విజయవాడ: పెద్దనోట్ల రద్దు అనంతరం పలు ప్రాంతాల్లో అధికారుల తనిఖీలలో కోట్లరూపాయల కొత్త, పాత నోట్లతో పాటు బంగారం వెలుగుచూస్తుంది. ఈ క్రమంలో విజయవాడలో పలు ఏరియాలో ఆదాయపన్నుశాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వన్ టౌన్ లోని గోల్డ్ విక్రయించే షాపులపై ఐటీ దాడులు వేగవంతం చేసింది.
పరిమితికి మించి విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న రోజే భారీ మొత్తంలో బంగారం అమ్మకాలు జరిగాయని, అప్పటినుంచీ చాలా గోల్డ్ షాపుల్లో విరివిగా బంగారం క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. దీనిపై అధికారులు స్పందించి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు.