ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తన సొంత పాలన మీద నమ్మకం లేకపోవడం వల్లే పార్టీలు మారిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి మళ్లీ ఎన్నికలకు వెళ్లలేకపోతున్నారని వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు అవినీతిని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించినట్లు ఆయన చెప్పారు. హోం మంత్రిని కలిసిన అనంతరం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే...
- ఎన్నికల హామీ నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు
- అవినీతి సొమ్ముతో విచ్చలవిడిగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు
- ఒక్కొక్కరికి రూ. 20-30 కోట్లు వెచ్చించి పట్టపగలే కొనుగోలు సాగిస్తున్నారు
- ఎమ్మెల్యేల కొనుగోలు, అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని హోం మంత్రిని కోరాం
- ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే ధైర్యం లేదంటేనే, ప్రజల్లో చంద్రబాబుకు ఏపాటి ఆదరణ ఉందో అర్థమవుతుంది
- విభజన హామీలను అమలుచేయాలని కూడా హోం మంత్రిని కోరాం
- నియోజకవర్గాల పునర్విభజనతో సామాన్యులకు ఒరిగేది ఏమీ లేదు
- మహా అయితే 50-60 మందికి ఎమ్మెల్యే ఉద్యోగాలు వస్తాయి
- ప్రజలకు కావల్సింది రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా
- ప్రత్యేక హోదాను వదిలేసి పునర్విభజన గురించి మాట్లాడితే ప్రజలు బాబును క్షమించరు
- పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా, వారిపై అనర్హత వేటు వేయకుండా కాపాడుతున్నారు
- చంద్రబాబు రాష్ట్ర పరువును ఎలా తీస్తున్నారో సీతారాం ఏచూరి చెప్పారు
- ఈ పోరాటం ఇంతటితో ఆగదు.. అందరి సహకారంతో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుతాం
- పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మరింత బలోపేతం చేయాలని కోరాం