ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తోందని వైఎస్సార్ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు.
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తోందని వైఎస్సార్ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. 26న విశాఖ సముద్ర తీరంలో జరిగే కొవ్వొత్తుల ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అన్ని జిల్లాల కేంద్రాల్లో నిర్వహించనున్న కొవ్వొత్తుల ర్యాలీలో ప్రతిఒక్కరు పాల్గొనాలని ఆయన కోరారు.
ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ గొప్ప అనే వాళ్లతో చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.