విశాఖ చేరుకున్న వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నుంచి కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టేందుకు వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. వైఎస్ జగన్ రాక నేపథ్యంలో విమానాశ్రయ పరిసరాల్లో భారీగా బందోబస్తును ఏర్పాటుచేశారు. సాయంత్రం 6 గంటలకు కొవ్వొత్తుల ర్యాలీ ప్రారంభం కావాల్సి ఉంది.
అయితే పోలీసులు ముందుగానే జగన్ కాన్వాయ్‌ని అడ్డగించి, ఆయన సెక్యూరిటీ సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. విమానాశ్రయ పరిసరాల్లో కూడా భారీగా పోలీసులను మోహరించారు. ఎయిర్‌పోర్టుకు కిలోమీటరు దూరం వరకు నిషేధాజ్ఞలు విధించారు.