హైదరాబాద్: ఏపీలో విచ్చలవిడిగా డబ్బులు పంచుతూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అదికార పార్టీ నేతలు ప్రజాస్వామ్య విలువలను దిగజార్చడాన్ని ప్రతిపక్ష ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతూ నీచరాజకీయాలను ప్రోత్సహిస్తున్న అధికార పార్టీ కనువిప్పు చేయడానికి వైఎస్ఆర్ సీపీ నేటి సాయంత్రం ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో 'సేవ్ డెమొక్రసీ' పేరుతో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించింది. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడం కోసం వైఎస్ఆర్ సీపీ పిలుపు మేరకు పార్టీ కార్యకర్తలతో పాటు, భారీ ఎత్తున ప్రజలు కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొని ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి భానుగుడి సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి, తదితర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణాజిల్లా విజయవాడలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, రక్షణనిధి, మేకా ప్రతాప్ అప్పారావు పాల్గొన్నారు. పార్టీ నేతలు పార్థసారధి, సామినేని ఉదయభాను, జోగి రమేష్, విజయవాడ నగర కార్పొరేటర్లు 'సేవ్ డెమొక్రసీ' లో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. గుంటూరులో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు డా.గోపిరెడ్డి నివాసరెడ్డి, ముస్తఫా, మర్రి రాజశేఖర్, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, తదితర నేతలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విధానాలు ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతిస్తున్నాయని నేతలు విమర్శించారు.
కడపలో వైఎస్సార్ సర్కిల్ లో బహిరంగసభ నిర్వహించారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, కొరుముట్ల నివాసులు, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి బహిరంగసభలో పాల్గొని ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు ప్రజలు తమతో కలిసి ముందుకురావాలని పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా నగరిలో ఎమ్మెల్యే ఆర్కే రోజా నేతృత్వంలో నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. చిత్తూరు జిల్లాలో 'సేవ్ డెమొక్రసీ' ర్యాలీలో ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, డా.సునీల్ కుమార్, పార్టీ కన్వీనర్లు ఆదిములం, జంగాలపల్లి నివాసులు, తదితర నేతలు పాల్గొన్నారు. తిరుపతిలో ఎంపీ వరప్రసాద్, నేతలు అశోక్ కుమార్, ప్రతాప్ రెడ్డి, రాజేంద్ర, పలువురు నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
కర్నూలులో రాజ్ విహార్ సెంటర్లో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి, బుగ్గర రాజేంద్రనాథ్, ఐజయ్య, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, తదితరులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతపురంలో వైఎస్ఆర్ సీపీ 'సేవ్ డెమొక్రసీ' క్యాండిల్ ర్యాలీలో భాగంగా ఎమ్మార్వో కార్యాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, ఎల్ఎం మోహన్ రెడ్డి, తదితర నేతలతో పాటు భారీగా కార్యకర్తలు, ప్రజలు ఈ ర్యాలీకి మద్ధతుగా తరలివచ్చారు.
వెల్లువెత్తిన కొవ్వొత్తుల ర్యాలీ
Published Sat, Apr 23 2016 9:30 PM | Last Updated on Tue, May 29 2018 4:23 PM
Advertisement
Advertisement