వైఎస్ జగన్కు మద్దతుగా తల్లి, భార్య..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో గురువారం కొవ్వొత్తులతో ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కుటుంబ సభ్యులు సంఘీభావం ప్రకటించారు. హైదరాబాద్‌లోని వైఎస్ జగన్ నివాసంలో ఆయన తల్లి, వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆయన భార్య వైఎస్ భారతీరెడ్డి కొవ్వొత్తులు వెలిగించి ఆయనకు మద్దతు ప్రకటించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విశాఖపట్నం విమానాశ్రయంలో నిర్బంధించిన సమయంలో ఆయనకు సంఘీభావంగా, ఆయన ఇచ్చిన పిలుపునకు అనుగుణంగా ఈ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని వారు కోరారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ జగన్ చేస్తున్న పోరాటం ఫలించాలని, ప్రత్యేక హోదా రావాలని, దీనివల్ల ప్రజలందరికీ మేలు జరగాలని విజయమ్మ, భారతీ రెడ్డి ఆకాంక్షించారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలని కోరుతూ, వైఎస్ జగన్ పిలుపు మేరకు ఏపీ వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలు కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు.