ప్రభుత్వం, పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా, ఆరు నూరైనా కొవ్వొత్తుల ర్యాలీ శాంతి యుతంగా నిర్వహించి తీరుతామని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనా రాయణ స్పష్టం చేశారు. విశాఖలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా డిమాండ్‌తో గురువారం సాయంత్రం ఆరుగంటలకు ఆర్కే బీచ్ నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు జరిగే కొవ్వొత్తుల ర్యాలీలో తమ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారని తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి సాయంత్రం 4.15 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారని, అక్కడి నుంచి నేరుగా బీచ్ రోడ్డుకు వస్తారని ఆయన వివరించారు.కుట్రలుంటాయి జాగ్రత్త... ప్రత్యేక హోదాను వ్యతిరేకించే కొన్ని శక్తులు ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకు, ఉద్యమాన్ని విఫలం చేసేందుకు కుట్రలు పన్నే అవకాశం ఉందని అలాంటి వాటికి లొంగకుండా జాగ్రత్తగా గమనించాలని బొత్స సూచించారు.