ప్రత్యేక హోదా ఆంధ్రులు హక్కు... దానిని పోరాడి సాధించుకుంటామని ప్రత్యేక హోదా సాధన సమతి నాయకులు తెలిపారు.
అనంతపురం అర్బన్ : ప్రత్యేక హోదా ఆంధ్రులు హక్కు... దానిని పోరాడి సాధించుకుంటామని ప్రత్యేక హోదా సాధన సమతి నాయకులు తెలిపారు. గురువారం నగరంలో ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్, సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు దాదాగాంధీ, ఎస్‌కేయూ ప్రొఫెసర్ సదాశివరెడ్డి, మహిళ సమాఖ్య జిల్లా కార్యదర్శి పద్మావతి, నాయకులు జాఫర్, మల్లికార్జున, తదితరులు పాల్గొని మాట్లాడారు.
విభజన హామీని కేంద్రం విస్మరించి ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పిందన్నారు. హోదా సాధనకు కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన చంద్రబాబు నాయుడు తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను మోదీ వద్ద తాకట్టు పెట్టారని మండిపడ్డారు.