వైఎస్‌ఆర్ సీపీ 'సేవ్‌ డెమోక్రసీ' | ysrcp save democracy movement in andhra pradesh | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్ సీపీ 'సేవ్‌ డెమోక్రసీ'

Published Fri, Apr 7 2017 12:23 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM

వైఎస్‌ఆర్ సీపీ 'సేవ్‌ డెమోక్రసీ' - Sakshi

వైఎస్‌ఆర్ సీపీ 'సేవ్‌ డెమోక్రసీ'

అమరావతి: ప్రజాస్వామ్య పరిరక్షణకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరుబాట పట్టింది. సేవ్‌ డెమోక్రసీ పేరుతో అన్ని నియోజకవర్గాల్లో శుక్రవారం ఆందోళనలు చేపడుతోంది. టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న అప్రజాస్వామిక చర్యలను రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్‌ఆర్‌ సీపీ ఎండగడుతోంది. ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ.. అన్ని జిల్లాల్లో ప్రజాస్వామిక వాదులతో కలిసి ధర్నాలు, ర్యాలీలను వైఎస్‌ఆర్ సీపీ చేపడుతోంది.

► వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందులలో సేవ్‌ డెమోక్రసీ పేరిట వైఎస్‌ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.

► పోరుమామిళ్లలో బద్వేల్‌ ఇంఛార్జ్‌ వెంకట సుబ్బయ్య, మండల అధ్యక్షుడు చిత్తా విజయప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

► రాజంపేట పాతబస్టాండ్‌ వద్ద వైఎస్‌ఆర్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్‌రెడ్డి, పట్టణ కన్వినర్‌ శ్రీనివాసుల రెడ్డి, కార్యదర్శి మురళీరెడ్డి  ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పోలీసులు వీరిని అరెస్ట్‌ చేశారు.

► మైదుకూరు ఎమ్మార్వో ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పార్టీ నేత దస్తగిరి బాబు, తదితరులు ధర్నాలో పాల్గొన్నారు.

► పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో ఆచంట కన్వీనర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సేవ్‌ డెమోక్రసీ పేరుతో ధర్నా చేపట్టారు. అంబేడ్కర్‌, పొట్టి శ్రీరాములు, గాంధీ, వైఎస్‌ఆర్‌ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్సీ ఆళ్ల నాని, జిల్లా మహిళా అధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆళ్ల నాని మాట్టాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిందని మండపడ్డారు. ఫిరాయింపుదారులను ప్రోత్సహించిన చంద్రబాబు ప్రభుత్వంపై కేంద్ర చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

► భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ, ధర్నా నిర్వహించారు.

► కర్నూలు జిల్లాలో సేవ్‌ డెమోక్రసీ పేరిట జిల్లా వ్యాప్తంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు నిరసనలు చేపట్టారు. కర్నూలులో ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, హఫీజ్‌ ఖాన్‌, బీవై రామయ్య ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

► ఎమ్మిగనూరులో ఇంఛార్జ్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు.

► కల్లూరు ఎమ్మార్వో ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యే గూరు సుచరిత, పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

► ఆళ్లగడ్డలో గంగుల జితేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

► అనంతపురం జిల్లా ఉరవకొండలో ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌ రెడ్డి ఆధ్వర్యంలో సెవ్‌ డెమోక్రసీ పేరిట ధర్నా చేపట్టారు.

► విజయనగరం జిల్లా సాలూరులో ఎమ్మెల్యే రాజన్నదొర ఆధ్వర్యంలో సేవ్‌ డెమోక్రసీ పేరిట రాస్తరోకో నిర్వహించారు. అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు.

► చిత్తూరు జిల్లా తిరుపతిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ మున్సిపల్‌ కార్యాలయం ఎదుట వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో నగరపాలక అధ్యక్షుడు ప్రతాప్‌ రెడ్డి, నాయకులు మమత, రాజేంద్ర ఇమామ్‌ తదితరులు పాల్గొన్నారు.

► గంగాధరనెల్లూరులో ఎమ్మెల్యే నారాయణ స్మామి ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

► కుప్పంలో ఇంఛార్జ్‌ చంద్రమౌళి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ విగ్రహం నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు.

► బి.కొత్తకోటలో ద్వారకానాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు.

► పీలేరులో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

► గుంటూరులో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ తాడేపల్లి ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట ఎమ్మెల్యే ఆర్కే ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు.

► రేపల్లెలో మాజీ మంత్రి మోపిదేవి ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ, తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా.

► ప్రకాశం జిల్లా కందుకూర నియోజకవర్గంలో తుమటి మాధవరావు ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ. అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం.

► అద్దంకిలో ఇంఛార్జ్‌ కృష్ణచైతన్య ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. పార్టీ నేతలు ఆనందరావు, జ్యోతి హన్మంతరావుతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

► ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ కృష్ణా జిల్లా తిరువురులో ఎమ్మెల్యే రక్షణనిధి ఆధ్వర్యంలో ధర్నా.

► కైకలూరులో వైఎస్‌ఆర్ సీపీ సేమ్‌ డెమోక్రసీ బైక్‌ ర్యాలీ. సమన్వయకర్త నాగేశ్వరరావు తదితర నేతలు ర్యాలీలో పాల్గొన్నారు.

► తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు, సునీల్‌ ఆధ్వర్యంలో 'సేమ్‌ డెమోక్రసీ' ధర్నా. భానుగుడి జంక్షన్‌ నుంచి సర్పవరం వరకు బైక్‌ ర్యాలీ.

► జగ్గంపేట తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట కోఆర్డినేటర్‌ ముత్యాల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ధర్నా. వరసాల ప్రసాద్‌, గోవిందరెడ్డి, దొరబాబు, పెదబాబు తదితరులు ధర్నాలో పాల్గొన్నారు.

► శ్రీకాకుళంలోని ఏడు రోడ్డుల జంక్షన్‌ నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకు వైఎస్‌ఆర్ సీపీ భారీ బైక్ ర్యాలీని నిర్వహించింది. పార్టీ అధ్యక్షురాలు రెడ్డి శాంతి, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

► ఆముదాలవలసలో తహశీల్దార్‌ కార్యాలయం వద్దకు నిర్వహించిన బైక్‌ ర్యాలీలో మాజీ మంత్రి తమ్మినేని సీతారాం పాల్గొన్నారు.

► నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటర్‌లో ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు.

► వేదాయపాలెంలోని జగ్జీవన్‌రామ్‌ విగ్రహం వద్ద డిప్యూటీ మేయర్‌ ద్వారకానాథ్‌, తాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సేవ్‌ డెమోక్రసీ ర్యాలీ.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement