అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న అధికార తెలుగుదేశం పార్టీ అప్రజాస్వామిక విధానాలను ఎండగడుతూ ఢిల్లీలో మంగళవారం
కాకినాడ : అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న అధికార తెలుగుదేశం పార్టీ అప్రజాస్వామిక విధానాలను ఎండగడుతూ ఢిల్లీలో మంగళవారం ‘సేవ్ డెమోక్రసీ’నినాదం మిన్నంటింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో పార్టీ తరఫున గెలుపొందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డితోపాటు జిల్లా నుంచి పరిశీలకులు ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, సీజీసీ సభ్యులు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ జాతీయస్థాయి నేతలను కలిసి రాష్ట్రంలోని అప్రజాస్వామిక విధానాలను వివరించారు. కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎన్సీపీ నాయకుడు శరద్‌పవార్, జేడీయూ నేత శరద్‌యాదవ్ తదితరులను వీరు కలిశారు.