candle rally
-
90 ఏళ్లు... రెండు మైళ్లు..: సొసైటీకీమె దివిటీ
పత్రికలకు, రేడియోకు దూరంగా ఉండే ఆ బామ్మ ఆగ్రహంతో రగిలిపోయింది. కోలకతాలో జూనియర్ డాక్టర్‌పై సాగిన హత్యాచారకాండను మనవరాళ్ల ద్వారా వినగానే ‘సమాజం ఇలాంటి వాటిని ఎలా అంగీకరిస్తుంది? పదండి అందరం నిరసన తెలుపుదాం’ అని 90 ఏళ్ల మాయా రాణి అర్ధరాత్రి కేండిల్ పట్టి రెండు మైళ్లు నడిచింది. ప్రతి అడుగు మనలో కదలిక ఆశిస్తోంది.ఆమెను చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. నడుము ఒంగిపోయినా అడుగులు తొణకడం లేదు. శరీరం బలహీనంగా ఉన్నా మాట తీవ్రతలో వెనుకంజ లేదు. మొన్నటి బుధవారం (ఆగస్టు 14) కోల్‌కతాలో అర్ధరాత్రి సాగిన నిరసనలో 90 ఏళ్ల ఆ బామ్మ చేతిలో క్యాండిల్ పట్టుకుని జనంతోపాటు నడుస్తూంటే అందరూ ఆమెను చూసి స్ఫూర్తి పొందారు. ఆమెతోపాటు మరింత ఉద్వేగంగా నడిచారు.ఇంత దారుణమా...కోల్‌కతాలోని జోకా ప్రాంతంలో నివాసం ఉండే 90 ఏళ్ల మాయారాణి చక్రవర్తికి ఆగస్టు 9న జరిగిన హత్యాచారం గురించి మనవరాళ్ల ద్వారా తెలిసింది. డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం జరిపి హత్య చేశారన్న వార్త తెలియగానే ఆమె కదిలిపోయింది. తన కోల్‌కతా నగరంలో ఇంత దారుణమా అనుకుందామె. ‘ఇంతటి ఘోరాన్ని నా జీవితంలో వినలేదు’ అందామె వాళ్లతో. ‘దీనిని సమాజం ఎలా అంగీకరిస్తుంది? మీరంతా ఏం చేస్తున్నారు?’ అని మనవరాళ్లను ప్రశ్నించింది. ‘మేము అర్ధరాత్రి నిరసన చేయబోతున్నాం. రాత్రిళ్లు సురక్షితంగా తిరగ్గలిగే మా హక్కు కోసం నినదించబోతున్నాం’ అని వాళ్లు చెప్పారు. ‘అయితే నేనూ వస్తాను’ అందామె. ‘రెండు మైళ్లు నడవాలి’ అన్నారు వాళ్లు. ‘నేను నడుస్తాను’ అందామె ఖండితంగా.క్యాండిల్ పట్టుకుని...మోకా అనే ఏరియాలోని తన అపార్ట్మెంట్ నుంచి ఆ ఏరియా ఇ.ఎస్.ఐ ఆస్పత్రి వరకు మూడు కిలోమీటర్లు నడిచింది మాయారాణి చక్రవర్తి. ‘బయట క్షేమంగా లేకపోతే ఇంట్లో మాత్రం క్షేమంగా ఎలా ఉండగలరు ఆడవాళ్లు. నా మనవరాళ్లు పని మీద, చదువు కోసం బయటకు వెళితే వాళ్లు వచ్చేంత వరకూ బితుకుబితుకుమంటూ ఉండాలా నేను. ఈ పరిస్థితి మారాలి. ఈ పరిస్థితిని అందరం మార్చాలి. అంతేకాదు ఇంత దారుణ నేరం చేసినవారికి శిక్ష పడాలి’ అందామె. సమాజంలో ఎన్ని ఘోరాలు జరిగినా జడత్వంతో మనకెందుకులే అనుకునేవారికి ఆ బామ్మ కదలిక ఒక దివిటీ కావాలని ఆశిద్దాం. -
వైఎస్ఆర్ సీపీ నేతల కొవ్వొత్తుల ర్యాలీ
-
వైఎస్సార్సీపీ క్యాండిల్ ర్యాలీ
-
‘అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయాలన్నదే కూటమి సర్కార్ ప్లాన్’
సాక్షి, విజయవాడ: అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. విగ్రహంపై ఉద్దేశపూర్వకంగా దాడి జరిగిందన్నారు. అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టించడం టీడీపీ నేతలకు ఇష్టంలేదని చెప్పుకొచ్చారు.కాగా, విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై జరిగిన దాడిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ నేతలు నిరసన చేపట్టారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనల్లో మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైఎస్సార్సీపీ నేతలు దేవినేని అవినాష్,షేక్ ఆసిఫ్, పోతిన మహేష్, దళిత సంఘం నేతలు, వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొన్నాయి.👉ఈ సందర్భంగా మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహాన్ని కొంతమంది ధ్వంసం చేయాలని చూశారు. ఈ దుశ్చర్యను యావత్ రాష్ట్ర ప్రజానీకం ఖండించారు. అంబేద్కర్‌ను అవమాన పరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత నిరసన చేపట్టాం. ఈ ఘటనకు కారకులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ నిరసన తెలిపాం. కొంతమంది కళ్లు లేని కబోథులు అక్షరాలే కదా అని అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. అంబేద్కర్ విగ్రహం ఉన్న ప్రాంతంలో ఏ చిన్న అవాంతరం జరిగినా అవమానమే. గునపాలతో దాడి చేసేందుకు వస్తే మీకు కళ్లు కనిపించలేదా?. అంబేద్కర్ విగ్రహం బెజవాడ నడిబొడ్డున ఉండటం చంద్రబాబుకు, టీడీపీ నేతలకు ఇష్టం లేదు. అంబేద్కర్‌ను అవమాన పరిచిన వారు ఎంతటి వారైనా విడిచిపెట్టవద్దని గవర్నర్, రాష్ట్రపతికి లేఖలు ఇచ్చాం. ఈ ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తాం. అంబేద్కర్ విగ్రహంపై గునపం పడితే ఊరుకునేది లేదు. మా ఆందోళన ఉధృతం చేస్తాం. ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్తాం. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులు ఎలాంటి వారైనా శిక్ష పడాల్సిందేనని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 👉మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహం ఉండటాన్ని ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. ఈ ఘటనపై ఇంతవరకూ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం. రాత్రి పూట లైట్లు ఆర్పి అంబేద్కర్ విగ్రహంపై దాడి చేశారు. అంబేద్కర్ విగ్రహం చుట్టూ సెక్యూరిటీ లేదు. ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి జరిగింది. ఈ దాడి ఘటనపై కేంద్రాన్ని, గవర్నర్, రాష్ట్రపతిని, కోర్టులను ఆశ్రయిస్తాం. 👉వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ఉండకూడదని నీచమైన చర్యలకు పాల్పడ్డారు. కూటమి ప్రభుత్వం దిగజారిపోయి వ్యవహరిస్తోంది. అంబేద్కర్ విగ్రహంపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. 👉విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ లేని సాంప్రదాయానికి కూటమి ప్రభుత్వం తెర తీసింది. అంబేద్కర్ విగ్రహంపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడి ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. 👉వైఎస్సార్సీపీ నాయకుడు పోతిన మహేష్ మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహంపై దాడిని ప్రజాస్వామ్యం పై దాడిగా పరిగణిస్తాం. రాజ్యాంగంపై నమ్మకం ఉంటే ఈ ఘటనను ప్రభుత్వం ఖండించి ఉండేది. ఈవీఎంలను నమ్ముకున్నారు కాబట్టే అంబేద్కర్‌పై జరిగిన దాడిని ఖండించ లేకపోతున్నారు. చంద్రబాబు అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చి ఎందుకు నివాళులర్పించలేదు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. అంబేద్కర్‌కు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. ఘటన జరిగి 24 గంటలు గడుస్తున్నా ఎందుకు ప్రభుత్వం స్పందించలేదు. స్వరాజ్య మైదానాన్ని చంద్రబాబు చైనా కంపెనీలకు, సుజనా చౌదరికి అమ్మేయాలని చూశారు. వారసత్వ సంపదైన స్వరాజ్య మైదానాన్ని చంద్రబాబు దోచుకోవాలని చూశారు. కానీ, వైఎస్ జగన్ మాత్రం కాపాడారు. కుట్రలు కుయుక్తలతో అంబేద్కర్ విగ్రహాన్ని విధ్వంసం చేయాలనేదే కూటమి పార్టీల ఉద్ధేశం. పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై ఎందుకు స్పందించలేదు. అంబేద్కర్ విగ్రహంపై దాడికి పాల్పడిన వారిని శిక్షించకపోతే రాష్ట్ర ప్రజలు త్వరలోనే మిమ్మల్ని తిరస్కరిస్తారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
అమరులకు కేసీఆర్ నివాళి
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) చేపట్టిన తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో.. తొలిరోజున సాయంత్రం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. కొవ్వొత్తితో అమరజ్యోతిని వెలిగించి అమరులకు నివాళి అర్పించారు. అనంతరం అమర జ్యోతుల (కొవ్వొత్తుల) ర్యాలీని కేసీఆర్ ప్రారంభించారు. వెయ్యి మందికిపైగా తెలంగాణ కవులు, కళాకారులు, న్యాయవాదులు, వైద్యులు, వివిధ రంగాలకు చెందినవారితోపాటు.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో సుమారు రెండు గంటల పాటు ర్యాలీ కొనసాగింది. అమరులకు నివాళి అర్పిస్తూ ర్యాలీ పొడవునా నినాదాలు చేశారు. రవీంద్రభారతి, ఆర్బీఐ మీదుగా సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమరజ్యోతి వరకు ర్యాలీ కొనసాగింది. అక్కడ ‘జోహారులు.. జోహారులు.. అమరులకు జోహారులు.. వీరులకు జోహారులు’అంటూ ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి అందరూ అమరులకు నివాళి అర్పించారు. నేడు తెలంగాణ భవన్లో వేడుకలు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో వేడుకలు జరగనున్నాయి. ఉదయం 9.30కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో జాతీయ జెండాతోపాటు బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం ‘తెలంగాణ యాది’పేరిట ఉద్యమ జ్ఞాపకాలతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పార్టీ అధినేత కేసీఆర్ ప్రారంభిస్తారు. ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగిస్తారు. తర్వాత తెలంగాణ భవన్ పక్కనే ఉన్న కళింగ భవన్లో పార్టీ నేతలతో కలిసి భోజనం చేస్తారు. ప్రజల భాగస్వామ్యంతోనే తెలంగాణ: కేసీఆర్ ప్రజాస్వామిక వాతావరణంలో, పార్లమెంటరీ పంథాలో బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వ రాజకీయ వేదికగా ప్రజలందరి భాగస్వామ్యంతో తెలంగాణ సాధించుకున్నామని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటాలు, త్యాగాలను స్మరించుకున్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో పటిష్ట పర్చుకుంటూ సమర్థవంతంగా పాలన అందించిన గత పదేళ్లలో.. అభివృద్ధి సంక్షేమ రంగాల్లో తెలంగాణ దేశానికే ఒక రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. అమరుల త్యాగాలను వృధాపోనీయకుండా.. గత పదేళ్ల ప్రగతిని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాలని ఆకాంక్షించారు. -
HYD: నేడు కేసీఆర్, బీఆర్ఎస్ శ్రేణుల క్యాండిల్ ర్యాలీ..
సాక్షి, హైదరాబాద్: రేపు(ఆదివారం) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. కాగా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి రేపటికి దశాబ్ధం కాలం కానుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు గులాబీ శ్రేణులు రెడీ అయ్యాయి. ఇక, ఈరోజు(శనివారం) నుంచి మూడు రోజులపాటు వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తామని పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు.కాగా, రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలతో శనివారం హైదరాబాద్ గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం నుంచి తెలంగాణ సచివాలయం ఎదురుగా ఉన్న అమరజ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.#TelanganaDecade #తెలంగాణదశాబ్దితెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉద్విగ్న భాగస్వాములైన కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, మేధావులు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, విద్యార్థులు, మహిళలు.. యావత్ తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలుతెలంగాణ అమరులకు నివాళులు… pic.twitter.com/GqZi28G14N— BRS Party (@BRSparty) June 1, 2024 మరవైపు.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు(ఆదివారం) తెలంగాణభవన్‌లో జరగబోయే పలు కార్యక్రమాల్లో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ ప్రసంగించనున్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడం, పదేళ్లలో బీఆర్ ఎస్ ప్రభుత్వం సాధించిన ప్రగతి, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులు తదితర అంశాలపై ఆయన మాట్లాడనున్నట్టు సమాచారం. -
గీతాంజలి మృతికి సంతాపం క్యాండిల్ ర్యాలీ
-
జేపీ నడ్డా రామోజీరావుని కలవడానికి అసలు కారణం..!
-
కాలిఫోర్నియా, మిల్పిటాస్ లో జాహ్నవి కందుల జ్ఞాపకార్థం క్యాండిల్ ర్యాలీ
-
జాహ్నవి మృతికి సంతాపంగా అమెరికాలో క్యాండిల్ ర్యాలీ
అమెరికా సియాటెల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల మృతి చెందిన సంగతి తెలిసిందే.అమెరికాలో పోలీసుల నిర్లక్ష్యంతో జరిగిన కారు ప్రమాదానికి బలైపోవడమే గాక మరణానంతరం కూడా వాళ్ల చేతుల్లో జాత్యహంకార హేళనకు గురైన తెలుగు యువతి జాహ్నవి కందుల ఉదంతం కలకలం రేపిన సంగతి తెలిసిందే. జాహ్నవి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్(AIA), తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(TANA), బే ఏరియా తెలుగు అసోసియేషన్ సంస్థ(BATA) ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు.జాహ్నవి జ్ఞాపకార్థం కాలిఫోర్నియాలోని మిల్పిటాస్లో నిర్వహించిన ఈ క్యాండిల్ ర్యాలీలో ప్రవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాహ్నవి చిత్రపటానికి నివాళులు అర్పించి.. ఒక నిముషం పాటు మౌనం పాటించారు. సియాటెల్ పోలీసు అధికారి కారు ఢీకొని ప్రమాదంలో మరణించిన జాహ్నవికి న్యాయం జరగాలని ఈ సందర్భంగా నినదించారు. ఆమె మృతికి కారణమైన పోలీసు అధికారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆమె అకాల మరణంపట్ల ఇండియన్ కమ్యూనిటీకి చెందిన పలువురు ప్రముఖులు, నాయకులు సంతాపం తెలిపారు.జాహ్నవి కుటుంబానికి మద్దతుగా ఉంటామని వారు పేర్కొన్నారు. ఏపీ కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల (23) ఈ ఏడాది జనవరి 23న రోడ్డు దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని మృతి చెందింది. దీనిపై పోలీస్ ఆఫీసర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ మైక్ సోలన్‌కు ప్రమాదం గురించి సమాచారం అందిస్తూ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ అడెరెర్.. చులకనగా మాట్లాడుతూ పగలబడి నవ్విన వీడియో ఒకటి ఇటీవల వైరల్ అయ్యింది. -
కుప్పంలో టీడీపీ నేతల ‘కరెంట్ డ్రామా’
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వంపై బురద జల్లడానికి కుప్పం(చిత్తూరు) టీడీపీ నేతలు ఎన్నిరకాల అడ్డదారులు తొక్కాలో.. అన్ని దారుల్లోనూ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కరెంట్ కోతల డ్రామాను తెర మీదకు తీసుకొచ్చారు. ఒక పథకం ప్రకారం రాత్రివేళల్లో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను బంద్ చేయిస్తున్న పచ్చ నేతలు.. ఆ వెంటనే కరెంట్ లేదంటూ కొవ్వొత్తులతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అయితే అసలు విషయం వెలుగు చూడడంతో ఇప్పుడు నీళ్లు నములుతున్నారు. ఇక ఇదంతా చంద్రబాబు డైరెక్షన్లోనే నడుస్తున్న డ్రామా అంటున్నారు స్థానిక నేతలు. విషయం వెలుగులోకి రావడంతో ఈ కుట్ర వెనుక ఉన్న టీడీపీ నేతపై కేసు నమోదు అయ్యింది. అంతేకాదు.. విద్యుత్ సరఫరాను నిలిపివేసిన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. -
విశాఖలో స్టీల్‌ప్లాంట్ కార్మికుల కొవొత్తుల ర్యాలీ
-
ప్రభుత్వానికి ప్రశాంతత లేకుండా చేస్తాం
కర్నాల్: డిమాండ్లను పరిష్కరించే వరకు రైతులు ప్రభుత్వానికి ప్రశాంతత లేకుండా చేస్తారని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ అన్నారు. కర్నాల్ జిల్లా ఇంద్రి ధాన్యం మార్కెట్లో ఆదివారం జరిగిన మహాపంచాయత్‌లో ఆయన ప్రసంగించారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరే కంగా నిరసనలు కొనసాగిస్తున్న రైతు సంఘాలకు చెందిన 40 మంది నేతలు మద్దతు కూడగట్టేందుకు దేశవ్యాప్తంగా పర్యటిస్తారని వెల్లడించారు. ‘డిమాం డ్లకు అంగీకరించకుండా, రైతు సంఘాలతో చర్చలు జరపకుండా ఉన్నంత కాలం ప్రభుత్వాన్ని ప్రశాంతంగా కూర్చో నివ్వకుండా చేస్తాం’అన్నారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం ఉపసం హరించుకోవాల్సిందేననీ, అప్పటి దాకా పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కొత్త సాగు చట్టాలతో ప్రజా పంపిణీ వ్యవస్థ అంతమ వుతుందన్నారు. రైతులతోపాటు చిన్న వ్యాపా రులు, రోజు కూలీలు తదితరులపైనా ఈ చట్టాలు ప్రభావం చూపుతాయని తికాయత్ చెప్పారు. ఆకలితో వ్యాపారం చేయడాన్ని అనుమతించబో మని తెగేసి చెప్పారు. కొత్త చట్టాలు కార్పొరేట్లకు అనుకూలమనే విషయం రైతులకు తెలియదను కుంటున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సింఘు బోర్డర్లో జరుగుతున్న ఆందోళనలే రైతు నిరసనలకు కేంద్ర బిందువుగా ఉంటాయన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాకేశ్ తికాయత్ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఘాజీపూర్ వద్ద రెండు నెలలుగా నిరసనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. -
గణపవరంలో క్యాండిల్ ర్యాలీ
-
టీడీపీ నేతల కొవ్వొత్తుల ర్యాలీ.. నవ్విపోతున్న జనం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అమరావతికి కట్టబడి ఉండాలన్న ప్రకటనపై టీడీపీలో ఒకపక్క ధిక్కార స్వరం వినిపిస్తోంది. ఇప్పటికే కొందరు నేతలు బయటపడ్డారు. మూడు రాజధానుల ప్రకటనకు మద్దతు తెలిపారు. మరికొందరు నేతలు లోపాయికారీగా చర్చించుకుంటున్నారు. తమ అభిప్రాయాన్ని చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఉన్న పళంగా పార్టీ చీలిపోయే పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని గమనించిన పార్టీ అధిష్టానం నష్ట నివారణ కోసం తమ చెప్పుచేతల్లో ఉండే కొందరు నేతలను రంగంలోకి దించింది. వారి చేత ‘మూడు రాజధానులు వద్దు– అమరావతి ముద్దు’ అనే నినాదంతో ర్యాలీలు చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కాకపోతే, ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్నట్లు ప్రజలు, ఆ పార్టీ కార్యకర్తలు సైతం కలిసి రాకపోవడంతో 30 మందితో మమ అనిపించే పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ చూసినా అదే చర్చ.. ప్రస్తుతం ఎక్కడ చూసినా మూడు రాజధానుల చర్చే జరుగుతున్నది. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణపై మద్దతు వెల్లువెత్తుతోంది. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయబోతున్నారన్న ప్రతిపాదిత ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా వెనుకబడిన జిల్లాలైన విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం అభివృద్ధికి నోచుకుంటాయని ప్రజలు ఆశిస్తున్నారు. అందుకనే అన్ని వర్గాలు మూడు రాజధానుల ప్రకటన, అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తున్నాయి. ఎక్కడికక్కడే రౌండ్ టేబుల్ సమావేశాలు, అభివృద్ధి–పరిపాలన వికేంద్రీకరణ సదస్సులు నిర్వహించి తమ ఆనందాన్ని, మనోగతాన్ని, అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ప్రతి ఏరియాలోనూ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖను చేయాలన్న ప్రతిపాదిత ప్రకటనపై చర్చ జరుగుతున్నది. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, న్యాయవాదులు, వైద్యులు, కారి్మకులు, కర్షకులు తదితర వర్గాలన్నీ రాజకీయాలకు అతీతంగా సమాయత్తమవుతున్నాయి. ఎక్కడికక్కడ కనిపిస్తున్న ప్రజల నాడిని గమనించి కొందరు నేతలు బయటపడుతున్నారు. రాజధానికి అనుకూలంగా మద్దతు పలుకుతున్నారు. అవసరమైతే చంద్రబాబు అజెండాను వ్యతిరేకించేందుకు సిద్ధమవుతున్నారు. తప్పదని అధిష్టానం ఒత్తిడి చేస్తే పార్టీ మారడానికైనా సై అంటున్నారు. ప్రజాభిప్రాయానికి ఎవరైనా తలొగ్గక తప్పదని, మన ప్రాంత అభివృద్ధికి కట్టుబడేలా ఉండాలని అత్యధిక టీడీపీ నేతలు ప్రస్తుతం లోపాయికారీగా చర్చించుకుంటున్నారు. దీంతో టీడీపీ నిట్టనిలువునా చీలిపోయే పరిస్థితి స్పష్టమవుతోంది. చక్కదిద్దేందుకు యత్నాలు రోజురోజుకూ పార్టీలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఆందోళన చెంది చక్కదిద్దే కార్యక్రమానికి అధినేత చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెట్టారు. తాను చెప్పినట్టు వినే నేతలను రంగంలోకి దించి, వారి చేత అమరావతికి అనుకూలంగా నినాదాలు చేయించి, అదే మాట ప్రజల్లోకి గట్టిగా వెళ్లేలా చేసి, మూడు రాజధానులకు అనుకూలంగా ఉన్న టీడీపీ శ్రేణుల మనసు మార్చే కార్యక్రమాన్ని తలపెట్టారు. కానీ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు చంద్రబాబు ఎత్తులను తిప్పికొడుతున్నారు. ఎన్ని జిత్తుల మారి ఎత్తులు వేసినా తమ ప్రాంత అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్దామని, భజన చేసే నాయకుల ట్రాప్‌లో పడేది లేదని చెప్పకనే చెబుతున్నారు. దానికి ఉదాహరణ శ్రీకాకుళంలో గురువారం సాయంత్రం చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీ. మూడు రాజధానులు వద్దు– అమరావతి ముద్దు అనే నినాదంతో చేసిన ర్యాలీలో 30 మందికి మించి కన్పించలేదు. నిత్యం రద్దీగా ఉండే ఏడు రోడ్ల జంక్షన్లో చేపట్టిన కొవ్వుత్తుల ర్యాలీకి జనాల నుంచి స్పందన లేదంటే వారు ఎత్తుకున్న నినాదానికి ఎంత మద్దతు ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖను రాజధాని చేస్తే వీరికొచ్చే నష్టమేంటి? అమరావతిలో కొన్న భూముల విలువ తగ్గిపోతుందన్న భయమా? రాజకీయంగా కనుమరుగైపోతామన్న ఆందోళనా? అని ప్రజలు పెదవి విరిచిన పరిస్థితి కని్పంచింది. వీరి చేష్టలు చూస్తుంటే వెనకబడిన జిల్లాలకు నష్టం చేసేలా ఉన్నారని, నాడు రాష్ట్ర విభజనలో ఏ రకంగానైతే ద్వంద్వ నీతిని ప్రదర్శించి మోసగించారో ఇప్పుడలా చేస్తున్నారని ప్రజలు బాహాటంగానే వాపోయారు. -
పోలీసుల క్యాండిల్ ర్యాలీ
సాక్షి, ఒంగోలు: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలోని అమరవీరుల స్థూపం వద్ద నుంచి ఆర్టీసీ బస్టాండు వరకు ఆదివారం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్, అదనపు ఎస్పీ బి.శరత్‌బాబు, ఒంగోలు డీఎస్పీ కేవీవీఎస్‌వీ ప్రసాద్, ట్రాఫిక్ డీఎస్పీ కె.వేణుగోపాల్, ఎస్బీ సీఐలు బాలమురళీకృష్ణ, శ్రీకాంత్‌బాబు, నగర సీఐలు లక్ష్మణ్, భీమానాయక్, రాజేష్, రిజర్వు ఇన్స్పెక్టర్ అంకమ్మరావు తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో అమరవీరులకు జోహార్లు అంటూ నినాదాలు చేశారు. అమరవీరుల కుటుంబాలకు తేనీటి విందు జిల్లాలోని అమరవీరుల కుటుంబాలకు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తన ఛాంబరుకు పిలిపించి తేనీటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభాకర్‌వర్మ, మోటా శ్రీదేవి, లేళ్ల శంకర్ తండ్రి లేళ్ల కృష్ణమూర్తిలు తమకు భాగ్యనగర్ నాలుగో లైనులో స్థలం ఇచ్చారని, కానీ దానికి బాట లేదని పేర్కొన్నారు. రాతపూర్వకంగా తెలియజేస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్పీ వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ వారితో మాట్లాడుతూ మీ అందరినీ తన సొంత కుటుంబసభ్యులుగా భావిస్తున్నానన్నారు. పోలీసు అమరువీరుల కుటుంబ సభ్యుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. అమరవీరుల కుటుంబసభ్యులకు ఎల్లప్పుడు పోలీసుశాఖ అండగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు హెలికాప్టర్లో ప్రయాణిస్తూ అమరులైన అద్దంకి సాల్మన్ కేరీ వెస్లీ తల్లి కమలా వెస్లీ, పీవీ రత్నం తనయుడు శ్రీనివాస ప్రసాద్, ప్రశాంతరావు తనయుడు ప్రభాకర్‌వర్మ, బలిమెల ఘటనలో అశువులు బాసిన మోటా ఆంజనేయులు సతీమణి శ్రీదేవి, లేళ్ల శంకర్ తండ్రి కృష్ణమూర్తి, రఫీ సతీమణి సలీమాలు తేనీటి విందుకు హాజరయ్యారు. కార్యక్రమంలో ఒంగోలు డీఎస్పీ కేవీవీఎస్‌వీ ప్రసాద్, ఎస్బీ సీఐలు బాలమురళీకృష్ణ, శ్రీకాంత్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా పోలీసు అమతవీరుల వారోత్సవాలు
-
భోపాల్‌లో సీఆర్పీఎఫ్ భారీ కొవ్వొత్తుల ప్రదర్శన
-
నిందితులను శిక్షించాలి
ఎదులాపురం(ఆదిలాబాద్) : బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని పలు యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. మంగళవారం రాత్రి పలు సంఘాలు జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌లోని తెలంగాణ చౌక్ నుంచి అమరవీరుల స్తూపం వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ మహిళా చట్టాల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి విఫలమయ్యాయని అన్నారు. మొన్న జమ్మూకశ్మీర్.. నేడు సోన్‌లో.. మహిళలపై ప్రతి రోజు ఎక్కడో ఒక చోట ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయని అన్నారు. ప్రభుత్వాల్లో మచ్చుకైనా మార్పు కనిపించడం లేదని విమర్శించారు. నిర్మల్ జిల్లా సోన్‌లో బాలికపై అత్యాచారానికి పాల్ప డిన డోకల ప్రవీణ్, మరో నిందితుడిని కఠి నంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాం టి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టాలను పటిష్టం చేయాలని అన్నారు. తెలంగాణ యువజన సంఘాల సమితి జిల్లా అధ్యక్షుడు బాల శంకర్ కృష్ణ, ఊరే గణేశ్, మానవసేవా మాధవ సేవా సంఘం సభ్యురాలు శశిశకళ, బెస్ట్‌ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, తెలంగాణ జన సమితి జిల్లా నాయకులు సామల ప్రశాంత్, మాల సంక్షేమ నాయకులు పతి హర ప్రభాకర్, పీడీఎస్‌యూ జిల్లా నాయకురాలు కళావతి, తెలంగాణ ప్రజా వైద్యారోగ్య సంఘం నాయకులు బండారి కృష్ణ, టీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు సతీశ్, కౌన్సిలర్లు దోని జ్యోతి, శైలేందర్, సత్యనారాయణ, వెంకటరమణ పాల్గొన్నారు. -
నాలుగేళ్లలో చీకటి పరిపాలన
చీపురుపల్లి : రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాలుగేళ్ల పాలనలో ప్రజల జీవితాల్లో చీకట్లు అలముకొన్నాయని వైఎస్సార్ సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. ఈ చీకట్లు తొలగిపోవాలనే కొవ్వొత్తుల వెలుతురులో నిరసన చేపట్టినట్టు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ చీకటి పాలనను నిరసిస్తూ చీపురుపల్లి పట్టణంలో శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మానవహారం ఏర్పడి నిరసన తెలుపుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ప్రారంభమైన ర్యాలీ మెయిన్‌రోడ్డు, గాంధీబొమ్మ జంక్షన్ నుంచి మూడు రోడ్ల జంక్షన్‌కు చేరుకుంది. అంతకు ముందు మూడు రోడ్ల జంక్షన్లో జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బాబు పాలనలో చీకటి పరిపాలన కొనసాగుతుందన్నారు. మంత్రి బాధ్యతలు చేపట్టిన బొబ్బిలి ఎమ్మెల్యే అతి పెద్ద భూ కుంభకోణం వెనుక ఉండడం దారుణమని విమర్శించారు. తెలుగుదేశం పాలనలో ఇసుక, భూ మాఫియాలు పెరిగిపోయారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో సంతకాలు చేసిన పథకాలకు దిక్కు లేదని విమర్శించారు. మహిళల డ్వాక్రా రుణాల మాఫీ, వ్యవసాయ రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి, ఉపాధి కల్పన వంటి ఎన్నో పథకాలు అటకెక్కాయని గుర్తు చేశారు. ప్రజల జీవితాల్లో చీకట్లు ఏర్పడ్డాయన్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగి వెలుగులు రావాలంటే రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కెవి.సూర్యనారాయణరాజు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కెవి.సూర్యనారాయణరాజు, చీపురుపల్లి మండల పార్టీ అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, మండల నాయకులు ఇప్పిలి అనంతం, బెల్లాన త్రినాధ్, పతివాడ రాజారావు, రేవల్ల సత్తిబాబు, చందక గురునాయుడు, అధికార్ల శ్రీనుబాబు, కరిమజ్జి శ్రీనివాసరావు, పనస అప్పారావు, మీసాల రమణ, రఘుమండ త్రినాధ్, కరణం ఆది, గరివిడి మండల నాయకులు మీసాల విశ్వేశ్వరరావు, యలకల అప్పలనాయుడు, వలిరెడ్డి లక్ష్మణ, లెంక శ్రీరాములు, మెరకముడిదాం మండల నాయకులు తాడ్డి వేణు, బూర్లె నరేష్, గుర్ల మండల నాయకులు వరదా ఈశ్వరరావు, తోట తిరుపతిరావు, మంత్రి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ కొవ్వొత్తుల ర్యాలీ
-
కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న వైఎస్ జగన్
-
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. రాష్ట్రంలో వరుసగా మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులకు నిరసనగా శనివారం 13 జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీలు చేపట్టారు. ఈ ర్యాలీలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పెడన నియోజక వర్గంలో పాదయాత్ర ముగిసిన తర్వాత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ, బాధితులకు సంఘీభావం తెలుపుతూ కొవ్వొత్తి పట్టుకుని జననేత నడిచారు. మహిళలు, చిన్నారులపై దాడులు జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని వైఎస్సార్ సీపీ నేతలు మండిపడ్డారు. టీడీపీ నేతలే మహిళలపై దాడులకు దిగడం దారుణమని ఖండించారు. మహిళలపై దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో క్యాండిల్ ర్యాలీ ఇలా.. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గుంటూరులోని వినుగొండలో నేతలు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు పాల్గొన్నారు. తూర్పుగోదావరి కొత్తపేటలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరులో క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. జిల్లాలోని రాజంపేట ఆకేపాటి అమర్నాథ్రెడ్డి క్యాండిల్ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. నెల్లూరులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు గౌరి, శోభారాణిలో పాల్గొన్నారు. చీపురపల్లిలో మజ్జి శ్రీనివాసరావు ఆధ్యర్యంలో క్యాండిల్ ర్యాలీ ప్రారంభమైంది. విజయనగరం జిల్లా కురుపాంలో ఎమ్మెల్యే పుష్పవాణి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. నెల్లిమర్లలో జరిగిన ర్యాలీలో వైఎస్సార్ సీపీ నేతలు పెన్మత్స సాంబశివరాజు, అప్పలనాయుడు, కందుల రఘుబాబులు పాల్గొన్నారు. కర్నూల్లో గౌరు వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ ప్రారంభించారు. జిల్లాలో హొళగొందలో జనార్దన్ నాయుడు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ ప్రారంభమైంది. ఎమ్మిగనూరులో ఎర్రకోట జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. పశ్చిమగోదావరి నరసాపురంలో ముదునురి ప్రసాద్‌రాజు ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. జిల్లాలోని చింతలపూడిలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో ఎలిజా, జానకిరెడ్డి, పాశం రామకృష్ణలు పాల్గొన్నారు. ఉండిలో పీవీఎల్ నరసింహజారు ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. విజయవాడ తూర్పు నియోజక వర్గంలో బొప్పన భవకుమార్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ ప్రారంభమైంది. ప్రకాశంజిల్లా కనిగిరిలో వైఎస్సార్సీపీ ఇంచార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ ఆద్వర్యం లో కొవొత్తుల ర్యాలీ చేపట్టారు. గిద్దలూరులో వైఎస్సార్సీపీ నాయకురాలు పిడతల సాయి కల్పనరెడ్డి ఆధ్వర్యంలో గంధీ విగ్రహాం నుంచి వైఎస్ఆర్ సర్కిల్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు అరికట్టడంలో చంద్రబాబు సర్కార్ వైఫల్యంపై అనంతపురం జిల్లా మడకశిరలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి ఆధ్వర్యంలో క్యాండీల్ ర్యాలీ చేపట్టారు. -
మహిళలపై దాడులకు నిరసనగా వైఎస్ఆర్సీపీ క్యాండిల్ ర్యాలీ
-
నెక్లెస్‌రోడ్డులో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన
-
పోరాటం ఉధృతం చేసిన వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఆందోళనను మరింత ఉధృతం చేసింది. వైఎస్సార్ సీపీ ఎంపీలు చేపట్టనున్న ఆమరణ దీక్షకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగబోతోంది. 6వ తేదీ(శుక్రవారం) సాయంత్రం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం గురువారం పిలుపునిచ్చింది. శనివారం నుంచి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని ఆదేశించింది. ప్రజా సంఘాలు, యువజన, విద్యార్థి సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించింది. ఢిల్లీకి చేరుకుంటున్న పార్టీ నేతలు ప్రత్యేక హోదా కోసం పదవులను త్యాగం చేసి, ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటున్న ఎంపీలకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనేక మంది ఢిల్లీ తరలివచ్చారు. పార్టీ సీనియర్ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, అనంత వెంకట్రామిరెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, డాక్టర్ అరుణ్‌కుమార్ తదితరులు ఢిల్లీ చేరుకున్నారు. శుక్రవారం ఉదయం ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఢిల్లీ చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. హోదా సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా కూడా వివిధ మార్గాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు పోరాటాలను ఉధృతం చేయనున్నాయి. -
ప్రత్యేక హోదా: ఏపీ ఫోటో జర్నలిస్ట్ క్యాండిల్ ర్యాలీ
-
హోదా కోసం కొవ్వొత్తుల ర్యాలీ
పటమట(విజయవాడ): ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరూ పార్టీలకతీతంగా పోరాడాల్సిన అవసరం ఉందని, హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రత్యేక హోదా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు అన్నారు. మంగళవారం ప్రత్యేక హోదా కోరుతూ వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కాంప్లెక్స్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. విభజన చట్టంలో పొందుపరచిన అంశాలు ఒక్కటి కూడా నెరవేర్చకపోవటం బాధాకరమన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని నాయకులు పదవుల్లో ఉన్నంతకాలం రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోనే ఉంటుందని అన్నారు. కార్యక్రంమలో వివిధ విద్యార్థి సంఘాల ప్రతినిధులు, పార్టీల నాయకులు పాల్గొన్నారు. మౌన ప్రదర్శన తెలుగుయువత నగర ఉపాధ్యక్షుడు బెజవాడ నజీర్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోరుతూ మౌన ప్రదర్శన జరిగింది. పటమట 9వ డివిజన్లోని పంటకాల్వ రోడ్డులో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్నికల ముందు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని విన్మరించిందని విమర్శించారు. ప్రత్యేకహోదాతోనే రాష్ట్రాభివృద్ధి చిలకలపూడి(మచిలీపట్నం): రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తేనే అభివృద్ధి చెందుతుందని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ తూర్పు కృష్ణాశాఖ అధ్యక్షుడు ఉల్లి కృష్ణ అన్నారు. సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేకహోదా సాధన కోసం స్థానిక ఎన్జీవో హోమ్ నుంచి కోనేరుసెంటరు వరకు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఉల్లి కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజించినప్పుడు చట్టంలో రూపొందించిన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాల్సి ఉందన్నారు. రాష్ట్రం లోటుబడ్జెట్లో ఉండటంతో కొత్త రాష్ట్రం కావటంతో ప్రత్యేక నిధులు ఇవ్వాలన్నారు. 8, 10 షెడ్యూల్లోని ఆస్తులను వెంటనే పంపిణీ చేయాలని విశాఖ రైల్వేజోన్‌ను ఏర్పాటు చేసి కడపకు ఉక్కు కర్మాగారం నిర్మాణానికి అనుమతి ఇవ్వాలన్నారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ తూర్పు కృష్ణా కార్యదర్శి దారపు శ్రీనివాస్, సంఘ నాయకులు కెఎ ఉమామహేశ్వరరావు, టి.నాగరాజు, లెనిన్‌బాబు, పీవీ సాయికుమార్, ఎ.శ్రీనివాసరావు, ఎల్వీ సూర్యకుమార్, ఎ.వెంకటేశ్వరరావు, రాజేంద్రప్రసాద్, వి.సీతారామ య్య, కె.గౌరి, ఎ.రమాదేవి పాల్గొన్నారు. -
హోదా కోసం డల్లాస్‌లో కొవ్వొత్తులతో నిరసన
డల్లాస్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర యువత ప్రత్యేక హోదా కోసం గణతంత్ర దినోత్సవం రోజున చేసిన నిరసనకి సంఘీబావంగా అమెరికాలోని వైఎస్ఆర్సీపీ డల్లాస్ విభాగం నేతలు డల్లాస్ మెట్రో అర్వింగ్ లో ఉన్న గాంధీ పార్కులో గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఎముకలు కొరికే చలిలో సైతం డల్లాస్ లో ఉన్న తెలుగువారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. కోడూరు కృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని విభజించేటపుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా చెప్పారని, గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఇస్తామంటే బీజేపీ 10 సంవత్సరాలు కావాలని అడిగారని గుర్తుచేశారు. టీడీపీ, బీజేపీ రెండూ కూడా ఎన్నికల సందర్భంగా 10-15 ఏళ్లు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడంతో పాటు వారి మేనిఫెస్టోలో కూడా చేర్చి నేడు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఇది తగదని చెప్పారు. రాష్ట్ర యువతకి ఉపాధి దొరకాలంటే పరిశ్రమలు రావాలని, పరిశ్రమలు రావాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉండాలన్నారు. ప్రత్యేక ప్యాకేజీ వల్ల రాజకీయ నాయకుల ప్యాకెట్లు నిండుతాయేమో కాని ప్రజలకు ఒనకురేదేమి లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నాయకులను, ఇతర రాజకీయ పార్టీ నేతలను కలుపుకొని అఖిల పక్షం ఏర్పాటు చేసి వీరిని డిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గరకు తీసుకెళ్ళి రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం ప్రయత్నించాలని డాక్టర్ పవన్ పామదుర్తి డిమాండ్ చేసారు. డాక్టర్ ఇస్మాయిల్ మాట్లాడుతూ.. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే రాజకీయ నాయకులు కావాలని మోదీ దగ్గర మోకరిల్లి స్వప్రయోజనాలకోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టవద్దని హితవు పలికారు. అన్నపూర్ణగా వర్దిల్లిన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసారని, ముఖ్యమంత్రి స్పందించి ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నాయకుడు చేసే పోరాటానికి మద్దతు ఇవ్వాలని లేకపోతే ప్రజలు మిమ్మల్ని క్షమించరని రమణ కిష్టపాటి, నరసింహా రెడ్డి టంగుటూరి, సుబ్బారెడ్డి కొండు, శివమణి అన్నపురెడ్డి సూచించారు. ఈ కార్యక్రమానికి కృష్ణారెడ్డి కోడూరు, డాక్టర్ పవన్ పామదుర్తి, బాస్కర్ గండికోట, కృష్ణమోహన్ రెడ్డి, రవి కోన, సుబ్బారెడ్డి కొండు, రమణ పుట్లూరు, డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ, రమణ పుట్లూరు, పల్గున రెడ్డి, డాక్టర్ రామిరెడ్డి, రఘు కుమ్మెత్త, శశి పల్లా, శ్రీనివాస్ బర్రె, రామకృష్ణ జాజుల, యుగంధర్ తిప్పిరెడ్డి, వెంకట్ తిప్పిరెడ్డి, రవితేజ సిద్ది, రమణ కిష్టపాటి, నరసింహా రెడ్డి టంగుటూరి, ఉమా మహేష్ కుర్రి, ఉమా మహేష్ పార్నపల్లి, శివ మణి అన్నపురెడ్డి, తిరుమల కంభం, ప్రబంద్ తోపుదుర్తి, రవి అరిమండ, శ్రీనివాసుల రెడ్డి వీరభద్ర, మహేష్ ఆదిబట్ల, శ్రీకాంత్ జొన్నల, చందు చింతల, అవినాష్, ప్రవీణ్, హేమంత్ నల్లా, వెంకటరెడ్డి, దేవేందర్, సుధాకర్ విప్పాల, మోహన్ మల్లంపాటి తదితరులు పాల్గొన్నారు. -
హోదాకోసం పోరు ఇది ఆరంభం మాత్రమే
-
మార్మోగిన ‘హోదా’ నినాదాలు
-
కలసికట్టుగా పోరాడదాం రండి
రాజకీయ పార్టీలకు వైఎస్ జగన్ పిలుపు ►ప్రత్యేకహోదాకు చంద్రబాబు వెన్నుపోటు ►నిరసనగా నేడు అన్ని మండల కేంద్రాల్లో ఆందోళన ►పోలీసులకు జీతాలిస్తున్నది ప్రభుత్వమే కాని చంద్ర బాబు కాదు ►సెల్యూట్ కొట్టాల్సింది సింహాలకు... గుంట నక్కలకు కాదు ►విద్యార్థులపై కేసులా... ప్రతి కేసునూ ఎత్తివేస్తాం ►చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపే రోజు త్వరలోనే ►రానున్న ప్రజా ప్రభుత్వంలో అన్నిటిపైనా విచారణ సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, సాక్షి, హైదరాబాద్ : ‘‘జల్లికట్టు అనేది ఆటే కావచ్చు... కానీ ఆ ఆటను కొనసాగించుకోవడానికి అందరూ కలిసికట్టుగా సాధించుకున్నా రు. దానిని స్ఫూర్తిగా తీసుకుని మనం అందరం ఒక్క తాటిపైకి వచ్చి కలిసికట్టుగా పోరాడదాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించుకుందాం. పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమాన్ని అడ్డుకున్న తీరుకు నిరసనగా, ప్రత్యేక హోదా సాధన ఉద్యమంలో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో నిరసన ఆందోళనలు నిర్వహిద్దాం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో గురువారం జరిగే కొవ్వొత్తుల ర్యాలీ లో పాల్గొనడానికి అక్కడి ఎయిర్‌పోర్టులో విమానం దిగిన వెంట నే జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు విజయసాయి రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, నాయకులు అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు చుట్టుముట్టి బయటకు అడుగు కూడా వేయనీయకుండా అడ్డుకున్న సంగతి తెలిసిందే. విశాఖ నుంచి హైదరాబాద్ రాత్రి 8.30 గంటలకు చేరుకున్న జగన్ తన నివా సం వద్ద విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదాకు అడుగడు గునా అడ్డుతగులుతున్న చంద్రబాబును చూసి సిగ్గుతో తలదిం చుకోవాల్సి వస్తోందని, పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ఆయనేమన్నారంటే... ప్రత్యేక హోదాకు చంద్రబాబు వెన్నుపోటు... ప్రత్యేక హోదా కోసం ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. రాష్ట్రంలో ఉద్యోగం కోసం వెతుకుతున్న వారు, చదువుతున్న విద్యార్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ చంద్రబాబు పుణ్యాన పరిశ్రమలు మూతపడుతున్నాయి. రాష్ట్రంలోని 1.06 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలుండగా... వాటిలో 26 వేలు మూతపడ్డాయని కేపీఎంజీ, ఆర్బీఐ లాంటి సంస్థలు నివేదికలు ఇస్తున్నాయి. ఉద్యోగాలు కల్పించడం మాట దేవుడెరుగు.. వరుసగా ఉద్యోగాలు పోతున్నాయి. కొత్త ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదా ఒక సంజీవని అని తెలిసినా చంద్రబాబు పట్టించుకోవడంలేదు. ప్రత్యేకహోదా కోసం ఎవరు నినదించినా, ఎవరు పోరాటం చేసినా ఉక్కుపాదంతో అణచివేయాలన్నట్లుగా వ్యవహరించారు. ముఖ్యమంత్రిగా ప్రత్యేకహోదాకోసం పోరాడాల్సిన వ్యక్తే పార్లమెంటు సాక్షిగా విభజన నాడు ఇచ్చిన హామీకి వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు ఉండటం బాధాకరం. చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. రాజ్యాంగం ప్రకారం రిపబ్లిక్ డేగా ప్రకటించుకుని 68 సంవత్సరాలు అయిన రోజున ప్రత్యేక హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా, వైజాగ్‌లో శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ చేస్తుంటే ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేశారు. ప్రత్యేకహోదా అన్న డిమాండ్‌ను కేంద్రప్రభుత్వానికి, రాష్ట్రప్రభుత్వానికి గుర్తుచేయడం కోసం గాంధేయ పద్ధతిలో సాగుతున్న యువకులను నిర్దాక్షిణ్యంగా అణచివేశారు. కాకినాడ, తిరుపతి, అనంతపురం, విశాఖపట్నంలో విద్యార్థులను దారుణంగా కొట్టారు... కేసులు పెట్టారు. వైఎస్సార్సీపీ నాయకులను హౌస్అరెస్ట్ చేశారు. సీపీఎం నేత మధును శ్రీకాకుళంలో అరెస్టు చేశారు. ఇవన్నీ చంద్రబాబు చేయాల్సిన పనులేనా అని అడుగుతున్నా. పోలీసులూ సెల్యూట్ చేయాల్సింది సింహాలకు... విమానాశ్రయంలో విమానం దిగిన వెంటనే రన్‌వే మీదనే మమ్మల్ని అడ్డుకున్నారు. మేమున్నది ఐదారుగురమే అయినా వందలకొద్దీ పోలీసులు అడ్డుకున్నారు. ప్రతిపక్షనాయకుడు, ఇద్దరు ఎంపీలు, ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నారని కూడా చూడలేదు. సాధారణ ప్రయాణికుడికి కూడా దేశీయ మార్గం ద్వారా బైటకు వెళ్లే హక్కు ఉంటుంది. విమానాశ్రయం సీఐఎస్ఎఫ్ అధీనంలో ఉంటుంది. పోలీసులకు సంబంధమే ఉండదు. కానీ పోలీసులు లోనికి ప్రవేశించి మమ్మల్ని అడ్డుకున్నారు. డొమెస్టిక్ టెర్మినల్ వద్దనే రెండు గంటలసేపు నిర్బంధించారు. అక్కడే మేం ధర్నాలు చేయాల్సి వచ్చింది. మీకు జీతాలిస్తున్నది ప్రభుత్వమే గానీ చంద్రబాబు కాదని పోలీసు అధికారులకు చెబుతున్నా. మీరు సెల్యూట్ కొట్టాల్సింది మీ నెత్తిపైనున్న మూడు సింహాలకే తప్ప, వాటి వెనుకనున్న గుంటనక్కలకు కాదు. చంద్రబాబే ఎల్లకాలం ఉంటాడని అనుకోవద్దు. దయచేసి ప్రజల పక్షాన నిలబడండి. ప్రజలకు అండగా నిలబడండి. పిల్లలు, నాయకులు రాష్ట్ర భవిష్యత్ కోసం ఆరాటపడుతున్నారు. అందులో పోలీసుల పిల్లల భవిష్యత్ కూడా ఉంది. కొంతమంది పోలీసు అధికారులు చంద్రబాబు మనుషుల్లా వ్యవహరిస్తున్నారు. నిజంగా వీటన్నిటి మీద కచ్చితంగా విచారణ జరుగుతుంది. తగిన సమయం వచ్చినపుడు బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ప్రతి పిల్లాడికీ తోడుగా ఉంటా చదువుకుంటున్న పిల్లలపై కేసులు పెడుతున్నారు. కేసులకు ఎవ్వరూ భయపడవద్దు. ప్రతిపిల్లాడికి తోడుగా ఉంటాం. రెండేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోతుంది... ప్రజల ప్రభుత్వం వస్తుంది. ఈ కేసులన్నీ తీసేస్తాం. ప్రత్యేక హోదాను ఖూనీ చేసిన, ఇంకా చేస్తున్న చంద్రబాబు నాయుడ్ని దేవుడు, ప్రజలు క్షమించరు. ఆయన్ను బంగాళాఖాతంలో కలిపే రోజు త్వరలోనే వస్తుంది. ప్రత్యేక హోదాకు అడ్డు తగులుతున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా రేపు నిరసన వ్యక్తం చేయాలని కోరుతున్నా. ప్రత్యేక హోదా మన శ్వాస... ప్రత్యేకహోదా అన్నది మన శ్వాస. మనకు రాజ్యాంగబద్ధంగా ఇస్తామన్న హామీ. దాన్ని నీరు గార్చడానికి మనం ఒప్పుకోకూడదు. అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా... అందరం ఒకటవుదాం... కలిసికట్టుగా పోరాడదాం... ప్రత్యేకహోదాను సాధించుకుందాం. చంద్రబాబునాయుడు లాంటి వ్యక్తిని బంగాళాఖాతంలో కలిపేద్దాం. తమిళనాడులో జల్లికట్టుకు, ఇక్కడి హోదా ఆందోళనకు సంబంధం లేదని చంద్రబాబు, ఆయన మంత్రులు వెటకారంగా మాట్లాడుతున్నారు. అది జల్లికట్టు కాదు... కలిసికట్టు. ముఖ్యమంత్రి నుంచి సామాన్యుడి వరకూ కలిసికట్టుగా ఉద్యమించి, పోరాడి సాధించుకున్నారు. సా«ధ్యం కాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అలాగే సాధించుకున్నారు. అదే స్ఫూర్తితో మనమూ ఉద్యమించి ప్రత్యేకహోదాను సాధించుకుందాం. చంద్రబాబులాంటి ముఖ్యమంత్రి ఉండి ఉంటే... మనకు స్వాతంత్య్రం కూడా వచ్చేది కాదు. ఇలాంటి ముఖ్యమంత్రి పోతేనే మంచి జరిగేది. గతంలో జాబు రావాలంటే బాబు రావాలని అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం జాబు రావాలంటే బాబు పోవాలి. ఇందుకు అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాం. చంద్రబాబు, సుజనా చౌదరి... అసలు వీరంతా మనుషులేనా అనిపిస్తోంది. రాష్ట్రాన్ని విడగొట్టేప్పుడు ప్రత్యేక హోదా అయిదు కాదు 15 ఏళ్లు కావాలని అడగలేదా? పరిశ్రమలు కట్టడానికే రెండు, మూడు సంవత్సరాలు పడుతుంది. అయిదేళ్లు హోదా ఏం సరిపోతుందని వెంకయ్యనాయుడు లాంటి వారు మాట్లాడలేదా? పార్టీల మేనిఫెస్టోల్లో ఇవన్నీ చెప్పలేదా? ఎన్నికలు, ప్రజలతో పని అయిపోయిన తరువాత ఇన్ని మోసాలు, అబద్ధాలా? ఇలాంటి వారు నాయకులని చెప్పుకోవడానికే సిగ్గుపడాలి. -
ప్రత్యేక హోదాను పోరాడి సాధించుకుంటాం
అనంతపురం అర్బన్ : ప్రత్యేక హోదా ఆంధ్రులు హక్కు... దానిని పోరాడి సాధించుకుంటామని ప్రత్యేక హోదా సాధన సమతి నాయకులు తెలిపారు. గురువారం నగరంలో ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్, సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు దాదాగాంధీ, ఎస్కేయూ ప్రొఫెసర్ సదాశివరెడ్డి, మహిళ సమాఖ్య జిల్లా కార్యదర్శి పద్మావతి, నాయకులు జాఫర్, మల్లికార్జున, తదితరులు పాల్గొని మాట్లాడారు. విభజన హామీని కేంద్రం విస్మరించి ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పిందన్నారు. హోదా సాధనకు కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన చంద్రబాబు నాయుడు తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను మోదీ వద్ద తాకట్టు పెట్టారని మండిపడ్డారు. -
వైఎస్ జగన్‌కు మద్దతుగా తల్లి, భార్య..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో గురువారం కొవ్వొత్తులతో ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కుటుంబ సభ్యులు సంఘీభావం ప్రకటించారు. హైదరాబాద్‌లోని వైఎస్ జగన్ నివాసంలో ఆయన తల్లి, వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆయన భార్య వైఎస్ భారతీరెడ్డి కొవ్వొత్తులు వెలిగించి ఆయనకు మద్దతు ప్రకటించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విశాఖపట్నం విమానాశ్రయంలో నిర్బంధించిన సమయంలో ఆయనకు సంఘీభావంగా, ఆయన ఇచ్చిన పిలుపునకు అనుగుణంగా ఈ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని వారు కోరారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ జగన్ చేస్తున్న పోరాటం ఫలించాలని, ప్రత్యేక హోదా రావాలని, దీనివల్ల ప్రజలందరికీ మేలు జరగాలని విజయమ్మ, భారతీ రెడ్డి ఆకాంక్షించారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలని కోరుతూ, వైఎస్ జగన్ పిలుపు మేరకు ఏపీ వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలు కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ ఆదేశిస్తే.. రాజీనామాకు సిద్ధం
తిరుపతి: ప్రత్యేక హోదా కోసం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశిస్తే.. రాజీనామాకు పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధమని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతిలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ... ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, రాజకీయ ప్రయోజనాలు కాదు.. రాష్ట్ర అభివృద్థే ముఖ్యమన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనలు చేశారు. దానివల్ల ఏం ప్రయోజనం వచ్చిందో తెలపాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కేంద్రం ఇచ్చి వుంటే రాష్ట్రం ఎంతో లబ్ది పొందేదని, ప్యాకేజీ వల్ల ఏం ప్రయోజనం ఉందని ప్రశ్నించారు. శాంతియుతంగా చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీ పట్ల ప్రభుత్వం అణచివేత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. కేసుల భయం వల్లే ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను వీడి అమరావతికి చంద్రబాబు మకాం మార్చారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను సీఎ చంద్రబాబు కేంద్రం ముందు తాకట్టు పెట్టాడని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. మట్టి, ఇసుక అమ్ముకుంటున్నారు.. రైతులు భూములు లాక్కుంటున్న సీఎంకు తగిన బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు. -
బాబూ.. మీ జేబులు నింపుకోడానికా?
-
పోలీసులో.. గూండాలో కూడా తెలీదు
-
చంద్రబాబూ.. మీ జేబులు నింపుకోవడానికా?
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించాలని పార్టీలు, యువత, మహిళలు, రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, అన్ని వర్గాలవారు కోరుకుంటుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గణతంత్ర దినోత్సవం రోజున ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి విమర్శించారు. చంద్రబాబు సీనియర్ నాయకుడిగా ఉండి ఇలా వ్యవహరించడం దారుణమని ఆమె అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనకుండా పోలీసులు నాయకులను, ప్రజలను అడ్డుకోవడంపై ఆమె నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో బీజేపీ నేత వెంకయ్య నాయుడుతో కలిసి ప్రచారంలో పాల్గొంటూ.. ప్రత్యేక హోదా సాధిస్తే తప్ప ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయలేమని ప్రగల్భాలు పలకలేదా? మేనిఫెస్టోలో రాయలేదా అని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు ప్రతిపక్షాల పట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం ప్రజలు రెండున్నరేళ్లుగా పోరాడుతున్నారని చెప్పారు. అసెంబ్లీలో రెండుసార్లు హోదా కోసం తీర్మానం చేయలేదా అని ప్రశ్నించారు. అలాంటిది చంద్రబాబు ప్యాకేజీని ఎందుకు అంగీకరించారని, మీ జేబులు నింపుకోవడానికా అని మండిపడ్డారు. గిరిజనులకు ఏం సాధించిపెట్టారని చంద్రబాబును నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడం కోసం ప్రజలంతా ఉద్యమరూపంలోకి వచ్చారని, శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తామని గిడ్డి ఈశ్వరి చెప్పారు. -
విశాఖలో వైఎస్ జగన్ నిర్బంధం
-
వాళ్లు పోలీసులో.. గూండాలో కూడా తెలీదు
విమానం దిగగానే తమను పోలీసులు అడ్డుకున్నారని, వ్యాన్ ఎక్కమని చెప్పారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. రన్‌వే మీదనే తమను అడ్డుకున్నారని, స్థానిక పోలీసులు మఫ్టీలో వచ్చి అక్కడ ఆపారని అన్నారు. అసలు మఫ్టీలో వచ్చామంటున్న వాళ్లు పోలీసులో గూండాలో కూడా తమకు తెలియడంలేదని ఆయన అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆయన, ఎంపీలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మరికొందరు నాయకులు విశాఖ విమానాశ్రయం రన్‌వే మీద బైఠాయించారు. అసలు అక్కడకు వచ్చింది స్థానిక పోలీసులు అయినా, వాళ్లు రన్‌వే మీదకు రావడమే తప్పన్నారు. ఇదంతా చాలా అప్రజాస్వామికంగా జరుగుతోందని, చివరకు అసలు ప్రయాణికుల లాంజ్ వద్దకు కూడా తమను వెళ్లనివ్వలేదని ఆయన చెప్పారు. ప్రివెంటివ్ ఆర్డర్లు ఉన్నాయని, 144 సెక్షన్ అమలులో ఉందని అంటున్నారని రాంబాబు అన్నారు. -
విశాఖలో రన్ వేపై బైఠాయించిన జగన్
-
విశాఖలో వైఎస్ జగన్ నిర్బంధం, రన్ వేపై బైఠాయింపు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో నిర్వహించనున్న కొవ్వొత్తుల ర్యాలీలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొనకుండా చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోంది. గురువారం సాయంత్రం విశాఖపట్నం వెళ్లిన వైఎస్ జగన్‌ను విమానాశ్రయం రన్ వేపైనే పోలీసులు అడ్డుకున్నారు. ఇందుకు నిరసనగా ఆయన రన్ వేపై బైఠాయించారు. విమానాశ్రయంలోనే పోలీసులు వైఎస్ జగన్‌ను నిర్బంధించారు. ఆయన వెంట పార్టీ నేతలు విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు తదితరులు ఉన్నారు. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ సీపీ శ్రేణులు నినాదాలు చేశారు. వైఎస్ జగన్ రాక నేపథ్యంలో విమానాశ్రయ పరిసరాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎయిర్‌పోర్టుకు కిలోమీటరు దూరం వరకు నిషేధాజ్ఞలు విధించారు. ఎయిర్ పోర్టు పరిసరాల్లో వైఎస్ఆర్ సీపీ నాయకుల్ని, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కొవ్వొత్తుల ర్యాలీ ప్రారంభం కావాల్సి ఉంది. -
విశాఖ చేరుకున్న వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నుంచి కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. వైఎస్ జగన్ రాక నేపథ్యంలో విమానాశ్రయ పరిసరాల్లో భారీగా బందోబస్తును ఏర్పాటుచేశారు. సాయంత్రం 6 గంటలకు కొవ్వొత్తుల ర్యాలీ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే పోలీసులు ముందుగానే జగన్ కాన్వాయ్‌ని అడ్డగించి, ఆయన సెక్యూరిటీ సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. విమానాశ్రయ పరిసరాల్లో కూడా భారీగా పోలీసులను మోహరించారు. ఎయిర్‌పోర్టుకు కిలోమీటరు దూరం వరకు నిషేధాజ్ఞలు విధించారు. -
భయానక వాతావరణం సృష్టిస్తున్నారు
-
ఆరు నూరైనా కొవ్వొత్తులు వెలిగిస్తాం
-
హోదాను పోలీసుల ఆంక్షలు నీరు గార్చలేవు
-
ప్రత్యేక హోదా.. సిక్కోలుకు సంజీవనే!
‘ఇవ్వబోమన్న కేంద్రం మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారు. మనకు కేంద్రమే హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా అడిగి సాధించుకోలేమా? వచ్చేవరకూ పోరాడుదాం. ఇచ్చినవారికే మద్దతు ఇద్దాం...’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం రోజు గురువారం కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా ఆంధ్రుల ప్రత్యేక హోదా ఆకాంక్షను బలంగా చాటాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ శ్రేణులు స్పందించాయి. సిక్కోలు జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో సాయంత్రం ఐదు గంటలకు సూర్యమహల్ జంక్షన్ నుంచి ఏడు రోడ్ల జంక్షన్ వరకూ కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీ నిర్వహించడానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలతో పాటు రాజకీయాలకు అతీతంగా యువత పాల్గొని విజయవంతం చేయాలని, ప్రత్యేక హోదా తమ హక్కు అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గట్టిగా వినిపించాలని పార్టీ నేతలు కోరారు. సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: తమ సంప్రదాయ క్రీడ జల్లికట్టును నిషేధిస్తే తమిళ యువత పోరాడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుకూల ఆదేశాలు సాధించుకున్న తార్కాణం పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో చూశాం. విషయం ఏదైనా పోరాటాన్ని మాత్రం స్ఫూర్తిగా తీసుకొని ప్రత్యేక హోదా కోసం నినదించాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్సార్ సీపీ సహా విపక్షాలన్నీ పిలుపునిస్తున్నాయి. అయితే విప్లవాలకు పురుటిగడ్డ సిక్కోలువాసుల్లో ఆ స్ఫూర్తి కొత్తకాదు. స్వాతంత్య్ర పోరాటం నుంచి రైతు ఉద్యమాల వరకూ తనదైన ముద్ర వేసుకున్న గడ్డ ఇది. కానీ వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ఇప్పటికీ జిల్లాది వెనుకబాటుతనమే. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ, తెస్తామన్న టీడీపీ ప్రత్యేక ప్యాకేజీ పల్లవి ఎత్తుకున్నాయి. ప్రత్యేక హోదా ఎంత అవసరమో వైఎస్ జగన్మోహన్రెడ్డి గత నవంబరులో విశాఖలో జరిగిన ‘జై ఆంధ్రప్రదేశ్’ సభలో గణాంకాల సహా వివరించి యువతను ఆకట్టుకున్నారు. కానీ టీడీపీ ప్రభుత్వ ఆలోచన ప్యాకేజీలతో తృప్తిపడిపోతోంది. తీరా అవీ సక్రమంగా అందని పరిస్థితి. ఈ నేపథ్యంలో కొవ్వొత్తుల ర్యాలీతో మరో ఉద్యమానికి వైఎస్సార్ సీపీ తెరతీసింది. టీడీపీ ప్రభుత్వం చేసిందేమిటి?... సుమారు 5,837 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న సిక్కోలు జనాభా 28 లక్షల పైమాటే. నాగావళి, వంశధార, మహేంద్ర తనయ, బాహుదా నదులున్నా ఇప్పటికీ జిల్లాలోని నాలుగు లక్షల హెక్టార్లలో వ్యవసాయం ఎక్కువగా వర్షాధారమే. 192 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్నా చెప్పుకోదగిన పోర్టు జిల్లాలో ఒక్కటీ లేదు. కళింగపట్నం, భావనపాడు పోర్టులను భారీ స్థాయిలో నిర్మాణం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాకొచ్చిన ప్రతిసారి హామీలిస్తున్నా ఇప్పటికీ కొలిక్కిరాలేదు. ప్రభుత్వాధీనంలో ఏర్పాటు చేయాల్సిన భావనపాడు పోర్టును ప్రైవేట్ సంస్థ అదానీకి అప్పగించేసింది. భూసేకరణ ఇంకా పూర్తికాలేదు. జపాన్ సంస్థ ఆర్థిక సహాయంతో పోలాకిలో థర్మల్ విద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేస్తామని టీడీపీ రెండేళ్లుగా చెబుతున్నా ఇప్పటికీ పత్తా లేదు. చివరకు కాకరాపల్లి థర్మల్ విద్యుత్తు కేంద్రం పనులు కూడా అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈస్ట్‌కోస్ట్ సంస్థ చేతులెత్తేయ్యాల్సిన పరిస్థితి ఏర్పడటానికీ టీడీపీ నాయకుల వైఖరి కారణమనేది బహిరంగ రహస్యమే. ఇక సోంపేటలో ఎన్సీసీ థర్మల్ విద్యుత్తు కేంద్రం కోసం సేకరించిన 2 వేల ఎకరాల్లో ఫుడ్‌ప్రాసెసింగ్, అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్, ఆక్వా పరిశ్రమల ఏర్పాటుకు కేటాయిస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఆ భూములను ఎన్సీసీ మళ్లీ చేజిక్కించుకొని ప్రమాదకరమైన పరిశ్రమల ఏర్పాటు కోసం ఇచ్చేస్తుందేమోన్న సందేహాలు స్థానిక ప్రజల్లో నెలకొన్నాయి. పొందూరు దగ్గర కొండపై ఐటీ టవర్స్ కడతామని ప్రభుత్వం ప్రకటించినా ఆ దిశగా చర్యలే లేవు. పైడిభీమవరం పారిశ్రామికవాడకు ప్రత్యామ్నాయంగా రాజాం, పలాసల్లో పారిశ్రామికవాడలు అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పినా జిల్లాలో ఉన్న పారిశ్రామికవాడల్లోనే లక్షల చదరపు మీటర్ల భూమి ఖాళీగాఉంది. చివరకు ఆమదాలవలస చక్కెర కర్మాగారాన్ని తిరిగి సహకార రంగంలోనే తెరిపిస్తామని హామీలిచ్చి గత ఎన్నికలలో పబ్బం గడుపుకున్న టీడీపీ నాయకులు... ఇప్పుడు దాని ఉనికికే గండికొట్టారు. కర్మాగారం భూములన్నీ ఏపీఐసీసీకి బదలాయించేసి రైతుల కంట్లో మట్టికొట్టిన సంగతి జిల్లా ప్రజలకు ఎరుకే! ప్రత్యేక హోదాతో జిల్లాకు మేలు.... రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే కేంద్రం నుంచి దండిగా నిధులొస్తాయి. వాటితో జిల్లాలో వంశధార, నాగావళి నదులపై పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి అవుతాయి. ప్రస్తుతం వంశధార నదిపై హిరమండలం వద్ద తలపెట్టిన వంశధార ప్రాజెక్టు నిధుల్లేక పనులు నత్తనడకన సాగుతున్నాయి. ►నైరాలో జాతీయ వరి పరిశోధన కేంద్రం గత ఏడాది మంజూరైంది. ఇది ఏర్పాటైతే మేలైన దిగుబడి ఇచ్చే వరి వంగడాలు రైతులకు సమకూరతాయి. వరిసాగును విస్తృతం చేయడానికి అవకాశం ఉంటుంది. ►కొబ్బరి, జీడిమామిడి ఉత్పత్తులను రైతులు దళారులకు విక్రయించడమే తప్ప వాటిని వాణిజ్య తరహాలో వినియోగించుకొనే అవకాశం లేదు. ప్రత్యేక హోదాతో లభించే రాయితీలతో కొబ్బరి, జీడిమామిడి ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. ►జిల్లాలోని విస్తారమైన అటవీ ప్రాంతంలో అనేక రకాలైన అటవీ ఉత్పత్తులు, ఔషధ మూలికలు లభిస్తున్నాయి. వాటి ఆధారిత పరిశ్రమలు జిల్లాలో లేవు. ఐటీడీఏ కేవలం మార్కెటింగ్‌కు మాత్రమే పరిమితమవుతోంది. అలాగాకుండా ఆయా అటవీ ఉత్పత్తుల ఆధారిత పరిశ్రమలు వస్తాయి. ► జిల్లాలో కళింగపట్నం, భావనపాడు ఓడరేవులను అభివృద్ధి చేస్తే జీడిమామిడి, కొబ్బరి, వరి ఉత్పత్తులతోపాటు పారిశ్రామిక ఉత్పత్తులు, గ్రానైట్ ఎగుమతులకు ప్రోత్సాహం లభిస్తుంది. ► జిల్లాలో ప్రస్తుతం గ్రానైట్ పరిశ్రమ అంతా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ఉంది. ప్రత్యేక హోదా ద్వారా గ్రానైట్ పాలిష్డ్ పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. ► పదివేల మత్స్యకార కుటుంబాలు జిల్లాలో ఉన్నాయి. ప్రత్యేక హోదా వస్తే మత్స్య సంపద ఆధారిత పరిశ్రమలు, చేపల శీతల నిల్వ కేంద్రాలు ఏర్పాటవుతాయి. ► సోంపేట థర్మల్ విద్యుత్తు కేంద్రం రద్దయిన నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే అక్కడున్న వెయ్యి ఎకరాల్లో వాణిజ్య తరహాలో అగ్రికల్చర్, ఆక్వా, డెయిరీ, పౌల్ట్రీ పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి అవకాశం ఏర్పడుంది. ► జిల్లాలో పైడిభీమవరం పారిశ్రామికవాడ ఒక్కటే ఉంది. అదీ ఫార్మా కంపెనీలకే పరిమితం. రణస్థలం పరిసర ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్నా ఆ దిశగా ప్రయత్నాలు జరగట్లేదు. ప్రత్యేక హోదా వస్తే జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటవుతాయి. ► ఆమదాలవలసలో సహకార చక్కెర కర్మాగారం, రావివలసలో ఫెర్రో అల్లాయిస్ కంపెనీ, రాజాంలో నూలు పరిశ్రమలతో పాటు జిల్లాలో ఎనిమిది జూట్ మిల్లులు మూతపడ్డాయి. ప్రత్యేక హోదా ద్వారా రాయితీలు, గ్రాంట్లు వస్తే ఇలాంటి పరిశ్రమలన్నీ తిరిగి ప్రారంభమవుతాయి. -
