సమావేశంలో మాట్లాడుతున్న శంకర్‌నాయక్
నల్లగొండ : ఎస్టీల మధ్య కొందరు పెద్దలు చిచ్చు పెడుతున్నారని, లంబాడీలకు, గోండులు, కోయల మధ్య చిచ్చు పెట్టి రిజర్వేషన్ నుంచి తొలగించాలని కుట్రలు పన్నుతున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నాయక్ ఆరోపించారు. మంగళవారం నల్లగొండ ఆర్‌అండ్‌బీ అ«తిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు భాస్కర్, రతన్‌సింగ్ నాయక్‌లతో కలిసి ఆయన మాట్లాడారు. 1977లో ఎస్టీలకు రిజర్వేషన్లు పెట్టడం జరిగిందని, ఆనాడు నైజాం, బ్రిటీష్ కాలంలో ఆంధ్రాప్రాంతంలో రిజర్వేషన్లు ఉండేవని, తెలంగాణ లో ఉండేవి కాదన్నారు. ఈ విషయాన్ని ఇంది రాగాంధీ దృష్టికి గిరిజన నేత రవీంద్రనాయక్ తీసుకెళ్లడంతో తెలంగాణ, ఆంధ్రాప్రాంతాల్లో రిజర్వేషన్లు అమలు చేయడం జరిగిందన్నారు.
అయితే కొందరు పెద్దలు గోండులను, కోయలను రెచ్చగొట్టి లంబాడీలపై ఉసిగొల్పుతున్నారన్నారు. రాజ్యాంగపరంగా వచ్చిన రిజర్వేషన్లను ఎవరూ కాదనలేరన్నారు. కేసీఆర్ 12 శాతం రిజర్వేషన్లు పెంచుతామని ఎస్టీలను మోసం చేశాడని ఆరోపించారు. త్వరలోనే లంబాడీల బహిరంగ సభ పెడతామన్నారు. గతంలో ఎస్టీ జాబితాలో 35 కులాలు ఉండేవి. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత 13 కులాలు ఉన్నాయని, అయితే లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగిస్తే ఇప్పుడున్న 6 శాతం రిజర్వేషన్లు కూడా తగ్గిపోతాయని, అందరం కలిసి 10శాతం రిజర్వేషన్ సాధిద్ధామన్నారు. విడిపోవడం వల్ల అందరికీ నష్టమని, కలిసివుండి పోరాటం చేద్దామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment