kota sathyam
-
‘మంత్రులూ.. మీ నిజాయితీని నిరూపించుకోండి’
అనంతపురం సెంట్రల్ : కరువు పరిస్థితులు నెలకొన్న జిల్లాలో రైతులను, ప్రజలను ఆదుకోకుండా సమస్యలను పక్కదారి పట్టించేలా జిల్లా మంత్రులు వ్యవహరిస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ మండిపడ్డారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీసీసీ చీఫ్ రఘువీరపై కౌంటర్ వ్యాఖ్యలు చేసిన ప్రజాప్రతినిధులపై ఆయన మండిపడ్డారు. అభివద్ధిని మరిచి ఆధిపత్యం కోసం, వాటాల కోసం ఫ్లెక్సీలను అడ్డుపెట్టుకొని బజార్లలో కొట్టుకునే వీధి రౌడీలు మీరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు జిల్లాలో కూర్చొని మనకు రావాల్సిన కేసీ కెనాల్ వాటా కర్నూలుకు ఇస్తుంటే గుడ్లప్పగించి చూస్తుండిపోవడం సిగ్గు చేటన్నారు. రైతులను, ప్రజలను ఆదుకొని మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సూచించారు. -
రక్షకతడి పేరుతో రూ. కోట్లు స్వాహా
అనంతపురం సెంట్రల్ : కంది పంటలకు రక్షకతడి అందించే ముసుగులో అధికారపార్టీ నేతలు రూ. వందల కోట్లు స్వాహా చేసేందుకు రంగం సిద్దం చేశారని డీసీసీ అధ్యక్షులు కోటా సత్యనారాయణ ఆరోపించారు. బుధవారం కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటను రక్షించినట్లు కాకిలెక్కలు చూపి రూ. 300 కోట్లు దిగమింగారని ఆరోపించారు. ప్రస్తుతం కంది పంటకు రక్షకతడి అందించాలని చెబుతూ మరో రూ. 300 కోట్లు నొక్కేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారన్నారు. -
17న రఘువీరా పాదయాత్ర
అమడగూరు : పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఈ నెల 17న మండలంలోని కొట్టువారిపల్లి నుంచి ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం తెలిపారు. గురువారం ఆయన మండలానికి వి చ్చేసి పాదయాత్ర నిర్వహించే రోడ్డు మార్గాన్ని పరిశీలించా రు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పాద యాత్రలో భాగంగా అమడగూరుకు వచ్చే దారి మీదుగా పొలాల్లో పర్యటిస్తూ రఘువీరారెడ్డి రైతులతో మాట్లాడతారన్నారు. అదే దారిలో సీఎం చంద్రబాబు రెయిన్గన్లు ప్రారంభించిన శివన్నతో ముఖాముఖి నిర్వహిస్తారన్నారు. అనంతరం అమడగూరులో బహిరంగ సమావేశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నాగరాజారెడ్డి, కన్వీనర్ బాబాఫకృద్ధీన్, యూత్ నాయకులు పాల్గొన్నారు. -
ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలి
అనంతపురం సెంట్రల్ : రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించేలా పరిపాలన సాగిస్తున్న టీడీపీ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేయాలని డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కరువు కాటకాలు, ప్రాణాంతక రోగాలతో జిల్లావాసులు విలవిలలాడుతున్నారన్నారు. జిల్లావ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంటలు సాగు చేసిన రైతులు దాదాపు రూ. 3 వేల కోట్లు పెట్టుబడులు పెట్టి నష్టపోయారన్నారు. హెచ్చెల్సీ కిందనైనా నీరిచ్చి ఆదుకుంటారనుకుంటే జిల్లాకు రావాల్సిన నీటిని కర్నూలు తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ఇన్పుట్ సబ్సిడీ, బీమా విడుదల చేయాలన్నారు. హంద్రీనీవా ద్వారా 30 టీఎంసీల నీటిని తీసుకొచ్చి ఆయకట్టుకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ నాయకులు రమణ, వాసు, మాసూలు శ్రీనివాసులు, శివ తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు ఆర్థిక భరోసా ఇవ్వాలి
హిందూపురం అర్బన్ : ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలన్నీ ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్థికSభరోసా ఇవ్వాలని డీసీసీ అధ్యక్షుడు కోటాసత్యం, పీసీసీ అధికార ప్రతినిధి బాలాజీ మనోహర్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో వారు విలేకరులతో మాట్లాడుతూ సీఎం, మంత్రులు, అధికారుల పర్యటనలకు చేస్తున్న ఖర్చును రైతులకు పంట నష్టపరిహారంగా అందించవచ్చునన్నారు. అంతేకాకుండా ప్రధాని ఫసల్ బీమా పథకాన్ని వేరుశనగ రైతులకు కూడా వర్తింపజేయాలని తెలిపారు. జిల్లా సర్వసభ్య సమావేశం నియోజకవర్గంలో సమస్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రతినెలా చేపడుతున్న ప్రజా పోరుబాటలో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో జిల్లా స్థాయి సమావేశాలు కొనసాగిస్తున్నామని డీసీసీ అధ్యక్షుడు కోటాసత్యం చెప్పారు. ఇందులో భాగంగా సెప్టెంబరు 3న హిందూపురంలోని ఇందిరమ్మ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం ఉంటుందని అదేరోజు మధ్యాహ్నం కేహెచ్ ఫంక్షన్ హాల్లో జిల్లా సర్వసభ్య సమావేశం జరుగుతుందన్నారు. సమావేశంలో కాంగ్రెస్ సీనియర్‌నాయకులు రమణ, ఆదిమూర్తి, శైవలి రాజశేఖర్, జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, రవూఫ్, యూత్ కాంగ్రెస్ నాయకులు రెహమత్, జబీ, మధు, జమీల్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
‘టీడీపీ కార్యకర్తల కోసమే వేడుకలు’
అనంతపురం అర్బన్ : రాష్ట్ర స్థాయిలో 70వ స్వాతంత్య్ర వేడుకలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసమే ప్రభుత్వం నిర్వహించి, వేడుకల్ని అధికార పార్టీ కార్యక్రమంగా మార్చిందని కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు. వేడుకల్ని తిలకించే భాగ్యాన్ని సామాన్యులకు లేకుండా చేశారని, రాజకీయపార్టీల నేతల్ని ఆహ్వానించాలన్న జ్ఞానం ఆ పార్టీ నాయకులకు లేకుండా పోయిందని మండిపడ్డారు. వేడుకలు నిర్వహించిన నీలం సంజీవరెడ్డి స్టేడియంను శుభ్రం చేసేందుకు మంగళవారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయం నుంచి బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని జిల్లా అధ్యక్షులు కోటా సత్యనారాయణ, నగర అధ్యక్షుడు దాదాగాంధీ, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు కేవీరమణ, నాయకుల్ని అరెస్టు చేసి టూటౌన్ పోలీసు స్టేషన్‌కి తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్టేడియంలోకి ప్రజల్ని పంపకుండా, పచ్చ జెండాలు పట్టుకున్నవారిని లోపలికి అనుమతించారని దుయ్యబట్టారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్కరికైనా ఉందా అని ప్రశ్నించారు. అనంతరం సొంత పూచికత్తుపై విడుదల చేశారు. అనంతరం టవర్ క్లాక్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి నాయకులు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో నాయకులు బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కిరణ్‌కుమార్, అధికార ప్రతినిధి మాసూలు శ్రీనివాసులు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ అగిశం రంగనాథ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి, డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శులు జి.వాసు, సత్యనారాయణ, నాయకులు కొండారెడ్డి, వైఆర్ కృష్ణ, తిరుపాలు, చంద్రశేఖర్, హరిరాయల్, తదితరలు పాల్గొన్నారు. -
‘టీడీపీ హఠావో... రాష్ట్ర్ కీ బచావో’
అనంతపురం సెంట్రల్ : గాంధీ మహాత్ముడు 1934 ఆగస్టు 9న చేపట్టిన క్వింట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రస్తుతం ప్రజలు దేశం నుంచి బీజేపీని, రాష్ట్రం నుంచి టీడీపీని తరిమికొట్టాలని కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షులు కోటా సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులు, మైనారిటీలు, ప్రార్థనా మందిరాలు, మహనీయుల విగ్రహాలపై దాడులు చేయడం సిగ్గు చేటు అని పేర్కొన్నారు. టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలను తరిమికొట్టాలని ఆగస్టు 9న నగరంలో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ నాయకులు వాసు, కేవీ రమణ, నాయకులు చంద్రశేఖర్‌గుప్తా, బాబ్జాన్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
హిందూపురం : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను బీజేపీ నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటా సత్యం డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి హిందూపురంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ సర్కిల్ నుంచి సద్భావన సర్కిల్ వరకు కొవ్వొత్తులు చేతపట్టి నినాదాలు చేస్తూ నిరనస కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కోటా సత్యం మాట్లాడుతూ రాజ్యసభలో కేవీపీ ప్రైవేట్ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతునివ్వాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఇందాద్, రాష్ట్ర నాయకులు ఆదిమూర్తి, జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, పట్టణ అధ్యక్షుడు నాగరాజు, ఏ బ్లాక్ కన్వీనర్ శైవలి రాజశేఖర్, మధు, మహబూబ్, రెహెమత్, జబీ, రవూఫ్, జహీర్, మహబూ»Œ , శ్యాం, కదిరీష్ తదితరులు పాల్గొన్నారు.