కేంద్ర హోంమంత్రితో వైఎస్ జగన్ భేటీ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రేరేపిస్తున్న పార్టీ ఫిరాయింపుల అంశంపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలిశారు. సీఎం చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాలపై ఫిర్యాదు చేసేందుకు ఆయన 'సేవ్ డెమోక్రసీ' పేరిట బృందంగా రాజ్ నాథ్ తో భేటీ అయ్యారు.
ఈ భేటీలో వైఎస్ఆర్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ కు ఓ విజ్ఞాపన పత్రం కూడా ఇవ్వనున్నారు. దీంతోపాటు 'ది ఎంపరర్ ఆఫ్ కరప్షన్' అనే పుస్తకాన్ని కూడా కేంద్ర హోమంత్రికి వైఎస్ జగన్ ఇవ్వనున్నారు. అమరావతి పేరుతో భూముల దోపిడీ, కరెంటు దోపిడీ, ఇసుక మాఫియాలను ఇలా అన్ని అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. మొత్తం లక్షా ముప్పైవేల కోట్ల రూపాయల అవినీతి వ్యవహారం ఈ పుస్తకంలో పొందుపరిచారు. పూర్తి ఆధారాలతో, డాక్యుమెంట్లు కూడా ఈ పుస్తకంలో పేర్కొన్నారు.