ఆరు నూరైనా కొవ్వొత్తులు వెలిగిస్తాం
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వం, పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా, ఆరు నూరైనా కొవ్వొత్తుల ర్యాలీ శాంతి యుతంగా నిర్వహించి తీరుతామని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనా రాయణ స్పష్టం చేశారు. విశాఖలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా డిమాండ్‌తో గురువారం సాయంత్రం ఆరుగంటలకు ఆర్కే బీచ్ నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు జరిగే కొవ్వొత్తుల ర్యాలీలో తమ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటారని తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి సాయంత్రం 4.15 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారని, అక్కడి నుంచి నేరుగా బీచ్ రోడ్డుకు వస్తారని ఆయన వివరించారు.కుట్రలుంటాయి జాగ్రత్త... ప్రత్యేక హోదాను వ్యతిరేకించే కొన్ని శక్తులు ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకు, ఉద్యమాన్ని విఫలం చేసేందుకు కుట్రలు పన్నే అవకాశం ఉందని అలాంటి వాటికి లొంగకుండా జాగ్రత్తగా గమనించాలని బొత్స సూచించారు. హోదా కోసం పోరాడాల్సింది పోయి.. చేస్తున్నవారిని అణచి వేయాలని ప్రభుత్వం చూస్తోందని, ప్రజల బాగు కోరుకుంటే ఉద్యమానికి అడ్డుపడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎలాంటి పరిణామాలకైనా తాము బాధ్యత వహిస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినా అనుమతి ఎందుకు నిరాకరిస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశమంతా రెడ్ అలెర్ట్ ప్రకటించాం కాబట్టి శాంతియుత ర్యాలీలు కూడా చేయకూడదంటే శాంతి భద్రతలు విఫలమైనట్టేనన్నారు. తామేమీ ఆయుధాలు చేతపట్టి ఉద్యమం చేయడం లేదని, చీకటిలో ఉన్న రాష్ట్రానికి వెలుగులు నింపాలనే ఉద్దేశంతో కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తున్నామని చెప్పారు. ఉదయం పూట గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆటంకం లేకుండా ఉండాలనే తాము సాయంత్రం వేళ ప్రదర్శన ఏర్పాటు చేశామని వివరించారు. భాగస్వామ్య సదస్సులో గతేడాది చేసుకున్న ఒప్పందాల్లో 40 శాతం పెట్టుబడులు వచ్చాయని సీఎం చెబుతున్న మాటలకు ఆధారాలు చూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని బొత్స సవాల్ చేశారు. కొవ్వొత్తుల ర్యాలీకి పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాలని కోరారు. -
ర్యాలీ అనుమతి కోసం దరఖాస్తు చేశాం
ఆధారమిదిగో.. ఆంగ్ల మీడియాతో జగన్ సాక్షి, హైదరాబాద్ : ప్రత్యేక హోదా సాధన కోసం విశాఖపట్టణంలో తలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీ కోసం తమను ఎవరూ సంప్రదించలేదని పోలీసు అధికారులు చెప్పడంలో నిజం లేదని తాము ఈ నెల 23వ తేదీనే అనుమతి కోరుతూ దరఖాస్తు చేశామని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆయన బుధవారం ఆంగ్ల మీడియా ప్రతినిధులడిగిన ప్రశ్నలకు సమాధానంగా కొవ్వొత్తుల ర్యాలీకి అనుమతి కోరుతూ పోలీసులకు చేసుకున్న దరఖాస్తు ప్రతిని స్వయంగా చూపించారు. తాను విశాఖ ర్యాలీలో పాల్గొని తీరతానని ఆయన స్పష్టం చేశారు. అన్ని విధాలా గ్రోత్ ఇంజన్‌గా, ఉమ్మడి రాష్ట్రానికి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను ఆంధ్రప్రదేశ్ కోల్పోతున్నందుకే ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాడు పార్లమెంటులో హామీ ఇచ్చారని జగన్ పేర్కొన్నారు. 90 శాతానికి పైగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ హైదరాబాద్‌లోనే కేంద్రీకృతం అయి ఉన్నాయని అంతే కాక పారిశ్రామిక తయారీ రంగం, సేవారంగాలు కూడా 70 శాతానికి పైగా హైదరాబాద్‌లోనే ఉన్నాయని ఆయన అన్నారు. ఈ స్థాయిలో ఏపీ కూడా అభివృద్ధి చెందాలంటే అనివార్యంగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఫార్మారంగం కూడా హైదరాబాద్‌లోనే ఉందన్నారు. జల్లికట్టు కోసం తమిళనాడు ముఖ్యమంత్రి మొత్తం రాజకీయ పక్షాలను ఢిల్లీకి తీసుకెళ్లారని, హోదా కోసం చంద్రబాబు కూడా అలాగే చేయాలని ఆయన అన్నారు. -
చంద్రబాబూ.. రా కలసి పోరాడదాం
విశాఖ కొవ్వొత్తుల ర్యాలీకి వెళుతున్నా మీరూ రండి.. ఏపీ సీఎంకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పిలుపు ► కాదని అరెస్టు చేస్తారో.. ఇంకేం చేస్తారో మీ ఇష్టం! ► శాంతియుత ప్రదర్శనలపై ఆంక్షలేమిటి? ► ప్రత్యేక హోదాపై అబద్ధాలు ఇకనైనా ఆపండి ► కుంభకోణాల్లో కూరుకుపోయి కేంద్రానికి హోదా తాకట్టు ► లక్షల కోట్ల పెట్టుబడుల ప్రచారం బూటకం సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రత్యేక హోదా కోసం విశాఖపట్టణంలో ఈ నెల 26న సాయంత్రం జరిగే కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనడానికి వెళుతున్నా.. అరెస్టు చేస్తారో.. ఇంకేం చేస్తారో.. మీ విజ్ఞతకే వదలి వేస్తున్నా. ఈ ర్యాలీకి మీరు కూడా రండి కలసి పోరాడదాం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పిలుపునిచ్చారు. విభజన జరిగేటపుడు పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీపై కేంద్రంతో గట్టిగా పోరాడి సాధించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రజలు.. ముఖ్యంగా యువత పోరాడుతుంటే అణచివేయాలని చూడడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాకు సంబంధించినవన్నీ ‘ప్రత్యేక ప్యాకేజీ’లో వచ్చేశాయని చంద్రబాబు చెబుతున్నవన్నీ అబద్దాలేనన్నారు. ప్రత్యేకహోదా కార్యక్రమాలలో పాల్గొనే విద్యార్ధినీవిద్యార్థులపై పీడీ చట్టం ప్రయోగించాలని చంద్రబాబు ఆదేశించడంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టుపెట్టి రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నందుకు చంద్రబాబుపైనే ‘టాడా’ కింద కేసు నమోదు చేయాలని, ఆయన్నే జైల్లో పెట్టాలని జగన్ వ్యాఖ్యానించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తర్వాత ఎంపీలందరిచేత రాజీనామా చేయిస్తామని జగన్ స్పష్టంచేశారు. ప్రత్యేక హోదా కోరుతూ శాంతియుత పోరాటానికి సన్నద్ధమవుతున్న విద్యార్థులు, యువకులు, సాధారణ ప్రజలపై రాష్ట్రప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ అణచివేతకు పూనుకుంటున్న నేపథ్యంలో జగన్ బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. వివరాలు జగన్ మాటల్లోనే...... ముఖ్యమంత్రే తొక్కేయడం బాధాకరం ‘మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని దేశానికంతటికీ చాటి చెప్పేందుకు ఈనెల 26న రాష్ట్ర ప్రజలంతా సన్నద్ధం అవుతూ ఉంటే కట్టడి చేసేందుకు , ప్రత్యేక హోదాను తొక్కేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ముందడుగు వేయడం బాధ కలిగిస్తోంది. రాష్ట్రాన్ని విడగొట్టేటపుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని అమలు చేయండని గట్టిగా ఒత్తిడి తీసుకు రావాల్సిన ముఖ్యమంత్రే స్వయంగా రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూ ఉంటే గుండె తరుక్కు పోతోంది. ప్రత్యేక హోదాలోని అంశాలన్నీ ప్యాకేజీలో వచ్చాయి కాబట్టే హోదా అంశాన్ని వదలి వేశామని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. ప్రత్యేక హోదా ఉంటేనే పారిశ్రామిక రాయితీలు, వంద శాతం ఆదాయపు పన్ను, వంద శాతం ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు ఉంటాయి. జీఎస్టీ నుంచి కూడా మినహాయింపు ఉంటుంది. అలాగే పారిశ్రామికవేత్తలకు రవాణా ఛార్జీలను తిరిగి చెల్లిస్తారు. హోదా వల్ల రాయితీలు వస్తాయి. రాయితీలుంటేనే పరిశ్రమలొస్తాయి. లక్షల కోట్ల పెట్టుబడులొస్తాయి. లక్షల్లో ఉద్యోగాలొస్తాయి. ఇవన్నీ తెలుసు కాబట్టే ఎన్నికలపుడు చంద్రబాబు ప్రత్యేక హోదా కావాలన్నారు. ఐదేళ్లు సరిపోదు.. 15 ఏళ్లు కావాలని కోరారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ‘బేషరతుగా రైతు రుణ మాఫీ’, ‘డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణమాఫీ’ వంటివి అమలు చేయలేదు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. జాబు ఇవ్వకుంటే ఇంటికి రూ 2,000లు నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. వీటిలో ఏ ఒక్కటీ చంద్రబాబు నెరవేర్చలేదు సరి కదా.. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టేశారు. ఢిల్లీతో పోరాడే ప్రయత్నమే చేయరు. గోదావరి, కృష్ణా నదుల నీళ్లు ఎగువ రాష్ట్రం అటు నుంచి అటే పంపులు పెట్టి, లిఫ్టులు పెట్టి తీసుకు పోతూ ఉంటే గట్టిగా నిలదీయాల్సింది.. అక్కడా మాట్లాడరు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రప్రయోజనాలను తాకట్టు పెట్టేశారు. ఇది ప్రజాస్వామ్యమా... బ్రిటిష్ పాలనా? ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతి జిల్లా కేంద్రంలోనూ యువత ముందుకొచ్చి కొవ్వొత్తుల ర్యాలీని శాంతియుతంగా జరపాలని పూనుకుంటే చంద్రబాబు అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటారట. ఏమండీ ఎందుకు జరపకూడదు? ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన మీరు పోరాడక పోగా ప్రజలంతా ముందుకొచ్చి అడుగుతూ ఉంటే మీరు ఓర్చుకోలేరా? ఎక్కడైనా ఉద్రిక్తతలుంటాయనుకుంటే 144 సెక్షన్‌ను, 30 సెక్షన్‌ను అమలు చేస్తారు. అసలేమీ జరక్క పోయినా అమలు చేస్తామంటున్నారు. వీడియో కెమెరాలు పెట్టి ర్యాలీలో పాల్గొనే వారిని అంతు చూస్తామని ముఖ్యమంత్రి చెప్పడం ఏమిటి? ఆయన ఆధ్వర్యంలో పని చేసే డీజీపీ చెప్పడం ఏమిటి? అలా అనడానికి డీజీపీ ఎవరసలు? ప్రత్యేక హోదాను ఈ విధంగా నీరు గార్చేందుకు ప్రయత్నించడం ధర్మమేనా? అని గట్టిగా అడుగుతున్నాను. గతంలో కూడా ఇదే అంశంపై బంద్‌లు, ధర్నాలకు పిలుపు నిచ్చినపుడు ముఖ్యమంత్రి దగ్గరుండి మరీ ఆర్టీసీ బస్సులు నడిపించారు. రాష్ట్రంలో ప్రజలెవ్వరికీ హోదా అవసరం లేదన్న తప్పుడు సంకేతాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసులను ఇంత దారుణంగా ఉపయోగించిన ముఖ్యమంత్రి బహుశా బ్రిటిష్ పాలనలో కూడా ఉండిఉండడు. అందుకే బ్రిటిష్ పాలనలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అనే సందేహం కలుగుతోంది. చంద్రబాబు వంటి వ్యక్తి స్వాతంత్రోద్యమంలో లేనందుకు ఓ రకంగా సంతోషంగా ఉంది. ఇపుడు ముఖ్యమంత్రిగా ఉండడం మన ఖర్మ. నిజంగా చంద్రబాబు కనుక స్వాంతంత్య్రోద్యమ కాలంలో ఒక నేతగా ఉండి ఉంటే ‘మనకెందుకు స్వాతంత్య్రం? బ్రిటిష్ ప్రభుత్వంతో సఖ్యతగా ఉందాం’ అనేవాడు. యువతపై పీడీ కేసులు పెడతారా? యువభేరీల్లో పాల్గొనే యువకులపై పీడీ కేసులు పెట్టాలని చంద్రబాబు ఆదేశిస్తున్నారు. అసలు పీడీ కేసంటే చంద్రబాబుకు తెలుసా అని ప్రశ్నిస్తున్నాను. ఉద్యోగాల కోసం, తమ భవిష్యత్తు కోసం పోరాడే పిల్లలపై పీడీ కేసు పెట్టమని చంద్రబాబు చెబుతారా? నిజానికి స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న చంద్రబాబుపై టాడా కేసు పెట్టి ముందు ఆయన్నే జైల్లో పెట్టాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా శాంతియుతంగా కొవ్వొత్తులతో జరుగబోయే ర్యాలీని ప్రశాంతంగా జరగనివ్వాలని, అడ్డుకోరాదని చంద్రబాబును డిమాండ్ చేస్తున్నా. మా పోరాటం ఆగదు.. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి 32 సార్లు పోరాటం చేసింది. హోదా వల్ల ప్రయోజనాలేమిటి? హోదాపై ఎవరెలాంటి అబద్ధాలు చెబుతున్నారనే వివరణతో కూడిన కరపత్రాన్ని వైఎస్సార్ కాంగ్రెస్‌కు సంబంధించిన అన్ని వెబ్సైట్లలో ఉంచాం. 26వ తేదీ నాటి కొవ్వొత్తుల ర్యాలీని మినహాయించినా కూడా 32 సార్లు పోరాటం చేసిన వివరాలున్నాయి. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. చేస్తూ పోతాం. జల్లికట్టు తమిళులకు ఒక ఆట దాని కోసం తమిళులంతా ఒక్కటయ్యారు. మనకు ప్రత్యేక హోదా అనేది జీవన్మరణ సమస్య. అలాంటి దాని కోసం చంద్రబాబు చేయలేక పోవడం సిగ్గుతో తలవంచుకోవాలి.’’ అని జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పక్షం నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పీఏసీ సభ్యుడు జి.ఆదిశేషగిరిరావు, జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ నేతలు ఎంవిఎస్ నాగిరెడ్డి, సాగి దుర్గాప్రసాదరాజు తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. నేనే వెళ్తా విశాఖ.. అరెస్టు చేస్తారా? ఇంకో విషయం చెబుతున్నా. విశాఖపట్టణంలో ర్యాలీకి నేను వెళుతున్నా. అరెస్టు చేస్తాం, ఇంకొకటి చేస్తాం అంటే మీ ఇష్టానికే వదిలేస్తున్నా. గురువారం సాయంత్రం నేను విశాఖకు వెళ్లి కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొంటానని గట్టిగా చెబుతున్నా. అరెస్టు చేస్తామటే చేయండి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు శాంతియుతంగా ప్రజాస్వామ్య యుతంగా ర్యాలీ చేయడానికి పోతూ ఉంటే అరెస్టు చేస్తాం, ఇంకొకటి చేస్తామంటే అది మీ విజ్ఞతకే వదలి వేస్తున్నా. నేనైతే అక్కడకు పోతున్నా. కచ్చితంగా పాల్గొంటానని చంద్రబాబుకు చెబుతున్నాను. బాబుకు జ్ఞానోదయమై ర్యాలీకి రావాలి చంద్రబాబుకు జ్ఞానోదయం కావాలని, ఆయన కూడా తన వైఖరిని మార్చుకుని ప్రత్యేక హోదాకు మద్దతుగా కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనాలని కోరుతున్నా. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని, అబద్ధాలు చెప్పవద్దని కోరుతున్నా. రాష్ట్ర ప్రయోజనాల కోసం తోడుగా నిలబడండి అని మనస్ఫూర్తిగా కోరుతున్నా. హోదా కోసం ఎవరు ఏ కార్యక్రమం చేసినా మేం మద్దతిస్తామని చెబుతున్నా. ఇది ఒక్క జగన్‌తో సాధ్యమయ్యేది కాదు, అందరూ కలిసికట్టుగా వస్తేనే సాధ్యమవుతుంది. ఎంపీలతో రాజీనామాలు చేయిద్దాం.. ప్రత్యేక హోదా కోసం అందరమూ కలిసి ఢిల్లీకి పోదాం, నేను కూడా చంద్రబాబుతో కలిసి వస్తా... ఢిల్లీ వాళ్లు ఒప్పుకోక పోతే అందరం మన 25 ఎంపీలతో∙రాజీనామాలు చేయిద్దాం. ప్రత్యేక హోదాపై ఎన్నికలకు పోదాం. దేశం మొత్తం చూసే విధంగా ఏపీ ప్రజలు ప్రత్యేక హోదా కోసం ఆరాటపడుతున్నారని తెలిసే విధంగా ప్రత్యేక హోదాపైనే ఎన్నికలకు పోదాం. చంద్రబాబు విన్నా వినక పోయినా , సహకరించినా సహకరించక పోయినా హోదా కోసం మా పోరు ఆగదు. ఈ ఏడాది మే, జూన్ నెల కల్లా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ మూడేళ్ల పరిపాలన పూర్తవుతుంది. బడ్జెట్ సమావేశాల తరువాత ప్రత్యేక హోదా కోసం మా పార్టీ ఎంపీలందరితో రాజీనామాలు చేయిస్తాం. దేశం మొత్తం చూసేలా ఉప ఎన్నికలకు పోదాం. పార్లమెంటులో ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయడం లేదో దేశమంతా ఆలోచించాలి. చంద్రబాబు కూడా సహకరిస్తే సంతోషిస్తాం. మాకు తోడుగా రాకపోతే రాబోయే రోజుల్లో చంద్రబాబును ప్రజలు బంగాళాఖాతంలో తోసేస్తారు. దేవుడు మొట్టికాయలు వేస్తారు. -
అనంతలో కదం తొక్కిన విద్యార్థులు
అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సలాంబాబా డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ నేతృత్వంలో బుధవారం శ్రీ కృష్ణదేవరాయ యూనివర్శిటీ బంద్ చేపట్టారు. అనంతపురం-చెన్నై జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో విద్యార్థులు నిరసనకు దిగారు. హైవేను దిగ్భంధించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీకి హోదా సాధించేంత వరకు పోరాడతామన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు మేరకు గురువారం జిల్లాలో నిర్వహించే కొవ్వొత్తుల ర్యాలీని విజయవంతం చేస్తామని చెప్పారు. -
అనంతలో కదం తొక్కిన విద్యార్థులు
-
‘ప్యాకేజీ గొప్ప అనే వాళ్లతో చర్చకు సిద్ధం’
-
‘ప్యాకేజీ గొప్ప అనే వాళ్లతో చర్చకు సిద్ధం’
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తోందని వైఎస్సార్ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. 26న విశాఖ సముద్ర తీరంలో జరిగే కొవ్వొత్తుల ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అన్ని జిల్లాల కేంద్రాల్లో నిర్వహించనున్న కొవ్వొత్తుల ర్యాలీలో ప్రతిఒక్కరు పాల్గొనాలని ఆయన కోరారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ గొప్ప అనే వాళ్లతో చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. -
బాలల హక్కులపై క్యాండిల్ ర్యాలీ
విజయవాడ : బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు శనివారం రాత్రి నగరంలో ఏర్పాటుచేసిన క్యాండిల్ ర్యాలీని సబ్–కలెక్టర్ డాక్టర్ సలోని సిదాన ప్రారంభించారు. సబ్–కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ మహాత్మాగాంధీ రోడ్డు మీదుగా పోలీసు కమిషనరేట్ వరకు సాగింది. బాలల హక్కుల వారోత్సవాలలో భాగంగా చైల్డ్‌లైన్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కె. కృష్ణకుమారి, కార్మిక శాఖ సహాయ కమిషనర్ ఆంజనేయరెడ్డి, చైల్డ్‌లైన్ ప్రతినిధి అరవ రమేష్ పాల్గొన్నారు. -
ఫ్రొఫెసర్ లక్ష్మిని అరెస్టు చేయాల్సిందే!
-
'ఉగ్రభూతాన్ని తరిమికొట్టాలి'
► కొవ్వొత్తులతో నివాళులర్పించిన బీజేపీ ► ఏబీవీపీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం ఒంగోలు : కశ్మీర్‌లోయలోని యురీ సెక్టార్లో పాక్ దుశ్చర్యకు అమరులైన జవానుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ సోమవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీతో నివాళులర్పించారు. స్థానిక చర్చి సెంటర్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందన్నారు. ఉగ్రభూతాన్ని తరిమికొట్టాలని ఏబీవీపీ టెక్నికల్ జిల్లా కన్వీనర్ విజయ్‌బాబు అన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు సెంటర్లో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వం ఆదేశిస్తే ఏబీవీపీ కార్యకర్తలు యుద్ధరంగంలోకి దిగేందుకు సిద్ధమన్నారు. బీజేపీ నాయకులు బత్తిన నరసింహారావు, ఖలీఫాతుల్లాబాషా, ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రచారక్ చంద్రశేఖర్, ఏబీవీపీ నగర సంఘటన కార్యదర్శి హనుమంతు తదితరులు పాల్గొన్నారు. -
ఉగ్రవాదం నుంచి దేశాన్ని కాపాడాలి
వైఎస్సార్‌ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతంరెడ్డి దాడులకు నిరసనగా భారీ కొవ్వొత్తుల ర్యాలీ అమరవీరులకు ఘన నివాళులు విజయవాడ (గాంధీనగర్):ఉగ్రవాదాన్ని తరిమికొట్టి దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్రం ప్రభుత్వంపై ఉందని వైఎస్సార్ ట్రేడ్‌యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డా. పూనూరు గౌతంరెడ్డి అన్నారు. కశ్మీర్లో ఉగ్రదాడులను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. పార్టీ కార్యాలయం నుంచి న్యూ ఇండియా హోటల్ సెంటర్, అలంకార్ సెంటర్, లెనిన్‌సెంటర్ వరకు ప్రదర్శన సాగింది. ఉగ్రవాదుల దాడిలో బలైన జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గౌతంరెడ్డి మాట్లాడుతూ దాడులు జరుగుతాయని సమాచారం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించిందన్నారు. దాడిలో 17 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నప్పటికీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం రాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైందన్నారు. మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఉగ్రదాడులను అరికట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ అసిఫ్, ఫ్లోర్ లీడర్ పుణ్యశీల, కార్పొరేటర్లు బుల్లా విజయ్‌కుమార్, జమాల పూర్ణిమ, బీజాన్బీ, నాయకులు కామా దేవరాజ్, కొణిజేటి రమేష్, కాలే పుల్లారావు, మాదు శివరామకష్ణ, విశ్వనాథ రవి, షేక్ గౌస్‌మొహిద్దీన్, యాదాల శ్రీనివాసరావు, కమ్మిలి రత్నకుమార్, బూదాల శ్రీనివాసరావు, పి శరత్, వీర్ల వరలక్ష్మీ, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇస్కఫ్ పాదయాత్ర కశ్మీర్లో ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఇస్కఫ్ సోమవారం సత్యనారాయణపురంలో పాదయాత్ర నిర్వహించింది. ఇస్కఫ్ జాతీయ అధ్యక్షుడు కె సుబ్బరాజు మాట్లాడుతూ తీవ్రవాద సంస్థలు ప్రపంచశాంతికి విఘాతం కలిగిస్తున్నాయన్నారు. ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలువరించేందుకు అందరూ పాటుపడాలన్నారు. ఉగ్రదాడిలో మరణించిన వీరజవాన్లకు నివాళులర్పించారు. ఎపీఎస్వైఎఫ్ నాయకులు నవనీతం సాంబశివరావు, పూజారి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు,. -
దేశం కోసం పనిచేయాలి
నెల్లూరు(బారకాసు): ప్రతి ఒక్కరూ దేశం కోసం పనిచేస్తేనే జన్మకు సార్ధకత లభిస్తుందని భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షుడు మొగరాల సురేష్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు తిరంగాయాత్రలో భాగంగా ఆదివారం రాత్రి నెల్లూరులోని వీఆర్సీ నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. సురేష్ మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసంప్రాణాలను త్యాగం చేసిన వారిని మననం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి భారత పౌరుడిపై ఉందన్నారు. వారి పోరాట స్ఫూర్తితో నేటి తరం యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఒక్కప్పుడు స్వేచ్ఛ కోసం ఉద్యమాల జెండాను చేత పట్టిన జాతి నేడు నాది అన్న స్వార్ధంతో బందీ అయిందన్నారు. నేటి యువత యాంత్రిక జీవితాన్ని గడుపుతోందని, అలా కాకుండా చదువుతో పాటు స్వాతంత్ర పోరాట చరిత్రను ఒకసారి నెమరువేసుకుంటే తాము చేస్తున్న తప్పులు ఏమిటనేవి తెలుస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ సొంత జీవితానికే కాకుండా కొంత సమయాన్ని దేశం కోసం కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షుడు మండ్ల ఈశ్వరయ్య, బీజేవైఎం నాయకులు ఫణిరాజు, ప్రసాద్, మల్లికార్జున పెంచలయ్య, మధుసూధన్‌రావు, ఆవుల నాగేంద్ర, రాధాకృష్ణ, అశోక్, క్రిష్ణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
హిందూపురం : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను బీజేపీ నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటా సత్యం డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి హిందూపురంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ సర్కిల్ నుంచి సద్భావన సర్కిల్ వరకు కొవ్వొత్తులు చేతపట్టి నినాదాలు చేస్తూ నిరనస కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కోటా సత్యం మాట్లాడుతూ రాజ్యసభలో కేవీపీ ప్రైవేట్ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతునివ్వాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఇందాద్, రాష్ట్ర నాయకులు ఆదిమూర్తి, జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, పట్టణ అధ్యక్షుడు నాగరాజు, ఏ బ్లాక్ కన్వీనర్ శైవలి రాజశేఖర్, మధు, మహబూబ్, రెహెమత్, జబీ, రవూఫ్, జహీర్, మహబూ»Œ , శ్యాం, కదిరీష్ తదితరులు పాల్గొన్నారు. -
నిందితులను కఠినంగా శిక్షిస్తాం : మంత్రి తలసాని
హైదరాబాద్: పంజాగుట్ట కారుప్రమాదానికి కారణమైన నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. కేబీఆర్ పార్క్ వద్ద సోమవారం సాయంత్రం రమ్యకు నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ...రమ్య కుటుంబానికి వచ్చిన పరిస్థితి ఎవరికీ రాకూడదన్నారు. చిన్నారి కుటుంబసభ్యులను సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి...న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ వహించాలని సూచించారు. రమ్య కుటుంబసభ్యులు మాట్లాడుతూ... ఈ ప్రమాదం కారణంగా మొత్తం కుటుంబాన్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చట్టాలను కఠినంగా అమలు చేయాలని ప్రజలు కోరారు. ఈ ర్యాలీలో రమ్య కుటుంబసభ్యులు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గాయని శోభారాణి, నటుడు కాదంబరి కిరణ్, శివాజీ, మంచు లక్ష్మీ, గజల్ శ్రీనివాస్‌తో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. -
నిందితులను కఠినంగా శిక్షిస్తాం
-
వెల్లువెత్తిన కొవ్వొత్తుల ర్యాలీ
హైదరాబాద్: ఏపీలో విచ్చలవిడిగా డబ్బులు పంచుతూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అదికార పార్టీ నేతలు ప్రజాస్వామ్య విలువలను దిగజార్చడాన్ని ప్రతిపక్ష ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతూ నీచరాజకీయాలను ప్రోత్సహిస్తున్న అధికార పార్టీ కనువిప్పు చేయడానికి వైఎస్ఆర్ సీపీ నేటి సాయంత్రం ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో 'సేవ్ డెమొక్రసీ' పేరుతో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించింది. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడం కోసం వైఎస్ఆర్ సీపీ పిలుపు మేరకు పార్టీ కార్యకర్తలతో పాటు, భారీ ఎత్తున ప్రజలు కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొని ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి భానుగుడి సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి, తదితర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణాజిల్లా విజయవాడలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, రక్షణనిధి, మేకా ప్రతాప్ అప్పారావు పాల్గొన్నారు. పార్టీ నేతలు పార్థసారధి, సామినేని ఉదయభాను, జోగి రమేష్, విజయవాడ నగర కార్పొరేటర్లు 'సేవ్ డెమొక్రసీ' లో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. గుంటూరులో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు డా.గోపిరెడ్డి నివాసరెడ్డి, ముస్తఫా, మర్రి రాజశేఖర్, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, తదితర నేతలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విధానాలు ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతిస్తున్నాయని నేతలు విమర్శించారు. కడపలో వైఎస్సార్ సర్కిల్ లో బహిరంగసభ నిర్వహించారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, కొరుముట్ల నివాసులు, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి బహిరంగసభలో పాల్గొని ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు ప్రజలు తమతో కలిసి ముందుకురావాలని పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా నగరిలో ఎమ్మెల్యే ఆర్కే రోజా నేతృత్వంలో నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. చిత్తూరు జిల్లాలో 'సేవ్ డెమొక్రసీ' ర్యాలీలో ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, డా.సునీల్ కుమార్, పార్టీ కన్వీనర్లు ఆదిములం, జంగాలపల్లి నివాసులు, తదితర నేతలు పాల్గొన్నారు. తిరుపతిలో ఎంపీ వరప్రసాద్, నేతలు అశోక్ కుమార్, ప్రతాప్ రెడ్డి, రాజేంద్ర, పలువురు నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కర్నూలులో రాజ్ విహార్ సెంటర్లో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి, బుగ్గర రాజేంద్రనాథ్, ఐజయ్య, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, తదితరులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతపురంలో వైఎస్ఆర్ సీపీ 'సేవ్ డెమొక్రసీ' క్యాండిల్ ర్యాలీలో భాగంగా ఎమ్మార్వో కార్యాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, ఎల్ఎం మోహన్ రెడ్డి, తదితర నేతలతో పాటు భారీగా కార్యకర్తలు, ప్రజలు ఈ ర్యాలీకి మద్ధతుగా తరలివచ్చారు. -
నేడు వైఎస్సార్సీపీ కొవ్వొత్తుల ర్యాలీ
సీఎం చంద్రబాబు అనైతిక విధానాలకు వ్యతిరేకంగా నిరసన సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనైతిక విధానాలకు నిరసనగా నెల్లూరు నగరంలో నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా పార్టీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం నుంచి శనివారం సాయంత్రం 6 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. రాజ్యంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం వరకు ఈ క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రజల గొంతైన ప్రతిపక్షాన్ని లేకుండా చేయటానికి అధికారపార్టీ కుట్రపన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తోందని, అందుకు నిరసనగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెల్లడించారు. కార్యక్రమానికి ఎంపీలు, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లాస్థాయి కార్యవర్గసభ్యులు హాజరవుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా సొసైటీ, మండలపార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొనాలని కాకాణి పిలుపునిచ్చారు. -
ప్రభుత్వ వైఖరి మారాలి
బంద్ పాటించిన బంగారు దుకాణాల యజమానులు అనంతపురం న్యూటౌన్ : బంగారు దుకాణాలపై క స్టమ్స్ సుంకం పెంచడం, రూ. 2 లక్షలు విలువ చేసే నగల కొనుగోళ్లపై పాన్ కార్డును తప్పనిసరి చేయడం వంటివి తమ వ్యాపారాలకు అడ్డంకిగా మారాయని స్వర్ణకార సంఘాల నాయకులు అన్నారు. బంగారు దుకాణదారుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ స్వర్ణకార, కార్మిక, వర్తక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని అన్ని బంగారు దుకాణాలను మూసివేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వానికి ఇప్పటికే చాలా సార్లు తమ సమస్యల గోడు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతోనే బంద్‌లో పాల్గొనాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు మహబూబ్ బాషా, కార్యదర్శి మన్సూర్, సంఘం సభ్యులు రంగాచారి, శ్రీనివాసులు, రామాంజనేయులు పాల్గొన్నారు. కొవ్వొత్తుల ప్రదర్శన : అదేవిధంగా సమస్యల పరిష్కారం కోసం బంగారు దుకాణాల యజమానులు మంగళవారం రాత్రి పాతూరు నుంచిసప్తగిరి సర్కిల్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవ హారం నిర్మించి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
ఎగసిన నిరసన
►అసెంబ్లీ వద్ద వైఎస్సార్ సీపీ నేత, ఎమ్మెల్యే రోజాను అడ్డుకోవడంపై భగ్గుమన్న పార్టీ శ్రేణులు ►డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు పాలభిషేకాలు, పలుచోట్ల ధర్నాలు ►నియోజకవర్గ కేంద్రాల్లో కదం తొక్కిన నాయకులు, కార్యకర్తలు ►అధికార పెత్తనాన్ని సహించబోమంటూ పాలకులకు హెచ్చరికలు వైఎస్సార్ సీపీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాని అసెంబ్లీ వద్ద అడ్డుకోవడాన్ని నిరసిస్తూ శనివారం గుంటూరులో పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ పట్నంబజారు (గుంటూరు) : అధికార పక్షం ఒంటెత్తు పోకడలతో ఇష్టానుసారం వ్యవహరించడంపై వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కన్నెర్రజేసింది. నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజాను అసెంబ్లీలోకి రానివ్వకుండా అడ్డుకోవడంపై పార్టీ నేతలు, కార్యకర్తలు భగ్గుమన్నారు. అధికార పెత్తనం చెలాయిస్తే సహించబోమంటూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో శనివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు పాలభిషేకాలు నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ► పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో చిలకలూరిపేటలోని అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియ జేశారు. అక్కడే ధర్నా చేశారు. ►పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో లాడ్జిసెంటర్ నుంచి శంకర్‌విలాస్ వరకు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి నిరసన తెలియజేశారు. ►తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో నల్ల చొక్కాలు ధరించి రైల్వేస్టేషన్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ►వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు నల్ల కండువాలు, బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ►తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త హెన్రి క్రిస్టినా, తాడికొండ, తుళ్లూరు, ఇన్చార్జి కత్తెర సురేష్‌కుమార్ ఆధ్వర్యంలో మేడికొండూరు, ఫిరంగిపురంలలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ►పెదకూరపాడు నియోజకవర్గంలో సమన్వయకర్త పానెం హనిమిరెడ్డి ఆధ్వర్యంలో నల్ల కండువాలు ధరించి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో పార్టీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ దేవళ్ల రేవతి పాల్గొన్నారు. ► మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) కార్యాలయం నుంచి పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వరకు కార్యకర్తలు, నేతలు భారీ ప్రదర్శన నిర్వహించారు. ► మాచర్లలో యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. ► పార్టీ లీగల్ విభాగం జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది పోలూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులంతా లాడ్జిసెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు పాల్గొన్నారు. ►సత్తెనపల్లి నియోజకవర్గంలో పట్టణ అధ్యక్షుడు షేక్ నాగూర్‌మీరా ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ► పొన్నూరులో పార్టీ జిల్లా అధికారప్రతినిధి గేరా సుబ్బయ్య ఆధ్వర్యంలో ఐలాండ్ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులుఅర్పించి ధర్నా నిర్వహించారు. ►వేమూరు నియోజకవర్గంలో ఆయా మండలాల నేతల ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ►ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు బండారు సాయిబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. గురజాల నియోజకవర్గంలో మండల కన్వీనర్ల ఆధ్వర్యంలో నల్లరిబ్బన్లతో నిరసన తెలియజేసి అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ►బాపట్ల పట్టణంలో కోకి రాఘవరెడ్డి, నరాలశెట్టి ప్రకాష్రావుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ► రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం ఐలాండ్ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ► నరసరావుపేట నియోజకవర్గంలో పార్టీ నేతలు సుజాత పాల్, హనీఫ్లతోపాటు, మరికొంత మంది నేతల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. క్షీరాభిషేకం నిర్వహించి నల్లరిబ్బన్లతో నిరసన తెలియజేశారు. -
హెచ్‌సీయూలో క్యాండిల్ ర్యాలీ
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) లో విద్యార్థుల ఆగ్రహజ్వాలలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. వేముల రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ అతడి బర్త్ డే సందర్భంగా హెచ్‌సీయూ విద్యార్థులు క్యాండిల్ ర్యాలీ చేస్తున్నారు. హెచ్‌సీయూ పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా వర్సిటీలోని విద్యార్థులు శుక్రవారం రాత్రి 11:30 సమయంలో క్యాండిల్ ర్యాలీ ప్రారంభించారు. రోహిత్ తల్లి రాధికతో పాటు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నిరసనలో పాల్గొననున్నట్లు విద్యార్థి సంఘాలు తెలిపాయి. -
హోదా కోరుతూ తిరుపతిలో వైఎస్ఆర్సీపీ క్యాండిల్ ర్యాలీ
-
ప్రత్యేక హోదా కోరుతూ కొవ్వొత్తులతో ర్యాలీ
-
ప్రత్యేక హోదా కోరుతూ కొవ్వొత్తులతో ర్యాలీ
పులివెందుల(వైఎస్సార్ జిల్లా) : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మంగళవారం పలు జిల్లాల్లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. పులివెందులలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అగ్రనేత వైఎస్ వివేకానంద రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు ఆందోళనలు, ర్యాలీలు కొనసాగుతాయని ఈ సందర్భంగా వారు తెలిపారు. అలాగే విజయనగరం జిల్లా పార్వతీపురం మండల కేంద్రంలోని బెలగాం నుంచి వైఎస్సార్ విగ్రహం మీదుగా పాతబస్టాండ్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ పార్వతీపురం సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. అదేవిధంగా విశాఖ జిల్లా అచ్యుతాపురంలో ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అచ్యుతాపురం కూడలి నుంచి వైఎస్సార్సీపీ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి సమీమ్ అస్లాత్ ఆధ్వర్యంలో ముంబై-చైన్నై రహదారిపై కొవ్వొత్తులతో ర్యాలీ, రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేత కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రాయదుర్గంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ప్రకాశం జిల్లాలో ఎడం బాలాజీ ఆధ్వర్యంలో చీరాలలో కొవ్వొత్తుల ర్యాలీ జరుగగా, ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో సంతనూతలపాడులో ర్యాలీ జరిగింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మంగళవారం జిల్లా వ్యాప్తంగా కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీలు నిర్వహించారు. పార్టీ జిల్లా పరిశీలకుడు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు వివిధ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి దీక్షలు చేస్తున్న వారికి సంఘీభావం తెలిపారు. తణుకులో అర్ధనగ్న ప్రదర్శన చేసి అనంతరం కళ్ళకు గంతలు కట్టుకుని మోకాళ్లపై నిలబడి సర్కారు తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఆచంట నియోజకవర్గంలో పార్టీ కన్వీనర్ ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో వేలాది మందితో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. -
YSRCP కొవ్వొత్తుల ప్రదర్శన
-
విద్యార్ధుల ఆత్మకు శాంతి చేకూరాలి-విజయారెడ్డి