ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. రాష్ట్రంలో వరుసగా మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులకు నిరసనగా శనివారం 13 జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీలు చేపట్టారు. ఈ ర్యాలీలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.