
సాక్షి, విజయవాడ: 159వ ఇన్‌కం టాక్స్ డేను పురస్కరించుకుని నగరంలో ఆదివారం ‘వాక్ ఫర్ ఐకర్ భారత్’ పేరుతో ఆదాయం పన్ను కార్యాలయం వద్ద నుంచి 4కే రన్ నిర్వహించారు. ఈ 4కే రన్‌ను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రారంభించి.. రన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇన్‌కంటాక్స్ వాకథాన్‌ను దేశవ్యాప్తంగా నిర్వహించడం హర్షణీయమన్నారు. ప్రజలు తమకు విధించిన ట్యాక్స్‌లను సకాలంలో చెల్లించాలని, పన్నులు సక్రమంగా చెల్లిస్తేనే.. వ్యవస్థలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టవచ్చునని చెప్పారు. టాక్స్‌లు చెల్లించడం ద్వారా పౌరుల మధ్య వ్యత్యాసాలు తగ్గుతాయన్నారు. ప్రజలంతా తమ పరిధిలోని పన్నులు చెల్లించి.. తమ కర్తవ్యాన్ని పాటించాలని పిలుపునిచ్చారు.