ఆదిలాబాద్‌లో కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేస్తున్న సంఘాల నాయకులు
ఎదులాపురం(ఆదిలాబాద్) : బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని పలు యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. మంగళవారం రాత్రి పలు సంఘాలు జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌లోని తెలంగాణ చౌక్ నుంచి అమరవీరుల స్తూపం వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ మహిళా చట్టాల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి విఫలమయ్యాయని అన్నారు.
మొన్న జమ్మూకశ్మీర్.. నేడు సోన్‌లో.. మహిళలపై ప్రతి రోజు ఎక్కడో ఒక చోట ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయని అన్నారు. ప్రభుత్వాల్లో మచ్చుకైనా మార్పు కనిపించడం లేదని విమర్శించారు. నిర్మల్ జిల్లా సోన్‌లో బాలికపై అత్యాచారానికి పాల్ప డిన డోకల ప్రవీణ్, మరో నిందితుడిని కఠి నంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాం టి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టాలను పటిష్టం చేయాలని అన్నారు.
తెలంగాణ యువజన సంఘాల సమితి జిల్లా అధ్యక్షుడు బాల శంకర్ కృష్ణ, ఊరే గణేశ్, మానవసేవా మాధవ సేవా సంఘం సభ్యురాలు శశిశకళ, బెస్ట్‌ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, తెలంగాణ జన సమితి జిల్లా నాయకులు సామల ప్రశాంత్, మాల సంక్షేమ నాయకులు పతి హర ప్రభాకర్, పీడీఎస్‌యూ జిల్లా నాయకురాలు కళావతి, తెలంగాణ ప్రజా వైద్యారోగ్య సంఘం నాయకులు బండారి కృష్ణ, టీఆర్‌ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు సతీశ్, కౌన్సిలర్లు దోని జ్యోతి, శైలేందర్, సత్యనారాయణ, వెంకటరమణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment