ఢిల్లీ: 'కేజ్రీవాల్'ను అరెస్టు చేసిన నేపథ్యంలో ఇండియా కూటమి రాంలీలా మైదానంలో 'సేవ్ డెమోక్రసీ' ర్యాలీ నిర్వహిస్తోంది. ఈ ర్యాలీలో పార్టీ ప్రధాన నాయకులు, కార్యకర్తలు మాత్రమే కాకుండా మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన చీఫ్ 'ఉద్ధవ్ ఠాక్రే' కూడా పాల్గొన్నారు.
సేవ్ డెమోక్రసీ ర్యాలీలో పాల్గొన్న ఉద్ధవ్ ఠాక్రే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో.. బీజేపీ 400 కంటే ఎక్కువ స్థానాల్లో గెలుపొందటమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఒక పార్టీ, ఒక వ్యక్తి సారథ్యంలో నడిచే ప్రభుత్వం అధికారం కోల్పోవాల్సిన సమయం ఆసన్నమైంది. మేము ఎన్నికల ప్రచారానికి రాలేదు.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి వచ్చాము అన్నారు.
ఒకప్పుడు అవినీతి చేసిన వాళ్లను బీజేపీ వాషింగ్ మెషిన్‌లో ఉతికి శుభ్రం చేసిందని ఎద్దేవా చేశారు. అవినీతిపరులతో నిండిన పార్టీ ప్రభుత్వాన్ని ఎలా నడుపుతుంది? అని ఠాక్రే ప్రశ్నించారు. జైలులో ఉన్న ప్రతిపక్ష నాయకులు అరవింద్ కేజ్రీవాల్ & హేమంత్ సోరెన్ భార్యలకు మద్దతునిస్తూ.. వారి పోరాటానికి మద్దతుగా వారి సోదరుడు ఇక్కడ ఉన్నాడు అని వ్యాఖ్యానించారు.
दिल्ली के रामलीला मैदान में पक्षप्रमुख मा. श्री. उद्धवसाहेब ठाकरे ने INDIA गठबंधन महारैली को संबोधित किया। pic.twitter.com/RdfFXDVFnL
— Office of Uddhav Thackeray (@OfficeofUT) March 31, 2024
Comments
Please login to add a commentAdd a comment