కరువు పరిస్థితులు నెలకొన్న జిల్లాలో రైతులను, ప్రజలను ఆదుకోకుండా సమస్యలను పక్కదారి పట్టించేలా జిల్లా మంత్రులు వ్యవహరిస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ మండిపడ్డారు.
అనంతపురం సెంట్రల్ : కరువు పరిస్థితులు నెలకొన్న జిల్లాలో రైతులను, ప్రజలను ఆదుకోకుండా సమస్యలను పక్కదారి పట్టించేలా జిల్లా మంత్రులు వ్యవహరిస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ మండిపడ్డారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీసీసీ చీఫ్ రఘువీరపై కౌంటర్ వ్యాఖ్యలు చేసిన ప్రజాప్రతినిధులపై ఆయన మండిపడ్డారు.
అభివద్ధిని మరిచి ఆధిపత్యం కోసం, వాటాల కోసం ఫ్లెక్సీలను అడ్డుపెట్టుకొని బజార్లలో కొట్టుకునే వీధి రౌడీలు మీరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు జిల్లాలో కూర్చొని మనకు రావాల్సిన కేసీ కెనాల్ వాటా కర్నూలుకు ఇస్తుంటే గుడ్లప్పగించి చూస్తుండిపోవడం సిగ్గు చేటన్నారు. రైతులను, ప్రజలను ఆదుకొని మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సూచించారు.