సాక్షి, హైదరాబాద్: రేపు(ఆదివారం) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. కాగా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి రేపటికి దశాబ్ధం కాలం కానుంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు గులాబీ శ్రేణులు రెడీ అయ్యాయి. ఇక, ఈరోజు(శనివారం) నుంచి మూడు రోజులపాటు వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తామని పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు.
కాగా, రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా బీఆర్‌ఎస్ శ్రేణులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలతో శనివారం హైదరాబాద్ గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం నుంచి తెలంగాణ సచివాలయం ఎదురుగా ఉన్న అమరజ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
#TelanganaDecade #తెలంగాణదశాబ్ది
తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉద్విగ్న భాగస్వాములైన కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, మేధావులు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, విద్యార్థులు, మహిళలు.. యావత్ తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు
తెలంగాణ అమరులకు నివాళులు… pic.twitter.com/GqZi28G14N— BRS Party (@BRSparty) June 1, 2024
మరవైపు.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు(ఆదివారం) తెలంగాణభవన్‌లో జరగబోయే పలు కార్యక్రమాల్లో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ ప్రసంగించనున్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడం, పదేళ్లలో బీఆర్ ఎస్ ప్రభుత్వం సాధించిన ప్రగతి, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులు తదితర అంశాలపై ఆయన మాట్లాడనున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment