DCC President
-
ప్రజలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి
సాక్షి, హన్మకొండ: గతంలో వరంగల్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు మంత్రి కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన హన్మకొండ గాంధీ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టకుని వరంగల్‌కు వస్తున్నారో ప్రజలకు కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. (వరంగల్‌లో అదృశ్యం.. కశ్మీర్లో ప్రత్యక్షం) గతంలో గ్రేటర్ వరంగల్‌కు ప్రతి ఏడాది రూ.300 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పారని, కేంద్ర నిధులతో చేసిన అభివృద్ధి పనులే తప్ప, ఒక రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని మండిపడ్డారు.కేంద్రం ఇచ్చిన నిధులతో చేసిన పనులను టీఆర్ఎస్ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుని ఎన్నికల్లో మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తుందని ధ్వజమెత్తారు.కాంగ్రెస్ అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని రాజేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
మా మధ్య పెద్దలు చిచ్చు పెడుతున్నారు!
నల్లగొండ : ఎస్టీల మధ్య కొందరు పెద్దలు చిచ్చు పెడుతున్నారని, లంబాడీలకు, గోండులు, కోయల మధ్య చిచ్చు పెట్టి రిజర్వేషన్ నుంచి తొలగించాలని కుట్రలు పన్నుతున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నాయక్ ఆరోపించారు. మంగళవారం నల్లగొండ ఆర్అండ్బీ అ«తిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు భాస్కర్, రతన్‌సింగ్ నాయక్‌లతో కలిసి ఆయన మాట్లాడారు. 1977లో ఎస్టీలకు రిజర్వేషన్లు పెట్టడం జరిగిందని, ఆనాడు నైజాం, బ్రిటీష్ కాలంలో ఆంధ్రాప్రాంతంలో రిజర్వేషన్లు ఉండేవని, తెలంగాణ లో ఉండేవి కాదన్నారు. ఈ విషయాన్ని ఇంది రాగాంధీ దృష్టికి గిరిజన నేత రవీంద్రనాయక్ తీసుకెళ్లడంతో తెలంగాణ, ఆంధ్రాప్రాంతాల్లో రిజర్వేషన్లు అమలు చేయడం జరిగిందన్నారు. అయితే కొందరు పెద్దలు గోండులను, కోయలను రెచ్చగొట్టి లంబాడీలపై ఉసిగొల్పుతున్నారన్నారు. రాజ్యాంగపరంగా వచ్చిన రిజర్వేషన్లను ఎవరూ కాదనలేరన్నారు. కేసీఆర్ 12 శాతం రిజర్వేషన్లు పెంచుతామని ఎస్టీలను మోసం చేశాడని ఆరోపించారు. త్వరలోనే లంబాడీల బహిరంగ సభ పెడతామన్నారు. గతంలో ఎస్టీ జాబితాలో 35 కులాలు ఉండేవి. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత 13 కులాలు ఉన్నాయని, అయితే లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగిస్తే ఇప్పుడున్న 6 శాతం రిజర్వేషన్లు కూడా తగ్గిపోతాయని, అందరం కలిసి 10శాతం రిజర్వేషన్ సాధిద్ధామన్నారు. విడిపోవడం వల్ల అందరికీ నష్టమని, కలిసివుండి పోరాటం చేద్దామన్నారు. -
పూర్వవైభవం తీసుకొస్తా
సాక్షి, మెదక్: జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానని నూతనంగా ఎన్నికైన డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు. చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకానికి అఖిల భారత్ కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఎట్టకేలకు పచ్చ జెండా ఊపింది. రాష్ట్రంలోని 31 జిల్లాలతో పాటు పట్టణ కాంగ్రెస్ కమిటీ అ«ధ్యక్షుల నియామకానికి గురువారం ఆమోదం తెలిపింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా తిరుపతిరెడ్డిని నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గురువారం నూతన డీసీసీ అధ్యక్షుల జాబితాను విడుదల చేశారు. తిరుపతిరెడ్డి మెదక్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపడంతోపాటు టికెట్‌కోసం గట్టిగా ప్రయత్నించారు. అయితే అధిష్టానం అనూహ్యంగా ఉపేందర్‌రెడ్డి టికెట్ ఇచ్చింది. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వక పోవడం, మాజీ మంత్రి సునీతారెడ్డి తిరుపతిరెడ్డికి మద్దతు తెలపడంతో ఆయన వైపే పీసీసీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. డీసీసీ అధ్యక్షుడి నియామకం విషయంలో మొత్తంగా మాజీ మంత్రి సునీతారెడ్డి తన పంతం నెగ్గించుకున్నట్లు తెలుస్తోంది. నిజాంపేట మండలం కల్వకుంట గ్రామానికి చెందిన తిరుపతిరెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. గ్రామ కమిటీ అధ్యక్షుడి నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి వరకు వివిధ పదవుల్లో పనిచేశారు. అందరిని కలుపుకొని ముందుకు వెళ్తారని పార్టీలో ఆయనకు పేరుంది. జిల్లాలో ఏడాది కాలానికిపైగా పార్టీ జిల్లా అధ్యక్షుడి నియామకంపై కాలయాపన జరుగుతూ వచ్చింది. కొత్త జిల్లాలు ఏర్పడిన సమయంలోనే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని నియమించాలని పార్టీ నేతలు డిమాండ్ చేశా>రు. అధిష్టానం మాత్రం జాప్యం చేస్తూ వస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జిల్లా పార్టీ అధ్యక్షులను నియమిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఎన్నికల సమయంలోనూ డీసీసీ అధ్యక్షులను నియమించలేదు. మాజీ మంత్రి సునీతారెడ్డి జిల్లా పార్టీ బాధ్యతలు చూస్తూ వచ్చారు. అయితే ఇటీవల కాలంలో డీసీసీ నియామకం చేపట్టాలని పార్టీలో నాయకులు డిమాండ్ చేస్తూ వచ్చారు. డీసీసీ నియామకం జరిగితేనే రాబోయే ఎన్నికలకు పార్టీ నాయకులు, కార్యకర్తలను ముందుకు నడిపిస్తారన్న అభిప్రాయాన్ని జిల్లా నాయకులు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డీసీసీ నియామకం దిశగా పీసీసీ చర్యలు ప్రారంభించింది. ఈ అధ్యక్ష పదవికోసం కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, చం ద్రపాల్, మామిళ్ల ఆంజనేయులు, రెడ్డిపల్లి ఆంజ నేయులు పోటీ పడ్డారు. మాజీ మంత్రి సునీతా రెడ్డి కంఠారెడ్డి తిరుపతిరెడ్డికి లేదా రెడ్డిపల్లి ఆంజ నేయులుకు డీసీసీ పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. మామిళ్ల ఆం జనేయులు, చంద్రపాల్‌లు డీసీసీ పదవి దక్కించుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేశారు. గెలుపే లక్ష్యంగా.. డీసీసీ అధ్యక్షుడిగా నియమించడంపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదార్ రాజనర్సింహ, మాజీ మంత్రి సునీతారెడ్డి, ఎమ్మె ల్యే జయప్రకాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డిలకు తిరుపతిరెడ్డి కృతజ్ఞతలు తెలి యజేశారు. పార్టీ బలోపేతానికి పాటు పడుతానని తెలిపారు. జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొ చ్చేందుకు కృషి చేస్తానన్నారు. రాబోయే పార్లమెం ట్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసి ఎన్నికల్లో గెలుపొందేలా ప్రయత్నిస్తానని తెలిపారు. -
జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా నర్సింహారెడ్డి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ)కి కొత్త సారథిగా చల్లా నర్సింహారెడ్డి నియమితులయ్యారు. జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా సంస్థాగత మార్పులు చేసిన ఏఐసీసీ.. రంగారెడ్డి జిల్లాకు సరూర్‌నగర్ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చల్లా నర్సింహారెడ్డి పేరును ఖరారు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వికారాబాద్‌కు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, మేడ్చల్‌కు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌కు బాధ్యతలను కట్టబెట్టింది. జిల్లా కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడానికి చల్లాతో సహా జెడ్పీ కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ ఏనుగు జంగారెడ్డి, మాజీ ఎంపీపీ మల్రెడ్డి రాంరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు వేణుగౌడ్, దండెం రాంరెడ్డి తదితరులు పోటీపడ్డారు. అయితే, ఇందులో చివరి వరకు చల్లా, జంగారెడ్డి పేర్లను అధిష్టానం పరిశీలించినప్పటికీ, నర్సింహారెడ్డి వైపే మొగ్గు చూపింది. జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఇరువురు ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి చల్లా నాయకత్వాన్ని సిఫార్సు చేశారు. ఈమేరకు ఆయన పేరును ప్రతిపాదిస్తూ పీసీసీకి లేఖ రాశారు. దీంతో ఆయన సారథ్యానికి అధిష్టానం పచ్చజెండా ఊపింది. మల్లేశ్‌కు ఉద్వాసన ఆరేళ్లుగా పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించిన క్యామ మల్లేశ్ గత ఎన్నికల ముందు ‘హస్తం’ను వీడారు. ఇబ్రహీంపట్నం టికెట్ ఆశించిన ఆయనకు నిరాశే మిగిలింది. అయితే, టికెట్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని, ఏఐసీసీ దూతలు టికెట్లను అమ్ముకున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఏకంగా ఆడియో టేపులను కూడా విడుదల చేశారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి... మల్లేశ్‌ను డీసీసీ పదవి నుంచి తొలగించారు. దీంతో మల్లేశ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. ఈనేపథ్యంలో ఖాళీ అయిన డీసీసీ పదవిని చేపట్టడానికి సీనియర్లు పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. శాసనసభ ఎన్నికలు ముగియడంతో పార్టీని నడపడం ఆర్థికంగా కష్టమని భావించిన ముఖ్యనేతలు.. ఈ పోస్టు వైపు కనీసం కన్నెత్తి చూడలేదు. కాగా, పదవిని ఆశించిన వారిలో వివాదరహితుడిగా పేరొందిన చల్లాకు పీసీసీ నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఇదిలాఉండగా, డీసీసీ పదవిని ఆశించిన ఏనుగు జంగారెడ్డి.. తనను ఎంపిక చేయకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా చల్లా పేరును అధిష్టానం అధికారికంగా ప్రకటించిన తరుణంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే! -
డీసీసీ అధ్యక్షుడిగా రాజేందర్‌రెడ్డి
వరంగల్: కాంగ్రెస్ పార్టీ వరంగల్ అర్బన్–వరంగల్ రూరల్ జిల్లాల అధ్యక్షుడిగా నాయిని రాజేందర్‌రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహూల్‌గాంధీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రాజేందర్‌రెడ్డిని తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం 2015లో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రెండో సారి నియమించారు. 2018లో మూడో సారి కూడా రాహుల్ గాంధీ రాజేందర్‌రెడ్డినే నియమించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 31 జిల్లాలకు నూతన అధ్యక్షులను నియమించిన రాహూల్‌గాంధీ నాలుగో దఫాలో ఆయనను వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే వరంగల్ సిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కట్ల శ్రీనివాస్‌ను మరో సారి అదే పదవీ వరించింది. ఈ సందర్భంగా రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి, టీపీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి. కుంతియాలకు కృతజ్ఞతలు తెలిపారు. నాయిని నియామకంపై టీపీసీసీ కార్యదర్శులు ఈ.వి.శ్రీనివాస్‌రావు, బత్తిని శ్రీనివాస్‌రావు శుభాకాంక్షలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. -
తెలంగాణలో 31 డీసీసీలకు కొత్త అధ్యక్షులు వీరే
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలకు కాంగ్రెస్ అధ్యక్షులను(డీసీసీ) ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. మొత్తం 31 మంది డీసీసీ అధ్యక్షుల నియామకానికి ఆ పార్టీ అధినేత రాహుల్ ఆమోదం తెలిపారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. వీరిలో 12 మంది బీసీలు, రెడ్డి-9, కమ్మ -2, బ్రాహ్మణలు, ఎస్సీ, ఎస్టీలలో ఇద్దరికి.. ముస్లిం, వెలమలకు ఒక్కొక్కరికి చొప్పున చోటు కల్పించారు. వీరితో పాటు ఇద్దరు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులను ఆ పార్టీ నియమించింది. ఖమ్మం పట్టణానికి చెందిన దీపక్ చౌదరిని పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. మొత్తం 33 మందితో కూడిన జాబితాను ఆ పార్టీ గురువారం విడుదల చేసింది. ఎమ్మెల్యేలుగా ఉన్నవారికి కూడా డీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఆసిఫాబాద్- ఆత్రం సక్కు, భద్రాది- వనమ వెంకట్వేరరావులను డీసీసీ అధ్యక్షులుగా నియమించారు. వీరితో పాటు ఎమ్మెల్యేల సతీమణులను కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమించారు. ఖమ్మం నగరం- జావీద్, గ్రేటర్ హైదరాబాద్- ఎం.అంజన్‌కుమార్ యాదవ్‌లను సిటీ కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమించారు. కొత్తగా నియమితులైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వీరే.. జిల్లా పేర్లు డీసీసీ అధ్యక్షుల పేర్లు మంచిర్యాల కొక్కిరాల సురేఖ కొమరం భీమ్ ఆసిఫాబాద్ ఆత్రం సక్కు నిర్మల్ రామారావు పటేల్ పవార్ కరీంనగర్ కె. మృతంజయం జగిత్యాల లక్ష్మణ్‌కుమార్ పెద్దపల్లి ఈర్ల కొమురయ్య రాజన్న సిరిసిల్ల ఎన్.సత్యనారాయణగౌడ్ నిజామాబాద్ మనాల మోహన్ రెడ్డి నిజామాబాద్ నగర కాంగ్రెస్ కేశ వేణు కామారెడ్డి కైలాస్ శ్రీనివాసరావు వరంగల్ రూరల్/ అర్బన్ నాయిని రాజేందర్ రెడ్డి వరంగల్ నగర కాంగ్రెస్ కేదారి శ్రీనివాసరావు జయశంకర్ భూపాల్పల్లి గండ్ర జ్యోతి జనగామ జంగా రాఘవ రెడ్డి సంగారెడ్డి నిర్మలాగౌడ్ మెదక్ తిరుపతి రెడ్డి సిద్దిపేట టి.నరసారెడ్డి వికారాబాద్ పి.రోహిత్ రెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి కూన శ్రీశైలం గౌడ్ రంగారెడ్డి చల్లా నరసింహారెడ్డి మహబూబ్‌నగర్ కొత్వాల్ ఒబెదుల్లా వనపర్తి శంకర్ ప్రసాద్ జోగులాంబ గద్వాల్ పటేల్ ప్రభాకర్ రెడ్డి నాగర్‌కర్నూల్ సీహెచ్ వంశీకృష్ణ సూర్యాపేట చెవిటి వెంకన్న యాదవ్ యాదాద్రి భువనగిరి బి.బిక్ష్మయ్యగౌడ్ మహబూబాబాద్ జె.భరత్ చంద్రారెడ్డి నల్గొండ కె.శంకర్‌నాయక్ భద్రాద్రి కొత్తగూడెం వనమా వెంకటేశ్వరరావు ఖమ్మం పువ్వాడ దుర్గాప్రసాద్ -
డీసీసీ పీఠం ఎవరికో..
రాష్ట్రంలో డీసీసీ అధ్యక్షులను నియమించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జి అధ్యక్షుడు కొనసాగుతున్నారు. కొత్త జిల్లాలకు ప్రత్యేకంగా అధ్యక్షుణ్ణి నియమించాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్న తరుణంలో కామారెడ్డితో పాటు, నిజామాబాద్ కు అధ్యక్షుడి నియామకం చేస్తారని చర్చ సాగుతోంది. డీసీసీ పదవికి పోటీ ఏర్పడింది. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్న ఇన్చార్జి అధ్యక్షుడిని కొనసాగిస్తారా.? లేదా ఈ స్థానంలో కొత్త వారిని నియమిస్తారా.? అనే దానిపై సందిగ్ధం నెలకొంది. డీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన తాహెర్‌బిన్ హందాన్ అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని నిజామాబాద్ నగర అధ్యక్షులుగా ఉన్న కేశవేణుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పదవిలో ఎవరిని నియమిస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలకు డీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలకు కూడా ప్రత్యేకంగా అధ్యక్షుణ్ణి నియమించాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించిన నేపథ్యంలో ఈ పదవి తెరపైకి వచ్చింది. కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిని నియమించినప్పుడే., నిజామాబాద్ జిల్లాకు కూడా అధ్యక్షున్ని ప్రకటించే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా అధ్యక్షులుగా నియమితులైన నేతలు అన్ని మండలాల్లో ఉన్న పార్టీ నేతలు, క్యాడర్‌ను కలుపుకుని పనిచేయాల్సి ఉంటుంది. ఆయా నియోజకవర్గాల ఇన్చార్జులను సమన్వయం చేయాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం విదితమే. ఉమ్మడి జిల్లాలో తొమ్మిది స్థానాల్లో కేవలం ఒకే ఒక స్థానాన్ని కైవసం చేసుకోగలిగింది. నిజామాబాద్ జిల్లా పరిధిలో ఒక్క స్థానం కూడా కాంగ్రెస్‌కు దక్కలేదు. దీంతో ఆ పార్టీ నాయకులతో పాటు, కేడర్‌లో కూడా నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలను నిర్వహించి, శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా చేయడంలో డీసీసీ నేతలు కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇటీవల హైదరాబాద్ గాంధీభవన్‌లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్చార్జులతో సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రె డ్డి, ఏఐసీసీ నేతలు శ్రీనివాస్ కృష్ణన్లు జిల్లా ముఖ్య నేతలతో సమావేశమయ్యా రు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా డీసీసీ పదవి విషయం ప్రత్యేకంగా చర్చ కొచ్చింది. అన్ని నియోజకవర్గాల ఇన్చార్జులు చర్చించుకుని నిర్ణయం తీసుకోవాలని జిల్లా నేతలకు సూచించినట్లు సమాచారం. కొందరు నేతలు డీసీసీ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నెలాఖరులోగా స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. -
పరిమిత పొత్తయితే ఇరుపార్టీలకు మంచిది
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలుగుదేశంతో సయోధ్య పార్టీకి లాభం కలుగుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ స్పష్టం చేశారు. ఈ పొత్తును పరిమిత స్థాయిలో ఉండాలని సూచించారు. శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ డీసీసీ అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికల సన్నద్ధతను సమీక్షించిన రాహుల్.. మహాకూటమి, టీడీపీతో పొత్తు వ్యవహారంపై ఆరాతీశారు. మనం బలంగా ఉన్న సెగ్మెంట్లను వారికిస్తే పార్టీకి నష్టం వాటిల్లుతుందని, కేడర్‌లో కూడా అసంతృప్తి పెల్లుబికే ఆస్కారముందని మల్లేష్ రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. 2014 ఎన్నికల్లో టీడీపీ ఏడు చోట్ల గెలిచిందని, అందులో ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారారని గుర్తుచేశారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని పార్టీకి కంకణబద్దులైన వారికే టికెట్లను కేటాయించే అంశంపై తెలుగుదేశం అధిష్టానంతో చర్చించాలని కోరారు. టీడీపీకి ముందున్న బలం ఇప్పుడు లేదని, రెండు స్థానాలు కేటాయిస్తే సరిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
ఎవరు..?
రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే నూతన జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షులు, ఇతర కార్యవర్గాలను ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేయాల్సి ఉన్నా పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో వాయిదా పడుతూ వచ్చింది. పార్టీ అధినేత, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈనెల 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లో పర్యటించనున్న నేపథ్యంలో మరోసారి కసరత్తు మొదలైంది. రాహుల్ పర్యటన తర్వాత నూతన కమిటీలను ప్రకటించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ యోచిస్తోంది. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో స్తబ్దుగా ఉన్న నాయకులు... తామూ డీసీసీ రేసులో ఉన్నామని అనుచరుల ద్వారా చెప్పించుకోవడం.. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా తామూ రేసులో ఉన్నామని సంకేతాలు పంపుతున్నారు. –సాక్షి, సిద్దిపేట రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వంలో కీలకమైన మంత్రి హరీశ్‌రావులు ప్రాతినిథ్యం వహించే సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీని నడిపించడం ఆషామాషీ వ్యవహారం కాదు. వారిని ఢీకొనే సత్తా ఉన్న నాయకుడి కోసం కాంగ్రెస్‌లో వేట మొదలైంది. ఇందులో భాగంగానే జిల్లాలోని సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ముత్యంరెడ్డి, మరో పీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రవన్‌కుమార్‌రెడ్డి, సిద్దిపేట నియోజకవర్గం ఇన్చార్జి తాడూరి శ్రీనివాస్‌గౌడ్, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ వర్మలతోపాటు ఇటీవల పార్టీలో చేరిన గజ్వేల్‌కు చెందిన ఒంటేరు ప్రతాప్‌రెడ్డి తదితరుల పేర్లు పరిశీలించినట్లు సమాచారం. అయితే ఇందులో శ్రవన్‌కుమార్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డిలు తమకు డీసీసీ పదవి వద్దని అధిష్టానానికి ఇప్పటికే తేల్చి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా ముత్యంరెడ్డి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ముందస్తు కసరత్తు అవసరమని, జిల్లా అంతా మీద వేసుకొని పార్టీని నడిపిస్తే నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టలేమోనని ఆలోచిస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ సిద్ధాంతాల ప్రకారం ఒక్కరికి ఒకే పదవి ఉండాలనే కొత్త నిబంధన కూడా ఉండనే ఉంది. హుస్నాబాద్ నుండి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, బొమ్మా శ్రీరాం చక్రవర్తిలు కూడా ఎమ్మెల్యే టిక్కెటే కావాలి.. డీసీసీపై పెద్దగా సానుకూలంగా స్పందించడం లేదనే వార్తలు వినవస్తున్నాయి.. పావులు కదుపుతున్న ఆశావాహులు.. పార్టీ కోసం ఇంతకాలం పనిచేశాం... ఉమ్మడి జిల్లాలో హేమాహేమీలు ఉండటంతో పార్టీ పదవులు రాలేదని.. ఇప్పుడు జిల్లా వేరు కావడంతో డీసీసీ పదవి దక్కించుకునేందుకు పలువురు నేతలు తమ గాడ్ ఫాదర్ల ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇంతకాలం పార్టీ కోసం పనిచేసిన నాకు సిద్దిపేట పట్టణంతోపాటు, జిల్లాలోని అన్ని ప్రాంతాలతో పరిచయం ఉందని ఎమ్మెల్యే టిక్కెట్‌తోపాటు డీసీసీ అధ్యక్ష పదవి కూడా ఇవ్వాలని తాడూరు శ్రీనివాస్ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్‌ల ద్వారా పావులు కదుపుతున్నట్లు తెలిసింది. సిద్దిపేట పట్టణంలో తనకు పట్టుందని.. పగ్గాలు తన చేతికిస్తే పార్టీని బలోపేతం చేస్తానని సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్ వర్మ ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షులను కలిసి చెప్పినట్లు తెలిసింది. అదేవిధంగా వర్మకు డీసీసీ ఇవ్వాలని షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్యలు ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడికి రెకమండ్ చేసినట్లు సమాచారం.. అదేవిధంగా ఢిల్లీ నాయకులతో ఉన్న సంబంధాలను కూడా ఉపయోగించుకొని పార్టీ పగ్గాలు కైవసం చేసుకునేందుకు వర్మ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. సిద్దిపేటకు చెందిన మరో నాయకుడు గంపా మహేందర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హన్మంతరావు ద్వారా ప్రయత్నిస్తున్నారు. పూజల హరికృష్ణ కూడా తనకు డీసీసీ ఇవ్వాలని తన అనుచరుల ద్వారా అధిష్టానానికి చెప్పిస్తున్నట్లు తెలిసింది. వీరితోపాటు దుబ్బాక నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు బండి నర్సాగౌడ్ కూడా డీసీసీ అధ్యక్ష పదవిపై కన్నేసి గాంధీభవన్‌లో పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నట్లు ప్రచారం. వీరితోపాటు హుస్నాబాద్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేరం లింగమూర్తి కూడా తనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేసిన అనుభవం ఉందని చెబుతూ గాడ్ ఫాదర్స్ ద్వారా పావులు కదుపుతున్నారు. స్థానికంగా నివాసం ఉండే వారైతే.. టీఆర్ఎస్ బలంగా ఉన్న సిద్దిపేటలో పార్టీని నిలబెట్టాలంటే స్థానికంగా నివాసం ఉండేవారికే డీసీసీ పదవి అప్పగిస్తే బాగుంటుందని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. పార్టీ కార్యాలయం, కార్యకర్తల సాదకబాధలు పట్టించుకునే నాయకులకు అవకాశం ఇస్తే పార్టీ నిలబడుతుందని జిల్లా కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో సిద్దిపేట పట్టణానికి చెందిన కార్యకర్తలతో మమేకమయ్యే వారికే డీసీసీ పదవి దక్కే అవకాశం ఉందని.. లేని పక్షంలో సీనియర్ నాయకుడు ముత్యం రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే.. ఆయనకున్న అనుభవం రాబోయే సార్వత్రిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉపయోగపడుతుందని పీసీసీ ఆలోచిస్తుందని సమాచారం. ఏదేమైనా రాహుల్ పర్యటన ముగిసేవరకు ఉత్కంఠగా వేచి చూడక తప్పని పరిస్థితి. -
ఆచితూచి అడుగేసి..
సాక్షిప్రతినిధి,నిజామాబాద్: నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి నియామకంపై ఆ పార్టీ అధిష్టానం ఆచితూచి అడుగేసింది. డీసీసీ అధ్యక్షునిగా తాహెర్‌బిన్ హందాన్నే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది జిల్లాల అధ్యక్షులను ప్రకటించిన ఆ పార్టీ అధిష్టానం నిజామాబాద్ జిల్లా పార్టీ పగ్గాలను తాహెర్కే అప్పగించింది. ఈ పదవి విషయంలో జిల్లాలోని పార్టీ అగ్రనేతల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో దాదాపు ఏడాది కాలంగా తర్జనభర్జన కొనసాగింది. మాజీ మంత్రి పి.సుదర్శన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులుగా తాహెర్‌ను కొనసాగించాలని పట్టుబట్టగా., శాసన మండలి పక్ష నేత షబ్బీర్ అలీ కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కైలాస్ శ్రీనివాస్‌ను తెరపైకి తెచ్చారు. జిల్లా విభజన నేపథ్యంలో ఈ పదవిని కామారెడ్డి జిల్లాకు కేటాయించాలని అధిష్టానాన్ని కోరారు. మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి మార చంద్రమోహన్ పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. గతంలో డీసీసీ అధ్యక్షునిగా దశాబ్ద కాలం పాటు పనిచేసిన గడుగు గంగాధర్ కూడా తన పేరును పరిశీలించాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు మాజీ ఎంపీ, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కిగౌడ్ ద్వారా నరాల రత్నాకర్ ఈ పదవి కోసం ప్రయత్నాలు చేశారు. తాహెర్ స్థానంలో మరొకరిని నియమిస్తే మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన తనకు అవకాశం ఇవ్వాలని బోధన్‌కు చెందిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాషా కోరినట్లు తెలిసింది. బాల్కొండ నియోజకవర్గం నుంచి మానాల మోహన్‌రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. మరోవైపు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌధాగర్ గంగారాం, మాచారెడ్డికి చెందిన నర్సింగ్‌రావు కూడా ఈ పదవిని ఆశించారు. ఇలా ఈ పదవి కోసం పార్టీలో తీవ్ర పోటీ ఏర్పడగా ఎవరికి వారే ఈ పదవి కోసం ప్రయత్నాలు చేసుకున్నారు. గ్రూపుల నేపథ్యంలో.. ఆధిపత్యపోరు, గ్రూపు తగాదాలకు నిలయంగా మారిన జిల్లా కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష పదవి విషయంలో ఏడాది కాలంగా ఏకాభిప్రాయం కుదరలేదని పార్టీ వర్గాలు చెప్పుకున్నాయి. ఎన్నికల సంవత్సరం కావడంతో ఎంతో కీలకమైన ఈ పదవిలో తన అనుచరుణ్ణి నియమించుకునేందుకు పార్టీ జిల్లా అగ్రనేతలు ఎవరికి వారే పావులు కదిపారు. ఈ మేరకు టీపీసీసీ ముఖ్యనాయకత్వంపై ఒత్తిడి పెంచారు. ఈ పరిస్థితుల్లో తాహెర్‌ను మార్చి.. కొత్త వారికి అవకాశం ఇస్తే అనవసరమైన తలనొప్పులు వస్తాయనే ఉద్దేశంతో అధిష్టానం తాహెర్‌ను కొనసాగించిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. దీనికి తోడు మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన తాహెర్ స్థానంలో మరో మైనారిటీ నేతను నియమించాల్సి ఉంటుంది. ఈ సమీకరణలు కుదరకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. దీనికి తోడు ఎన్నికల సంవత్సరం కావడంతో అధ్యక్ష స్థానాన్ని మార్చడం అంత మంచిది కాదని భావించిన అధిష్టానం అధిష్టానం తాహెర్‌ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఉమ్మడి జిల్లాగానే.. జిల్లాల పునర్విభజన జరిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉమ్మడి జిల్లాగానే జిల్లా కాంగ్రెస్ కమిటీ నియామకం చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే అధిష్టానం కొత్త జిల్లాల వారీగా కాకుండా, ఉమ్మడి జిల్లాగానే డీసీసీని ఏర్పాటు చేసింది. డీసీసీ అధ్యక్షుల జాబితాను ఎన్నికల కమిషన్‌కు సమర్పించాల్సి ఉండటంతో ఉన్నఫలంగా ఈ జాబితాను ప్రకటించిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా కొత్త జిల్లాలకు అధ్యక్షులను ఇంకా నియమించలేదు. -
తెలంగాణలో డీసీసీ అధ్యక్షులు వీరే..
-
మాటల గారడీతో మోసం చేస్తున్న సీఎం కేసీఆర్
హన్మకొండ : మాటల గారడితో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం హన్మకొండ వడ్డెపల్లి రోడ్డులోని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్–327 కార్యాలయంలో మేడేను యూనియన్ నాయకులు, ఉద్యోగులు ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన టీఎస్ ఈఈయూ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసారు. అనంతరం రక్తదానం చేసిన దాతలకు సర్టిఫికెటన్లు అంద చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ హామీలను విస్మరించారని విమర్శించారు. వరంగల్ నగరంలో మూడు రోజుల పాటు ఉండి డబుల్ బెడ్రూం ఇళ్ళు కట్టిస్తామని చెప్పి నాలుగు సంవత్సరాలవుతున్న ఇప్పటికీ అతిగతీ లేదని దుయ్యబట్టారు. మాటలతో మాయ చేయడం తప్ప ప్రజలకు ఒరగబెట్టింది ఏమిలేదన్నారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.రాజిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణస్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. కార్మికులకు అండగా నిలుస్తున్న యూనియన్ ఇదొక్కటేనని అన్నారు. రక్తదానం చేసిన ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. సమావేశంలో పీసీసీ కార్యదర్శి ఇ.వి.శ్రీనివాస్, రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యురాలు డాక్టర్ టి.విజయలక్ష్మి, యూనియన్ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పి.మహేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శశికుమార్, వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు బుచ్చయ్యగౌడ్, ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్, మçహాబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు హనుము, ప్రధాన కార్యదర్శి బాబు, జనగామ జిల్లా కార్యదర్శి బాలు, నాయకులు ఫయిం, శ్రీనివాస్, జశ్వంత్, లక్ష్మణ్‌నాయక్, జి.రమేష్, రమణారెడ్డి, శ్రీకాంత్ పాల్గొన్నారు. -
ఖమ్మం డీసీసీ అధ్యక్షుడి మృతి
సాక్షి, ఖమ్మం : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు ఐతం సత్యం శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందారు. సత్యం మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్య నిర్వాహక అధ్యక్షులు భట్టి విక్రమార్క, నాయకులు మల్లు రవి తదితరులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. సత్యం కొంత కాలంగా కాన్సర్ వ్యాధితో బాధ పడుతూ హైదరాబాద్‌లోని మాక్స్‌క్యూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించి ఈరోజు తెల్లవారు జామున మృతి చెందారు. సత్యం భౌతికకాయాన్ని ఖమ్మం తరలించి ప్రజల సందర్శనార్థం డీసీసీ కార్యాలయంలో కొద్ది సేపు ఉంచుతారు. సత్యం మరణ వార్త తెలియగానే టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క వరంగల్ నుంచి ఖమ్మం బయలుదేరి వెళ్లారు. -
జమ్మలమడుగు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా సులోచన రెడ్డి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జమ్మలమడుగు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా ఎర్రగుంట్ల మండలానికి చెందిన వెన్నపూస సులోచన రెడ్డిని డీసీసీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్ పేర్కొన్నారు.ఈమేరకు గురువారం ఇందిరా భవన్లో నియామక పత్రాన్ని అందజేశారు.ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ పార్టీ అభివృద్దికి కృషి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో అధికారంలోకి వస్తామన్నారు. కార్యక్రమంలో పీసీసీ జనరల్ సెక్రటరీ సత్తార్, జాయింట్ సెక్రటరీ చంద్రశేఖర్, సేవాదళ్ చైర్మన్ చార్లెస్,మహిళా సేవాదళ్ చైర్మన్ గౌసియా,ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు ధ్రువకుమార్ రెడ్డి పాల్గొన్నారు. -
‘మంత్రులూ.. మీ నిజాయితీని నిరూపించుకోండి’
అనంతపురం సెంట్రల్ : కరువు పరిస్థితులు నెలకొన్న జిల్లాలో రైతులను, ప్రజలను ఆదుకోకుండా సమస్యలను పక్కదారి పట్టించేలా జిల్లా మంత్రులు వ్యవహరిస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ మండిపడ్డారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీసీసీ చీఫ్ రఘువీరపై కౌంటర్ వ్యాఖ్యలు చేసిన ప్రజాప్రతినిధులపై ఆయన మండిపడ్డారు. అభివద్ధిని మరిచి ఆధిపత్యం కోసం, వాటాల కోసం ఫ్లెక్సీలను అడ్డుపెట్టుకొని బజార్లలో కొట్టుకునే వీధి రౌడీలు మీరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు జిల్లాలో కూర్చొని మనకు రావాల్సిన కేసీ కెనాల్ వాటా కర్నూలుకు ఇస్తుంటే గుడ్లప్పగించి చూస్తుండిపోవడం సిగ్గు చేటన్నారు. రైతులను, ప్రజలను ఆదుకొని మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సూచించారు. -
రక్షకతడి పేరుతో రూ. కోట్లు స్వాహా
అనంతపురం సెంట్రల్ : కంది పంటలకు రక్షకతడి అందించే ముసుగులో అధికారపార్టీ నేతలు రూ. వందల కోట్లు స్వాహా చేసేందుకు రంగం సిద్దం చేశారని డీసీసీ అధ్యక్షులు కోటా సత్యనారాయణ ఆరోపించారు. బుధవారం కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటను రక్షించినట్లు కాకిలెక్కలు చూపి రూ. 300 కోట్లు దిగమింగారని ఆరోపించారు. ప్రస్తుతం కంది పంటకు రక్షకతడి అందించాలని చెబుతూ మరో రూ. 300 కోట్లు నొక్కేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారన్నారు. -
కొత్త జిల్లాలకు డీసీసీ అధ్యక్షులు
ఈ నెలాఖరులోగానే నియామకాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో టీపీసీసీ భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి సారించింది. రాష్ట్రంలోని 10 జిల్లాలకు అదనంగా ఆవిర్భవించిన మరో 21 జిల్లాలకు సారథులను నియమించడానికి కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఉన్న డీసీసీ అధ్యక్షులను కొనసాగించాలని నిర్ణయించింది. డీసీసీ అధ్యక్షులు లేకుండా ఖాళీగా ఉన్న జిల్లాలతోపాటు కొత్తగా 21 జిల్లాలకు అధ్యక్షులను నియమించడానికి పార్టీ ముఖ్యుల నుంచి, ఆశావహుల నుంచి టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. జీహెచ్ఎంసీ, రంగారెడ్డిజిల్లాలతో పాటు కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు అధ్యక్షులను వీలైనంత తొందరలోనే నియమించాలని భావిస్తున్నారు. పార్టీలో పని చేయగలిగే నేతల నుంచి దరఖాస్తులు స్వీకరించి, పార్టీ సీనియర్ల అభిప్రాయాలను తీసుకుని అధిష్టానం ఆమోదం పొందాలని టీపీసీసీ భావిస్తోంది. డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తయిన వెంటనే జిల్లాల వారీగా సమస్యలు, పార్టీకి ఉపయోగపడే కార్యక్రమాలపై అధ్యయనం చేయాలని యోచిస్తోంది. జిల్లాల పరిధి కూడా తగ్గిపోవడంతో పూర్తిస్థాయిలో పని చేయగలిగే నాయకులుంటే పార్టీని బలోపేతం చేయడం సులభమని టీపీసీసీ అంచనా వేస్తోంది. ఉత్సాహంగా పనిచేస్తూ, పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకోగలిగిన నాయకుల కోసం జిల్లాల వారీగా అన్వేషణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియను అక్టోబరు నెలాఖరులోగా పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పుడున్న జిల్లాలకు పార్టీ అధ్యక్షులుగా ఉన్నవారినే కొనసాగించనుంది. జిల్లా అధ్యక్షులు ఏ జిల్లా పరిధిలోకి వచ్చారో, ఆ జిల్లాకు పాత అధ్యక్షుడినే కొనసాగించాలని నిర్ణయించింది. -
ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలి
అనంతపురం సెంట్రల్ : రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించేలా పరిపాలన సాగిస్తున్న టీడీపీ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేయాలని డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కరువు కాటకాలు, ప్రాణాంతక రోగాలతో జిల్లావాసులు విలవిలలాడుతున్నారన్నారు. జిల్లావ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంటలు సాగు చేసిన రైతులు దాదాపు రూ. 3 వేల కోట్లు పెట్టుబడులు పెట్టి నష్టపోయారన్నారు. హెచ్చెల్సీ కిందనైనా నీరిచ్చి ఆదుకుంటారనుకుంటే జిల్లాకు రావాల్సిన నీటిని కర్నూలు తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ఇన్పుట్ సబ్సిడీ, బీమా విడుదల చేయాలన్నారు. హంద్రీనీవా ద్వారా 30 టీఎంసీల నీటిని తీసుకొచ్చి ఆయకట్టుకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ నాయకులు రమణ, వాసు, మాసూలు శ్రీనివాసులు, శివ తదితరులు పాల్గొన్నారు. -
పాలమూరు ఎడారి చేస్తారా?
మహబూబ్‌నగర్ అర్బన్ : ‘కృష్ణా పరివాహక ప్రాంతాలను కొత్త జిల్లాల్లో చేర్చి మహబూబ్‌నగర్‌ను ఎడారి చేస్తారా, వలసల జిల్లాగానే మిగిలిస్తారా..’ అంటూ డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ ప్రశ్నించారు. బుధవారం డీసీసీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ముసాయిదాపై అభ్యంతరాల గడువు పూర్తికాక ముందే వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల ఏర్పాట్లు చేస్తుండడం ఎంతవరకు సమంజసమన్నారు. నడిగడ్డ ప్రాంతాన్ని గద్వాల కేంద్రంగా జిల్లా చేయాలని అక్కడి ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తుంటే వాటిని ప్రభుత్వం పక్కనబెట్టడం తగదన్నారు. జూరాల ప్రాజెక్టు ఉన్న ఆత్మకూర్, అమరచింత మండలాలను, పరిశ్రమలు ఉన్న షాద్‌నగర్‌ను మహబూబ్‌నగర్ జిల్లా నుంచి విడదీయడం ఏకపక్ష నిర్ణయమన్నారు. ఈ సమావేశంలో పాలమూరు మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్, డీసీసీ మాజీ అధ్యక్షుడు ముత్యాల ప్రకాశ్, ప్రధాన కార్యదర్శులు సత్తూరు చంద్రకుమార్‌గౌడ్, ధనుంజయరెడ్డి, మీడియాసెల్ కన్వీనర్ పటేల్ వెంకటేశ్ పాల్గొన్నారు. -
రైతులకు ఆర్థిక భరోసా ఇవ్వాలి
హిందూపురం అర్బన్ : ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలన్నీ ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్థికSభరోసా ఇవ్వాలని డీసీసీ అధ్యక్షుడు కోటాసత్యం, పీసీసీ అధికార ప్రతినిధి బాలాజీ మనోహర్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో వారు విలేకరులతో మాట్లాడుతూ సీఎం, మంత్రులు, అధికారుల పర్యటనలకు చేస్తున్న ఖర్చును రైతులకు పంట నష్టపరిహారంగా అందించవచ్చునన్నారు. అంతేకాకుండా ప్రధాని ఫసల్ బీమా పథకాన్ని వేరుశనగ రైతులకు కూడా వర్తింపజేయాలని తెలిపారు. జిల్లా సర్వసభ్య సమావేశం నియోజకవర్గంలో సమస్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రతినెలా చేపడుతున్న ప్రజా పోరుబాటలో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో జిల్లా స్థాయి సమావేశాలు కొనసాగిస్తున్నామని డీసీసీ అధ్యక్షుడు కోటాసత్యం చెప్పారు. ఇందులో భాగంగా సెప్టెంబరు 3న హిందూపురంలోని ఇందిరమ్మ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం ఉంటుందని అదేరోజు మధ్యాహ్నం కేహెచ్ ఫంక్షన్ హాల్లో జిల్లా సర్వసభ్య సమావేశం జరుగుతుందన్నారు. సమావేశంలో కాంగ్రెస్ సీనియర్‌నాయకులు రమణ, ఆదిమూర్తి, శైవలి రాజశేఖర్, జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, రవూఫ్, యూత్ కాంగ్రెస్ నాయకులు రెహమత్, జబీ, మధు, జమీల్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
‘టీడీపీ కార్యకర్తల కోసమే వేడుకలు’
అనంతపురం అర్బన్ : రాష్ట్ర స్థాయిలో 70వ స్వాతంత్య్ర వేడుకలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసమే ప్రభుత్వం నిర్వహించి, వేడుకల్ని అధికార పార్టీ కార్యక్రమంగా మార్చిందని కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు. వేడుకల్ని తిలకించే భాగ్యాన్ని సామాన్యులకు లేకుండా చేశారని, రాజకీయపార్టీల నేతల్ని ఆహ్వానించాలన్న జ్ఞానం ఆ పార్టీ నాయకులకు లేకుండా పోయిందని మండిపడ్డారు. వేడుకలు నిర్వహించిన నీలం సంజీవరెడ్డి స్టేడియంను శుభ్రం చేసేందుకు మంగళవారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయం నుంచి బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని జిల్లా అధ్యక్షులు కోటా సత్యనారాయణ, నగర అధ్యక్షుడు దాదాగాంధీ, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు కేవీరమణ, నాయకుల్ని అరెస్టు చేసి టూటౌన్ పోలీసు స్టేషన్‌కి తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్టేడియంలోకి ప్రజల్ని పంపకుండా, పచ్చ జెండాలు పట్టుకున్నవారిని లోపలికి అనుమతించారని దుయ్యబట్టారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్కరికైనా ఉందా అని ప్రశ్నించారు. అనంతరం సొంత పూచికత్తుపై విడుదల చేశారు. అనంతరం టవర్ క్లాక్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి నాయకులు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో నాయకులు బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కిరణ్‌కుమార్, అధికార ప్రతినిధి మాసూలు శ్రీనివాసులు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ అగిశం రంగనాథ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి, డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శులు జి.వాసు, సత్యనారాయణ, నాయకులు కొండారెడ్డి, వైఆర్ కృష్ణ, తిరుపాలు, చంద్రశేఖర్, హరిరాయల్, తదితరలు పాల్గొన్నారు. -
‘టీడీపీ హఠావో... రాష్ట్ర్ కీ బచావో’
అనంతపురం సెంట్రల్ : గాంధీ మహాత్ముడు 1934 ఆగస్టు 9న చేపట్టిన క్వింట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రస్తుతం ప్రజలు దేశం నుంచి బీజేపీని, రాష్ట్రం నుంచి టీడీపీని తరిమికొట్టాలని కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షులు కోటా సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులు, మైనారిటీలు, ప్రార్థనా మందిరాలు, మహనీయుల విగ్రహాలపై దాడులు చేయడం సిగ్గు చేటు అని పేర్కొన్నారు. టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలను తరిమికొట్టాలని ఆగస్టు 9న నగరంలో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ నాయకులు వాసు, కేవీ రమణ, నాయకులు చంద్రశేఖర్‌గుప్తా, బాబ్జాన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదాకు చంద్రబాబే అడ్డంకి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డంకిగా మారుతోంది చంద్రబాబే నని డీసీసీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్ విమర్శించారు. బుధవారం డీసీసీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రానికి చంద్రబాబు వత్తాసు పలుకుతుండడంతో ఇదే సాకుగా చూసుకొని కేంద్ర పెద్దలు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని ఆరోపించారు. విభజన చట్టంలోని అంశాలు, పోలవరం, రాజధాని నిర్మాణం, ఉక్కు పరిశ్రమ, దుగ్గరాజ పట్నం ఓడరేవు, విశాఖ రైల్వేజోన్‌తో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అందరు అడుగుతుంటే విచిత్రంగా ముఖ్యమంత్రే కేంద్రం ఏమిస్తారో ఇవ్వడంటూ అడగడం చూస్తే పలు అనుమానాలు వస్తున్నాయన్నారు. రాష్ట్ర బంద్ ప్రశాంతంగా జరుగుతుంటే పోలీసులను ప్రయోగించి అరెస్టులు చేయడం దారుణమన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాటకాలు మాని ప్రత్యేక హోదాపై నిజాయితీగా కేంద్రం పై పోరాడాలన్నారు. పీసీసీ జనరల్ సెక్రటరీ ఎస్ఎ సత్తార్, పీసీసీ జాయింట్ సెక్రటరీ చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా సేవాదళ్ ఛైర్మన్ చీకటి చార్లెస్ పాల్గొన్నారు. -
రంగారెడ్డి జిల్లా సారధి ఎవరు?
డీసీసీ కూర్పుపై హైకమాండ్ తర్జనభర్జన కొత్త సారథి ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్ ఆశావహులందరికీ పీసీసీలో చోటు నాయకత్వలేమితో పార్టీ కార్యక్రమాలపై ప్రభావం రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ సారథి నియామకంపై ఊగిసలాట కొనసాగుతోంది. డీసీసీ పగ్గాలు అప్పగించే అంశంపై ఆ పార్టీ నాయకత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. పాతకాపుకే మళ్లీ పీఠం వేయాలనే సీనియర్ల సూచనను పరిగణనలోకి తీసుకోని హైకమాండ్.. కొత్త సారథిని కూడా ప్రకటించకుండా సస్పెన్స్ కొనసాగిస్తోంది. హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ డీసీసీ అధ్యక్ష పదవికి క్యామ మల్లేశ్ రాజీనామా చేశారు. అంతకుమునుపే గ్రేటర్ అధ్యక్షుడు దానం నాగేందర్ రాజీనామా చేసిన నేపథ్యంలో మల్లేశ్ కూడా రాజీనామా చేయాలని అధినాయకత్వం ఒత్తిడి చేసింది. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఆయన డీసీసీ కుర్చీని వదులుకున్నారు. అయితే రాజీనామాను ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టింది. అదేసమయంలో ఆయన కొనసాగింపుపైనా స్పష్టతనివ్వలేదు. ఈ క్రమంలోనే మల్లేశ్‌కు వ్యతిరేకంగా కొందరు నాయకులు పావులు కదిపారు. మరో వైపు రాష్ర్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ కూడా క్యామ కొనసాగింపును అయిష్టంగా ఉన్న విషయాన్ని పసిగట్టిన వైరివర్గం.. డీసీసీ పగ్గాలను మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్‌కు అప్పగించాలని ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసింది. ఈ ఎత్తుగడను అంచనా వేసిన మరోవర్గంమాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ పేరు ను తెరపైకి తెచ్చింది. సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకుంటే.. పార్టీ భావజాలం తెలియని చంద్రశేఖర్ కన్న ప్రసాద్ మేలనే సూచించింది. సీనియర్ల అభిప్రాయబేధాలు.. హస్తిన స్థాయిలో ఇరువర్గాలు మంత్రాంగం నెరపడంతో ఇరకాటంలో పడ్డ హస్తం పార్టీ డీసీసీ సారథి నియామకాన్ని వాయిదా వేసింది. ఎవరినీ కాదని..! జిల్లా సారథి ఎంపికపై సీనియర్ల మధ్య అభిప్రాయబేధాలు పొడచూపిన నేపథ్యంలో ఆ పార్టీ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పార్టీ పగ్గాలు ఆశించిన వారందరికీ పీసీసీ కార్యవర్గంలో చోటు కల్పించడం ద్వారా డీసీసీ రేసు నుంచి తప్పించింది. తద్వారా కొత్త నేతకు నాయకత్వం అప్పగిస్తామని సంకేతాలిచ్చింది. మాజీ మంత్రుల సబిత, ప్రసాద్, చంద్రశేఖర్, మల్లేశ్, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ సహా అందరికి రాష్ట్ర కమిటీలో పదవులు కట్టబెట్టింది. ఈ పరిణామాలతో డీసీసీ కథ మొదటికొచ్చినట్లయింది. నెలరోజుల క్రితం పదవులను వడ్డించిన ఏఐసీసీ జిల్లా కమిటీ విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతోంది. మల్లేశ్‌నే కొనసాగించాలనే సీనియర్ల వాదనను తోసిపుచ్చిన నాయకత్వం.. కొత్త సారథి ఎవరనే అంశంపై ఉత్కంఠను కొనసాగిస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాల్సిన కాంగ్రెస్‌కు జిల్లా అధ్యక్షుడు లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇటీవల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల వద్ద నిరసనలు చేపట్టాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. అయితే, జిల్లాలో మాత్రం పరిగి మినహా మరెక్కడ నిరసన కార్యక్రమాలు జరగలేదు. మరోవైపు పార్టీ శ్రేణులు, దిగువ శ్రేణి నాయకుల్లో నెలకొన్న నైరాశ్యాన్ని సొమ్ము చేసుకునే దిశగా అధికారపార్టీ పావులు కదుపుతోంది. ఇప్పటికే చాలా మండలాల్లో క్రియాశీల నేతలకు ఎర వేయడం కాంగ్రెస్‌ను ఖాళీ చేయిస్తోంది. -
జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి
నర్సాపూర్: జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని డీసీసీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి సునీతారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొని ఉన్నప్పటికీ కేవలం 8 మండలాలను మాత్రమే ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించడం సమంజసం కాదన్నారు. అలాగే అన్ని మండలాల్లో ఉపాధి హామీ పనులు చేపట్టి రైతు కూలీలను ఆదుకోవాలన్నారు. జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొని ఉండడంతో రైతులు కూలీలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ గోదాముల్లో స్థలం లేదంటూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను నిలిపివేయడంతో దళారుల చేతిలో రైతులు నష్టపోతున్నారన్నారు. రైతుల వద్ద ధాన్యం ఉన్నంత వరకు కొనుగోలు చేయాలని, రైతులకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా 72 గంటల్లో ధాన్యం విక్రయించిన సొమ్ము వారి ఖాతాలో జమ అయ్యే విధంగా చూడాలన్నారు. అలాగే చెరకు మద్దతు ధరను టన్నుకు రూ.మూడు వేలుగా ప్రకటించాలన్నారు. చెరకు క్రషింగ్ చేస్తారో చేయరో తెలియని పరిస్థితి నెలకొందని, దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, ఈ విషయంలో రైతులకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలన్నారు. విచారణ పేరుతో కాలయాపన.. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నందున ప్రభుత్వం విచారణల పేరుతో కాలయాపన చేయవద్దని సునీతారెడ్డి ప్రభత్వాన్ని కోరారు. ఆత్మహత్యలపై డీఎస్పీ, ఆర్డీఓ, తహశీల్దార్లు విచారణ చేపట్టి నివేదికలు ఇవ్వాల్సి ఉంటుందని, విచారణలో జాప్యం జరగడంతో రైతు కుటుంబాలకు నష్టం జరగుతోందన్నారు. పార్టీ సభ్యత్వంపై రేపు సమీక్ష జిల్లాలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సంతృప్తికరంగా సాగుతోందని సునీతారెడ్డి పేర్కొన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించేందుకు ఆదివారం జహీరాబాద్‌కు, డిసెంబరు 3న నారాయణఖేడ్‌కు పార్టీ ప్రముఖులు రానున్నట్లు తెలిపారు. డిసెంబరు 1న జిల్లాలో సభ్యత్వ నమోదును సమీక్షించేందుకు అందోలులో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశామన్నారు. సమీక్షలో పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తదితరులు హాజరవుతారన్నారు. సమీక్షకు జిల్లాలోని పార్టీ మండల స్థాయి నాయకులు తదితరులు హాజరు కావాలని కోరారు. జిల్లాలో లక్షా 20వేల సభ్యత్వ నమోదు లక్ష ్యంగా నిర్ణయించామన్నారు. -
ఢిల్లీకి చేరిన కాంగ్రెస్ లొల్లి
ఖమ్మం : జిల్లా కాంగ్రెస్ సారథి ఎంపికపై కొనసాగుతున్న లొల్లి ఢిల్లీకి చేరింది. ఏ వర్గానికి చెందిన వారిని ఎంపిక చేస్తే ఏ తంటా వస్తుందోనని తెలంగాణ ప్రదేశ్‌కాంగ్రెస్ కమిటీ చేతులెత్తేయండంతో ఈ అంశం హస్తినాకు చేరింది. డీసీసీ అధ్యక్షుడెవరో తేల్చేందుకు ఈనెల 15న ఢిల్లీ పెద్దలు ముహూర్తం పెట్టారు. అక్కడి నుంచి టీపీసీసీకి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఢిల్లీకి పయనం కావాలని జిల్లా కాంగ్రెస్ శ్రేణులకు తెలంగాణ ప్రదేశ్‌కాంగ్రెస్ కమిటీ నాయకులు వర్తమానం పంపారు. గత సార్వత్రిక ఎన్నికల్లో తనకు టిక్కెట్ ఇవ్వలేదనే నెపంతో అప్పటి డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన డీసీసీ అధ్యక్ష పదవిని ఎవరికి అప్పగించకుండా కార్యాలయ ఇన్చార్జీల పేరుతో ఐదుగురు సభ్యులను నియమించారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతోపాటు పలువురు నాయకులు టీఆర్ఎస్లో చేరడంతో జిల్లా పార్టీ అధ్యక్షుడిని ఎవరో ఒకరిని ఎంపిక చేసి కార్యకర్తలకు భరోసా ఇవ్వాలని పార్టీ శ్రేణులు భావించారు. ఈ నేపథ్యంలో తమకు అనుకూలంగా ఉన్న నాయకుడిని డీసీసీ అధ్యక్షుడిగా నియమించుకునేందుకు మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి పావులు కదిపారు. తమ వర్గీయుడికే పదవి ఇవ్వాలని పట్టుపట్టడంతో ఈ వ్యవహారాన్ని టీపీసీసీ ఏటూ తేల్చలేకపోయింది. ఈ వ్యవహారాన్ని ఏఐసీసీకి వదిలేసింది. ఈ నేపథ్యంలో 15న పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు హాజరు కావాలని జిల్లా నాయకులకు అధిష్టానం కరుబు పంపింది. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డి.శ్రీనివాస్, జానారెడ్డి, జిల్లా పార్టీ ఇన్చార్జ్ కుసుమ కుమార్ పాల్గొనే ఈ భేటీకి ఖమ్మం, పాలేరు, మధిర ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఖమ్మం డీసీసీ అధ్యక్ష పదవి ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే రేణుకాచౌదరి, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి వర్గీయుల మధ్య వర్గ పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, షోకాజ్ నోటీసులు ఇప్పించుకోవడం జరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితిలో ఈనెల 15న హస్తినలో జరిగే సమావేశంలో కాంగ్రెస్ జిల్లా సారథి ఎంపిక సాఫీగా జరుగుతుం దా..? అనే చర్చ జిల్లా కాంగ్రెస్ శ్రే ణుల్లో సాగుతోంది. -
రైతులను మోసం చేస్తున్న కేసీఆర్
డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ నిజామాబాద్ క్రైం : రుణమాఫీ విషయంలో రైతులను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ విమర్శించారు. బ్యాంకులో రుణాలను 25 శాతం చెల్లిస్తే తిరిగి రీషెడ్యూల్ ఎలా చేస్తారని ప్రశ్నిం చారు. శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతుల రుణాలు మాఫీ చేస్తామంటూ వారి ఓట్లతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇప్పుడు రైతులను మోసగిస్తున్నారని విమర్శించారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల మొత్తం 25 శాతం రుణాలు చెల్లించేందుకు రూ.4,250 కోట్లు బ్యాంకులకు చెల్లించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కానీ రైతులు తీసుకున్న మొత్తం రుణం సెప్టెంబర్ 30 వరకు చెల్లిస్తేనే బ్యాంకులు తిరిగి రుణాలు ఇచ్చేందుకు రీ షెడ్యూల్ చేసేందుకు ముందుకువస్తాయన్నారు. అలా కాకుండా మొత్తం రుణంలో 25 శాతం రుణం మాత్రం చెల్లిస్తే ఏ బ్యాంకులు కూడా దీనిని ఒప్పుకోవన్నారు. మిగతా 75 శాతం రుణంపై బ్యాంకులు వడ్డీ విధిస్తాయన్నారు. రుణమాఫీ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ రిజర్వు బ్యాంక్ అధికారులతో మాట్లాడితే రైతుల రుణాలు రీషెడ్యూల్ అయ్యే అవకాశం ఉంటుందన్నారు. రుణ మాఫీ లేకుండా పోవడం, రుణాలు రీ షెడ్యూల్ చేసేందుకు అవకాశం కోల్పోతుండటంతో రైతు కుటుంబాలు పండుగలు ఎలా చేసుకుంటాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి దసరా పండుగకు దూరంగా ఉండే పరిస్థితులు దాపురించాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కనీసం పండుగల పూట అయినా విద్యుత్ కోత లేకుండా ఇచ్చామన్నారు. ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం పండుగల పూట కూడా విద్యుత్ కోతలు విధిస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. -
డీసీసీకి దిక్కెవరు?
ఖమ్మం : జిల్లా కాంగ్రెస్‌కు పట్టిన గ్రహణం వీడటం లేదు. గత నాలుగు నెలలుగా డీసీసీకి అధ్యక్షుడు లేకపోవడంతో ఆ పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా మారింది. జిల్లా నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో ఒక వర్గానికి చెందిన వారిని నియమిస్తే మరో వర్గంతో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందేమోననే భయంతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకం విషయంలో టీపీసీసీ కూడా నిర్ణయం తీసుకోవడం లేదు. అయితే జిల్లా నాయకులు మాత్రం తమ అనుచరులకే పగ్గాలు అప్పగించేలా పట్టువిడుపు లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేసిన టీపీసీసీ ఖమ్మం జిల్లాను మాత్రం కదిలించిన పాపాన పోలేదు. దీంతో పార్టీకి సారధి నియామకం ఇప్పట్లో జరిగేనా అని కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 24, 25 తేదీ లలో జరిగే ప్లీనరీ సమావేశాల్లోనైనా ఈ వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఆధిపత్య పోరుతో అడుగున పడిన ఎంపిక.. జిల్లా కాంగ్రెస్‌లో నాయకుల మధ్య ఉన్న ఆధిపత్య పోరుతో పార్టీ ప్రాభవం కోల్పోతోంది. చివరకు డీసీసీ అధ్యక్ష పదవిని కూడా తమ అనుచరులకే ఇప్పించాలని నాయకులు పట్టుపట్టడంతో నియామకమే నిలిచిపోయింది. గతంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడిగా పనిచేసిన వనమా వెంకటేశ్వరరావు సార్వత్రిక ఎన్నికలకు ముందు వేరే పార్టీలోకి వెళ్లారు. దీంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల ముందే టీపీసీసీ ప్రయత్నం చేసింది. అయితే వర్గపోరుతో భగ్గుమంటున్న ఆ పార్టీలో డీసీసీ అధ్యక్ష ఎన్నిక మరింత ఆజ్యం పోసినట్లు అవుతుందని భావించిన అధిష్టానం వాయిదా వేసింది. అనంతరం కార్యాలయాన్ని నడిపించే బాధ్యతను మాజీ మంత్రి రాంరెడ్డి వర్గానికి చెందిన శీలంశెట్టి వీరభద్రం, మాజీ ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క వర్గానికి చెందిన అయితం సత్యం, ఎమ్మెల్యే పొంగులేటి సుధాకర్‌రెడ్డి వర్గానికి చెందిన శ్రీనివాసరెడ్డికి అప్పగిస్తూ ఆ పార్టీ జిల్లా ఇన్చార్జి వట్టి కుసుమకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో తన వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం, అప్పటి వరకు కార్యాలయ వ్యవహారాలు చూస్తున్న తమ అనుచరుడు పులిపాటి వెంకయ్యను తొలగించడంపై కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరి ఆగ్రహించినట్లు తెలిసింది. దీంతో ఆమె వర్గానికి చెందిన వి.వి.అప్పారావు, పరుచూరి మురళిని కూడా డీసీసీ కార్యాలయ ఇన్చార్జిల జాబితాలో చేర్చారు. అయితే ఒకే కుర్చీని ఐదుగురు నాయకులు పట్టుకుని ఉండటం ఏంటని కాంగ్రెస్ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అనుచరుల కోసం ఆరాటం.. కీలకమైన జిల్లా కాంగ్రెస్ పార్టీ పగ్గాలను తమ అనుచరులకు అప్పగించేందుకు పలువురు నాయకులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. కాగా, అధ్యక్ష ఎంపికపై జిల్లా నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్లే వాయిదా వేసినట్లు టీపీసీసీ వర్గాలు చెపుతున్నాయి. తమ వర్గానికి చెందిన పరుచూరి మురళీకృష్ణ, వి.వి. అప్పారావు, ఇల్లందు మాజీమార్కెట్ కమిటీ చైర్మన్ కావూరి వెంకట్రామయ్యల్లో ఎవరైనా ఒకరికి ఇవ్వాలని రేణుకా చౌదరి అధిష్టానం ఎదుట పట్టుపట్టినట్లు తెలిసింది. పార్టీ పటిష్టతకు డీసీసీ కీలకమని, ఈ సారి డీసీసీ అధ్యక్షుడిగా తానే ఉంటానని, లేదా బీసీ వర్గానికి చెందిన తన అనుచరుడు శీలంశెట్టి వీరభద్రానికి అయినా పగ్గాలు అప్పగించాలని మాజీమంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి తేల్చిచెప్పినట్లు సమాచారం. అదేవిధంగా అయితం సత్యం పేరును భట్టి విక్రమార్క చెప్పగా, సీపీఐతో పొత్తులో భాగంగా పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు అన్యాయం జరిగిందని, సార్వత్రిక ఎన్నికల ముందే డీసీసీ అధ్యక్ష పదవి ఇస్తామని ఆయనకు హామీ ఇచ్చామని, ఆ పదవిని ఆయనకు ఇవ్వడమే న్యాయమని కేంద్ర మాజీమంత్రి బలరాంనాయక్ చెపుతున్నట్లు తెలిసింది. ఇటువంటి పరిస్థితుల్లో అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలోనని టీపీసీసీ సందిగ్ధంలో పడింది. అయితే పార్టీని బలోపేతం చేసేందుకు ఈనెల 24, 25 తేదీల్లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించే ప్లీనరీ సమావేశంలోనైనా జిల్లా అధ్యక్షుడి ఎంపిక వ్యవహారాన్ని తేల్చాలని, లేకపోతే పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందని స్థానిక నాయకులు అధిష్టానాన్ని కోరుతున్నారు. -
21 నుంచి కాంగ్రెస్ జిల్లా స్థాయి సమీక్షలు
* రైతులకు ప్రత్యామ్నాయం చూపాలి * డీసీసీ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి ఎదులాపురం : ఎన్నికల ఫలితాలపై, భవిష్యత్తు రాజకీయాలపై చర్చించేందుకు జిల్లా స్థాయి సమీక్షలను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రయత్నాలు ప్రారంభించిందని డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 21 నుంచి హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో ఆదిలాబాద్ జిల్లా సమీక్ష సమావేశంతో ప్రారంభం కానున్నాయని తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో ఈ సమావేశాలు జరుగుతాయన్నారు. జిల్లాలోని ప్రతీ నియోజకవర్గానికి 45 నిమిషాలపాటు సమావేశం ఉంటుందని తెలిపారు. ఉదయం 10.00 గంటలకు సిర్పూర్ నియోజకవర్గ సమీక్ష సమావేశంతో ప్రారంభవుతాయని అన్నారు. తర్వాత వ రుసగా చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల సమీక్షలు ఉంటాయని వివరించారు. అన్ని నియోజకవర్గ సమీక్షలో డీసీసీ అధ్యక్షులతోపాటు మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ డీసీసీ అధ్యక్షులు పాల్గొంటారని చెప్పారు. నియోజకవర్గ సమీక్షలో ఎమ్మెల్యే లేదా పోటీ చేసిన అభ్యర్థితోపాటు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, పీఏసీఎస్ చైర్మన్లు, పీసీసీ, డీసీసీ, కార్యవర్గస్థాయి నాయకులు, పార్టీ ముఖ్య అనుబంధ సంఘాల నాయకులు పాల్గొంటారని సీఆర్ఆర్ వివరించారు. రైతులకు వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయం చూపాలి ప్రభుత్వం రైతాంగ సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సీఆర్ఆర్ పేర్కొన్నారు. రుణ మాఫీపై స్పష్టత లేక, ప్రకృతి సహకరించక రైతులు కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న రైతులకు వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని కోరారు. గతంలో ప్రజాపథం కార్యక్రమంలో అధికారులందరూ పాల్గొనే వారని, మన ఊరు-మన ప్రణాళికలో ఆశా వర్కర్లు అప్లికేషన్లు తీసుకొంటున్నారని విమర్శించారు. సమావేశంలో పీసీసీ కార్యదర్శి నరేష్ జాదవ్, నాయకులు యాసం నర్సింగ్‌రావ్, దిగంబర్‌రావ్ పాటిల్, అంబకంటి అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
డీసీసీ అధ్యక్ష పదవి విషయంలో తలెత్తిన విభేదాలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు మరోసారి రచ్చకెక్కాయి. డీసీసీ అధ్యక్ష పదవి విషయంలో తలెత్తిన విభేదాలు ఆ పార్టీ ఆఫీసు తాళం పగలగొట్టే వరకూ వెళ్లాయి. ఒకరికి ఒకటే పదవి అనే ఏఐసీసీ నిబంధన మేరకు క్యామ మల్లేశ్‌ను డీసీసీ పదవికి రాజీనామా చేయాలని టీపీసీసీ సూచించింది. ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు జిల్లా సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆదేశించిన క్రమంలో ఇబ్రహీంపట్నం నుంచి అసెంబ్లీ బరిలో దిగిన మల్లేశ్‌కు కూడా వైదొలగడం అనివార్యమైంది. క్యామ స్థానంలో రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ పడాల వెంకటస్వామిని నియమిస్తూ టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం బాధ్యతలు స్వీకరించేందుకు గాంధీభవన్ ఆవరణలోని డీసీసీ ఆఫీసుకు వెంకటస్వామి వచ్చారు. కార్యాలయానికి తాళం వేసి ఉండడం.. చార్జి ఇచ్చేందుకు క్యామ నిరాకరించినట్లు తెలుసుకున్న వెంకటస్వామి వర్గీయులు తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. తాత్కాలికం కావడంతోనే... ఇదిలావుండగా, ఈ వ్యవహారం కాంగ్రెస్‌లో కొత్త వివాదానికి దారితీసింది. జోడు పదవుల నేపథ్యంలో డీసీసీ పదవికి రాజీనామా చేయాలని పీసీసీ సూచించినప్పటికీ, ఆరుగురు డీసీసీ అధ్యక్షులు ఎన్నికల్లో పోటీచేస్తున్నా.. కేవలం రంగారెడ్డి జిల్లాకే ఈ నిబంధనను వర్తింపజేయడంపై పార్టీలోని ఒక వర్గం తీవ్రంగా తప్పుబడుతోంది. సోమవారం సాయంత్రం పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలోనూ దీనిపై వాడివేడి చర్చ జరిగినట్లు తెలిసింది. పడాల వర్గీయులు గాంధీభవన్ ఆవరణలోనే తాళం పగులగొట్టినా ఎందుకు మిన్నకున్నారని మేడ్చల్ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినవారికి టికెట్లు ఇచ్చారని, వెన్నుపోటు దారులను ప్రోత్సహిస్తున్నవారికి అండగా నిలుస్తున్నారని నిలదీసినట్లు పార్టీవర్గాల ద్వారా తెలిసింది. పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు ప్రయత్నించినవారికి పదవులు కట్టబెట్టడం మంచి పద్దతికాదని కేఎల్లార్ అన్నట్లు సమాచారం. అయితే, దీనిపై స్పందించిన పీసీసీ చీఫ్ పొన్నాల, జిల్లా ఇన్చార్జి నాగయ్య మాట్లాడుతూ డీసీసీ అధ్యక్షుల్లో దానం మినహా మిగతావారిని తప్పుకోమని ఆదేశించామని, అందులోభాగంగానే వెంకటస్వామిని నియమించినట్లు స్పష్టం చేశారు. అయితే, బాధ్యతలు తీసుకోవడంలో వ్యవహరించిన తీరు సరిగాలేదని అన్నట్లు సమాచారం. మే 16వ తేదీ తర్వాత పార్టీలో సంస్థాగత మార్పులు ఉంటాయని, అప్పటివరకు వెంకటస్వామియే జిల్లా సారథిగా ఉంటారని తేల్చిచెప్పినట్లు తెలిసింది. ఇదిలావుండగా, జిల్లా పరిషత్, పురపాలక సంఘాలను కైవసం చేసుకునేందుకు పార్టీ నేతలంతా సమన్వయంతో పనిచేయాలని పొన్నాల సూచించారు. జెడ్పీ చైర్మన్ అభ్యర్థి యాదవరెడ్డి జెడ్పీటీసీలతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని, ఎంపీపీ అభ్యర్థి ఎంపిక బాధ్యత స్థానిక కాంగ్రెస్ ఇన్చార్జులదేనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కేఎల్లార్, నారాయణరావు, భిక్షపతియాదవ్,పార్టీ అభ్యర్థులు క్యామ మల్లేశ్, బండారి లక్ష్మారెడ్డి, కాలె యాదయ్య, నర్సింహయాదవ్ తదితరులు పాల్గొన్నారు. బాధ్యతను నిర్వర్తిస్తా: పడాల అధిష్టానం అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని డీసీసీ అధ్యక్షుడు పడాల వెంకటస్వామి చెప్పారు. జిల్లాలో పార్టీ పటిష్టానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తానని, సీనియర్లతో సమన్వయం సాధించడం ద్వారా అత్యధిక పురపాలికలు, జిల్లా, మండల పరిషత్‌లను చేజిక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. -
నయనానందంగా శ్రీరామ రథోత్సవం
నల్లగొండ కల్చరల్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామ దివ్య రథోత్సవాన్ని నయనానందపర్వంగా నిర్వహించారు. ముందుగా సముద్రాల యాదగిరాచార్య, శఠగోపాలాచార్య, సంపత్కుమారాచార్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిం చారు. భక్తాంజనేయస్వామి భజన మండలి ఆధ్వర్యంలో భజ న, దుర్గా భవాని మహిళా మండలి గోదా కోలాట బృందాలు, పాలబిందెల బాలు నృత్యాలు, పెంటయ్య బ్యాండు భక్తి గీతాలాపనలతో రథోత్సవం పురవీధుల్లో సాగింది. ఈ సందర్భంగా అడుగడుగునా భక్తులు హారతులతో నీరజనాలు పలికారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి, ఆలయ చైర్మన్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి, ఈఓ మనోహర్‌రెడ్డి, టుటౌన్ ఎస్ఐ బాషా, కమిటీ సభ్యులు జడల సువర్ణ, సునీతవేమన, శ్రీనివాసాచార్యులు, భక్తులు చకిలం వేణుగోపాలరావు, అర్చకులు పాల్గొన్నారు. -
నామినేషన్ల కోలాహలం
నాలుగో రోజు 29 నామినేషన్లు లోక్‌సభకు 4, అసెంబ్లీ స్థానాలకు 25 దాఖలు నల్లగొండకు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మిర్యాలగూడ అసెంబ్లీకి తూడి సాక్షి, నల్లగొండ, జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నాలుగో రోజు శనివారం మొత్తం 29 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో నల్లగొండ, భువనగిరి లోక్‌సభ స్థానాలకు రెండుచొప్పున, 8 అసెంబ్లీ స్థానాలకు 25 చొప్పున ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. భువనగిరి, నాగార్జునసాగర్, దేవరకొండ, తుంగతుర్తి నియోజకవర్గాల నుంచి ఒక్క నామినేషన్ కూడా రాలేదు. అత్యధికంగా నల్లగొండ అసెంబ్లీ స్థానానికి 6 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నుంచి 7, టీడీపీ, టీఆర్ఎస్ నుంచి 3 చొప్పున, వైఎస్సార్ కాంగ్రెస్, భారత పిరమిడ్ పార్టీల నుంచి ఒక్కొక్కటి చొప్పున, స్వతంత్రులు 10మంది నామినేషన్లు వేశారు. ఎంపీ గుత్తా, డీసీసీ అధ్యక్షుడు తూడి.. నల్లగొండ లోక్‌సభ స్థానానికి సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి రెండు సెట్ల నామినేషన్లను సమర్పిం చారు. అదేవిధంగా భువనగిరి లోక్‌సభ స్థానానికి బీఎస్పీ అభ్యర్థిగా అర్వపల్లి అంబటి రెండు సెట్ల నా మినేషన్లు వేశారు. మిర్యాలగూడ అసెంబ్లీ స్థానానికి డీసీసీ జిల్లా అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా నకిరేకల్ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రెండుసెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. -
కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి
గుంటూరు మెడికల్, న్యూస్‌లైన్ :రాష్ట్రంలో అనిశ్చితి వల్ల కాంగ్రెస్ పార్టీని దోషిగా చిత్రీకరించేందకు అన్ని పార్టీలు శతవిధాల ప్రయత్నిస్తున్నాయని, దానిని తిప్పికొట్టి మరో నాలుగు నెలల్లో జరగనున్న ఎన్నికల్లో పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి జెడి. శీలం పిలుపునిచ్చారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డీసీసీ అధ్యక్షుడి సారథ్యంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అమలుచేసిన సంక్షేమ కార్యక్రమాలు, పథకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. గత ఏడాదిగా రాష్ట్రంలో బాధాకర పరిణామాలు జరుగుతున్నాయని, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని చెప్పారు. అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లు ఉందని, ప్రజల అభిప్రాయాలను తీసుకొని తదుపరి దానిని కేంద్రానికి పంపాలన్నారు. తెలంగాణకు తాము వ్యతిరేకులం కాదని, తెలంగాణ ఇచ్చే తీరు మాత్రం అభ్యంతరకరంగా ఉందన్నారు. అసెంబ్లీలో ఉన్న ముసాయిదా బిల్లుపై ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు పత్రికలు, టీవీ చానల్స్ ఉన్నాయని, తాము చెప్పుకునేందుకు ఏమీ లేవన్నారు. కొత్తపార్టీ పెట్టే ఆలోచనల్లో ఎవ్వరూ లేరన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు, ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, ఎస్సీసెల్ చైర్మన్ ఈరి రాజశేఖర్, పార్టీ నాయకులు కొరివి వినయ్‌కుమార్, భాష్యం నరసయ్య,పెదకాకాని గుడి పాలకమండలి సభ్యురాలు వై.అమ్మణి, ప్రసన్నాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర నినాదాలు... జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొద్దిసేపు సమైక్యాంధ్ర జేఏసీ విద్యార్థి నాయకులు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. అనంతరం మంత్రి జె.డి. శీలంకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వినతి ప్రతాన్ని సమర్పించారు. వినతి ప్రతం సమర్పించిన వారిలో మండూరి వెంకటరమణ, జెట్టి ఝాన్సీరాణి, రాయపాటి సాయికష్ణ తదితరులు ఉన్నారు. సూటిగా ప్రశ్నించిన డాక్టర్ రాయపాటి... విలేకరుల సమావేశంలో మాట్లాడిన అనంతరం శ్రీకృష్ణ కమిటీ సిఫార్సుల గురించి మంత్రి జె.డి. శీలంను మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ సూటిగా ప్రశ్నించారు. కోట్లాది రూపాయలను ఖర్చుపెట్టి సర్వే చేయించి సమర్చించిన నివేదికను ఎందుకు బుట్టదాఖలు చేశారని సామాన్య ప్రజలు అడుగుతున్నారన్నారు. ఈ ప్రశ్నలకు మంత్రి శీలం ఎలాంటి సమాధానం చెప్పకుండానే మిన్నకుండిపోయారు. -
ఎసరు?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా కాంగ్రెస్ వర్గ రాజకీయాలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. జిల్లా కాంగ్రెస్(డీసీసీ) అధ్యక్షుడు ఆమంచి కృష్ణమోహన్ చాపకిందకు నీళ్లు వస్తున్నాయి. ఆయన్ను డీసీసీ పీఠం నుంచి తప్పించాలని పీసీసీ చీఫ్ బొత్స సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. సీఎం కిరణ్ వర్గీయుడిగా ఉండేందుకే ఆమంచి మొగ్గుచూపడమే బొత్స ఆగ్రహానికి కారణం. మరోవైపు కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి కూడా ఆమంచి తీరుపై గుర్రుగా ఉన్నారు. దాంతో ఆమంచి ఉద్వాసనకు రంగం సిద్ధమైంది. ఎన్నికల నాటికి సీఎం కిరణ్వర్గంపై పైచేయి సాధించాలన్నది బొత్స వ్యూహం. అందులో భాగంగానే జిల్లాలో ఆమంచిపై వేటు పడనుందని తెలుస్తోంది. జిల్లా కాంగ్రెస్‌లో సరికొత్త రాజకీయ సమీకరణలిలా ఉన్నాయి.. సీఎంతో సాన్నిహిత్యం...బొత్సకు దూరం రాజకీయంగా రంగులు మార్చే ఆమంచి కృష్ణమోహన్ నైజమే ప్రస్తుత పరిస్థితికి కారణం. బొత్స వర్గీయుడిగా మెలిగి డీసీసీ అధ్యక్ష పీఠాన్ని ఆయన దక్కించుకున్నారు. ప్రధానంగా మంత్రి మహీధర్ రెడ్డి సీఎం కిరణ్‌కు సన్నిహితుడిగా ఉన్నందున బొత్స తన వర్గీయుడిగా ఉంటారన్న నమ్మకంతో ఆమంచిని డీసీసీ అధ్యక్షుడిని చేశారు. కానీ మారిన పరిస్థితుల్లో ఆయన బొత్సకు దూరం జరుగుతూ వచ్చారు. పూర్తిగా సీఎం వర్గీయుడిగా ముద్ర పడేందుకే మొగ్గుచూపారు. దీన్ని గమనించినప్పటికీ బొత్స ఏమాత్రం బయటపడకుండా వేచిచూసే ధోరణి అవలంబించారు. దీన్ని గుర్తించలేని ఆమంచి పూర్తిగా సీఎం కిరణ్ వర్గీయుడిగా మారిపోయి ఒకానొక దశలో బొత్సను బేఖాతరు చేసే స్థితికి చేరుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే ఊపులో ఆయన కేంద్ర మంత్రి పనబాక లక్ష్మితో కూడా వైరం కొనితెచ్చుకున్నారు. తన అసెంబ్లీ నియోజకవర్గంలో ఆమె ఏమాత్రం జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్న రీతిలో వ్యవహరించారు. సంతనూతలపాడు, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లో తన మాట చెల్లుబాటు అవుతున్నప్పటికీ... చీరాలలో తనకు కనీస గౌరవం దక్కడం లేదని ఆమె కొంతకాలంగా ఆమంచిపై గుర్రుగా ఉన్నారు. బొత్సకు అందివచ్చిన అవకాశం... ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన - తదనంతర పరిణామాలు బొత్సకు కలసివచ్చాయి. అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పీసీసీకి అధిష్టానం ఆదేశించింది. వాస్తవానికి ఆమంచి అధిష్టానికి వ్యతిరేకంగా పెద్దగా వ్యాఖ్యలు ఏమీ చేయలేదు. మొదట్లో కాస్త హడావుడి చేసినప్పటికీ ఆయన విభజనకు సహకరించేందుకు మొగ్గుచూపుతున్నట్టు కనిపిస్తున్నారు. కానీ ఆమంచిని డీసీసీ పీఠం నుంచి తప్పించాలని భావిస్తున్న బొత్స మాత్రం దీన్ని అవకాశంగా తీసుకున్నారు. అందుకే అధిష్టానానికి సమర్పించిన నివేదికను జాగ్రత్తగా రూపొందించారు. ‘అధిష్టానాన్ని ఆమంచి విమర్శించారని... కాబట్టి ఆయన్ని డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించలేమని’ బొత్స నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. తద్వారా ఆమంచిని తప్పించి మరొకర్ని డీసీసీ అధ్యక్షుడిగా నియమించాలన్నది ఆయన ఉద్దేశం. తదుపరి డీసీసీ అధ్యక్షుడిపై కూడా ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది. అధిష్టానానికి సన్నిహితంగా ఉండే కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, ఎంపీ మాగుంట సూచించిన మేరకు కొత్త డీసీసీ అధ్యక్షుడి నియామకానికి బొత్స నిర్ణయించారు. తద్వారా ఇటు జిల్లాలోనూ అటు అధిష్టానం వద్ద తన పట్టును పెంచుకోవాలన్నది ఆయన లక్ష్యం. దీనిపై అధికారిక ప్రకటన వారంరోజుల్లోనే వెలువడనుందని తెలుస్తోంది. జిల్లా పార్టీలో వర్గ రాజకీయాలను ప్రభావితం చేయనున్న ఈ పరిణామాలను కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా గమనిస్తున్నాయి. అటు సీఎం కిరణ్ సన్నిహితుడైన మంత్రి మహీధర్ రెడ్డి వర్గంతో వైరం... ఇటు పీసీసీ చీఫ్ బొత్స, కేంద్రమంత్రి పనబాకతో విరోధం... వెరసి ఆమంచి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైందని వ్యాఖ్యానిస్తున్నాయి. -
‘సేనానీ లేడు... సైన్యమూ లేదు’
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘సేనానీ లేడు... సైన్యమూ లేదు’అన్నట్టుగా తయారైంది జిల్లా కాంగ్రెస్ పరిస్థితి. అది కూడా పార్టీ అధికారంలో ఉండగా ఇంతటి దుస్థితికి దిగజారిపోవడం విస్మయపరిచే వాస్తవం. అధికార పార్టీ అంటేనే ఎక్కడలేని దర్పం... హోదా... సందడి కనిపిస్తుంది. ఇక అధికార పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడి వైభవం అంతా ఇంతా కాదు.. డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే కూడా అయితే ఇక చెప్పేదేముందీ!... కానీ జిల్లా కాంగ్రెస్‌లో ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. జిల్లా కాంగ్రెస్(డీసీసీ) అధ్యక్షుడు ఆమంచి కృష్ణమోహన్ పార్టీ కార్యాలయంవైపు కన్నెత్తి చూడటం లేదు. బోర్డు తిప్పేసిన కంపెనీలా తయారైన జిల్లా కాంగ్రెస్ . తాజా పరిస్థితి ఇలా ఉంది... ఆమంచి ఆమడదూరం ఆమంచి కృష్ణమోహన్ తాను డీసీసీ అధ్యక్షుడిననే విషయాన్నే మరచిపోయినట్టున్నారు. కొన్ని నెలలుగా ఆయన డీసీసీ కార్యాలయానికే రావడం లేదు. నిజం చెప్పాలంటే ఆరు నెలల క్రితం డీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన కేవలం రెండుసార్లే కార్యాలయానికి వచ్చారు. మొదటి సారి డీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి... మరోసారి ఓ సమావేశానికి హాజరయ్యారు. అంతే!... ఆ తరువాత ఇంత వరకు పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి చూడనే లేదు. జూన్ నుంచి ఇంతవరకు ఆయన డీసీసీ కార్యాలయానికి రానే లేదు. జులైలో పంచాయతీ ఎన్నికల కోసం కూడా డీసీసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించ లేదు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గెలుపు బాధ్యతలు తీసుకోవడానికి ఆమంచి ఇష్టపడ లేదు. పార్టీ ఓడిపోతే అందుకు మంత్రి మహీధర్‌రెడ్డిని బాధ్యుడిని చేయాలన్నది ఆయన ఉద్దేశం. చివరి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ రోజే(జులై 30) రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రకటించింది. దాంతో ఒక్కసారిగా పరిస్థితి చేయిదాటిపోయింది. దాంతో డీసీసీ కార్యాలయానికి రావాలన్న ఉద్దేశాన్ని ఆమంచి పూర్తిగా పక్కనపెట్టేశారు. రాజీనామా ప్రహసనం రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్ష పదవులకు రాజీనామా చేసినట్టు ఆమంచి ప్రకటించారు. కానీ ఆ రెండు రాజీనామాలు ఆమోదం పొందలేదు. దాంతో ఆమంచి ఎమ్మెల్యేగా ఎంచక్కా కొనసాగుతున్నారు. గన్‌మెన్‌తోపాటు ఎమ్మెల్యేగా అన్ని హోదాలు అనుభవిస్తున్నారు. డీసీసీ అధ్యక్ష పదవికి వచ్చేసరికి మాత్రం ఆమంచి మాటమారుస్తున్నారు. తాను రాజీనామా చేశానని చెబుతూ తప్పించుకుంటున్నారు. ఆయన అసలు ఉద్దేశం వేరుగా ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ‘ప్రత్యామ్నాయం’ కోసం అర్రులు రాష్ట్రంలో కాంగ్రెస్ దాదాపు కనుమరుగైపోయే తరణంలో డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగడానికి ఆమంచి ససేమిరా అంటున్నారు. మంత్రి మహీధర్ రెడ్డితో ఆయనకు తీవ్ర విభేదాలు ఎలాగూ ఉన్నాయి. కాబట్టి జిల్లా పార్టీ బాధ్యతలు మంత్రే స్వయంగానో తన అనుచరుల ద్వారానో చూసుకుంటారులే అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పనైపోయిందని నిర్ధారించుకున్న ఆమంచి ప్రత్యామ్నాయ అవకాశాలపై కన్నేశారు. రానున్న ఎన్నికల్లో సమైక్యాంధ్ర నినాదంతో పోటీ చేస్తానని బీరాలు పలికిన ఆమంచి తరువాత ఆ ఊసే ఎత్తడం మానేశారు. మళ్లీ సీఎం కిరణ్‌కు సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇతరత్రా అవకాశాల కోసం అర్రులు చాస్తూ విఫలయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ వ్యవహారాలను పూర్తిగా గాలికొదిలేశారు. పార్టీ ఊసే ఎత్తని మంత్రి మంత్రి మహీధర్ రెడ్డి తీరు కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఆయన కూడా జిల్లా కాంగ్రెస్ వ్యవహారాలను పట్టించుకోవడం లేదు. పంచాయతీ ఎన్నికల సమయంలోనే ఆయన పార్టీ వ్యవహారాల బాధ్యత తీసుకోలేదు. సాధారణంగానే పార్టీ బాధ్యతలను పట్టించుకునే అలవాటులేని ఆయన... ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోనూ పార్టీ ఊసే ఎత్తడం లేదు. దాంతో జిల్లా కాంగ్రెస్‌లో కాస్తో కూస్తో మిగిలిన కాంగ్రెస్ శ్రేణులకు పెద్ద దిక్కులేకుండాపోయింది. కనీసం ఎన్నికల వరకైనా బండిని లాక్కురావాలన్న ధ్యాసే తమ నేతలకు లేకుండాపోయిందని విమర్శిస్తున్నారు. జిల్లాలో పార్టీని దాదాపుగా చాపచుట్టేసినట్టేనని కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. -
డీసీసీ అధ్యక్షుడిని నేనే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడిగా క్యామ మల్లేశ్ నియామకం చెల్లదని ఆ పార్టీ సీనియర్ నేత కేఎం ప్రతాప్ అన్నారు. మల్లేశ్‌ను డీసీసీ ఇన్చార్జి అధ్యక్షుడిగా పీసీసీ ప్రకటించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇన్చార్జిల నియామకాలు కొన్ని అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే జరుగుతాయని గుర్తు చేశారు. ఏఐసీసీ అనుమతిలేకుండానే మల్లేశ్ పేరును పీసీసీ ఖరారు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రతాప్ మాట్లాడారు. అధినాయకత్వం అనుమతి మేరకు పీసీసీ చీఫ్‌లు ఆయా జిల్లాల కమిటీలను ఖరారు చేస్తారని, రంగారెడ్డి జిల్లా విషయానికి వచ్చే సరికి.. అధిష్టానం ఆమోదం లేకుండానే మల్లేశ్‌ను నియమించి నట్లు పీసీసీ ఉపాధ్యక్షులు పరస్పర విరుద్ధ ప్రకటనలు జారీ చేసి పార్టీ శ్రేణులను గందరగోళంలోకి నెట్టారని అన్నారు. ఇప్పటికీ తానే డీసీసీ సారథినని, పార్టీ వ్యవహారాలపై అధిష్టానం కూడా తనతోనే ఉత్తర ప్రత్యుత్తరాలను కొనసాగిస్తోందని చెప్పుకొచ్చారు. పార్టీ మార్గదర్శకాలకు భిన్నంగా డీసీసీ ప్రెసిడెంట్‌గా మల్లేశ్ ప్రకటించుకుంటే... చట్టప్రకారం చర్యలు చేపడతానని ప్రతాప్ హెచ్చరించారు.