కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ | candle rally in hindupur | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

Published Thu, Aug 4 2016 10:00 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ - Sakshi

కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

హిందూపురం : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను బీజేపీ నిలబెట్టుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటా సత్యం డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి హిందూపురంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ సర్కిల్‌ నుంచి సద్భావన సర్కిల్‌ వరకు కొవ్వొత్తులు చేతపట్టి నినాదాలు చేస్తూ నిరనస కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా కోటా సత్యం మాట్లాడుతూ రాజ్యసభలో కేవీపీ ప్రైవేట్‌ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతునివ్వాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఇందాద్, రాష్ట్ర నాయకులు ఆదిమూర్తి, జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, పట్టణ అధ్యక్షుడు నాగరాజు, ఏ బ్లాక్‌ కన్వీనర్‌ శైవలి రాజశేఖర్, మధు, మహబూబ్, రెహెమత్, జబీ, రవూఫ్, జహీర్, మహబూ»Œ , శ్యాం, కదిరీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement