'దుష్ట శక్తుల గుప్పిట్లో ఏపీ' | people will give ultimate justice in 2019 elections | Sakshi
Sakshi News home page

'దుష్ట శక్తుల గుప్పిట్లో ఏపీ'

Published Sun, May 8 2016 12:44 PM | Last Updated on Tue, May 29 2018 4:23 PM

'దుష్ట శక్తుల గుప్పిట్లో ఏపీ' - Sakshi

'దుష్ట శక్తుల గుప్పిట్లో ఏపీ'

ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ముఖ్యం అని చెప్పారు.

చికాగో: ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ముఖ్యం అని చెప్పారు. ఏపీలోని దుష్ట శక్తుల గుప్పెట్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని రక్షించి సుఖ సంతోషాలు వెల్లి విరిసేలా చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుందని ఆయన చెప్పారు.

అమెరికాలోని చికాగో నగరం ఆరోరాలో టామరిండ్ ఇండియన్ కుసిన్ లో 'శేషు రెడ్డి & కొండపల్లి సత్య (కేఎస్ఎన్) ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 'సేవ్ డెమొక్రసీ' సంఘీభావ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. వందలాదిమంది ప్రవాసాంధ్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరుతూ భారత రాజకీయ వ్యవస్థకు ఒక గట్టి సందేశాన్ని అందిస్తున్నారని చెప్పారు. మహానేత వైఎస్ఆర్ అధికారంలో వున్నప్పుడు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిపేందుకు కృషిచేస్తామని చెప్పారు. వైఎస్ జగన్ పాలనతో తిరిగి రాజన్న స్వర్ణయుగం ఖాయమన్నారు.

ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం రాజకీయ వ్యభిచారం లాంటిదని ఆయన చెప్పారు. తప్పు ఎవరు చేసినా తప్పేనని ఇలాంటివి ఆపకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతింటుందని అన్నారు. 'తిరుగులేని నాయకత్వ పటిమ కలిగిన వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రస్తుతం నేను నిజాయితీ కలిగిన ఎమ్మెల్యేగా ప్రజల్లో ఉన్నాను. మీ ప్రలోభాలకు లొంగి పార్టీ మారితే నీతిమాలిన ఎమ్మెల్యేగా  చరిత్రలో మిగిలిపోతాను' అంటూ ఆయన చెప్పారు. ప్రజలు అన్ని చూస్తున్నారని, 2019లో ప్రజలు తప్పక గుణపాటం చెప్పడం ఖాయమన్నారు.

రెండేళ్ల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.1,34,295 కోట్లు సంపాదించుకోవడానికి అవకాశం కల్పించిన 31 కుంభకోణాల వివరాలతో కూడిన ఎంపరర్ ఆప్ కరప్షన్ పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చికాగో సిటి కమిటీ ఇంచార్జీ ఆర్ వెంకటేశ్వర రెడ్డి, గంగాధర్, బక్తియర్ ఖాన్ తో పటుపలు రాష్టాల నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ తెలుగువారు, విద్యార్థులు, వైఎస్‌ఆర్ అభిమానులు, వైఎస్‌ఆర్ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదే సభలో అమెరికా తెలుగు అసోసియేషన్ (అట) కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, కేకే రెడ్డి, కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జూలై తొలివారంలో చికాగోలో జగరనున్న అట 25వ వార్షికోత్సవ సభకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా శ్రీకాంత్ రెడ్డి ద్వారా విన్నవించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement