Gold shops
-
ధన్తేరస్ సందర్భంగా బంగారం దుకాణాలు కిటకిట (ఫొటోలు)
-
సోనేకా ఠేట్.. నారాయణపేట్
నారాయణపేట: మగువల మనసు దోచే అందమైన, అద్భుతమైన మన్నికకు మారుపేరుగా నిలిచే బంగారు అభరణాలకు నారాయణపేట తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధి. దాదాపు 128 ఏళ్లుగా పేట బంగారానికి చెక్కుచెదరని ఖ్యాతి ఉంది. ఇక్కడి బంగారం నాణ్యత చూసిన నిజాం ప్రభువు నారాయణపేట్ సోనేకా ఠేట్ (స్వచ్చమైన బంగారం) అని కితాబిచ్చినట్లు ప్రచారం ఉంది. 24 క్యారెట్ల స్వచ్ఛ బంగారాన్ని విక్రయించడంలో స్థానిక స్వర్ణకారులు నమ్మకాన్ని కూడగట్టుకున్నారు. అందుకే పక్కన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల నుంచి సైతం బంగారు నగలను కొనుగోలు చేసేందుకు ఇక్కడికి వస్తుంటారు. బంగారు విక్రయానికి 128 ఏళ్లు నారాయణపేటలో 1898వ సంవత్సరం నుంచి బంగారం విక్రయాలు కొనసాగుతున్నాయి. అప్పట్లో వ్యాపారులు బంగారు వ్యాపారాన్ని ప్రారంభించారు. నిజాం కాలంలో లహోటికి చెందిన వారు వ్యాపారం భారీగా చేసేవారు. ఆ కాలంలో రాజస్తాన్ నుంచి నారాయణపేటకు వచ్చిన రాంచందర్ మెగరాజ్ భట్టడ్ ఇక్కడ బంగారం వ్యాపారాన్ని ప్రారంభించారు. ఐదు దశాబ్దాలుగా స్థానికంగా బంగారం వ్యాపారం రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. ఆరంభంలో అసరం భట్టడ్, వై.సురేశ్, బంగారు బాలప్ప, దత్తురావు, సరాఫ్ హన్మంతు, మహ్మద్ హసన్ సహాబ్ చాంద్ తదితర ఎనిమిది బంగారు దుకాణాలుంటే.. ప్రస్తుతం 100పైగా దుకాణాలకు విస్తరించాయి. హాల్‌మార్క్.. మోనోగ్రామ్ స్థానికంగా దుకాణాల్లో తయారు చేసిన అభరణాలపై చిన్న సైజులో తమ దుకాణం పేరు ముద్రను (మోనోగ్రామ్) వేస్తారు. తిరిగి ఆయా దుకాణాల్లో కొనుగోలు చేసిన వారు విక్రయించేందుకు వెళ్తే.. గుర్తు పట్టేందుకు సులభంగా ఉంటుంది. వివిధ రకాల డిజైన్లను వ్యాపారులు బంగారం ప్రియుల కోసం అందుబాటులో ఉంచుతారు. తారాపూర్, అమృత్సర్, ముంబై, మచిలీపట్నంలో డైస్ తయారవుతాయి. మార్కెట్లో డైస్ వచ్చిన పది రోజుల్లో ఆయా కొత్త డిజైన్లు ఇక్కడికి చేరుతాయి. హాల్‌మార్క్‌తో కూడిన వివిధ రకాల డిజైన్లలో నగలను హైదరాబాద్, నారాయణపేటలోని బెంగాలీ స్వర్ణకారులతో తయారు చేయించి విక్రయిస్తారు. లక్ష్మీ నెక్లెస్, లక్ష్మీలాంగ్ చైన్, లాంగ్ చైన్ తదితర రకాల డిజైన్ల అభరణాలు లభిస్తాయి. శుభకార్యం వస్తే చాలు.. పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు నారాయణపేట సరాఫ్ బజార్ కిటికిటలాడుతుంది. రాష్ట్రంలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, జనగాంలతో పాటు నారాయణపేటలో బంగారం ఎంతో నాణ్యత, మన్నికతో ఉంటుంది. శుభకార్యాలు, పండుగలు ఉన్నప్పుడు పేట బంగారం కొనుగోలు చేసేందుకు కర్ణాటకలోని యాద్గిర్, సేడం, గుల్బర్గా, బీదర్, రాయచూర్, మహారాష్ట్రలోని పుణే, షోలాపూర్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా వాసులు ఎక్కువ వస్తుంటారు. స్విస్ బ్యాంక్ కార్పొరేషన్ నుంచే కొనుగోళ్లు దేశంలోని బంగారు వ్యాపారస్తులు ఆన్లైన్ ద్వారా స్విస్ బ్యాంక్ కార్పొరేషన్‌తో పాటు సెంట్రల్ బ్యాంకుల్లో డీడీలను కట్టి బంగారు బిస్కెట్లను కొనుగోలు చేస్తుంటారు. ఎస్బీఐ, కార్పొరేషన్ బ్యాంకులు, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ల నుంచి కిలోల చొప్పున బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అంతర్జాతీయ మార్కెట్ న్యూయార్క్ బంగారం ధరపై ఆధారపడి ఉంటుంది. మార్కెట్ ఆరంభంలో డాలర్ విలువపై హెచ్చుతగ్గు ధరలు కావాల్సిన వారు.. బంగారం కోసం ఆన్లైన్లో ధరను కోట్ చేసి ఉంచితే వారికి అదే ధరకు బంగారం కేటాయిస్తారు. సరాఫ్ బజార్ ఏ ఊళ్లోనైనా కూరగాయల మార్కెట్, చికెన్, మటన్ మార్కెట్, కిరాణా మార్కెట్, పత్తి బజార్ తదితర బజార్లు ఉండడం సహజం. కానీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో సరాఫ్ బజార్ ఎక్కడా లేదు. నారాయణపేటలో దాదాపు 100 దుకాణాలు వరుసగా ఉండడంతో సరాఫ్ బజార్ అని పేరుపెట్టారు. పెద్ద పెద్ద నగరాల స్థాయిలో పేటలో బులియన్ అండ్ జువెల్లర్స్గా వ్యాపారం కొనసాగుతోంది. తేజాప్తో నాణ్యత ఆభరణాలు నాణ్యతగా ఉన్నాయా?, డూప్లికేటా? అనేది తేజాప్తోనే పరిశీలిస్తారు. డూప్లికేట్ బంగారు నగలైతే వెంటనే అది కాలిపోతూ నల్లగా మారుతుంది. ఒరిజినల్ బంగారాన్ని తేజాప్లో వేసి కరిగించినా ఎలాంటి మార్పు రాదు. తేజప్లో పాత బంగారాన్ని కరిగించి నగల నాణ్యతను గుర్తిస్తారు. టెక్నాలజీ పెరగడంతో ప్రస్తుతం టెస్టింగ్ మెషీన్ ద్వారా బంగారాన్ని పరీక్షిస్తున్నారు. నారాయణపేటలో 24 క్యారెట్లతో నగలు తయారు చేస్తారు. అందుకే అత్యవసర సమయాల్లో అభరణాలను విక్రయిస్తే.. పేట బంగారానికి ఏ మాత్రం విలువ తగ్గదు.30 ఏళ్లుగా వ్యాపారం నేను 30 ఏళ్లుగా బంగారు వ్యాపారం చేస్తున్నా. ముంబై, పుణే, హైదరాబాద్ నగరాల్లో 18, 19 క్యారెట్లతో బంగారు అభరణాలు విక్రయిస్తుంటారు. కానీ ఒక్క నారాయణపేటలోనే ఇప్పటికి 24 క్యారెట్లతో నగలు తయారు చేసి విక్రయిస్తున్నాం. – సరాఫ్ నాగరాజు, వ్యాపారి, నారాయణపేటనాణ్యతకు మారుపేరు.. నమ్మకానికి, నాణ్యతకు, మన్నికకు మారుపేరు నారాయణపేట బంగారు అభరణాలు. 24 క్యారెట్లతో నాణ్యత కూడిన బంగారు అభరణాల విక్రయాలు ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ కొన్న అభరణాలు రీసేల్ చేస్తే 99.12 శాతం ఉంటుంది. అందుకే నారాయణపేట బంగారాన్ని కొనేందుకు అసక్తి చూపుతారు. – హరినారాయణభట్టడ్, బులియన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు, నారాయణపేటఅంతా ‘చొక్క’బంగారమే నారాయణపేటలో స్వర్ణకారులు తయారు చేసేది.. వ్యాపారస్తులు అమ్మేదంతా చొక్క బంగారమే. అభరణాల్లో కల్తీ ఉండదు. పుస్తెలు, వంకి, ఉంగరాలు, నల్లపూసల దండలు, వడ్డాణాలు, నానులు తదితర ఆభరణాలను నాణ్యత, మన్నికతో తయారు చేస్తాం. జాయింట్ల కోసమే కేడీఎం వాడుతాం. వందశాతం నాణ్యతగా ఉంటుంది. – శ్రీనివాస్ చారి, స్వర్ణకారుడు, నారాయణపేటచొక్క బంగారు అభరణాలివే నాను, పుస్తెలతాడు, గొలుసు, రెండు, మూడు వరసల పెద్దగొలుసులు, జిలేబీ చైను, చుట్టూ ఉంగరాలను 24 క్యారెట్లతో తయారు చేస్తారు. చంద్రహార, బోర్మాల్ గుండ్లు, కొలువులు, టెక్కీలు, ఐదారుటెక్కీలు, నెక్లెస్, లాంగ్‌చైన్, వడ్డాణం, వంకీలు, గాజులు, చెవుల కమ్మలు, జుంకీలు, మకరకురందనాలు, గెంటీలు, తార్కాస్ కమ్మలు, కరివేపూలు, ఏడురాళ్ల కమ్మలు, బ్రాస్లెట్లు, లాకెట్లు తదితర ఆభరణాలను కూడా తయారు చేస్తారు. -
Akshaya Tritiya: అక్షయ తృతీయ.. గోల్డ్ షాపుల్లో రద్దీ (ఫొటోలు)
-
Dhanteras 2023: బంగారానికి ధనత్రయోదశి డిమాండ్
న్యూఢిల్లీ: దీపావళికి ముందు ధనత్రయోదశి సందర్భంగా శుక్రవారం బంగారం షాపులు సందడిగా కనిపించాయి. సాధారణ రోజులతో పోలిస్తే బంగారం, వెండి విక్రయాలకు డిమాండ్ ఏర్పడింది. బంగారం ధరలు కూడా కొంత తగ్గడం సానుకూలించింది. అక్టోబర్ 28న 10 గ్రాముల బంగారం (24 క్యారెట్లు) రూ.63,000 వరకు వెళ్లగా, అక్కడి నుంచి రూ.1,500 వరకు తగ్గడంతో వినియోగదారులు కొనుగోళ్లకు ఆసక్తి చూపించారు. ధన త్రయోదశి నాడు బంగారం కొనుగోలు చేస్తే మంచిదనే నమ్మకం ఎక్కువ మందిలో ఉండడం తెలిసిందే. గురువారం బంగారం 10 గ్రాముల ధర రూ.400 తగ్గి రూ.60,950 వద్ద ముగియగా, ధనత్రయోదశి సందర్భంగా ఢిల్లీలో 10 గ్రాములకు రూ.50,139 (పన్నులు కాకుండా) పలికింది. సాధారణంగా ధనత్రయోదశి నాడు దేశవ్యాప్తంగా 20–30 టన్నుల వరకు బంగారం అమ్ముడుపోతుంటుంది. మధ్యాహ్నం తర్వాత నుంచి షాపులకు కస్టమర్ల రాక పెరిగినట్టు వర్తకులు తెలిపారు. మధ్యాహ్నం తర్వాత త్రయోదశి రావడం తెలిసిందే. శనివారం మధ్యాహ్నం వరకు త్రయోదశి ఉంటున్నందున కొనుగోళ్లు మరింత పెరగొచ్చని వర్తకుల అంచనాగా ఉంది. ‘‘బంగారం ధరలు వ్యాపారానికి అనుకూలంగా ఉన్నాయి. మంచి విక్రయాలు నమోదవుతాయని భావిస్తున్నాం. కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తోంది’’అని అఖిల భారత జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ డైరెక్టర్ దినేష్ జైన్ తెలిపారు. రాత్రి 8 గంటల వరకు అందిన సమాచారం మేరకు దేశవ్యాప్తంగా రూ.30,000 కోట్ల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు, ఆరి్టకల్స్ కొనుగోళ్లు జరిగాయి. ఇందులో బంగారం కొనుగోళ్లు రూ.27,000 కోట్లుగా, వెండి కొనుగోళ్లు రూ.3,000 కోట్ల వరకు ఉంటాయని ఆల్ ఇండియా జ్యుయలర్స్, అండ్ గోల్డ్ స్మిత్స్ ఫెడరేషన్ నేషనల్ ప్రెసిడెంట్ పంకజ్ అరోరా తెలిపారు. గతేడాది ధనత్రయోదశి రోజున బంగారం, వెండి కొనుగోళ్లు రూ.25,000 కోట్లుగా ఉన్నాయి. -
బంగారం కొంటాం.. రూ.2 వేల నోట్లు తీసుకుంటారా?
రూ. 2,000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన వెంటనే జువెలరీ షాపులకు ఎంక్వైరీలు వెల్లువెత్తాయి. బంగారం కొనుగోలుకు రూ.2 వేల నోట్లు స్వీకరిస్తారా అని కస్టమర్లు దేశవ్యాప్తంగా పలు జువెలరీ దుకాణాల్లో ఆరా తీస్తున్నారు. అప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు అయితే 2016లో నోట్ల రద్దు సమయంలో కనిపించిన ఉధృత పరిస్థితి ఇప్పుడు లేదని జువెలర్స్ బాడీ జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) తెలిపింది. వాస్తవానికి రూ.2 వేల నోట్ల మార్పిడి, కఠిన కేవైసీ నిబంధనల నేపథ్యంలో గత రెండు రోజులుగా బంగారం కొనుగోళ్లు మందగించాయి. 10 శాతం వరకు అధిక ధర! రూ.2 వేల నోట్ల ఉపసంహరణ నేపథ్యంలో కొంతమంది బంగారు వ్యాపారులు కస్టమర్ల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేసినట్లు వార్తలు వచ్చాయి. బంగారం కొనుగోలు కోసం రూ.2 వేలు నోట్లు ఇచ్చే కస్టమర్ల నుంచి 5 నుంచి 10 శాతం అదనంగా తీసుకున్నట్లు తెలిసింది. 10 గ్రాముల గ్రాముల బంగారాన్ని రూ. 66,000 వరకు అమ్మినట్లు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం దేశంలో బంగారం ధర తులం రూ.60,200 మేర ఉంది. కాగా రూ. 2 లక్షల లోపు బంగారం, వెండి ఆభరణాలు, రత్నాల కొనుగోలు కోసం పాన్, ఆధార్ వంటి డాక్యుమెంట్లను కస్టమర్లు సమర్పిచాల్సిన అవసరం లేదు. ‘రూ. 2,000 నోట్లతో బంగారం లేదా వెండిని కొనుగోలు చేసేందుకు కస్టమర్ల నుంచి జువెలరీ షాపులకు అధిక సంఖ్యలో ఎంక్వైరీలు వచ్చాయి. అయితే కఠినమైన కేవైసీ నిబంధనల కారణంగా వాస్తవ కొనుగోళ్లు తక్కువగా ఉన్నాయి’ అని జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ సయమ్ మెహ్రా పీటీఐ వార్తా సంస్థకు చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ. 2,000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు మే 19న ప్రకటించింది. ఆ నోట్లను ఖాతాల్లో డిపాజిట్ చేయడానికి, బ్యాంకుల్లో మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు సమయం ఇచ్చింది. మరోవైపు రూ.2000 నోట్ల చలామణిని తక్షణమే నిలిపివేయాలని బ్యాంకులను కోరింది. ఇదీ చదవండి: RS 2000 Note: ముగిసిన రూ.2 వేల నోటు శకం.. ఆరేళ్ల ప్రస్థానం.. -
బంగారం ధర పెరుగుతుందా..? తగ్గుతుందా?.. విశ్లేషకులు ఏం చెబుతున్నారు?
నరసాపురం(పశ్చిమగోదావరి): 20 రోజుల క్రితం తగ్గిన బంగారం ధరలు మళ్లీ 10 రోజుల నుంచి పెరుగుతూ వస్తున్నాయి. ధరలు ఇంకా తగ్గుతాయని కొన్ని నెలలుగా బులియన్ వర్గాలు విశ్లేషిస్తూ వస్తున్నాయి. అయితే సీన్ రివర్స్ అయ్యింది. వారం రోజుల నుంచి పసిడి ధరలు పెరుగుతున్నాయి మరో వైపు వెండిదీ అదే దారి. ప్రస్తుతం నరసాపురం మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ 53,400, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.48,200 వద్ద ట్రేడవుతోంది. 916 కేడీఎం ఆభరణాల బంగారం కాసు ప్రస్తుతం రూ 38,550కు చేరింది. నెలరోజుల క్రితం కాసుధర రూ.37,024గా ఉంది. నెలరోజుల్లో రూ.1536లు పెరిగింది. కిలో వెండి ధర 62,000గా ట్రేడవుతోంది. చదవండి: లోన్ యాప్స్ వేధింపులకు ఇక చెక్.. ట్రోల్ ఫ్రీ నంబర్ రిలీజ్ చేసిన హోంశాఖ నెలరోజుల క్రితం వరకూ బంగారం ధరలు తగ్గుతూ వస్తుండటంతో ఇంకా తగ్గుతాయని బులియన్ వర్గాలు అంచనా వేశాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. చైనా, ఆ్రస్టేలియా, లాటిన్ అమెరికా దేశాలు భారీగా బంగారం నిల్వలను పెంచుకునే ప్రయత్నం చేయడం, రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం చల్లారకపోవడం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయని అంటున్నాయి. రూపాయి మారకం విలువ రికార్డుస్థాయిలో పడిపోవడం మరో కారణం. షేర్మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. దీంతో మదుపర్లు బంగారం వైపు మళ్లడం ధరల పెరుగుదలకు కారణాలుగా మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో మరింతగా పెరగొచ్చని భావిస్తున్నారు. రూ.4 కోట్ల వరకూ తగ్గిన అమ్మకాలు బంగారం ధరల పెరుగుదల అమ్మకాలపై పడింది. మొన్నటి వరకూ కళకళలాడిన జ్యుయెలరీ షాపులు వెలవెల బోతున్నాయి. ఒక్క నరసాపురం మార్కెట్లోనే హోల్‌సేల్, రిటైల్ కలిపి రోజుకు రూ.5 కోట్ల వరకూ అమ్మకాలు జరుగుతాయి. ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం పట్టణాల్లో పెద్ద ఎత్తున అమ్మకాలు జరుగుతాయి. పెరిగిన ధరలతో ఉమ్మడి పశ్చిమలో రోజుకు రూ 4 కోట్లు వరకూ అమ్మకాలు తగ్గినట్లు అంచనా. దీపావళికి బంగారం అమ్మకాలు పెద్ద ఎత్తున సాగుతుంటాయి. ధరల పెరుగుదల దీపావళి అమ్మకాలపై కూడా ప్రభావం చూపుతుందని బులియన్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వేచి చూసే ధోరణిలో కొనుగోలుదారుడు ప్రస్తుతం బంగారం కొనాలా? కొన్ని రోజులు ఆగాలా? అనే సందిగ్ధంలో కొనుగోలుదారుడు ఉన్నాడు. ధరలు ఇంకా తగ్గుతాయనే విశ్లేషణతో, బంగారం కొనుగోళ్ళను చాలామంది వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఒక్కసారిగా పెరుగుతున్న ధరలు వారిని షాక్‌కు గురిచేసాయి. ఇప్పుడేమో ధరలు ఇంకా పెరుగుతాయని చెప్పడంతో కొనాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నారు. ఇంకా పెరిగే అవకాశం ఉంది బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. షేర్ మార్కెట్ నష్టాల్లో ఉంది. అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం నెలకొంది. దీంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ధరలు పెరగడంతో నరసాపురం మార్కెట్లోనే దాదాపు 40 శాతం అమ్మకాలు తగ్గాయి. దీపావళి పండుగ అమ్మకాలపై కూడా ప్రభావం పడింది. పండుగకు ముందస్తు ఆర్డర్లు పెద్దగా రావడంలేదు. పెట్టుబడుల రూపంలో కొనుగోలు చేసే బిస్కెట్ అమ్మకాలు మాత్రం నిలకడగా సాగుతున్నాయి. – వినోద్‌కుమార్‌జైన్, నరసాపురం చాంబర్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
పెళ్లి సందడి షురూ! ముహూర్తాలే ముహూర్తాలు!!
నిజామాబాద్ కల్చరల్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెళ్లిళ్ల సందడి షురూ కానుంది. శ్రావణ మాసం ప్రారంభమవడంతో పాటు శుభకార్యాల నిర్వహణకు ప్రజలు సిద్ధమవుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా సుమారు ఐదు నెలలుగా వివాహాది శుభకార్యాలు వాయిదా పడుతూ వచ్చాయి. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడం, శ్రావణమాసం కావడంతో శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అంతేకాకుండా ఏడాదిన్నరగా కరోనా వల్ల అన్నిరంగాలు ఇబ్బందులకు గురయ్యాయి. అనేక వివాహాది శుభకార్యాలు నిలిచిపోయాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో కల్యాణ మండపాలు కళ కళ లాడనున్నాయి. శుభకరం శ్రావణం.. శివకేశవులకు ప్రీతికరమైనది శ్రావణ మాసం. ప్రతియేటా ఈ మాసంలో వేల సంఖ్యలో వివాహాలు జరుగుతాయి. ఈనెల 9 నుంచి శ్రావణం ఆరంభమైంది. పెళ్లీడుకొచ్చిన యువతీయువకులకు వారి తల్లిదండ్రులు వివాహాలు చేసేందుకు ముందుగానే నిశ్చయించుకున్నారు. ఇన్నాళ్లు ము హూర్తాలు లేక వేచిచూశారు. ప్రస్తుతం ముహూర్తాలు ఉండడంతో పెళ్లి భాజాలు మోగనున్నాయి. చేతినిండా పని.. ఈనెలలో అధికంగా పెళ్లిళ్లు ఉండడంతో అన్ని రంగాల వారికి చేతినిండా పని దొరుకుతుంది. ఫ్లవర్ డెకరేషన్, భజంత్రీలు, వంట మాస్టర్స్, ఫొటో, వీడియోగ్రాఫర్స్, పురోహితులకు మంచి డిమాండ్ ఏర్పడింది. వివాహాలు జరుపుకునేందుకు కల్యాణ మండపాలు, కన్వెన్షన్ హాల్స్, సత్రాలు, గదులు ముందుగానే రిజర్వ్ చేసుకుంటున్నారు. మార్కెట్లో ఇప్పటికే వస్త్రాలు, బంగారం, సరుకుల కొనుగోళ్ల సందడి నెలకొంది. పట్టణాల్లోని బంగా రం షాపులు, వస్త్ర దుకాణాలు రద్దీగా మారాయి. శుభ ముహూర్త తేదీలు.. ఈనెలలో 12, 13, 14, 16, 18, 20, 21, 22, 25, 26, 27 సెప్టెంబర్ 1వ తేదీ ముహూర్తాలు ఉన్నాయి. వీటిల్లో 14వ తేదీ స్వాతీ, 16న అనురాధ, 18న ఏకాదశి, మూల 21న శ్రవణా, 25న ఉత్తరాభద్ర 26న రేవతి నక్షత్రాలు కలిసిన ముహుర్తాలు ఉండటంతో ఆయా తేదీల్లో ఎక్కువ వివాహాలు జరిగే అవకాశం ఉందని పండితులు అభిప్రాయపడుతున్నారు. బాధ్రపద మాసంలో సెప్టెంబర్ 2నుంచి అక్టోబర్ 5వరకు శుభముహూర్తాలు లేకపోవడంతో వివాహాలు చేయరు. తిరిగి అక్టోబర్ 7, 8,10 15, 16, 17, 20, 21, 23, 24, 31న ముహూర్తాలు ఉన్నాయి. నవంబర్ (కార్తీక మాసం)లో 6, 10, 12, 13, 17, 20, 21 తేదీలు, డిసెంబర్ (మార్గశిరమాసం)లో 5, 8, 9, 10, 12, 17, 18, 19, 24 తేదీల్లో ముహూర్తాలు వివాహానికి అనుకూలంగా ఉన్నాయి. వివాహాలకు మంచి రోజులు ఈనెల 27వ తేదీ వరకు పలు తేదీల్లో మంచి ముహుర్తాలు ఉన్నాయి. కరోనాతో రెండేళ్లుగా శుభకార్యాలు తక్కువగా జరిగాయి. ప్రస్తుతం కరోనా తగ్గడంతో ఈ నెలలో చాలా జంటలు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నాయి. అలాగే అక్టోబర్, నవంబర్‌ల్లో ముహూర్తాలున్నాయి. – మురళీకృష్ణ మాచార్యులు, రామాలయ పూజారి, సుభాష్‌నగర్ -
పసిడి మోసాలకు పంచ్
సాక్షి, అమరావతి బ్యూరో: బంగారు ఆభరణాల విక్రయంలో మోసాలకు చెక్ పడనుంది. ఇకపై నగలకు హాల్‌మార్క్ తప్పనిసరి కానుంది. జూన్ 1నుంచి హాల్‌మార్క్ లేని ఆభరణాలను విక్రయించకూడదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్నాళ్లూ పలు జ్యుయలరీ షాపుల్లో నాణ్యతకు తిలోదకాలిస్తూ నగలను విక్రయిస్తుండటంతో వినియోగదారులు మోసపోతున్నారు. ఇలాంటి మోసాలపై అందిన ఫిర్యాదుల నేపథ్యంలో బంగారు, వెండి నగలపై వాటి స్వచ్ఛతను తెలియజేసే హాల్‌మార్క్‌ను తప్పనిసరి చేస్తూ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనను జూన్ 1వ తేదీ నుంచి విధిగా అమలు చేయనుంది. ఈలోగా నగల దుకాణాల యజమానులు భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) ద్వారా హాల్‌మార్క్ రిజిస్ట్రేషన్ చేయించుకుని లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. ఇలా లైసెన్స్ పొందిన జ్యుయలరీ దుకాణాలను మాత్రమే 14 (585), 18 (750), 22 (916) క్యారెట్ల బంగారు ఆభరణాల అమ్మకానికి అనుమతిస్తారు. హాల్‌మార్క్ లేని నగలను విక్రయిస్తే చట్టరీత్యా గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష లేదా రూ.2 లక్షల నుంచి 5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఆ షాపులోని ఆభరణాలనూ సీజ్ చేస్తారు. అలాగే నగల కొనుగోలుదారుకు హాల్‌మార్క్ సర్టిఫికేషన్ ఉన్న బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలి. బిల్లు ఇవ్వకపోయినా షాపు యజమానిపై చర్యలు తీసుకుంటారు. ఇకపై ఆభరణాల నాణ్యతపై అనుమానం వచ్చి బీఐఎస్ అధికారులకు ఫిర్యాదు చేస్తే వాటి స్వచ్ఛతను పరీక్షిస్తారు. స్వచ్ఛతలో తేడాలుంటే ఆ మొత్తాన్ని షాపు యజమాని నుంచి వసూలు చేసి కొనుగోలుదారుకు ఇప్పిస్తారు. మోసాలు ఇలా.. బంగారంలో ఇతర లోహాలను కలిపినా దాని సహజ రంగు పూర్తిగా కోల్పోదు. వ్యాపారులు దీనిని ఆసరా చేసుకుని కృత్రిమ లేపనాలతో మెరిసేలా చేసి, రాగి వంటి లోహాలను కలిపి మేలిమి బంగారంగా అంటగడతారు. ఇకపై అలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయడానికి, వినియోగదారుడిని కల్తీ నుంచి కాపాడటానికి బీఐఎస్ హాల్‌మార్క్ నిబంధన ఉపయోగపడుతుందని కన్సూ్యమర్స్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ స్టేట్ విజిలెన్స్ కమిటీ సభ్యుడు కాండ్రేగుల వెంకటరమణ ‘సాక్షి’తో చెప్పారు. రాష్ట్రంలో 876 షాపులే.. ఆంధ్రప్రదేశ్‌లో 876 దుకాణాలకు మాత్రమే హాల్‌మార్క్ రిజిస్ట్రేషన్ ఉంది. ఈ లైసెన్స్ లేని షాపులు రాష్ట్రంలో 7 వేలకు పైగా ఉండవచ్చని అధికారుల అంచనా. రాష్ట్రంలో ఇలాంటి షాపుల గణనను చేపట్టే పనిలో బీఐఎస్ అధికారులున్నారు. హాల్‌మార్క్ అంటే.. ఆభరణాల బంగారంలో స్వచ్ఛత పాళ్లను తెలియజేసేదే హాల్‌మార్క్. నగలపై బంగారం స్వచ్ఛత, ముద్ర, హాల్‌మార్క్ వేసిన కేంద్రం పేరు, ఆభరణం తయారు చేసిన తేదీ, విక్రయించిన షాపు పేరు ఉంటాయి. ఆభరణం నాణ్యతలో తేడాలుంటే.. దీనిని బట్టి అది ఏ షాపులో కొనుగోలు చేసిందీ తెలిసిపోతుంది. ముద్ర లేజర్‌తో వేసింది కాబట్టి చెరిగిపోయే లేదా చెరిపేసే వీలుండదు. శిక్ష, జరిమానాలు తప్పవు జూన్ 1 నుంచి జ్యుయలరీ షాపుల్లో హాల్‌మార్క్ ఆభరణాలనే విక్రయించాలి. ఈలోగా దుకాణాల వారు బీఐఎస్ నుంచి హాల్‌మార్క్ రిజిస్ట్రేషన్ చేయించుకుని సర్టిఫికేషన్ పొందాలి. దీనిపై జ్యుయలరీ అసోసియేషన్ల ప్రతినిధులకు అవగాహన కల్పిస్తున్నాం. హాల్‌మార్క్ లేని ఆభరణాలు విక్రయిస్తే జైలు శిక్ష, భారీ జరిమానా తప్పదు. – ఆర్.తిరుమలరావు, సైంటిస్ట్–డి, బీఐఎస్ -
అక్కడ అరనిమిషం ‘నో మాస్క్’
భోపాల్: కరోనా వ్యాప్తిని కట్టడిచేసేందుకు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేశారు. రెండు నెలల లాక్డౌన్ అనంతరం కరోనా నిబంధనలను దశల వారీగా కొంత సడలించారు. అయితే మధ్య ప్రదేశ్ పోలీసులు మాత్రం మరో కొత్త రూల్‌ని అమలులోకి తెచ్చారు. బ్యాంకులు, బంగారం షాపులను సందర్శించేవారు 30 సెకన్ల పాటు మాస్క్‌ని తీసివేయాలని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ప్రజలను కోరింది. (బుద్ధి లేదా.. ఇంత బాధ్యతారాహిత్యమా?) ఇంతకీ విషయం ఏమిటంటే మాస్క్‌లు ధరించి బ్యాంకుల్లోనూ, బంగారం షాపుల్లోనూ దోపిడీలకు పాల్పడే ప్రమాదం ఉందనీ, అలా జరిగితే మాస్క్‌ల కారణంగా సీసీటీవీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డయినప్పటికీ వారిని గుర్తించడం కష్టం కనుక ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా ఈ నోమాస్క్ ఆదేశాలు జారీచేసింది. 30 సెకన్ల పాటు మాస్క్‌తీయడం వల్ల వారిని సీసీటీవీ కెమెరాల్లో బంధించే వీలుంటుంది. తప్పు చేస్తే, తప్పించుకునే అవకాశం కూడా ఉండదు. (మాస్క్ లేకుంటే శిక్ష తప్పదు ) -
4 కేజీల బంగారు ఆభరణాల చోరీ
సాక్షి, బొమ్మలసత్రం: నంద్యాల పట్టణంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత బంగారు దుకాణంలో భారీ చోరీ జరిగింది. వన్‌టౌన్ పరిధిలోని నిమిషాంబ బంగారు దుకాణంలో నాలుగు కేజీల బంగారం. రూ.5లక్షల నగదు ఎత్తికెళ్లారు. వన్‌టౌన్ సీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన చిత్తారి వెంకన్నవర్మ చాలాకాలంగా బంగారు అంగళ్ల వీధిలో దుకాణాన్ని నడుపుతున్నాడు. షాపు వెనుక భాగంలో గోడతో పాటు ఇనుముతో తయారు చేసి తలుపు ఉంది. పాత భవనం కావటంతో షాపు పైభాగంలో గవాజీ ఉండేది. యజమాని వెంకన్నవర్మ ఎప్పటిలాగే బుధవారం రాత్రి 10 గంటలకు దుకాణం మూసి ఇంటికి వెళ్లి పోయాడు. రాత్రి 12 నుంచి 2 వరకూ పట్టణంలో ఓ మోస్తారు వర్షం కురిసింది. వర్షం నిలిచిపోయిన కొద్ది సేపటికి ఆప్రాంతంలో పోలీసు పహారా లేకపోవటం దొంగలకు అదనుగా మారింది. పక్కనే మెట్ల ద్వారా దొంగలు షాపు పైఅంతస్తుకు ప్రవేశించారు. పైభాగంలో వెంటిలేషన్ కోసం ఉంచిన గవాజీ నుంచి దొంగలు దర్జాగా దుకాణంలోకి ప్రవేశించారు. దుకాణంలో ఉన్న బంగారు అభరణాలతో పాటు గల్లా పెట్టెలో దాచిన రూ.5 లక్షల నగదును దోచుకున్నారు. అనంతరం దుకాణం వెనక భాగంలో ఉన్న ఇనుప వాకిలి వద్దకు చేరి దానికున్న తాళం నెమ్మదిగా తొలగించి అక్కడి నుంచి జారుకున్నారు. ఉదయం 11 గంటలకు వెంకన్నవర్మ దుకాణాన్ని తెరిచాడు. వేసిన తాళాలు వేసినట్టే ఉన్నా దుకాణంలోని బంగారు మాత్రం మాయమైంది. ఇది చూసి యజమాని కంగుతిన్నాడు. తాను దాచుకున్న రూ.5 లక్షల కోసం గళ్లాపెట్టలో చూశాడు. అందులో ఉన్న నగదు కనిపించలేదు. ఇది చూసి బోరున విలపించాడు. ఏం చేయాలో తెలియక ఇరుగుపొరుగు షాపుల యజమానులను పిలిచి విచారించాడు. షాపుపైభాగంలో గమనించగా గవాజీ తెరుచుకుని ఉంది. తన షాపులో దొంగలు పడ్డారని భావించి వెంకనే వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి దొంగల ఆనవాళ్లకోసం గాలించారు. పోలీసు జాగిలాలు దుకాణం మొత్తం తిరిగి షాపు వెనుక భాగంలో నూతనంగా నిరి్మస్తున్న భవనంలోకి వెళ్లి నిలిచిపోయాయి. నిర్మాణంలో ఉన్న భవన యజమానిని విచారించగా బుధవారం నలుగురు కొత్తవారు పనికి వచ్చారని, వారిని మేస్త్రి పంపించారని, వారి వివరాలు తనకు తెలియవని పోలీసులకు తెలిపాడు. అయితే మేస్త్రికి ఫోన్ చేసిన పోలీసులకు తాను ఎవరిని పనికి పంపలేదని కూలీలు అందుబాటులో లేక, పని కొన్ని రోజుల నుంచి నిలిపానని సమాధానం ఇచ్చాడు. దీన్ని బట్టి భవననిర్మాణ కారి్మకుల పేరుతో దొంగలు వచ్చి రెక్కీ నిర్వాహించిన అనంతరం దొంగతనానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. యజమాని వెంకన్నవర్మ ఫిర్యాదు మేరకు దాదాపు రూ.1.40కోట్లు విలువ చేసే 4 కేజీల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులు అంచనా వేసి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
ధనత్రయోదశి ధగధగలు
ఐశ్వర్య ప్రదాయిని అయిన లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందే శుభదినం ధనత్రయోదశి. వెలుగు దివ్వెల పండుగ దీపావళికి రెండు రోజుల ముందు జరుపుకునేదీ ఈ ఉత్సవం. ఆ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సకలశుభాలు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని నమ్మకం. అందుకే ప్రతి ఒక్కరూ ధనత్రయోదశి నాడు శక్తికొలది బంగారం కొని లక్ష్మీదేవిని సేవిస్తారు. ఈ నేపథ్యంలో బంగారు దుకాణాలు కళకళలాడుతున్నాయి. సాక్షి, విజయవాడ: భారతీయ సమాజంలో ధనత్రయోదశికి విశేషమైన ప్రత్యేకత ఉంది. ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశిగా, యమత్రయోదశిగా జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో ధనత్రయోదశిని ధనతేరస్గా జరుపుకుంటారు. ఈ రోజును ఐశ్వర్య ప్రదాయక రోజుగా వారు భావిస్తారు. ధన త్రయోదశి రోజున ఉత్తర భారతీయులు పలు ప్రత్యేక పూజల ద్వారా లక్ష్మీ అమ్మవారి కటాక్షాన్ని పొందేందుకు ప్రత్యేకమైన రోజుగా భావించి పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు. మహిళల సౌభాగ్యానికి, ఐశ్వర్యానికి ధనత్రయోదశి సూచికగా భావిస్తారు. ఆ రోజున వెండి, బంగారాన్ని కొని ధనలక్ష్మిని అర్చిస్తారు. ధన్వంతరి అవతరణ దినోత్సవం కూడా.. ఆయుర్వేద వైద్యానికి ఆది పురుషుడైన ధన్వంతరి అవతరించినది కూడా ధనత్రయోదశి రోజునే. క్షీరసాగర మధనంలో మహాలక్ష్మీతో పాటుగా ధన్వంతరి కూడా ఆవిర్భవించినట్లు పౌరాణికగాథ. ప్రతి ధనత్రయోదశి రోజున జ్యూయలరీ దుకాణాల్లో విస్తృతమైన అమ్మకాలు జరుగుతాయి. ధనత్రయోదశి రోజు కోసం నెల రోజుల ముందు నుంచే వినియోగదారులను ఆకర్షించే విధంగా ప్రకటనలు ఇస్తూ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. భారతదేశంలో జరిగే మొత్తం బంగారు ఆభరణాల అమ్మకాల్లో ధనత్రయోదశి పర్వదినం సందర్భంగా జరిగే అమ్మకాలు 15 నుంచి 20 శాతం ఉంటాయంటే దీని ప్రభావం ఎంతగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జ్యూయలరీ దుకాణాల్లో ప్రారంభమైన సందడి నగరంలో ధనత్రయోదశికి సంబంధించి నాలుగు రోజుల క్రితం నుంచే జ్యూయలరీ దుకాణాల్లో సందడి ప్రారంభమైంది. పలు దుకాణాలు ఇప్పటికే ధనత్రయోదశికి ఆఫర్లు ప్రకటించాయి. మేకింగ్ చార్జీలు, తరుగులో ప్రత్యేకంగా రాయితీని ప్రకటించాయి. ఎంత బంగారం కొనుగోలు చేస్తే అంత వెండి ఉచితమని ప్రకటించాయి. వాటితో పాటుగా పలు ప్రత్యేక రాయితీలంటూ నాలుగు రోజులుగా విస్తృతంగా ప్రకటనలు చేస్తున్నాయి. మొత్తం మీద ఈ ఏడాది కూడా ధనత్రయోదశిని పూర్తి స్థాయిలో వినియోగించుకొని వ్యాపారాన్ని పెంచుకునేందుకు జ్యూయలరీ దుకాణాలు పోటీ పడుతున్నాయి. నేటి మధ్యాహ్నం నుంచి త్రయోదశి తిథి ఈ ఏడాది ధనత్రయోదశి ఘడియలు శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమై శనివారం మధ్యాహ్నం వరకూ ఉంటుందని పండితులు చెబుతున్నారు. కొంతమంది శుక్రవారం మరికొంతమంది శనివారం ఈ పర్వదినాన్ని జరుపుకుంటారని పండితులువ వివరిస్తున్నారు. -
భాగ్యనగరంలో అక్షయ తృతీయ సందడి
-
ఢిల్లీలో ఐటీ అధికారులు సోదాలు
-
గోల్డ్ షాపులపై ఐటీ ఆకస్మిక దాడులు
విజయవాడ: పెద్దనోట్ల రద్దు అనంతరం పలు ప్రాంతాల్లో అధికారుల తనిఖీలలో కోట్లరూపాయల కొత్త, పాత నోట్లతో పాటు బంగారం వెలుగుచూస్తుంది. ఈ క్రమంలో విజయవాడలో పలు ఏరియాలో ఆదాయపన్నుశాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వన్ టౌన్ లోని గోల్డ్ విక్రయించే షాపులపై ఐటీ దాడులు వేగవంతం చేసింది. పరిమితికి మించి విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న రోజే భారీ మొత్తంలో బంగారం అమ్మకాలు జరిగాయని, అప్పటినుంచీ చాలా గోల్డ్ షాపుల్లో విరివిగా బంగారం క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. దీనిపై అధికారులు స్పందించి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. -
బంగారం షాపులపై ఐటీ దాడులు..
-
బంగారంపై షాపులపై కేసులు
-
బంగారం షాపులపై ఐటీ దాడులు
తెనాలి: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో భారీగా బంగారు కొనుగోళ్లు చేసిన వారిపై ఐటీ శాఖ అధికారులు కన్నేశారు. గుంటూరు తెనాలి టీబీ రోడ్‌లోని బంగారం దుకాణాలపై ఇన్‌కం ట్యాక్స్ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. స్థానిక భవదీప్ జ్యూయలర్స్‌లో అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. విషయం తెలుసుకున్న ఇతర బంగారం వ్యాపారస్థులు దుకాణాలు మూసి వేశారు. -
15 బంగారం షాప్‌లకు డీజీసీఐ నోటీసులు
-
బంగారం షాపులపై ఐటీ దాడులు
-
15 బంగారం షాప్‌లకు డీజీసీఐ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో అక్రమ బంగారం అమ్మకాలపై డైరెక్టర్ జనరల్ సెంట్రల్ ఎక్సైజ్ ఇంటె లిజెన్స్ (డీజీసీఐ) నిఘా పెట్టింది. హైదరాబాద్‌లోని 15 దుకాణాలకు శుక్రవారం సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్ సెక్షన్ 14 ప్రకారం డీజీసీఐ నోటీసులిచ్చింది. గత నాలుగు రోజులుగా విక్రయించిన బంగారం, వజ్రాభరణాల లావాదేవీల పూర్తి వివరాలను 24 గంటల్లోగా తెలపాలని బంగారం వ్యాపారులను ఆదేశించింది. నగరంలో అక్రమ బంగారం వ్యాపారం, నల్లకుబేరుల ఆటకట్టించేందుకు 6 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు డీజీసీఐ తెలిపింది. మరోవైపు చెన్నై నగరంలో ఏకకాలంలో ఎనిమిది చోట్ల శుక్రవారం ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. చెన్నైలోని ప్రముఖ వ్యాపార కూడలి ప్యారిస్, ఎన్ఎస్సీ బోస్ రోడ్లలోని బంగారు దుకాణాలు, మనీ ఎక్చేంజ్ సెంటర్లు, అనుమానిత హవాల కేంద్రాలపై దాడులు చేశారు. అయితే ఈ దాడుల్లో ఎంత సొమ్ము పట్టుబడిందన్న వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. -
బంగారం షాపులు, ఫారెక్స్ కంపెనీలపై దాడులు
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను బ్యాన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన అనంతరం నల్ల కుబేరులు వణికిపోతున్నారా?. తాజా పరిస్ధితులు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. గత మూడు రోజులుగా పెద్దనోట్లను చలామణిలోకి తీసుకురావడానికి నల్ల కుబేరులు నానాతంటాలు పడుతున్నారు. బంగారం షాపులు, ఫారెక్స్ కంపెనీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారనే సమాచారంతో వాటిపై ఐటీ, ఈడీలు దాడులకు పూనుకోవడంతో వారిలో మరింత కలవరం మొదలైంది. బంగారం షాపుల నగదు లావాదేవీలను ఐటీ శాఖ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అంతేకాదు ఫారెక్స్ కంపెనీలపై ఈడీ ప్రత్యేక దృష్టి సారించింది. దేశంలోని 67 ఫారెక్స్ కంపెనీలపై ఒకేసారి దాడులు చేసింది. కంపెనీలకు, బంగారు షాపులకు చెందిన అన్ని వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. గత మూడు రోజుల్లో రూ.2.5లక్షలకు పైచిలుకు జరిగిన లావాదేవీల వివరాలను అందజేయాలని ఐటీ శాఖ ఇప్పటికే బ్యాంకులను కోరిన విషయం తెలిసిందే. -
ప్రభుత్వ వైఖరి మారాలి
బంద్ పాటించిన బంగారు దుకాణాల యజమానులు అనంతపురం న్యూటౌన్ : బంగారు దుకాణాలపై క స్టమ్స్ సుంకం పెంచడం, రూ. 2 లక్షలు విలువ చేసే నగల కొనుగోళ్లపై పాన్ కార్డును తప్పనిసరి చేయడం వంటివి తమ వ్యాపారాలకు అడ్డంకిగా మారాయని స్వర్ణకార సంఘాల నాయకులు అన్నారు. బంగారు దుకాణదారుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ స్వర్ణకార, కార్మిక, వర్తక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని అన్ని బంగారు దుకాణాలను మూసివేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వానికి ఇప్పటికే చాలా సార్లు తమ సమస్యల గోడు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతోనే బంద్‌లో పాల్గొనాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు మహబూబ్ బాషా, కార్యదర్శి మన్సూర్, సంఘం సభ్యులు రంగాచారి, శ్రీనివాసులు, రామాంజనేయులు పాల్గొన్నారు. కొవ్వొత్తుల ప్రదర్శన : అదేవిధంగా సమస్యల పరిష్కారం కోసం బంగారు దుకాణాల యజమానులు మంగళవారం రాత్రి పాతూరు నుంచిసప్తగిరి సర్కిల్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవ హారం నిర్మించి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
29 నుంచి బంగారు షాపుల నిరవధిక బంద్
నరసరావుపేట వెస్ట్(గుంటూరు జిల్లా): కేంద్ర ప్రభుత్వం బంగారం వ్యాపారంపై విధించిన సెంట్రల్ ఎక్సైజ్ పన్నుకు నిరసనగా ఈనెల 29 నుంచి రాష్ట్రంలో బంగారం వ్యాపారులు నిరవధిక బంద్ చేపడుతున్నట్లు ఏపీ బులియన్, గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్ మర్చంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్ వెల్లడించారు. ఆదివారం గుంటూరు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వర్తక ప్రతినిధుల తృతీయ సమావేశంలో తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయం మేరకు 13 జిల్లాల్లోని వ్యాపారులు తమ షాపులను మూసివేసి బంద్‌లో పాల్గొంటారని ఆయన విలేకరులకు తెలిపారు. బంద్ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఒక రోజు స్థానిక ఎమ్మెల్యేను, మరుసటి రోజు పార్లమెంటు సభ్యులు, ఆ మరుసటి రోజు మంత్రులను ఘెరావ్ వంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. అర్ధనగ్న ప్రదర్శనలు, కాగడా ప్రదర్శనలు నిర్వహించి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తామన్నారు. ఎక్సైజ్ పన్నును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ స్టేట్ చీఫ్ ఆర్గనైజర్ ఎస్.శాంతిలాల్‌జైన్ మాట్లాడుతూ బంగారం వ్యాపారంపై విధించిన సెంట్రల్ ఎక్సైజ్ పన్నుపై దేశవ్యాప్తంగా గత 25 రోజుల నుంచి వర్తకులు బంద్ చేస్తున్నారన్నారు. ఏపీలో మాత్రం కొన్నాళ్లు బంద్ నిర్వహించి ఆపేశారని, ఇప్పుడు మిగతా రాష్ట్రాల వర్తకులకు మద్దతుగా తాము కూడా పన్నును రద్దు చేసేవరకు బంద్ చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు చెప్పారు. -
పుస్తెలకూ పసిడి కరువే
అమలాపురం టౌన్: పసిమివన్నె పసిడి నిత్యావసరవస్తువు కాకపోవచ్చు. అయినా బంగారం వ్యాపారులు పాటిస్తున్న బంద్ ప్రభావం.. లగ్గసరి నేపథ్యంలో హెచ్చుగానే ఉంది. చివరికి తాళిబొట్టు తయూరీకి అవసరమైన బంగారం కూడా కొనలేక వధూవరుల కుటుం బాలు ఇబ్బంది పడాల్సి వస్తోంది. బంగారం విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో ఒక శాతం ఎక్సైజ్ డ్యూటీ విధించినందుకు నిరసనగా బంగారు వర్తకులు చేపట్టిన బంద్ ఈనెల 17 వరకూ జరగనుంది. దేశ వాప్తంగా బంద్ జరుగుతుండటంతో ఎక్కడ, ఎవరికి బంగారం అవసరమైనా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. జిల్లాలో ఉన్న రెండు వేలకు పైగా బంగారు దుకాణాలు ఈనెల 9 నుంచి మూతపడ్డారుు. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, మండపేట, రామచంద్రపురం తదితర పట్టణాల్లోనే కాక మండల కేంద్రాల్లో ఉన్న పసిడి దుకాణాలూ తెరుచుకోక రోజుకు రూ.కోట్లలో అమ్మకాలు నిలిచిపోయాయి. ఈనెల 11,15 తేదీల్లో పెళ్లిళ్లకు బలమైన ముహూర్తాలు ఉండటంతో ఆ కుటుంబాలకు బంగారం లేదా నగలు కొనుగోలు చేయటం అత్యవసరం. ఈ రెండు ముహూర్తాల్లో జిల్లాలో మూడు వేలకు పైగా పెళ్లిళ్లు జరుగుతున్నట్లు అంచనా. కాలం మారిపోయి ఇప్పుడు పెళ్లిళ్లకు వధూవరులకు, ఇతర సంప్రదాయాలకు బంగారు నగలను తయారు చేయించటం లేదు. అప్పటికప్పుడు దుకాణాలకు వచ్చి రెడీమేడ్ నగలను వచ్చి కొనుగోలు చేయటం పరిపాటైంది. చివరకు మంగళ సూత్రాలు కూడా రెడీమేడ్‌వి వినియోగిస్తుండటంతో ముహూర్తం దగ్గర పడ్డా సూత్రం సిద్ధం కాకపోవటంతో కంగారు పడుతున్నారు. జిల్లాలో దుకాణాలు 9 రోజుల పాటు మూత పడటంతో పెళ్లి ఇళ్ల వారికి ఏమీ చేయలేని నిస్సహాయత ఎదురవుతోంది. ఏ విజయవాడో, హైదరాబాదో వెళ్లి కొందామన్నా వీలు కాని పరిస్థితి. ఈ క్రమంలో పెళ్లి ఇళ్ల వారు బంగారు దుకాణ యజమానుల వద్దకు వెళ్లి బతిమాలుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి బంగారు వర్తకుల బంద్ గురించి తెలియక నగరాలు, పట్టణాల్లోని దుకాణాలకు వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్నారు. కొత్త బంగారముందా.. మిత్రులారా! కాట్రేనికోన మండలం దొంతుకుర్రుకు చెందిన ఓ కుటుంబంలో ఈనెల 15న పెళ్లి జరగనుంది. వారు బంగారు నగల కొనుగోలుకు శుక్రవారం అమలాపురంలోని ఓ పెద్ద నగల దుకాణానికి వచ్చారు. బంద్ గురించి తెలిసి దుకాణ యజమాని ఇంటికి వెళ్లి నగల కోసం అడిగారు. యూనియన్ నిబంధనల ప్రకారం దుకాణాలు తెరవకూడదని, తాను చేయగలిగిందేమీ లేదని ఆయన చేతులెత్తేశారు. రాత్రి పది గంటల తర్వాతైనా దుకాణం తెరిచి నగలు అమ్మమని, కనీసం మంగళ సూత్రానికైనా బంగారం అమ్మమని పెళ్లింటి వారు బతిమాలారు. ఈ పరిస్థితి జిల్లా అంతటా ఉంది. పెళ్లిళ్లకు కచ్చితంగా కొత్త బంగారమే వాడతారు. అందులోకి మంగళ సూత్రానికి విధిగా కొత్త బంగారం కావాల్సి రావటంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఎవరైనా బంధువులు, స్నేహితులు గతంలో కొనుగోలు చేసిన కొత్త బంగారం ఉందేమోనని కొందరు అన్వేషణలో పడ్డారు. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం మార్కెట్లకు బంగారం కొనుగోలుకు వచ్చి నిరాశతో తిరిగి వెళుతున్న వినియోగదారుల సంఖ్య శుక్రవారం ఎక్కువగా కనిపించింది. మరో పక్క ఎక్సైజ్ డ్యూటీ రద్దు చేసేవరకూ బంద్ విరమించేది లేదనిముంబై, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాల బులియన్ యూనియన్ల నుంచి సంకేతాలు వస్తున్న క్రమంలో ఈ బంద్ మరిన్ని రోజులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. -
పార్వతీపురంలో బంగారు దుకాణాల మూసివేత
కేంద్ర బడ్జెట్లో బంగారంపై విధించిన ఒక శాతం ఎక్సైజ్ పన్నును రద్దు చేయాలని కోరుతూ విజయనగరం జిల్లా పార్వతీపురంలో బంగారు వర్తక సంఘం ఆధ్వర్యంలో బుధవారం దుకాణాలు మూసివేశారు. మెయిన్రోడ్లో ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆర్డీఓ రామకృష్ణకు వినతిపత్రం అందించారు. మూడు రోజుల్లోగా తమ డిమాండ్‌కు స్పందించకపోతే బంగారు దుకాణాల నిరవధిక బంద్ చేస్తామని బంగారు వర్తక సంఘం ప్రకటించింది. -
బంగారం ధర తగ్గినా కొనేవారులేరు!
హైదరాబాద్: అక్షయ తృతీయ అనగానే బంగారం షాపులు పూలతో సింగారించుకుని కొనుగోలు దారులకు ఆహ్వనం పలికేవి. కానీ ఈ అక్షయ తృతీయకు మాత్రం కొనుగోలు దారులు లేక బంగారం షాపులు వెలవెలబోతున్నాయి. కిందటి ఏడాదితో పోల్చితే బంగారం ధర తగ్గినా, కొనుగోళ్ళు మాత్రం పుంజుకోలేదు. అక్షయ తృతీయ అనగానే మహిళలే కాదు అటు బంగారం షాపు యజమానులు సంతోషపడే వారు. కానీ ఈ సారి పరిస్థితి వేరుగా ఉంది. అటు కస్టమర్లు ఇటు బంగారం షాపు యజమానులు నిరుత్సాహంగా ఉన్నారు. కారణం ఒక్కటే. అక్షయ తృతీయ రోజున తృతీయ ముహూర్తం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకే ఉండటం. ఆ ముహూర్తంలోనే ఎక్కువ మంది బంగారం కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారు. అంతేకాదు ఆ ముహూర్తంలో కొంటే సాక్షాత్తు లక్ష్మీ దేవి నట్టింట్లో ఏడాది మొత్తం తిరుగుతుందని ఎక్కువ మంది నమ్మకం. ఈ సారి రాత్రి ముహూర్తం ఉండటం కొంత కస్టమర్లను నిరుత్సాహపడేలా చేస్తోంది. అయినప్పటికీ కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు ఆఫర్లు ఇస్తున్నామని బంగారం అమ్మకం దారులు చెపుతున్నారు. ఇక కస్టమర్లు మాత్రం ముమూర్తం ఎప్పుడున్నా ఖచ్చితంగా కొనితీరుతామని చెపుతున్నారు. సెంటిమెంట్‌గా భావించడం వల్లనే కొనుగోలు చేస్తున్నామని ఈ రోజు బంగారం కొంటే మంచి జరుగుతుందని వారు చెపుతున్నారు. ఇక కిందటి ఏడాది ఇదే అక్షయ తృతీయకు 10 గ్రాముల బంగారం ధర 30 వేల రూపాయలు ధర పలికింది, కిలో వెండి ధర 47వేల 500 రూపాయలు. ఈ ఏడాది మాత్రం 10 గ్రాముల బంగారం ధర 26 వేల రూపాయలకు తగ్గింది. కిలో వెండి 37 వేల రూపాయలకు పడిపోయింది. అయినప్పటికీ బంగారం వెండి కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ముందకు రావడం లేదు. స్టాక్స్‌లలో పెట్టుపెట్టడానికే పెద్ద పీఠ వేస్తున్నారని గోల్డ్ అనలిస్ట్‌లు చెపుతున్నారు. బంగారం ధర పెరుగుతూ ఉంటే కొనుగోలుదారులు ఎగబడతారు. తగ్గుతూ ఉంటే కొనడానికి అంతగా ఆసక్తి చూపరని అర్ధమవుతోంది. మొత్తం మీద ఈ సారి బంగారం షాపుల యజమానులకు కాసుల పంట పండిస్తుందనుకున్న అక్షయ తృతీయ చాలా నిరాశ మిగిల్చింది. అయినప్పటికీ రానున్నది పెళ్ళిళ్ళ సీజన్ అయినందున మళ్లీ ధరలు పుంజుకుంటాయని అమ్మకాలు పెరుగుతాయనే ఆశాభావంతో వారు ఉన్నారు. -
పక్కదారి పడుతున్న పసిడి !
బాన్సువాడ : జిల్లాలో బంగారం దుకాణాల్లో క్రయ విక్రయాలు కనీస లెక్కలు లేకుండా సాగుతున్నాయి. సాధారణంగా మార్కెట్లో ఏ వస్తువు కొనుగోలు చేసినా బిల్లు ఇస్తారు. రూ.10తో కొనుగోలు చేసినా, రూ.10వేలతో కొనుగోలు చేసినా బిల్లు ఇస్తారు. కానీ వెండి, బంగారు వర్తకుల దుకాణాల్లో మాత్రం లక్షలాది రూపాయలు వెచ్చించి, బంగారాన్ని కొనుగోలు చేసినా, కనీస లెక్కా, పత్రాలు ఇవ్వకపోవడం గమనార్హం. జిల్లాలో బిల్లులు లేకుండా జరుగుతున్న బంగారం వ్యాపారం ‘మూడు కాసులు... ఆరు క్యారెట్లు’గా సాగుతోంది. ఈ వ్యాపారం ఎక్కువగా నిజామాబాద్, ఆర్మూర్, బాన్సువాడ, కా మారెడ్డి, బోధన్ పట్టణాల్లో జరుగుతోంది. పెళ్ళిళ్ళ సీజన్ రాకతో ప్రస్తు తం బంగారం కొనుగోళ్లు పెరిగాయి. ఇక్కడి వ్యాపారులు ముంబై, హైదరాబాద్‌లను కేంద్రంగా చేసుకొని బంగారాన్ని ఇక్కడికి దిగుమతి చేసుకొని క్రయ విక్రయాలు సాగిస్తున్నారు. అక్రమంగా తెస్తున్న బంగారం ఒక వేళ పోలీసుల కంటపడితే అప్పటికప్పుడే బిల్లులు తెప్పిస్తున్నారు. ఆదాయ పన్నుల శాఖకు గండి జిల్లాలో నిత్యం పది నుంచి 30 కిలోల బంగారు నగలు వస్తుంటాయని వ్యాపారుల ద్వారా తెలిసింది. సాధారణంగా నగలపై ఒక శాతం పన్ను, అదే రూ.5లక్షలు దాటితే రెండు శాతం పన్ను చెల్లించాలి. దీన్ని తప్పించుకొనేందుకే దొంగ వ్యాపారం చే స్తున్నట్లు తెలుస్తోంది. రవాణా చేసే బంగారంలో ఒకటి లేదా రెండు కిలోలకు మాత్రమే బిల్లులు ఉంటాయి. ఇలా పది కిలోల బంగారం బిల్లులు లేకుండా చేస్తే ప్రభుత్వానికి రూ.5లక్షల వరకు గండి పడుతుంది. అంటే మొత్తం మీద రూ.10 లక్షల వరకు హోల్‌సెల్ వ్యాపారులే ప్రతీ నెల ఆదాయ పన్నుల శాఖకు గండి కొడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా అక్రమంగా దిగుమతి చేసుకొంటున్న బంగారానికి లెక్కలు చూకపోవడంతో ప్రభుత్వానికి భారీ స్థాయిలోనే ఆదాయానికి గండి పడుతోంది. దిగుమతి చేసుకొంటున్న బంగారంలో సింహ భాగం లెక్కలు లేకపోవడంతో జిల్లాలో దొంగ బంగారం యథేచ్ఛగా చేతులు మారిపోతోంది. ఇటీవల బాన్సువాడలో అనేకమార్లు దొంగ బంగారం కొనుగోలు విషయమై పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొన్నారు. అక్రమంగా దిగుమతి చేసుకొంటున్న బంగారం, వజ్రాలను దుకాణాల్లో ఉంచి విక్రయాలు సాగిస్తుండగా, ఆదాయ పన్నుల శాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
ఉల్లిపాయ... మహా మాయ...
ఢిల్లీలో 1998లో అధికారంలో ఉన్న బీజేపీ, ఆ సంవత్సరం జరిగిన ఎన్నికలలో మట్టి కరిచిందంటే కారణం ఉల్లి సంక్షోభమే. షీలాదీక్షిత్ వణుకంతా ఇందుకే. ఆహారభద్రత చట్టం తెచ్చిన ఫలితం ఉల్లి మాయతో భ్రష్టు పట్టిపోతుందని కాంగ్రె స్ భయం. ‘టైర్లు కొంటే ఉల్లిపాయలు ఉచితం!’ ఇది కొద్దిరోజుల క్రితం జార్ఖండ్‌లో ఒక దుకాణం ముందు కనిపించిన రాత. ఇలాంటి ఎరల వివరాలు ఇంకొద్ది రోజులలో బంగారం దుకా ణాల ముందు వెలిసినా ఆశ్చర్యపోవక్కర లేదు. ఉల్లినీ, టొమేటోనీ బ్యాంకు లాకర్లలో పెట్టి ఢిల్లీలో బీజేపీ కార్యకర్తలు వినూత్న నిర సన తెలియచేశారు. ముందు ముందు టీవీ లూ మోటారుబైక్లూ లేదా నగలూ - వీటిని కాదు దొంగలు ఎత్తుకువెళ్లేది, ఉల్లిపాయలనే, అని కాన్పూరు ఎమ్మెల్యే ఒకరు చేసిన వ్యాఖ్య అక్కడ చాలా ప్రాచుర్యం పొందింది. ఉల్లి సంక్షోభం, ధరలు ఆ స్థాయిలోనే ఉన్నాయి. ఇది దేశానికి కొత్తకాదు. పొరలు ఒలిచిన కొద్దీ ఉల్లిఘాటు పెరిగినట్టు, సంక్షోభం తరువాత సంక్షోభం తీవ్రమౌతోంది. కానీ తాజా ఉల్లి సంక్షోభానికి ప్రత్యేకత ఉంది. ఇది సామా న్యుల చేతకంటె రాజకీయ పార్టీలనీ, ముఖ్యం గా కొందరు ముఖ్యమంత్రుల చేత ధారాపా తంగా కంటనీరు పెట్టిస్తున్నది. రెండురోజుల క్రితం రాజధాని ఢిల్లీలో ఉల్లి ధర కిలో వంద రూపాయలకు ఎగబాకిం ది. ముంబై, పాట్నా, చండీఘడ్‌లలో కూడా అంతే పలుకుతోంది. ఈ ఘాటుతో మొదట వణికిపోయిన రాజకీయ నేత ఢిల్లీ ముఖ్య మంత్రి షీలాదీక్షిత్. ప్రతికూల సర్వేలతో కుం గిపోయి ఉన్న కాంగ్రెస్ అడ్డూ అదుపూ లేకుం డా పెరుగుతున్న ఉల్లి ధరతో అక్షరాలా వణికి పోతోంది. అత్యవసరంగా కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్‌తో సమావేశమైన షీలా దీక్షిత్ చర్యలు తీసుకోవాల్సిందని వేడుకున్నా రు. కోడ్ అమలులో ఉన్నందున, చౌక ధరలో ప్రజలకు ఉల్లి అందించడానికి అనుమతి ఇవ్వ వలసిందిగా ఎన్నికల సంఘాన్ని కోరాలని కూడా షీలా భావిస్తున్నారని వార్తలు వచ్చా యి. అంటే ఆహారంలో ప్రధాన దినుసుగా ఉండే ఉల్లి లేక దేశంలో అత్యధిక కుటుం బాలు బాధ పడుతున్నందుకు నేతలు కదల డంలేదు. డిసెంబర్ 4న జరిగే ఎన్నికలలో పార్టీకి ఉల్లి పా(మా)యతో జరగబోయే చేటు గురించి కలవరపడుతున్నారు. ఢిల్లీలో 1998 లో అధికారంలో ఉన్న బీజేపీ, ఆ సంవత్సరం జరిగిన ఎన్నికలలో మట్టి కరిచిందంటే కార ణం ఉల్లి సంక్షోభమే. షీలాదీక్షిత్ వణుకంతా ఇందుకే. ఆహారభద్రత చట్టం తెచ్చిన ఫలితం ఉల్లి మాయతో భ్రష్టు పట్టిపోతుందని కాంగ్రె స్ భయం. దేశంలో మూడింట రెండొంతుల మందికి బియ్యం, గోధుమ ఇవ్వడానికి ఉద్దే శించిన ఈ చట్టం ఉల్లి ఘాటును మాత్రం తట్టుకోలేదు. ప్రపంచ చరిత్రలోనే విస్తృత మైన ఆహార రాయితీ పథకంగా పేరు తెచ్చు కున్న భారత ఆహార భద్రత చట్టం, ఉల్లి సంక్షోభాల చరిత్ర ముందు తెల్లమొహం వేయవలసివచ్చింది. ఈనెలలో ఒక్క మూడో వారంలో ఉల్లి టోకు ధరలు 36 శాతం పెరిగాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ లెక్క ప్రకారం జూన్, 2012 నుంచి ఇప్పటిదాకా ఉల్లి ధర 114 శాతం పెరిగింది. ఈ ఏప్రిల్/మే మాసాలలో టోకు మార్కెట్లో కిలో రూ.8కి అమ్మకాలు జరిగితే, బయట కిలో రూ.20 వంతున అమ్మారు. ఇంతలో ఎంత మార్పు! కాబట్టి ఇది కృత్రిమ సంక్షోభమంటూ వినిపిస్తున్న వాదన తోసిపుచ్చలేనిది. మన రాష్ట్రంలో కూ డా వంద దిశగా ఉల్లి ధర పరుగులు తీస్తోంది. నిరుడు అకాల వర్షాలతో దిగుబడి 20 శాతం తగ్గిన మాట నిజమే అయినా, ధరలు మాత్రం అనూహ్యంగా పెరిగాయి. దేశంలో ఎనిమి దిన్నర లక్షల హెక్టార్లలో పదిహేను నుంచి పదిహేడు మిలియన్ టన్నుల ఉల్లి పండిస్తు న్నారు. ఇందులో 80 శాతం మహారాష్ట్ర, కర్ణాటకలదే. శరద్ పవార్ సొంత రాష్ట్రంలోనే నాసిక్ పరిధిలో దిగుబడి తగ్గింది. అయినా కొన్నేళ్ల నుంచి ఉల్లి ఎగుమతుల మీద ఉన్న నిషేధాన్ని కేంద్ర వ్యవసాయమంత్రి ఎత్తేశారు. ఇలాంటి నిషేధాలు విధిస్తే నమ్మకమైన ఉత్పత్తిదారుగా భారత్ మీద ప్రపంచ దేశాలకు నమ్మకం పోతుందని ఆయన వాదన. మన ఉల్లి ప్రధా నంగా బంగ్లాదేశ్‌కు వె ళుతుంది. ఇందులో ఎక్కువ అనధికారిక ఎగుమతులేనని చెబు తారు. అరబ్ దేశాలకీ, శ్రీలంక, హాంకాంగ్, మలేసియా వంటి చోటికి మన ఉల్లి ఎగుమతి అవుతోంది. ఉల్లి ఎగుమతులు ఆపేస్తే దాని ప్రభావం ఇతర ఉత్పత్తుల మీద కూడా పడు తుందని పవార్ చేస్తున్న వాదన ఎలా ఉన్నా దేశంలో సామాన్యుడి మాటేమిటి? ఉల్లితో పాటు ఇతర కూరగాయల ధరలలో వస్తున్న ఈ మార్పులకు కారణం రహస్యం కాదు. దేశంలో జరుగుతున్న కూరలు, పళ్ల ఉత్పత్తిలో నలభై శాతం మార్కెట్‌కు రాకుండానే ధ్వం సం అవుతున్నాయని రిజర్వు బ్యాంకు ఒక సర్వేలో పేర్కొంది. ఇప్పుడు భారత్ ఉల్లి దిగుమతి చేసుకోవాలని, లేదంటే రేపటి ఎన్నికలలో కాంగ్రెస్ మరింత కుంగిపోవడం ఖాయమని ఢిల్లీ ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నా రు. ఇరుగు పొరుగు లేదా ఉల్లి ఎగుమతి చేసే చైనా, ఈజిప్ట్ దేశాలలో కూడా పరిస్థితి ఆశా జనకంగా లేదు. అయితే వర్షాలు పడితే సమస్య తీరిపోతుంది. ఇది తాత్కాలికం- ఇదీ పవార్ జవాబు. అంటే ఉల్లి సంక్షోభం ఇంకా కొనసాగుతుంది. ఉల్లిపాయలు అందక సామాన్య జనం రుచీపచీ లేని భోజనం చేస్తూ గడుపుతు న్నారు. కానీ ఎన్నికలలో వీరంతా ప్రభుత్వాల చేత చేదుగుళికలు మింగిస్తారు. ఆ భయం రాజకీయ నాయకులలో ఎక్కువగానే కనిపి స్తోంది. ఉల్లి ఇప్పుడు వంటింట్లో చిన్న దిను సు కాదు. ప్రభుత్వాలను మార్చే కింగ్‌మేకర్ స్థానాన్ని ఆక్రమించింది. తస్మాత్ జాగ్రత్త. - డా॥గోపరాజు నారాయణరావు