కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు
చీపురుపల్లి : రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాలుగేళ్ల పాలనలో ప్రజల జీవితాల్లో చీకట్లు అలముకొన్నాయని వైఎస్సార్ సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. ఈ చీకట్లు తొలగిపోవాలనే కొవ్వొత్తుల వెలుతురులో నిరసన చేపట్టినట్టు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ చీకటి పాలనను నిరసిస్తూ చీపురుపల్లి పట్టణంలో శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మానవహారం ఏర్పడి నిరసన తెలుపుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ప్రారంభమైన ర్యాలీ మెయిన్‌రోడ్డు, గాంధీబొమ్మ జంక్షన్ నుంచి మూడు రోడ్ల జంక్షన్‌కు చేరుకుంది. అంతకు ముందు మూడు రోడ్ల జంక్షన్‌లో జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బాబు పాలనలో చీకటి పరిపాలన కొనసాగుతుందన్నారు.
మంత్రి బాధ్యతలు చేపట్టిన బొబ్బిలి ఎమ్మెల్యే అతి పెద్ద భూ కుంభకోణం వెనుక ఉండడం దారుణమని విమర్శించారు. తెలుగుదేశం పాలనలో ఇసుక, భూ మాఫియాలు పెరిగిపోయారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో సంతకాలు చేసిన పథకాలకు దిక్కు లేదని విమర్శించారు. మహిళల డ్వాక్రా రుణాల మాఫీ, వ్యవసాయ రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి, ఉపాధి కల్పన వంటి ఎన్నో పథకాలు అటకెక్కాయని గుర్తు చేశారు. ప్రజల జీవితాల్లో చీకట్లు ఏర్పడ్డాయన్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగి వెలుగులు రావాలంటే రాబోయే ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కెవి.సూర్యనారాయణరాజు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కెవి.సూర్యనారాయణరాజు, చీపురుపల్లి మండల పార్టీ అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, మండల నాయకులు ఇప్పిలి అనంతం, బెల్లాన త్రినాధ్, పతివాడ రాజారావు, రేవల్ల సత్తిబాబు, చందక గురునాయుడు, అధికార్ల శ్రీనుబాబు, కరిమజ్జి శ్రీనివాసరావు, పనస అప్పారావు, మీసాల రమణ, రఘుమండ త్రినాధ్, కరణం ఆది, గరివిడి మండల నాయకులు మీసాల విశ్వేశ్వరరావు, యలకల అప్పలనాయుడు, వలిరెడ్డి లక్ష్మణ, లెంక శ్రీరాములు, మెరకముడిదాం మండల నాయకులు తాడ్డి వేణు, బూర్లె నరేష్, గుర్ల మండల నాయకులు వరదా ఈశ్వరరావు, తోట తిరుపతిరావు, మంత్రి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment