
న్యూఢిల్లీ, సాక్షి: లోక్‌సభ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ లెక్కింపులో పారదర్శకత పాటిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందుకోసం అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లను అనుమతించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించినట్లు తెలిపింది.
ఓట్ల లెక్కింపుపై మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడారు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్. ఈ సందర్భంగా.. ఈసీ వెబ్‌సైట్‌ను సెకనుకు 2లక్షల మంది చూస్తున్నారని తెలిపారాయన. అలాగే.. కౌంటింగ్‌ను ఈసీ బృందాలు వర్చువల్‌గా పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment