సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి... తెలుగు ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.