
ప్రభుత్వ వైఖరి మారాలి
బంద్ పాటించిన బంగారు దుకాణాల యజమానులు
అనంతపురం న్యూటౌన్ : బంగారు దుకాణాలపై క స్టమ్స్ సుంకం పెంచడం, రూ. 2 లక్షలు విలువ చేసే నగల కొనుగోళ్లపై పాన్ కార్డును తప్పనిసరి చేయడం వంటివి తమ వ్యాపారాలకు అడ్డంకిగా మారాయని స్వర్ణకార సంఘాల నాయకులు అన్నారు. బంగారు దుకాణదారుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ స్వర్ణకార, కార్మిక, వర్తక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని అన్ని బంగారు దుకాణాలను మూసివేశారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వానికి ఇప్పటికే చాలా సార్లు తమ సమస్యల గోడు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతోనే బంద్‌లో పాల్గొనాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు మహబూబ్ బాషా, కార్యదర్శి మన్సూర్, సంఘం సభ్యులు రంగాచారి, శ్రీనివాసులు, రామాంజనేయులు పాల్గొన్నారు.
కొవ్వొత్తుల ప్రదర్శన : అదేవిధంగా సమస్యల పరిష్కారం కోసం బంగారు దుకాణాల యజమానులు మంగళవారం రాత్రి పాతూరు నుంచిసప్తగిరి సర్కిల్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవ హారం నిర్మించి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.