
ప్రధాన ఎన్నికల కమిషనర్ తో వైఎస్ జగన్ భేటీ
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) నదీమ్ జైదీని కలిశారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) నదీమ్ జైదీని కలిశారు. ఏపీలో ఫిరాయింపుల వ్యవహారాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు. అధికార టీడీపీ సాగిస్తున్న అనైతిక రాజకీయాలు, ప్రలోభాలతో ఎమ్మెల్యేలను లోబర్చుకుంటున్న తీరును వివరించారు. వైఎస్ జగన్ వెంట వైఎస్సార్ సీపీ ఎంపీలు, నాయకులు ఉన్నారు.
ఫిరాయింపుల వ్యవహారాన్ని జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్ జగన్ నేతృత్వంలో 'సేవ్ డెమొక్రసీ' ఉద్యమం చేపట్టారు. ఇందులో భాగంగా పార్టీ నాయకులతో పాటు వైఎస్ జగన్ ఢిల్లీలో పలువురు జాతీయ పార్టీల నేతలను, కేంద్ర మంత్రులను కలిశారు.