ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తన స్థాయిని మించి విమర్శలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి మండిపడ్డారు.
విజయవాడ: ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తన స్థాయిని మించి విమర్శలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి మండిపడ్డారు. ఆయన శుక్రవారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్పై విమర్శలు చేసినవారికే ఫస్ట్ ర్యాంకులు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడకు రిటైర్డ్మెంట్ మూడ్ వచ్చేసినట్లు ఉందని పార్థసారధి వ్యాఖ్యానించారు. టీడీపీ ఫిరాయింపు రాజకీయాలకు నిరసనగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి సేవ్ డెమెక్రసీ పేరుతో జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన చేయనున్నట్లు వివరించారు.