో 'సేవ్ డెమొక్రసీ'
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో 'వాషింగ్టన్ డీసీ మెట్రో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ' ఆధ్వర్యంలో ఆదివారం 'సేవ్ డెమొక్రసీ' సంఘీభావ సభ నిర్వహించారు. ఈ సభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత లోపిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం రాజకీయ వ్యభిచారమని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లను కట్టడి చేయకుంటే వ్యవస్థ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు, తాగునీటి ఎద్దడితోపాటు అవినీతి తదితర సమస్యలపై తమ పార్టీ ప్రజల తరపున నిలదీస్తుందని ఆయన స్పష్టం చేశారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. 'తిరుగులేని నాయకత్వ పటిమ కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నిజాయతీ గల ఎమ్మెల్యేగా తాను ప్రజల్లో ఉన్నానని... మీ ప్రలోభాలకు తలొగ్గి పార్టీ మారితే నీతిమాలిన ఎమ్మెల్యేగా చరిత్రలో మిగిలిపోతానని తనను పార్టీలోకి రావాలంటూ సంప్రదించిన టీడీపీ నేతలకు స్పష్టం చేసినట్లు శ్రీకాంత్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం 'ఎంపరర్ ఆఫ్ కరప్షన్' పుస్తకాన్ని శ్రీకాంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ పుస్తకం చంద్రబాబు అవినీతి కుంభకోణాలకు అక్షర రూపమని పేర్కొన్నారు. తాము చెప్పేదే వేదం, చేసేదే అభివృద్ధి అంటూ మూర్ఖంగా ముందుకు పోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తప్పక గుణపాఠం నేర్పుతారని టీడీపీ నేతలను శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమెరికా ఎన్ఆర్ఐ కమిటీ అడ్వైజర్ అండ్ మిడ్ అట్లాంటిక్ రీజియన్ ఇన్చార్జ్ వల్లూరు రమేష్ రెడ్డి, సెంట్రల్ రీజియన్ ఇన్ ఛార్జ్ శ్రీ సురేష్‌రెడ్డి బత్తినపట్లతోపాటు వైఎస్సార్సీపీ అమెరికా ఎన్ఆర్ఐ కమిటీ కన్వీనర్ రత్నాకర్ పండుగాయల, స్టూడెంట్ వింగ్ లీడర్ సాత్విక్ రెడ్డి, పలు రాష్టాల నుంచి విచ్చేసిన తెలుగు ఎన్ఆర్ఐలు, విద్యార్థులు, వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాషింగ్టన్ డీసీలో మెట్రో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనితీరును సురేష్‌రెడ్డి బత్తినపట్ల వివరించారు. అలాగే ఈ కార్యక్రమాలు అమలు చేస్తున్న క్రమంలో పొందిన అనుభవాలను ఈ కార్యక్రమానికి హాజరైన వారితో పంచుకున్నారు. అయితే ఈ కార్యక్రమం ప్రారంభం కాగానే దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు. -
కొనుగోళ్ల పర్వాన్ని వివరించాం
♦ ఫిరాయింపులపై చర్యల అధికారాన్ని స్పీకర్ నుంచి తప్పించాలి ♦ మూడు నెలల కాలవ్యవధి పెట్టి ఈసీకి అప్పగించాలి ♦ 10 ప్రధాన హామీలు నెరవేర్చని పార్టీని పోటీనుంచి నిషేధించాలి ♦ సీమాంధ్ర, జీహెచ్ఎంసీలో ఒకే రోజు పోలింగ్ నిర్వహించాలి ♦ ఎన్నికలను అర్థవంతంగా నిర్వహించేందుకు ఈసీకి మూడు సూచనలిచ్చాం ♦ చంద్రబాబు అనైతిక రాజకీయాలపై ప్రధానికి లేఖ రాస్తాం ♦ న్యాయం జరగడం ఆలస్యం కావచ్చేమో.. నిరాకరణ ఉండదు ♦ పోరాటం ఇంతటితో ఆగదు.. న్యాయస్థానాలకూ వెళతాం ♦ ‘సేవ్ డెమొక్రసీ’ ఉద్యమంపై వైఎస్ జగన్ సంతృప్తి న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో జరుగుతున్న అనైతిక రాజకీయాలను, అవినీతి సొమ్ముతో విచ్చలవిడిగా సాగిస్తున్న ఎమ్మెల్యేల కొనుగోళ్ల తీరును ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చెప్పారు. అనైతిక రాజకీయాలకు అడ్డుకట్ట వేయడానికి, ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత బలోపేతం చేసి ప్రజల ఆకాంక్షలకు రక్షణ కవచంగా మార్చాలని వైఎస్సార్సీపీ చేస్తున్న పోరాటానికి తప్పకుండా ఫలితం ఉంటుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. న్యాయం జరగడంలో ఆలస్యం ఉండవచ్చే మో కానీ.. న్యాయం తప్పకుండా జరుగుతుందంటూ తొణికిసలాడిన ఆత్మవిశ్వాసంతో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. గురువారం ఎన్నికల సంఘంతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘రూ. 20-30 కోట్ల అవినీతి సొమ్ముతో ఒక్కో ఎమ్మెల్యేని అధికార టీడీపీ కొనుగోలు చేస్తున్న తీరును వివరించాం. కొందరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులను ఎర చూపుతున్న పరిస్థితిని విడమరిచి చెప్పాం’ అని తెలిపారు. ఎన్నికలను మరింత అర్థవంతంగా నిర్వహించడానికి అనుసరించాల్సిన మార్గాలను సూచించాలని వివిధ రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం కోరిన నేపథ్యంలో తమ పార్టీ తరఫున మూడు సూచనలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించామని చెప్పారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వరప్రసాద్, బుట్టా రేణుక తదితరులతో కూడిన బృందం జగన్ నేతృత్వంలో ఎన్నికల ప్రధాన కమిషనర్ నజీమ్ జైదిని కలిసి ఈ వినతిపత్రం సమర్పించారు. ప్రధానమంత్రికి లేఖ రాస్తాం ఏపీలో సాగుతున్న అక్రమాలు, అవినీతి, అనైతిక రాజకీయాలను వివరిస్తూ ప్రధానమంత్రికి లేఖ రాస్తానని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా జగన్ చెప్పారు. ‘‘ప్రధాన మంత్రి అపాయింట్మెంట్ అడిగాం. మీరన్నట్లుగా (బీజేపీకి టీడీపీ మిత్రపక్షం కాబట్టి ఇవ్వలేదా? అని అడిగిన విలేకరిని ఉద్దేశించి) మిత్రపక్షం కాబట్టి ఇవ్వలేదోమో! మా వాదనలు, విజ్ఞప్తులు వివరిస్తూ ప్రధానికి లేఖ రాస్తాం. ‘చంద్రబాబు.. అవినీతి చక్రవర్తి’ పుస్తకాన్ని పోస్టు ద్వారా పంపిస్తాం’’ అని తెలిపారు. ‘సేవ్ డెమొక్రసీ’ ఢిల్లీ యాత్ర సంతృప్తికరంగా సాగిందా? అంటూ ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ‘‘వ్యవస్థలో మార్పు తీసుకు రావాలంటే మన వాదన గట్టిగా వినిపించాలి. సాధ్యమైనంత మేర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుంది’’ అని సమాధానమిచ్చారు. మీ పోరాటం ఫలిస్తుందనే నమ్మకం ఉందా? అని మరో విలేకరి ప్రశ్నించగా... ‘‘ఇదో పోరాటం. న్యాయం జరుగుతుందా, జరగదా అనే విషయం పక్కనబెడితే.. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అన్యాయాన్ని దేశం దృష్టికి తీసుకొచ్చాం. దేశంలోని ముఖ్య నాయకులు, ముఖ్యమైన సంస్థలు, వ్యవస్థల దృష్టికి ఆంధ్రప్రదేశ్‌లో సాగుతున్న అనైతిక రాజకీయాల తీరును వివరించగలిగాం’ అని జవాబు చెప్పారు. ‘ఇంతటితో ఆగం. కోర్టులకూ వెళతాం. అక్కడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం. న్యాయం జరగడం ఆలస్యం కావచ్చేమో కానీ... నిరాకరించడం మాత్రం జరగదు’ అని మరో ప్రశ్నకు ఆత్మవిశ్వాసంతో సమాధానం చెప్పారు. గ్యాస్ కనెక్షన్లు అధికంగా ఇవ్వాలని వినతి కేంద్ర పెట్రోలియం, సహజ వాయు మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను జగన్ గురువారం మధ్యాహ్నం ఇక్కడి శాస్త్రిభవన్‌లోని మంత్రి కార్యాలయంలో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ‘‘హోం మంత్రి, ఆర్థిక మంత్రికి ఇచ్చిన వినతిపత్రాలను ఇక్కడ కూడా ఇచ్చాం. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పర్వం, ఫిరాయింపుల పర్వాన్ని వివరించాం. అలాగే ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీల్లో పెండింగ్‌లో ఉన్న అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లాం. ఇటీవలే కేంద్రం ప్రకటించిన ఉచిత గ్యాస్ కనెక్షన్లలో ఆంధ్రప్రదేశ్‌కు పెద్దమొత్తంలో ఇవ్వాలని కోరాం..’’ అని వివరించారు. ఈసీకి వైఎస్సార్సీపీ ఇచ్చిన సూచనలు సూచన-1 పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అనర్హత వేటు వేసే అధికారాన్ని స్పీకర్ పరిధి నుంచి తప్పించి, మూడు నెలల వ్యవధిలో నిర్ణయం తీసుకునేలా ఎన్నికల సంఘానికి అప్పగించమని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయండి. అలా చేయకుంటే ప్రజాస్వామ్యం బతకదు. అనైతిక రాజకీయాలతో పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని, ప్రజల ఆకాంక్షలను ఖూనీ చేస్తారనే ఆందోళన వ్యక్తమవుతోంది. స్పీకర్ అధికార పార్టీకి చెందిన వ్యక్తే కాబట్టి... అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాన్ని రద్దు చేయరు. ఎమ్మెల్యేలు రాజీనామా చేయరు. ఇటు అనర్హత వేటు పడకుండా, అటు రాజీనామాలు చేయకుండా.. ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ మంత్రి పదవులూ చేపట్టే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. సూచన-2 ఎన్నికల మేనిఫెస్టోలోని 10 ముఖ్యమైన హామీలను అన్ని పార్టీలను అడగండి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 10 హామీలను నెరవేర్చలేకపోతే.. తర్వాత జరిగే ఎన్నికల్లో ఆ పార్టీలు పోటీ చేయకుండా నిషేధం విధించండి. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అబద్దాలు చెప్పి ప్రజలను ఏ విధంగా మోసం చేశారో చూస్తే అర్థమవుతుంది. ♦ రూ. 87,612 కోట్ల వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ కింద చంద్రబాబు ఇచ్చిన సొమ్ము.. రైతుల వడ్డీలకు సరిపోలేదు. రుణాలన్నీ మాఫీ చేస్తానని డ్వాక్రా అక్కచెల్లెమ్మలకూ పంగనామాలు పెట్టారు. ♦ జాబు కావాలంటే బాబు రావాలంటూ ఎన్నికల ముందు టీడీపీ ఊదరగొట్టింది. ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో ఇంటికి రూ. 2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశారు. ఉద్యోగాల ఇచ్చే సంగతి అటుంచితే.. ఉన్న ఉద్యోగాలనే ఊడబెరుకుతున్నారు. నిరుద్యోగ భృతి మాటే ఎత్తడం లేదు. ♦ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసి, వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. చంద్రబాబు చేసిన మోసానికి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ప్రజాగ్రహానికి, వ్యతిరేకతకు భయపడి ప్రతి పక్ష పార్టీ ఎమ్మెల్యేలను రూ. 20-30 కోట్లకు కొనుగోలు చేస్తున్నారు. ప్రజల గొంతుక వినపండకుండా చేయాలని ముఖ్యమంత్రి ఆరాటపడుతున్న తీరు జుగుప్సాకరంగా ఉంది. ఫిరాయింపుదారులతో రాజీనా మా చేయించి ఎన్నికలకు వెళ్లడానికి బాబు భయపడుతున్నారంటే ప్రజల్లో ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. సూచన-3 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ దాదాపు ఆరు దశాబ్దాలపాటు రాజధాని. సీమాంధ్రకు చెందిన వారు పెద్ద సంఖ్యలో జీహెచ్ఎంసీ(గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్) పరిధిలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. సీమాంధ్ర, జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో ఒకే రోజు పోలింగ్ నిర్వహించాలి. తద్వారా రెండు చోట్లా ఓట్లు వేసే (డబుల్ ఓటింగ్) అవకాశం లేకుండా చేయవచ్చు. -
టీడీపీ తీరుపై కేంద్రం సిగ్గుపడుతోంది
► ఎమ్మెల్యేలను కొనుక్కోవడమేనా ప్రజాస్వామ్యం... ► వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల ఆరోపణ ► సేవ్‌డెమొక్రసీ కోసం గడపగడపకు యాత్రలు చేపడతామని వెల్లడి గోపాలపట్నం : టీడీపీ అధినేత చంద్రబాబు అప్రజాస్వామ్య పాలనపై కేంద్రం సిగ్గుపడుతోందని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు విమర్శించారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు డబ్బు ఎరజూపి కొనుక్కోవడం, అభివృద్ధిని గాలికొదిలేయడం ప్రజాస్వామ్యమా అని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు బూడి ముత్యాలనాయుడు, గిడ్డి ఈశ్వరి, దాడిశెట్టి రాజా, కళావతి, కంబాల జోగులు, పుష్ప శ్రీవాణి ఢిల్లీలో ‘సేవ్‌డెమొక్రసీ’ యాత్ర ముగించుకొని విశాఖ విమానాశ్రయానికి గురువారం సాయంత్రం చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రలో అధికార పార్టీ తీరుపై కేంద్రం ఎంత చిన్నచూపుతో ఉందో వివరించారు. టీడీపీ చర్యలను నిరసిస్తూ.. వైఎస్సార్ సీపీ చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. అడ్డగోలు సంపాదనతో ఎమ్మెల్యేలను కొంటున్నారు పట్టిసీమ, రాజధాని భూములపై అడ్డగోలుగా సంపాదించిన సొమ్ముతో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిపై ఏమాత్రం శ్రద్ధ లేదు. నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదు. ఇది అత్యంత దారుణం. ఒక పార్టీ బీఫాంతో గెలిచిన ఎమ్మెల్యేలను మరో పార్టీ వారు కొనడం రాక్షసపాలనగానే భావిస్తున్నాం. టీడీపీ ప్రభుత్వ ఆగడాలపై పుస్తకరూపంలో కేంద్రానికి విన్నవించాం. టీడీపీ ప్రభుత్వ అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగ భృతి ఎరజూపి ఓట్లేయించుకని ఇపుడు మొహం చాటేసింది. ఫీజు రీయింబర్సుమెంట్ మంజూరు చేయకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వలేదని వాపోయారు. ప్రజలు వైఎస్సార్ సీపీ పక్షాన ఉన్నారు. వైఎస్సార్ సీపీ పోరు ఇది ఆరంభమే. - బూడి ముత్యాలనాయుడు, మాడుగుల ఎమ్మెల్యే కిడారిని రూ. 30 కోట్లతో కొన్నారు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.30 కోట్లిచ్చి కొన్నారు. కిడారి సర్వేశ్వరరావు వైఎస్సార్ సీపీకి నమ్మకద్రోహం చేశారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డికి వెన్నుపోటుపొడిచారు. కొణతాల రామకృష్ణను గురువంటునే ఆయనకు భంగపాటుకు గురిచేశారు. కిడారి స్వలాభం కోసం గిరిజనులను టీడీపీకి తాకట్టుపెట్టారు. గిరిజనులు మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై అభిమానంతో జగన్మోహన్రెడ్డి నాయకత్వం కోరుతూ ఓట్లేస్తే ఇలా పార్టీ ఫిరాయించారు. ఏజెన్సీలో 50 ఎకరాల మైనింగ్ దోచుకోడానికి కిడారి సర్వేశ్వరరావు టీడీపీలో చేరడం దారుణం. పార్టీ ఫిరాయింపులపై జాతీయ నాయకులను, ప్రధాన పార్టీల నాయకులను కలిసి అన్నివిషయాలు చర్చించాం. టీడీపీ చర్యలు హాస్యాస్పదమని కేంద్రంలో నాయకులు విమర్శిస్తున్నారు. - గిడ్డి ఈశ్వరి, పాడేరు ఎమ్మెల్యే -
'హైదరాబాద్, ఏపీలలో ఒకేసారి ఎన్నికలు'
► అలా చేయపోతే రెండుచోట్లా ఓట్లేసే ప్రమాదం ► పార్టీలు మేనిఫెస్టోలలో ఇచ్చే హామీలను కూడా చూడాలి ► ఎన్నికల కమిషన్‌కు వైఎస్ జగన్ విజ్ఞప్తి ► ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తాం ► ఏపీలో జరిగే అరాచకాలను ఇప్పుడు దేశం దృష్టికి తీసుకొచ్చాం ► తర్వాత కోర్టులోనూ పోరాటం కొనసాగిస్తాం న్యూఢిల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలన్నా.. ఆంధ్రప్రదేశ్‌తో పాటు హైదరాబాద్ నగరంలో (జీహెచ్ఎంసీ పరిధిలో) కూడా ఒకేసారి పోలింగ్ ఉండేలా చూడాలని ఎన్నికల కమిషన్‌కు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రెండుచోట్లా వేర్వేరు సమయాల్లో ఎన్నికలు నిర్వహిస్తే, కొంతమంది ఓటర్లు అక్కడ, ఇక్కడ కూడా ఓట్లు వేస్తున్నారని.. దీనివల్ల ప్రజాస్వామ్యానికి నష్టం కలుగుతుందని కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ నజీమ్ జైదీని గురువారం కలిసి ఈ మేరకు పలు విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లిన అనంతరం వైఎస్ జగన్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అధికారాన్ని అసెంబ్లీ స్పీకర్ చేతుల్లోంచి తీసేసి ఎన్నికల కమిషన్ పరిధిలోకి తెచ్చేలా ప్రతిపాదించాలని కోరామన్నారు. లేకపోతే ప్రజాస్వామ్యం అమ్ముడుపోతుందని చెప్పామన్నారు. ఒక పార్టీ నుంచి గెలిచి, అధికార పార్టీలోకి వెళ్లే ఎమ్మెల్యేలపై అధికార పార్టీకి చెందిన స్పీకర్ అనర్హత వేటు వేయరని, వీళ్లు కూడా రాజీనామా చేయరని తెలిపామన్నారు. అలా పార్టీలు మారిన ఎమ్మెల్యేలు అదే పదవుల్లో కొనసాగే పరిస్థితి మారాలని.. అలాంటివాళ్లు మంత్రి పదవులు పొందడం మరీ దౌర్భాగ్యమని ఎన్నికల కమిషన్‌కు చెప్పామన్నారు. దాంతోపాటు.. ఎన్నికల మేనిఫెస్టోలో పార్టీలు ఇచ్చే 10 ముఖ్యమైన హామీలేంటో అడగాలని.. వాటిని నెరవేర్చకపోతే ఆయా పార్టీలను తర్వాత ఎన్నికల్లో పోటీ చేయకుండా బ్యాన్ చేయాలని ఎన్నికల కమిషన్‌ను కోరామని ఆయన తెలిపారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఏ రకంగా అబద్ధాలు ఆడి ప్రజలను మోసం చేశారో ఎన్నికల కమిషన్‌కు చెప్పామన్నారు. రైతు రుణాలు బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పి.. చివరకు ఇప్పుడు మాత్రం వడ్డీలకు కూడా సరిపోకుండా డబ్బులు విదిలిస్తున్నారని, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు కూడా పంగనామాలు పెట్టారని ఆయన అన్నారు. జాబు కావాలంటే బాబే సీఎం కావాలని ఎన్నికల సమయంలో ఊదరగొట్టారని, ఉద్యోగాలు ఇవ్వలేకపోతే ఇంటికి 2వేల నిరుద్యోగ భృతి ఇస్తామని కూడా చెప్పారని గుర్తుచేశారు. ఇప్పుడు మాత్రం ఆ హామీలన్నింటినీ తుంగలో తొక్కి ప్రజల జీవితాలను ఎలా మోసం చేస్తున్నారో, దానిపై ప్రజల గొంతు ఎక్కడ వినపడుతుందోనన్న భయంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఎలా తాపత్రయపడుతున్నారో కూడా ఎన్నికల కమిషన్‌కు చెప్పామన్నారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేలను మళ్లీ ఎన్నికల్లో పోటీచేయిస్తే, ప్రజలు వీళ్లకు మళ్లీ ఓట్లేయరేమోనన్న చంద్రబాబుకు ఉందని కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వ్యవస్థలో మార్పు తేవాలంటే ప్రతిచోటా మనవాణిని గట్టిగా వినిపించాలని, చేతనైనంత ప్రెజర్ పెడితే ఏదో ఒకరోజు సాకారం అవుతుందని.. ప్రజాస్వామ్యంలో న్యాయం జరుగుతుందని తమకు నమ్మకం ఉందన్నారు. ఢిల్లీలో సాగించిన 'సేవ్ డెమొక్రసీ' అనేది ఇది ఒక పోరాటమని, ఇందులో తమకు న్యాయం జరుగుతుందా లేదా అన్నది పక్కన పెడితే రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ఈ పోరాటం ద్వారా దేశం దృష్టికి తెచ్చామని అన్నారు. ముఖ్య నాయకులందరికీ దీని గురించి చెప్పామని, తర్వాత కోర్టుల్లో కూడా ఈ పోరాటం కొనసాగుతుందని అన్నారు. న్యాయం ఆలస్యం కావచ్చేమో గానీ నిరాకరించరన్నది తన నమ్మకమని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తాము ఇదే విషయమై ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కూడా అడిగాం గానీ, ఇంతవరకు దొరకలేదని, బహుశా టీడీపీ వాళ్ల మిత్రపక్షం కాబట్టి ఇవ్వలేదేమోనని ఆయన చెప్పారు. కానీ తాము ప్రధానికి ఏం చెప్పాలనుకున్నామో అదంతా పోస్టు ద్వారా ఆయనకు పంపిస్తామని తెలిపారు. -
ప్రధాన ఎన్నికల కమిషనర్ తో వైఎస్ జగన్ భేటీ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) నదీమ్ జైదీని కలిశారు. ఏపీలో ఫిరాయింపుల వ్యవహారాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు. అధికార టీడీపీ సాగిస్తున్న అనైతిక రాజకీయాలు, ప్రలోభాలతో ఎమ్మెల్యేలను లోబర్చుకుంటున్న తీరును వివరించారు. వైఎస్ జగన్ వెంట వైఎస్సార్ సీపీ ఎంపీలు, నాయకులు ఉన్నారు. ఫిరాయింపుల వ్యవహారాన్ని జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్ జగన్ నేతృత్వంలో 'సేవ్ డెమొక్రసీ' ఉద్యమం చేపట్టారు. ఇందులో భాగంగా పార్టీ నాయకులతో పాటు వైఎస్ జగన్ ఢిల్లీలో పలువురు జాతీయ పార్టీల నేతలను, కేంద్ర మంత్రులను కలిశారు. -
అనైతిక రాజకీయాలపై అన్ని కోణాల్లో యుద్ధం
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టీకరణ ♦ వ్యవస్థలో మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నాం ♦ అన్ని పార్టీల నేతలను కలుస్తాం... మద్దతు కూడగడతాం ♦ న్యాయస్థానాలనూ ఆశ్రయిస్తాం ♦ ఫిరాయింపులపై చర్యలు తీసుకొనే అధికారాన్ని ఈసీకి అప్పగించాలి ♦ ఢిల్లీలో సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజాతో ప్రతిపక్ష నేత భేటీ ♦ అనైతిక రాజకీయాలకు పార్టీ ఫిరాయింపులే పరాకాష్ట: డి.రాజా న్యూఢిల్లీ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: అనైతిక రాజకీయాలపై అన్ని కోణాల్లో యుద్ధం చేస్తామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. ఆయన నేతృత్వంలో పార్టీ ప్రజాప్రతినిధుల బృందం బుధవారం ఢిల్లీలో సీపీఐ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి డి.రాజాతో సమావేశమైంది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... దేశంలో కొనసాగుతున్న అనైతిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. వైఎస్సార్సీపీ చేపట్టిన ‘సేవ్ డెమొక్రసీ’ ఉద్యమంలో భాగంగా అన్ని పార్టీల నేతలను కలసి మద్దతు కూడగడుతున్నామని వెల్లడించారు. పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకొనే అధికారాన్ని స్పీకర్ పరిధి నుంచి తప్పించి, ఎన్నికల సంఘానికి అప్పగిస్తేనే రాజకీయ వ్యవస్థ బాగుపడుతుందని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా ఫిరాయింపుల నిరోధక చట్టంలో మార్పులు తీసుకొచ్చే దిశగా అన్ని పార్టీల మద్దతు కూడగడుతున్నామని చెప్పారు. సాధ్యమైనంత వరకు అన్ని పార్టీల నేతలను కలవడానికి ప్రయత్నిస్తున్నామని, ఈ ప్రయత్నంలో మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవస్థలో మార్పు కోసం కోర్టులను కూడా ఆశ్రయిస్తామని ప్రకటించారు. పార్టీ కార్యవర్గ సమావేశంలో చర్చిస్తాం: డి.రాజా అనైతిక రాజకీయాలకు పార్టీ ఫిరాయింపులే పరాకాష్ట అని డి.రాజా పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యంలో దురదృష్టకరమైన అంశమని చెప్పారు. తనతో భేటీ అయిన వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధుల బృందాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘పార్టీ నుంచి నిష్ర్కమిస్తే.. ఆ పార్టీ ద్వారా సమకూరిన శాసనసభ్యత్వంతో సహ అన్ని పదవులను కోల్పోయినట్లే. కానీ, ఏపీలో అలా జరగడం లేదు. ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లోపాలను ఆధారంగా చేసుకొని అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి అనైతిక వ్యవహారాలు ప్రజల ఆకాంక్షలకు భంగం కలిగించడమే కాకుండా, ప్రజాస్వామ్యానికే సవాళ్లు విసురుతున్నాయి. ఈ సమస్యకు సరైన పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది. ఫిరాయింపుల నిరోధక చట్టానికి సవరణకు వీలుగా ఆర్డినెన్స్ జారీ చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి సహకరించాలని వైఎస్ జగన్ మాకు విజ్ఞప్తి చేశారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు మే 28-29న జరగనున్నాయి. కార్యదర్శి వర్గ సమావేశం త్వరలో ఉంది. జగన్ లేవనెత్తిన అంశాలను, చంద్రబాబు అవినీతి వ్యవహారాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తాం. చంద్రబాబు రూ. 1.34 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ జగన్ ఇచ్చిన ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ పుస్తకంపై కూడా పార్టీ సమావేశాల్లో విస్తృతంగా చర్చిస్తాం. వైఎస్సార్సీపీ చేపట్టిన ఉద్యమానికి సీపీఐ మద్దతు ఉంటుంది’’ అని డి.రాజా పేర్కొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఢిల్లీకి రావాల్సి ఉన్నా.. ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల రాలేకపోయారని చెప్పారు. జగన్ కుటుంబంతో పరిచయం ఉంది జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో తనకు మంచి పరిచయం ఉందని డి.రాజా తెలిపారు. ఏపీలో సీట్ల సర్దుబాటు విషయంలో రాజశేఖరరెడ్డితో చర్చలు జరిపే అవకాశం తనకు వచ్చిందని గుర్తు చేశారు. జగన్ మాతృమూర్తి విజయమ్మతోనూ తాను మాట్లాడానని అన్నారు. అలా వారి కుటుంబంతో తనకు ముందు నుంచే పరిచయం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు సీపీఐ నేతలు అమర్జీత్ కౌర్, అనీ రాజా పాల్గొన్నారు. -
ఢిల్లీలో సేవ్ డెమోక్రసీ
-
'వ్యవస్థలో మార్పు తీసుకురావడమే మా లక్ష్యం'
న్యూఢిల్లీ : వ్యవస్థలో మార్పు తీసుకు రావడమే తమ లక్ష్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ సాగిస్తున్న అప్రజాస్వామిక రాజకీయాలు, అధికార టీడీపీ అడ్డగోలుగా సంపాదించిన అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష శాసనసభ్యులను కొనుగోలు చేస్తున్న తీరును జగన్ నేతృత్వంలో ప్రజా ప్రతినిధుల బృందం సేవ్ డెమొక్రసీ పేరిట ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పరిహసిస్తూ చంద్రబాబు నాయుడు.. వేరే పార్టీ గుర్తుపై పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలకు పచ్చకండువా కప్పి పార్టీలోకి తీసుకుంటున్న పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే అంశాన్ని స్పీకర్ పరిధిలో నుంచి తీసేసి, ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి తీసుకువస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. అప్పటివరకూ తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఫిరాయింపులపై కోర్టును కూడా ఆశ్రయిస్తామని వైఎస్ జగన్ తెలిపారు. -
ఏపీలో కూడా అదే జరుగుతోంది: డి.రాజా
న్యూఢిల్లీ : సీపీఐ నేత డి.రాజాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బృందం బుధవారం భేటీ అయింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని రాజా దృష్టికి తీసుకు వెళ్లారు. చంద్రబాబు అవినీతి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్న తీరును డి.రాజాకు వివరించారు. భేటీ అనంతరం డి.రాజా మాట్లాడుతూ వైఎస్ జగన్ తమ దృష్టికి తీసుకువచ్చిన అంశాలను పార్టీలో చర్చిస్తామన్నారు. ఫిరాయింపుల వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంటామన్నారు. పార్టీ మారిన వ్యక్తులు ఆ పార్టీ నుంచి వచ్చిన అన్ని పదవుల నుంచి తప్పుకోవాలన్నారు. చట్టంలోని లొసుగులను ఉపయోగించుకోవడం సరికాదని డి.రాజా వ్యాఖ్యానించారు. ఫిరాయింపులు అనేవి ఒక్క రాష్ట్రానికే పరిమితం కాలేదన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఫిరాయింపుల సమస్యగా మారాయన్నారు. ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్‌లో ఏం జరిగిందో, ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే జరుగుతోందన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం కచ్చితంగా ఉందన్నారు. మార్పులు తీసుకొచ్చేందుకు తమ వంతు కృషి చేస్తామని డి.రాజా తెలిపారు. కాగా ఏపీ అధికార పార్టీ సాగిస్తున్న అప్రజాస్వామిక రాజకీయాలను జాతీయ స్థాయిలో ఎండగట్టడానికి, ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడానికి ‘సేవ్ డెమొక్రసీ’ పేరిట జగన్ నేతృత్వంలో ప్రజా ప్రతినిధుల బృందం జాతీయ నేతల దృష్టికి తీసుకు వచ్చారు. ఇందులో భాగంగా మంగళవారం హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, శరద్ యాదవ్ తదితరులను కలిసి టీడీపీ అనుసరిస్తున్న వక్రమార్గాలను, ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను వివరించారు. ఇవాళ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. -
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి: వైఎస్ జగన్
న్యూఢిల్లీ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో చొరవ తీసుకోవాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బృందం కోరింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను విచ్చలవిడిగా కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఏపీ సర్కారు ఖూనీ చేస్తున్న విధానాన్ని ఎండగట్టేందుకు న్యూఢిల్లీలో చేపడుతున్న 'సేవ్ డెమొక్రసీ' కార్యక్రమంలో భాగంగా జైట్లీని బుధవారం మధ్యాహ్నం వైఎస్ జగన్ బృందం కలిసింది. ఈ సందర్భంగా 'ఎంపరర్ ఆఫ్ కరప్షన్' పేరిట చంద్రబాబు అవినీతి మీద ప్రచురించిన పుస్తకాన్ని జగన్ స్వయంగా అరుణ్ జైట్లీకి అందించారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని, బాబు అవినీతిని జైట్లీకి వివరించి, రాష్ట్రంలో సాగుతున్న అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించేలా చూడాలన్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో చొరవ తీసుకోవాలని, అలాగే రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్ట్‌ను వెంటనే పూర్తి చేయాలని కూడా అరుణ్ జైట్లీని జగన్ బృందం కోరింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నందున.. కేంద్రమే ముందడుగు వేయాలని ఆయన కోరారు. -
అవినీతి చక్రవర్తి చంద్రబాబు
♦ ఆయన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించండి ♦ అవినీతి సొమ్ముతో విపక్ష ఎమ్మెల్యేల కొనుగోలు ♦ ఫిరాయింపు కేసులను స్పీకర్ నుంచి తప్పించాలి ♦ ఎన్నికల సంఘానికి నివేదించేలా ఆర్డినెన్స్ తేవాలి ♦ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌కు వైఎస్ జగన్ వినతి ♦ ఏచూరి, పవార్, శరద్‌యాదవ్‌తోనూ జగన్ భేటీ న్యూఢిల్లీ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం సాగిస్తున్న అవినీతి కుంభకోణాలను, అనైతిక రాజకీయాలను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశరాజధాని ఢిల్లీలో ఎండగట్టారు. అవినీతి సొమ్ముతో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్న అవినీతి చక్రవర్తి చంద్రబాబు నిజ స్వరూపాన్ని జాతీయ స్థాయి నేతలకు వివరించారు. రాష్ర్టంలో కొనసాగుతున్న భారీ కుంభకోణాలు, ఎమ్మెల్యేల కొనుగోళ్ల గురించి తెలుసుకుని వారు విస్తుపోయారు. అనైతిక రాజకీయాలపై వైఎస్సార్సీపీ చేపట్టిన ‘సేవ్ డెమొక్రసీ’ ఉద్యమానికి మద్దతు ప్రకటించా రు. ‘సేవ్ డెమొక్రసీ’ పేరిట వైఎస్సార్సీపీ చేపట్టిన ఉద్యమంలో భాగంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నేతృత్వంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో కూడిన బృందం మంగళవారం దేశ రాజధానిలో కేం ద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌తోపాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, జేడీ(యూ) సీనియర్ నేత శరద్ యాదవ్‌తో సమావేశమైంది. చంద్రబాబు సాగిస్తున్న అనైతిక రాజకీయాలు, అప్రజాస్వామిక, అరాచక పాలన, భారీ కుంభకోణాల గురించి ఉదాహరణల సహితంగా జగన్ వారికి వివరించారు. రూ.1.34 లక్షల కోట్ల అవినీతి సంపాదన కోసం బాబు ప్రభుత్వం చేసిన 31 కుంభకోణాల వివరాలను ఆధారాలతో సహా ప్రచురించిన ‘చంద్రబాబు.. అవినీతి చక్రవర్తి’ పుస్తకాన్ని అందించారు. అందులో పేర్కొన్న ఒక్కో సంఘటన గురించి జగన్ వివరించినప్పుడు.. వారిలో విస్మయం వ్యక్తమయింది. అవినీతి, ఎమ్మెల్యేల కొనుగోళ్ల తీరును చూసి వారు ఆశ్చర్యపోయారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని బలోపేతం చేయడానికి వైఎస్సార్సీపీ చేస్తున్న ఉద్యమంలో కలిసి వస్తామని, బాబు అనైతిక రాజకీయాలను పార్లమెంట్లో ప్రస్తావిస్తామని హామీ ఇచ్చారు. ఫిరాయింపుల జాఢ్యానికి అడ్డుకట్ట వేయకపోతే.. అధికార పార్టీ కేంద్రంగా అరాచకాలు మరింత పెచ్చుమీరి ప్రజాస్వామ్యాన్నే సవాలు చేసే ప్రమాదం ఉందనే ఆందోళన జాతీయ నేతల్లో వ్యక్తమైంది. సానుకూలంగా స్పందించిన హోంమంత్రి రాష్ట్రంలో చంద్రబాబు భారీగా అవినీతి అక్రమాలకు పాల్పడి, ఆ సొమ్ముతో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని వైఎస్ జగన్ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు వివరించారు. రెండేళ్ల పాలనలోనే రూ.లక్ష కోట్లను దాటిన చంద్రబాబు అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. ఫిరాయింపు కేసులను స్పీకర్‌నుంచి తప్పించి ఎన్నికల సంఘానికి అప్పగించేలా ఆర్డినెన్స్ తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. జగన్ బృందం చెప్పిన విషయాలను కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సావధానంగా వినడంతోపాటు సానుకూలంగాస్పందించారు. బాబు అవినీతి, కుంభకోణాల వివరాలున్న ‘అవినీతి చక్రవర్తి చంద్రబాబు’ పుస్తకాన్ని హోంమంత్రి ఆసాం తం పరిశీలించారు. ఈ అంశాలతో పాటు.. విభజన హామీలు నెరవేర్చడానికి తన వంతు సహకారం అందిస్తానని హోం మంత్రి చెప్పారు. కనీవినీ ఎరుగని అవినీతి అవినీతి, అనైతిక రాజకీయాలపై ఉద్యమిస్తున్న వైఎస్సార్సీపీ బృందానికి ఢిల్లీలో సాదర స్వాగతం లభించింది. జాతీయ స్థాయి నేతలందరూ జగన్ వివరించిన అంశాలను విని సానుకూలంగా స్పందించారు. ఉదయం 10.15 గంటల సమయంలో జన్‌పథ్‌లోని శరద్‌పవార్ నివాసంలో జగన్ బృందం ఆయనను కలిశారు. రూ.కోట్లు వెదజల్లి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు అనైతిక రాజకీయాలను జగన్ ఆయనకు వివరించారు. ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదని, వాటిని నిరోధించడంపై అఖిలపక్షంలో చర్చ జరగాలని పవార్ అభిప్రాయపడ్డారు. వైఎస్సార్సీపీ చేపట్టిన ‘సేవ్ డెమొక్రసీ’ ఉద్యమానికి తన అందడండలు ఉంటాయని, పోరాటంలో కలిసి నడుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆ తర్వాత జగన్ బృందం సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలిసి రాష్ర్టంలో పరిస్థితులను వివరించారు. ఇంతటి అవినీతిని తానెన్నడూ చూడలేదని ఏచూరి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ఆందోళనలో కలిసివస్తామని హామీ ఇచ్చారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో జేడీయూ సీనియర్ నేత శదర్‌యాదవ్ నివాసంలోనూ జగన్ బృందానికి సాదర స్వాగతం లభించింది. జగన్ బృందం చేసిన వాదనతో ఆయన ఏకీభవించారు. ఫిరాయింపుల జాఢ్యం విస్తరిస్తే.. అన్ని పార్టీలకూ ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై జరిపే ఉద్యమంలో తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. -
ఢిల్లీలో మార్మోగిన సేవ్ డెమోక్రసీ
కాకినాడ : అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న అధికార తెలుగుదేశం పార్టీ అప్రజాస్వామిక విధానాలను ఎండగడుతూ ఢిల్లీలో మంగళవారం ‘సేవ్ డెమోక్రసీ’నినాదం మిన్నంటింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో పార్టీ తరఫున గెలుపొందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డితోపాటు జిల్లా నుంచి పరిశీలకులు ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, సీజీసీ సభ్యులు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ జాతీయస్థాయి నేతలను కలిసి రాష్ట్రంలోని అప్రజాస్వామిక విధానాలను వివరించారు. కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎన్సీపీ నాయకుడు శరద్‌పవార్, జేడీయూ నేత శరద్‌యాదవ్ తదితరులను వీరు కలిశారు. -
శరద్ యాదవ్‌తో వైఎస్ జగన్ బృందం భేటీ
న్యూఢిల్లీ: జేడీయూ నేత శరద్ యాదవ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సాయంత్రం భటీ అయ్యారు. ఆయనతో పాటు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అధికార టీడీపీ అడ్డగోలుగా సంపాదించిన అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష శాసనసభ్యులను కొనుగోలు చేస్తున్న తీరును నిరసిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించమని నినదిస్తూ..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. శరద్ యాదవ్‌ను కలిసిన వైఎస్ జగన్ బృందం.. మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా శరద్ యాదవ్ మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులనే జాఢ్యం దేశవ్యాప్తంగా విస్తరించిందని, అధికార పార్టీకి చెందిన వ్యక్తులు స్పీకర్ గా ఉన్నందువల్లే ఇది జరుగుతోందన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత పటిష్టం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ అధికార పార్టీ సాగిస్తున్న అప్రజాస్వామిక రాజకీయాలను జాతీయ స్థాయిలో ఎండగట్టడానికి, ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడానికి ‘సేవ్ డెమొక్రసీ’ పేరిట జగన్ నేతృత్వంలో ప్రజా ప్రతినిధుల బృందం జాతీయ నేతల దృష్టికి తీసుకు వచ్చారు. వైఎస్ జగన్ బృందం ... హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులను కలిసి టీడీపీ అనుసరిస్తున్న వక్రమార్గాలను, ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను వివరించారు. -
ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా?
న్యూఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజల గొంతు వినపడకుండా చేసేందుకు విపక్ష ఎమ్మెల్యేలను విచ్చలవిడిగా కొంటున్నారని ఆరోపించారు. ఢిల్లీలో మంగళవారం సాయంత్రం పార్టీ నాయకులతో కలిసి వైఎస్ జగన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తమ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తామని ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకుంటున్నారని, ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి, అక్రమాలపై నిలదీస్తున్నందుకే తమ పార్టీ ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే ఏపీలో ఎమ్మెల్యేలను విచ్చలవిడిగా కొంటున్నారు ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 కోట్లు నుంచి రూ. 30 కోట్లు ఇస్తున్నారు చంద్రబాబుకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడు తెలంగాణలో మొదలు పెట్టిన చంద్రబాబు ఏపీలో కూడా ఎమ్మెల్యేలను కొంటున్నాడు ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? డబ్బులతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమే కాకుండా కొంతమందికి మంత్రి పదవులు ఇస్తానని చెబుతున్నాడు వేరే పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా పార్టీలో చేర్చుకుంటున్నాడు అనర్హత వేటు పడకుండా వాళ్ల చేత మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేయిస్తానని చెబుతున్నాడు ఇంతకన్నా దిక్కుమాలిన పరిస్థితి ప్రజాస్వామ్యంలో ఉంటుందా? ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తున్నారు గత ఎన్నికల్లో మాకు 45 శాతం ఓట్లు, టీడీపీ కూటమికి 46 శాతం చిల్లర ఓట్లు వచ్చాయి రెండు పార్టీలకు మధ్య తేడా కేవలం 1.86 శాతం మాత్రమే కొంతమంది పార్టీ మారినంత మాత్రానా పార్టీకి నష్టం లేదు చంద్రబాబు ప్రజల గొంతు నొక్కుతున్నాడు చంద్రబాబు మోసపూరిత విధానాలతో ప్రజలు బాధ పడుతున్నారు ఏపీలో ప్రతిచోటా చంద్రబాబుపై వ్యతిరేకత కనిపిస్తోంది ఆయన చేస్తానన్న రుణమాఫీ వడ్డీలో మూడో వంతుకు కూడా సరిపోదు చంద్రబాబును రైతులు తిట్టిన తిట్టుకుండా తిడుతున్నారు రెండేళ్లలో రెండుసార్లు కరెంట్ చార్జీలు పెంచారు, ఆర్టీసీ చార్జీలు పెంచారు చంద్రబాబు పాలనలో ప్రతి విషయంలో ప్రజలు విసిగెత్తి పోయారు తనపై ప్రజావ్యతిరేకత పెరగడంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తావున్నాడు ప్రజల గొంతు వినపడకూడదన్న దిక్కుమాలిన ఆలోచనతో ఇదంతా చేస్తున్నాడు చంద్రబాబు రెండేళ్లలో 31 స్కామ్ లు చేశాడు, రూ. లక్షా 34 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు అన్ని వివరాలను 'ఎంపరర్ ఆఫ్ కరప్షన్' పుస్తకంలో పొందుపరిచాం సీబీఐ విచారణ జరిపితే అన్ని విషయాలు బయటకు వస్తాయి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ఘనకార్యమా? కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించడం లేదు? ఈ ఎమ్మెల్యేలను ప్రజల ముందుకు ఎందుకు తీసుకెళ్లడం లేదు? పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ చంద్రబాబు రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడు రాజకీయ వ్యభిచారం ఎవరు చేసినా తప్పే అవుతుంది 'ది ఎంపరర్ ఆఫ్ కరప్షన్' ఇక్కడ క్లిక్ చేయండి... -
ఢిల్లీ పర్యటనపై వైఎస్ జగన్ ట్వీట్
న్యూఢిల్లీ: టీడీపీ అవినీతిని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ దృష్టికి తీసుకెళ్లామని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. అనైతికంగా తమ పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుంటున్న విషయాన్ని ప్రధానంగా జాతీయ నాయకులకు వివరించామని వైఎస్ జగన్ ట్విటర్ లో పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నాయకులతో పాటు వైఎస్ జగన్ మంగళవారం ఢిల్లీలో రాజ్ నాథ్ సింగ్, శరద్ పవార్ లను కలిశారు. తమ భేటీకి సంబంధించిన ఫొటోలను వైఎస్ జగన్ తన ట్విటర్ పేజీలో పోస్ట్ చేశారు. వైఎస్ జగన్ వెంట మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యానారాయణ, ధర్మాన ప్రసాదరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితర నాయకులు, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ సాగిస్తున్న అప్రజాస్వామిక రాజకీయాలను జాతీయ స్థాయిలో ఎండగట్టడానికి 'సేవ్ డెమొక్రసీ' పేరిట వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధుల బృందం జాతీయ నేతలను కలుస్తోంది. ఈ సాయంత్రం 7.15 గంటలకు జేడీయూ నేత శరద్‌యాదవ్‌తో పాటు మరికొంత నేతలను కలిసే అవకాశం ఉంది. Met HM RajnathSingh & Sharad Pawarji to highlight TDP's corruption & unethical practices in poaching YSRCP MLAs pic.twitter.com/8UtkuTbI7T — YS Jagan Mohan Reddy (@ysjagan) 26 April 2016 -
ఇది చంద్రబాబు అవినీతి చిట్టా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తన సొంత పాలన మీద నమ్మకం లేకపోవడం వల్లే పార్టీలు మారిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి మళ్లీ ఎన్నికలకు వెళ్లలేకపోతున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు అవినీతిని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించినట్లు ఆయన చెప్పారు. హోం మంత్రిని కలిసిన అనంతరం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... ఎన్నికల హామీ నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు అవినీతి సొమ్ముతో విచ్చలవిడిగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు ఒక్కొక్కరికి రూ. 20-30 కోట్లు వెచ్చించి పట్టపగలే కొనుగోలు సాగిస్తున్నారు ఎమ్మెల్యేల కొనుగోలు, అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని హోం మంత్రిని కోరాం ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే ధైర్యం లేదంటేనే, ప్రజల్లో చంద్రబాబుకు ఏపాటి ఆదరణ ఉందో అర్థమవుతుంది విభజన హామీలను అమలుచేయాలని కూడా హోం మంత్రిని కోరాం నియోజకవర్గాల పునర్విభజనతో సామాన్యులకు ఒరిగేది ఏమీ లేదు మహా అయితే 50-60 మందికి ఎమ్మెల్యే ఉద్యోగాలు వస్తాయి ప్రజలకు కావల్సింది రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రత్యేక హోదాను వదిలేసి పునర్విభజన గురించి మాట్లాడితే ప్రజలు బాబును క్షమించరు పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా, వారిపై అనర్హత వేటు వేయకుండా కాపాడుతున్నారు చంద్రబాబు రాష్ట్ర పరువును ఎలా తీస్తున్నారో సీతారాం ఏచూరి చెప్పారు ఈ పోరాటం ఇంతటితో ఆగదు.. అందరి సహకారంతో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుతాం పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మరింత బలోపేతం చేయాలని కోరాం -
కేంద్ర హోంమంత్రితో వైఎస్ జగన్ భేటీ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రేరేపిస్తున్న పార్టీ ఫిరాయింపుల అంశంపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలిశారు. సీఎం చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాలపై ఫిర్యాదు చేసేందుకు ఆయన 'సేవ్ డెమోక్రసీ' పేరిట బృందంగా రాజ్ నాథ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో వైఎస్ఆర్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ కు ఓ విజ్ఞాపన పత్రం కూడా ఇవ్వనున్నారు. దీంతోపాటు 'ది ఎంపరర్ ఆఫ్ కరప్షన్' అనే పుస్తకాన్ని కూడా కేంద్ర హోమంత్రికి వైఎస్ జగన్ ఇవ్వనున్నారు. అమరావతి పేరుతో భూముల దోపిడీ, కరెంటు దోపిడీ, ఇసుక మాఫియాలను ఇలా అన్ని అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. మొత్తం లక్షా ముప్పైవేల కోట్ల రూపాయల అవినీతి వ్యవహారం ఈ పుస్తకంలో పొందుపరిచారు. పూర్తి ఆధారాలతో, డాక్యుమెంట్లు కూడా ఈ పుస్తకంలో పేర్కొన్నారు. -
ఉత్తరాఖండ్ కంటే దారుణంగా ఎమ్మెల్యేల కొనుగోళ్లు
► ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నాం ► ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి అభివృద్ధి కోరుకోలేదు ► ఎన్నికైన ఎమ్మెల్యేలు చివరివరకు అదే పార్టీలో ఉండాలి ► లేకపోతే ప్రజాస్వామ్యానికి, వాస్తవానికి సంబంధం ఉండదు ► వైఎస్ఆర్సీపీ పోరాటానికి పార్లమెంటులో, లోపల పూర్తి మద్దతు ► సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి న్యూఢిల్లీ ఉత్తరాఖండ్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఎమ్మెల్యేల కొనుగోళ్లు ఏపీలో జరుగుతున్నాయని, ఈ వ్యవహారాన్ని తాము సీరియస్‌గా తీసుకుంటున్నామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. 'సేవ్ డెమొక్రసీ' యాత్రలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం సీపీఎం ప్రధాన కార్యాలయంలో ఏచూరిని కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో విచ్చలవిడిగా సాగుతున్న ఎమ్మెల్యేల కొనుగోళ్లు, అవినీతి కార్యకలాపాలను ఆయన దృష్టికి తెచ్చారు. అనంతరం వైఎస్ జగన్, ఇతర నేతలతో కలిసి సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడారు. ఇంత పెద్ద ఎత్తున రాజకీయ అవినీతి, దిగజారుడు తనాలను దేశంలో ఎక్కడా చూడలేదని, ఈ వివరాలన్నింటినీ వైఎస్ జగన్ తనకు చెప్పారని అన్నారు. అసలు దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరగడాన్ని ఎక్కడా చూడలేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడటం, ఎమ్మెల్యేలను కొనుగోలుచేసి వాళ్లకు పదవులు ఇవ్వడం సరికాదన్నారు. చట్టాలను బైపాస్ చేసి ఇలా చేయడం ఆశ్చర్యకరమైన విషయమని, దీన్ని చాలా తీవ్రమైన విషయంగా పరిగణిస్తున్నామని చెప్పారు. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తే ప్రయత్నం కూడా చేస్తామన్నారు. ఆంధ్రదేశం అభివృద్ధి చెందాలని అంతా అనుకుంటున్నాం గానీ, ఇలా అభివృద్ధి చెందడం అవమానకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎం తరఫున దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రకమైన అవినీతిని ఆపలేకపోతే ప్రజాస్వామ్యానికి మనుగడ ఉండదని అన్నారు. ఒక పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు చివరివరకు అదే పార్టీలో ఉండకపోతే.. ప్రజాస్వామ్యానికి, వాస్తవానికి సంబంధం లేకుండా పోతుందని, ఇది చాలా ప్రమాదకరమని.. ఇలా కొనసాగితే అసలు వ్యవస్థను మనం కాపాడలేమని అన్నారు. ఈ సమస్యను ఎక్కడ వీలైతే అక్కడ తాము ప్రస్తావిస్తామని సీతారాం ఏచూరి చెప్పారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సవరణలు తేవాల్సిన అవసరం కచ్చితంగా ఉందని, పార్లమెంటులో ఆ అంశాలను ప్రస్తావిస్తామని అన్నారు. అలాగే ఈ అంశాలపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న పోరాటానికి తమ పార్టీ తరఫున మద్దతు ఇస్తున్నామన్నారు. ఇప్పుడు దేశమంతా అంబేద్కర్ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయంటూ రాజ్యాంగంలో ఆయన చెప్పిన చివరి మాటలను ప్రస్తావించారు. ''ప్రజాస్వామ్యంలో ప్రజల విశ్వాసం పోతే.. ఈ రాజ్యాంగాన్ని ఎవరూ కాపాడలేరు, దాన్ని పోగొట్టుకోకుండా చూసుకోవాలి'' అని అంబేద్కర్ అన్నారన్నారు. సీతారాం ఏచూరిని కలిసిన వారిలో వైఎస్ఆర్సీపీ ముఖ్యనేతలు మేకపాటి రాజమోహనరెడ్డి , బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, వైవీ సుబ్బారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఇంకా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. -
'ఒక్కో ఎమ్మెల్యేతో రూ.40కోట్లకు బేరం'
న్యూఢిల్లీ: కోట్లు కుమ్మరించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం సేవ్ డెమోక్రసీ పేరిట ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న కోట్ల నల్లధనం చంద్రబాబుకు ఎక్కడ నుంచి వస్తుందని ప్రశ్నించారు. డబ్బుకు లొంగని వారిని మంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు ప్రలోభపెడుతున్నారని, అందుకే తాము ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ఢిల్లీ పెద్దలను కలిసేందుకు వచ్చామని చెప్పారు. ఈరోజు ముఖ్యమైన నేతలందరినీ కలవబోతున్నామని, అపాయింట్లమెంట్ల ప్రకారం పార్టీ ఎమ్మెల్యేలం, ఎమ్మెల్సీలం రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను, పరిస్థితులను ఢిల్లీలోని రాజకీయ పెద్దలకు వివరించనున్నామని చెప్పారు. చంద్రబాబు ఏరకంగా అనైతిక చర్యలు చేస్తున్నారో అందరికీ వివరిస్తున్నామన్నారు. బాబుకు ప్రజల్లోకి వెళ్లే విశ్వాసం లేదని, ఆయనకు ఇక ఓట్లు రావని తెలుసని అందుకే ఆయనకు ఎన్నికల్లో వెళ్లే ధైర్యం చంద్రబాబు చేయడం లేదని అన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా పేరుతో అక్కాచెల్లెమ్మలను, జాబులేనివారికి నిరుద్యోగ భృతి పేరుతో యువతను దారుణంగా మోసం చేశారని చెప్పారు. చంద్రబాబు పాలనతో ప్రజలు విసుగెత్తారని, బాబు పాలన మాకొద్దు బాబో అని విలపిస్తున్నారని చెప్పారు. ఒక్కో ఎమ్మల్యేకు 20 నుంచి 40 కోట్లు ఇవ్వడం చేస్తున్నారని ఇంతపెద్ద మొత్తం నల్లడబ్బు చంద్రబాబుకు ఎలా వస్తుందని నిలదీశారు. తమ పార్టీలో చేర్చుకున్న వారితో రాజీనామా చేయించి చంద్రబాబుకు దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. ప్రతి పౌరుడు బాబును నిలదీయాలి, తమకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆడియో, వీడియోలతో దొరికిపోయిన చంద్రబాబును ఎందుకు ప్రశ్నించకూడదని అడిగారు. రెండేళ్లలో చంద్రబాబు చేసిన అవినీతిపాలనను పూర్తి వివరాలతో 'ది ఎంపరర్ ఆఫ్ కరప్షన్' అనే పుస్తక రూపంలో ఇస్తున్నామని చెప్పారు. అమరావతి పేరుతో భూముల దోపిడీ, కరెంటు దోపిడీ, ఇసుక మాఫియాలను ఇలా అన్ని అంశాలు పుస్తకంలో వివరించామని చెప్పారు. మొత్తం లక్షా ముప్పైవేల కోట్ల రూపాయల అవినీతి వ్యవహారం ఈ పుస్తకంలో ఉందని చెప్పారు. పూర్తి ఆధారాలతో, డాక్యుమెంట్లు ఈ పుస్తకంలో ఉన్నాయని తెలిపారు. ఈ పుస్తకాన్ని జాతీయ నాయకులకు ఇస్తామని చెప్పారు. ఏపీ, తెలంగాణ, ఉత్తరాఖండ్.. రాష్ట్రాలు ఏవైనా పార్టీ ఫిరాయింపులు తప్పే అని చెప్పారు. బాబు అవినీతిపై సీబీఐ విచారణ జరిపించకపోవడం ఎంతవరకు సమంజసం అని జగన్ ప్రశ్నించారు. -
ఢిల్లీ చేరుకున్న వైఎస్ఆర్సీపీ నేతలు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటున్న అప్రజాస్వామిక తీరును జాతీయస్థాయిలో ఎలుగెత్తి చాటడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ‘సేవ్ డెమొక్రసీ’(ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి) అని నినదిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. అవినీతి సొమ్ముతో రాష్ట్రంలో చంద్రబాబు విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న తీరును, నిరంకుశంగా పరిపాలన సాగిస్తున్న తీరును వివిధ జాతీయ పార్టీల నేతలను కలుసుకుని వివరిస్తారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పరిహసిస్తూ చంద్రబాబు స్వయంగా ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు టీడీపీ కండువాను కప్పుతున్న వైనాన్ని కూడా దేశం దృష్టిని ఆకర్షించేలా తెలియజేయబోతున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లను కలవాలని కూడా నిర్ణయించారు. వారిచ్చే సమయాన్ని బట్టి ఈ మూడు రోజుల్లో కలసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తారు. -
కుటిల నీతిపై కదన భేరి
అధికార టీడీపీ కుతంత్రంపై వైఎస్సార్సీపీ కన్నెర్ర కాకినాడలో మార్మోగిన ‘సేవ్ డెమోక్రసీ’ నినాదం ఫిరాయింపులను నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ జిల్లా నలుమూలల నుంచీ తరలి వచ్చిన పార్టీ శ్రేణులు కాకినాడ : అధికార తెలుగుదేశం పార్టీ తీరుపై నిరసన మిన్నంటింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడలో జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు ‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి- పార్టీ ఫిరాయింపు చట్టాన్ని అమలు చేయండి’ అంటూ కొవ్వొత్తులు చేతబట్టి నినాదాలు చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని కోకిల సెంటర్ నుంచి పద్మప్రియ, భానుగుడి జంక్షన్ మీదుగా కొవ్వొత్తులతో ర్యాలీ కొనసాగింది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు, రాష్ట్ర, జిల్లా కమిటీల నేతలు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలతో కొవ్వొత్తుల ర్యాలీ జరుగుతున్న ప్రాంతం కిటకిటలాడింది. తొలుత కోకిల సెంటర్లోని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కాంస్య విగ్రహానికి కన్నబాబు, ఇతర నేతలు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి, సేవ్ డెమోక్రసీ’ అనే నినాదాలతో ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లు చేత బట్టి ర్యాలీగా భానుగుడి జంక్షన్‌కు చేరుకున్నారు. రాజీనామాలు చేసి ఎన్నికల్లో గెలవాలి : కన్నబాబు అధికార పార్టీ ప్రలోభాలకు లొంగి టీడీపీ లో చేరిన ఎమ్మెల్యేలకు ప్రజాస్వామ్య విలువలపై ఏ మాత్రం నమ్మకం ఉన్నా తక్షణమే రాజీనామా చేసి మళ్లీ ప్రజల తీర్పు కోరాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు డిమాండ్ చేశారు. సేవ్ డెమోక్రసీ ర్యాలీ సందర్భంగా భానుగుడి సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో ఆయన మాట్లాడారు. రాజ్యాంగానికి లోబడి పని చేస్తానని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు రాజ్యాంగ విలువలకు తిలోదకాలిచ్చి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షం బలంగా ఉంటే తమ అవినీతి అక్రమాలు బయటకు వస్తాయనే భయంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. నైతిక విలువలపై ఏ మాత్రం విశ్వాసం లేని టీడీపీ అధినేత, పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు భవిష్యత్‌లో శంకరగిరి మాన్యాలు పట్టడం తథ్యమని జోస్యం చెప్పారు. నిక్కచ్చిగా పనిచేసే నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు కొద్ది మందే ఉన్నా పార్టీకి అదే కొండంత బలమన్నారు. తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మాట్లాడుతూ కొద్ది మంది ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకున్నంతమాత్రాన తమ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదన్నారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేలు గానీ, టీడీపీ చెందిన ఏ ఒక్క మంత్రైనా ముందుకు వస్తే తాను రాజీనామా చేసి వారిపై పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ సవాల్‌ను స్వీకరించాలన్నారు. ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ గుర్తుపై గెలిచి పార్టీ మారడం అనైతికమని, తక్షణమే ఆయా ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్ళీ గెలిస్తే ప్రజలు కూడా హర్షిస్తారని అన్నారు. లోకేష్ రాజ్యాంగేతరశక్తి : పినిపే మాజీ మంత్రి, సీజీసీ సభ్యుడు పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ సంతలో పశువులను కొన్న చందంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసేలా ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతూ కిందిస్థాయిలో రాజ్యాంగేతర శక్తులుగా జన్మభూమి కమిటీలను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్నిఅవహేళన చేస్తున్నారంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ రాజ్యాంగేతర శక్తిగా పెత్తనం చెలాయిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో నైతిక విలువలకు జగన్ ప్రాధాన్యతనిస్తే చంద్రబాబు ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిస్తున్నారని, ఇదే ఈ ఇద్దరి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసమని పేర్కొన్నారు. నేరుగా ఏ ఒక్క ఎన్నికల్లోనూ పొత్తులేకుండా తెలుగుదేశం పోటీ చేయలేకపోతోందని, ప్రజల్లో ఆ పార్టీపై విశ్వాసం లేదనడానికి అదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ చంద్రబాబును రాష్ట్రానికి పట్టిన శనిగా అభివర్ణించారు. టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్ళాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ రాజీనామాలు చేయకుండా పార్టీలు మారడం సరికాదని, దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికల కు వెళ్ళాలని అన్నారు. సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్తే రాళ్ళతో కొట్టే పరిస్థితి ఉందన్నారు. సిగ్గుంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేసి ప్రజల తీర్పు కోరాలని డిమాండ్ చేశారు. అలా ఒక్క ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిచినా పార్టీ పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. కాకినాడ సిటీ కో ఆర్డినేటర్ ముత్తా శశిధర్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ, ఫ్యాన్ గుర్తు, మహానేత వైఎస్ ఆశయాల ప్రభావంతో ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీలు మారడాన్ని ఎద్దేవా చేశారు. చివరగా పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్ వందన సమర్పణ చేశారు. ఆందోళనలో వివిధ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు తోట సుబ్బారావునాయుడు, గిరజాల వెంకటస్వామినాయుడు, ఆకుల వీర్రాజు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, వేగుళ్ళ పట్టాభిరామయ్యచౌదరి, వేగుళ్ళ లీలాకృష్ణ, అనంత ఉదయభాస్కర్, కొండేటి చిట్టిబాబు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు అత్తిలి సీతారామస్వామి, శెట్టిబత్తుల రాజబాబు, జెడ్పీ ప్రతిపక్షనేత సాకా ప్రసన్నకుమార్, రాజమండ్రి ఫ్లోర్ లీడర్ షర్మిలారెడ్డి, ముమ్మిడివరం ఫ్లోర్‌లీడర్ కాశి మునికుమారి, కాకినాడ మాజీ డిప్యూటీ మేయర్ పసుపులేటి వెంకటలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, మిండగుదిటి మోహన్, జక్కంపూడి రాజా, కర్రి నారాయణరావు, జీవీ రమణ, పాలెపు ధర్మారావు, చెల్లుబోయిన శ్రీను, లింగం రవి, అడ్డగళ్ళ సాయిరామ్, రాష్ట్రసేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర బీసీసెల్ కార్యదర్శులు బొబ్బిలి గోవిందు, అల్లి రాజబాబు, రాష్ట్ర సేవాదళ్ ప్రధానకార్యదర్శి ఒమ్మి రఘురామ్, రాష్ట్ర నీటి వినియోగదారుల సంఘం మాజీప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాథరెడ్డి, జిల్లా అనుబంధ విభాగాల కన్వీనర్లు సిరిపురపు శ్రీనివాసరావు, డాక్టర్ యనమదల మురళీకృష్ణ గీత, పెట్టా శ్రీనివాస్, మట్టపర్తి మురళీకృష్ణ, జున్నూరు వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, పార్టీ నేతలు ఆదిరెడ్డి వాసు, మురళీరాజు, వాసిరెడ్డి జమీలు, రవి వర్మ తదితరులు పాల్గొన్నారు. -
వెల్లువెత్తిన కొవ్వొత్తుల ర్యాలీ
హైదరాబాద్: ఏపీలో విచ్చలవిడిగా డబ్బులు పంచుతూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అదికార పార్టీ నేతలు ప్రజాస్వామ్య విలువలను దిగజార్చడాన్ని ప్రతిపక్ష ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతూ నీచరాజకీయాలను ప్రోత్సహిస్తున్న అధికార పార్టీ కనువిప్పు చేయడానికి వైఎస్ఆర్ సీపీ నేటి సాయంత్రం ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో 'సేవ్ డెమొక్రసీ' పేరుతో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించింది. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడం కోసం వైఎస్ఆర్ సీపీ పిలుపు మేరకు పార్టీ కార్యకర్తలతో పాటు, భారీ ఎత్తున ప్రజలు కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొని ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి భానుగుడి సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి, తదితర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణాజిల్లా విజయవాడలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, రక్షణనిధి, మేకా ప్రతాప్ అప్పారావు పాల్గొన్నారు. పార్టీ నేతలు పార్థసారధి, సామినేని ఉదయభాను, జోగి రమేష్, విజయవాడ నగర కార్పొరేటర్లు 'సేవ్ డెమొక్రసీ' లో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. గుంటూరులో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు డా.గోపిరెడ్డి నివాసరెడ్డి, ముస్తఫా, మర్రి రాజశేఖర్, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, తదితర నేతలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విధానాలు ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతిస్తున్నాయని నేతలు విమర్శించారు. కడపలో వైఎస్సార్ సర్కిల్ లో బహిరంగసభ నిర్వహించారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, కొరుముట్ల నివాసులు, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి బహిరంగసభలో పాల్గొని ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు ప్రజలు తమతో కలిసి ముందుకురావాలని పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా నగరిలో ఎమ్మెల్యే ఆర్కే రోజా నేతృత్వంలో నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. చిత్తూరు జిల్లాలో 'సేవ్ డెమొక్రసీ' ర్యాలీలో ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, డా.సునీల్ కుమార్, పార్టీ కన్వీనర్లు ఆదిములం, జంగాలపల్లి నివాసులు, తదితర నేతలు పాల్గొన్నారు. తిరుపతిలో ఎంపీ వరప్రసాద్, నేతలు అశోక్ కుమార్, ప్రతాప్ రెడ్డి, రాజేంద్ర, పలువురు నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కర్నూలులో రాజ్ విహార్ సెంటర్లో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి, బుగ్గర రాజేంద్రనాథ్, ఐజయ్య, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, తదితరులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతపురంలో వైఎస్ఆర్ సీపీ 'సేవ్ డెమొక్రసీ' క్యాండిల్ ర్యాలీలో భాగంగా ఎమ్మార్వో కార్యాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, ఎల్ఎం మోహన్ రెడ్డి, తదితర నేతలతో పాటు భారీగా కార్యకర్తలు, ప్రజలు ఈ ర్యాలీకి మద్ధతుగా తరలివచ్చారు. -
నేడు సేవ్ డెమొక్రసీ
► గుంటూరులో సాయంత్రం 5 గంటలకు భారీ ర్యాలీ ప్రారంభం ► డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి కొవ్వొత్తుల ప్రదర్శన ► వైఎస్సార్ సీపీ శ్రేణులు ప్రజాస్వామ్య వాదులు తరలిరావాలి ► పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పిలుపు పట్నంబజారు(గుంటూరు) : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి కొనుగోలు చేస్తున్నందుకు నిరసనగా ‘సేవ్ డెమొక్రసీ’ (ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి) పేరిట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం గుంటూరులో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ చెప్పారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ సాయంత్రం ఐదు గంటలకు అరండల్‌పేటలోని పార్టీ కార్యాలయం నుంచి లాడ్జిసెంటర్ చేరుకుని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి కొవ్వొత్తుల ప్రదర్శన ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరవుతారని చెప్పారు. వైఎస్సార్ సీపీ జిల్లా కార్యవర్గం, జిల్లాలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, మండల, పట్టణ, గ్రామ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, అనుబంధ విభాగాల నేతలు తప్పని సరిగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. బాబుది నీచ రాజకీయం.. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నీచ రాజకీయాలకు నాంది పలుకుతున్నారని మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. అప్రజాస్వామికంగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న చంద్రబాబు దోచుకున్న అక్రమ సంపాదనతో ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నేతలకు ఏ మాత్రం దమ్మున్నా ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఎన్నికలకు సిద్ధం కావాలని మర్రి రాజశేఖర్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలనే దురుద్దేశంతో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న చంద్రబాబు సర్కార్ తీరుపై ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగబద్ధులు పోరాటానికి సిధ్దం కావాలని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రదర్శనకు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. -
నేడు వైఎస్సార్సీపీ ‘సేవ్ డెమొక్రసీ’
శ్రీకాకుళం అర్బన్: ‘రాష్ట్రంలో ప్రతిపక్షమనేదే లేకుండా చేయాలి...ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎలాగైనా మన పార్టీలోకి చేర్చుకోవాలి. అపుడే మనం అనుకున్నది సాధించుకోగలం’. ఇదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాజకీయ కుయుక్తి. ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్న ఆయన ..టీడీపీ కోటరీ తీరును జనానికి వివరించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది. ఇందులో భాగంగా ‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ(సేవ్ డెమొక్రసీ) నిరసన కార్యక్రమానికి పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమం శనివారం సాయంత్రం జరగనుంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన పార్టీ శ్రేణులు పాల్గొని ప్రభుత్వ దురాగతాలను తమ గళం ద్వారా ప్రజలకు వినిపించనున్నాయి. సీఎం చంద్రబాబు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేయడం రాజకీయ అనైకత కిందే వస్తుందని, చట్టాల్ని చేయాల్సిన నేతలే ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారంటూ సేవ్ డెమోక్రసీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి స్పష్టం చేశారు. ఇవీ కార్యక్రమ వివరాలు శ్రీకాకుళంలోని సూర్యమహల్ కూడలి వద్ద శనివారం సాయంత్రం 5.30గంటలకు జీటీ రోడ్డు మీదుగా వైఎస్సార్ కూడలి వరకూ కొవ్వొత్తులు, కాగడాల ర్యాలీ నిర్వహించనున్నారు. కార్యక్రమానికి పార్టీ ప్రధాన కార్యదర్శిధర్మాన ప్రసాదరావుతో పాటు పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం, పార్టీ బీసీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, పార్టీ నేతలు పాలవలస రాజశేఖరం, జిల్లాలోని అన్ని నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ అనుబంధ విభాగాలు, పార్టీ శ్రేణులు పాల్గొననున్నాయి. -
యనమలవి స్థాయికి మించిన విమర్శలు
విజయవాడ: ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తన స్థాయిని మించి విమర్శలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి మండిపడ్డారు. ఆయన శుక్రవారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్‌పై విమర్శలు చేసినవారికే ఫస్ట్ ర్యాంకులు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడకు రిటైర్డ్మెంట్ మూడ్ వచ్చేసినట్లు ఉందని పార్థసారధి వ్యాఖ్యానించారు. టీడీపీ ఫిరాయింపు రాజకీయాలకు నిరసనగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి సేవ్ డెమెక్రసీ పేరుతో జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన చేయనున్నట్లు వివరించారు. -
‘సేవ్ డెమొక్రసీ’ ఆందోళన 23కు మార్పు
సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యేల్ని ప్రలోభాలకు గురిచేసి కొనుగోలు చేస్తున్నందుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 25న చేయ తలపెట్టిన ‘సేవ్ డెమొక్రసీ’ (ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి) ఆందోళన కార్యక్రమం తేదీని ఈ నెల 23కు మార్చినట్లు ఆ పార్టీ ప్రకటించింది. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అపాయింట్మెంట్ 25న లభించే అవకాశాలున్నందువల్ల ఆందోళనను రెండు రోజులు ముందుకు మార్చినట్లు వివరించింది. ఈ మేరకు బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. పార్టీ శ్రేణులు ఈ మార్పును గమనించాలని అందులో పేర్కొంది. ప్రకటన పూర్తి పాఠం ఇలా ఉంది. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనాపరంగా అన్ని రంగాల్లో దారుణంగా విఫలమై, నిలువెత్తున అవినీతిలో మునిగి, ఎన్నికల వాగ్దానాలను దారుణంగా ఉల్లంఘించిన టీడీపీ తనకు ప్రజాదరణ కరువైన విషయాన్ని గమనించుకుని... ఏకైక ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను భారీగా డబ్బులు ఎర చూపి కొనుగోలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. చంద్రబాబు బృందం చేస్తున్న ఈ దుర్మార్గానికి, దిగజారుడుతనానికి నిరసనగా, ప్రజాస్వామ్య పరిరక్షణకోసం ఈనెల 25న జిల్లా కేంద్రాల్లో ‘సేవ్ డెమొక్రసీ’ పేరిట ర్యాలీ, కొవ్వొత్తుల ప్రదర్శన, బహిరంగసభలకు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. ఇవే అంశాల్ని రాష్ట్రపతి, ప్రధానమంత్రి, జాతీయ పార్టీల నేతల దృష్టికి తీసుకు వెళ్లనున్న విషయాన్ని కూడా పార్టీ స్పష్టం చేసింది. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అపాయింట్మెంట్ 25వ తేదీన లభించే అవకాశాలు స్పష్టమైనందువల్ల, ఆ రోజున తలపెట్టిన ‘సేవ్ డెమొక్రసీ’ కార్యక్రమాలన్నింటినీ రెండు రోజులు ముందుగా, అంటే ఈ నెల 23వ తేదీనే జరపాలని పార్టీ నిర్ణయించింది. ఈ మార్పును గమనించగలరు’’. లండన్‌కు పలమనేరు ఎమ్మెల్యే దంపతులు పలమనేరు: తాను, తన సతీమణి రేణుకారెడ్డితో కలసి గురువారం లండన్‌కు వెళుతున్నట్లు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి చెప్పారు. లండన్‌లోని ఓ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్న తమ కుమారుడు త్రాసేన్ను చూడడానికి వెళుతున్నట్లు ఆయన తెలిపారు. త్రాసేన్కు గత నెలలో అక్కడి విశ్వవిద్యాలయం బంగారు పతకం బహూకరించిందని, అప్పట్లో అసెంబ్లీ సమావేశాల కారణంగా తాము ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయినట్లు పేర్కొన్నారు. అలాగే ఏడాదిగా కుమారుడిని కలవకపోవడంతో ముందస్తుగా ఖరారైన షెడ్యూల్ మేరకు లండన్‌కు వెళుతున్నట్లు అమరనాథరెడ్డి వివరించారు. వారం పాటు లండన్‌లో ఉండి అనంతరం రాష్ట్రానికి తిరిగి రానున్నట్లు తెలిపారు. -
కాంగ్రెస్‌ను జనంలో ఎండగట్టండి
ఎన్డీఏ ఎంపీలకు మోదీ దిశానిర్దేశం * ‘ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీ’ చేపట్టిన ఎన్డీఏ న్యూఢిల్లీ: ఎటువంటి కార్యకలాపాలు సాగకుండా పార్లమెంటు వర్షాకాలు సమావేశాలు తుడిచిపెట్టుకొనిపోవడానికి కారణం కాంగ్రెసేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. అధికారం మొత్తం ఒకే కుటుంబం చేతిలో ఉండాలంటూ ఎమర్జెన్సీ విధించిన రోజుల మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ తీరు ఉందని మోదీ పేర్కొన్నారు. గురువారం మోదీ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడారు. ‘కాంగ్రెస్ విసిరిన అప్రజాస్వామిక సవాల్‌ను మేము స్వీకరిస్తున్నాం. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఒక కుటుంబాన్ని రక్షించడం కాంగ్రెస్ సిద్ధాంతమైతే... బీజేపీ సిద్ధాంతం మాత్రం దేశాన్ని రక్షించడమే’ అని మోదీ పేర్కొన్నారు. ఎన్డీఏ ఎంపీలు, మంత్రులు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని, ముఖ్యంగా కాంగ్రెస్, వామపక్షాల ఎంపీలున్న నియోజకవర్గాలను లక్ష్యంగా ఎంచుకోవాలని తన 25 నిమిషాల ప్రసంగంలో హితవుపలికారు. కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా అప్రజాస్వామిక చర్యలతో పార్లమెంటు సమావేశాలను అడ్డుకుందంటూ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ తీర్మానం చేసింది. బ్లేమ్ గేమ్... అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌ల మాటల యుద్ధంతో పార్లమెంటు సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో తదుపరి కార్యాచరణపై ఆ రెండు పార్టీలు దృష్టిపెట్టాయి. పరస్పర నిందాస్త్రాలు సంధించుకున్నాయి. గురువారం పార్లమెంటు నిరవధికంగా వాయిదాపడిన వెంటనే ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశమై కాంగ్రెస్ తీరును ఎండగట్టగా, రాహుల్ మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నెలరోజుల పాటు విపక్ష ఎంపీ నియోజకవర్గాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఎన్డీఏ నిర్ణయించింది. అనంతరం ఎన్డీఏ ఎంపీలంతా విజయ్ చౌక్ నుంచి పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వరకు ‘ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీ’ నిర్వహించారు. ఇందులో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, సుష్మాస్వరాజ్, వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కారీలతోపాటు బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ పాల్గొన్నారు. -
ఎన్డీఏ ఎంపీల ర్యాలీలో అద్వానీ
-
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు గొంతెత్తాలి: జగన్
చెన్నై: ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు గొంతెత్తాలని, కలసిరావాలని అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధిలను కోరినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా జగన్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు జగన్ జయలలిత, కరుణానిధిలను కలిసిన తరువాత విలేకరులతో మాట్లాడరారు. తమ విజ్ఞపనలు వారు సావదానంగా విన్నట్లు తెలిపారు. కరుణానిధితో 45 నిమిషాలు మాట్లాడినట్లు చెప్పారు. ఇది చాలా ప్రధాన్యత గల అంశంగా వారు ఇద్దరూ భావించినట్లు తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని సవరించాల్సిన అవసరాన్ని వారిద్దరి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. కాంగ్రెస్ తీరు చూస్తుంటే వారికి స్సష్టతలేదని, వారు ఏం చేస్తున్నారో వారికే తెలియడంలేదని చెప్పారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా ప్రజలకు ఇష్టం ఉన్నా లేకున్నా రాష్ట్రాన్ని విభజిస్తారని హెచ్చరించారు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే సంబంధించిన అంశంకాదని, ఓట్ల కోసం, సీట్ల కోసం ఏ రాష్ట్రాన్నైనా విభజిస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజావ్యతిరేక చర్యకు పాల్పడుతుందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తున్నప్పుడు మౌనంగా ఉంటే, శాసనసభ తీర్మానం లేకుండానే విభజించిన తొలి రాష్ట్రం ఇదే అవుతుందని చెప్పారు. రెండు జిల్లాలనే ఎందుకు అన్ని జిల్లాలను కలిపి రాష్ట్రం పేరును తెలంగాణగా మార్చండని అన్నారు. ముందు ఎన్నికలు జరపాలని కాంగ్రెస్‌కు జగన్ సవాల్ విసిరారు. తమ పార్టీ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉందని తెలిపారు. అదే నినాదంతో తాము ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. 2014 ఎన్నికలనే రిఫరెండంగా తీసుకోండన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తన వాదాన్ని బలపరుస్తారన్న విశ్వాసం ఉందని చెప్పారు. 30కి పైగా ఎంపి స్థానాలు గెలుస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మీపై మీకు నమ్మకం ఉంటే ఎన్నికలు నిర్వహించండని జగన్ సవాల్ విసిరారు. ప్రజల కోరిక మేరకు అప్పుడు నిర్ణయాలు చేయవచ్చన్నారు.