lambadas
-
శ్రీ సేవాలాల్ మహారాజ్ ఎవరు.. గిరిజనులకు ఆరాధ్యుడు ఎలా అయ్యారు?
ఆయన భారత గిరిజన ప్రజలకు ఆరాధ్య దైవం. లంబాడీలను అహింసావాదంవైపు నడిపించిన దార్శనికుడు. బ్రహ్మచర్య నిష్టను ఆచరించి ఎంతో మంది గిరిజనులను ఆకర్షించిన వ్యక్తి. ఆయనే సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ (sant shri sevalal maharaj). 17వ శతాబ్దంలో అవతరించిన ఆయన, గిరిజనులకు ఆరాధ్య దైవమయ్యారు. నేడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను సేవాలాల్ బంజార సంఘం (Banjara Community) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు సెలవుదినంగా ప్రకటించాలని గిరిజనులు (Tribals) కోరుతున్నారు.గిరిజన రాజుగా..అసలు శ్రీ సేవాలాల్ మహారాజ్ ఎవరు..? ఆయనకు మూడు దశాబ్దాలుగా గిరిజనుల్లో ఇంత ఆదరణ ఎందుకు ఉంది? ఆయన రాజా? లేక దార్శనికుడా? లేక ఆధ్యాత్మిక గురువా? అనేది చాలా మందిని తొలుస్తున్న ప్రశ్న. తెలంగాణలో గిరిజనులు ఆరాధించే ఆధ్యాత్మిక గురువు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15న ఏపీలోని అనంతపురం జిల్లాలో గుత్తి సమీపంలోని ఓ మారుమూల తండాలో జన్మించారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన అప్పట్లోనే దేశమంతటా తిరిగి లంబాడీ సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చారు. అందుకే ఆయన వారికి ఆరాధ్య దేవుడయ్యాడు. రాజపుత్ర సంతతికి చెందిన గిరిజన జాతుల్లో లంబాడీ జాతికి చెందిన దంపతులకు జన్మించడం వల్ల ఆయనను సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్‌గా, గిరిజన రాజుగా, లంబాడీ గురువుగా కొలుస్తారు. అప్పట్లోనే నిజాం రాజులకు ఎదురొడ్డి నిలిచిన ఘనత సేవాలాల్ మహారాజ్ది. కఠోర నిష్ట సేవాలాల్ మహారాజ్ పూజా విధానం చాలా కఠినతరంగా ఉంటుంది. సేవాలాల్ గుడిని దర్శించిన భక్తులందరూ ఉదయం, సాయంత్రం కలుసుకోవాల్సి ఉంటుంది. బలన్బోగ్ మరియు బేలన్బోగ్ అనే ఆధ్యాత్మిక సాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ సమయంలో భగవంతునికి నివేదించి ధర్మబోధన చేస్తారు. ప్రతీ బంజార యువకుడు కనీసం జీవిత కాలంలో ఒక్క సారైనా బంజార సేవాలాల్ గుడిని దర్శించాలని విశ్వసిస్తుంటారు. చదవండి: కామాఖ్య దర్శనం.. చిరస్మరణీయంఅనంతపురం (Anantapur) గుత్తి సమీపంలోని ఓ గిరిజన తండాలో భీమానాయక్, ధర్మిణి దంపతులకు జన్మించిన రమావత్ సేవాలాల్ క్రమక్రమంగా దార్శనికుడిగా, అహింసావాదిగా పేరు సంపాదించారు. తర్వాత కాలంలో ఛత్తీస్‌గఢ్‌లో ఆయనకు గిరిజనులు ఆలయాన్ని నిర్మించారు. సేవాలాల్ మహారాజ్ జన్మించిన ఊరును ప్రస్తుతం పురితండాగా పిలుస్తున్నారు.సంత్ శ్రీ సేవాలాల్ మార్గాన్ని ఆచరించాలి గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ శ్రీ సేవాలాల్ చూపించిన మార్గాన్ని రాష్ట్రంలోనే కాకుండా, దేశంలోని ప్రతి గిరిజనుడు ఆచరించాల్సిన అవసరం ఉంది. ఆయన ఆదర్శాలను ప్రచారం చేస్తూ, జయంతి ఉత్సవాలకు రాష్ట్రంలోని ప్రతి గిరిజనుడు జరుపుకోవాలి. – రమావత్ చిరంజీవి, అంగడిపేట జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి గిరిజనులు ఎంతో భక్తితో జరుపుకునే సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడంతోపాటు, జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. – రమావత్ శ్రీనునాయక్, సేవాలాల్ బంజార సంఘం నాయకుడు, గుడిపల్లి మండలం -
మా మధ్య పెద్దలు చిచ్చు పెడుతున్నారు!
నల్లగొండ : ఎస్టీల మధ్య కొందరు పెద్దలు చిచ్చు పెడుతున్నారని, లంబాడీలకు, గోండులు, కోయల మధ్య చిచ్చు పెట్టి రిజర్వేషన్ నుంచి తొలగించాలని కుట్రలు పన్నుతున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నాయక్ ఆరోపించారు. మంగళవారం నల్లగొండ ఆర్అండ్బీ అ«తిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు భాస్కర్, రతన్‌సింగ్ నాయక్‌లతో కలిసి ఆయన మాట్లాడారు. 1977లో ఎస్టీలకు రిజర్వేషన్లు పెట్టడం జరిగిందని, ఆనాడు నైజాం, బ్రిటీష్ కాలంలో ఆంధ్రాప్రాంతంలో రిజర్వేషన్లు ఉండేవని, తెలంగాణ లో ఉండేవి కాదన్నారు. ఈ విషయాన్ని ఇంది రాగాంధీ దృష్టికి గిరిజన నేత రవీంద్రనాయక్ తీసుకెళ్లడంతో తెలంగాణ, ఆంధ్రాప్రాంతాల్లో రిజర్వేషన్లు అమలు చేయడం జరిగిందన్నారు. అయితే కొందరు పెద్దలు గోండులను, కోయలను రెచ్చగొట్టి లంబాడీలపై ఉసిగొల్పుతున్నారన్నారు. రాజ్యాంగపరంగా వచ్చిన రిజర్వేషన్లను ఎవరూ కాదనలేరన్నారు. కేసీఆర్ 12 శాతం రిజర్వేషన్లు పెంచుతామని ఎస్టీలను మోసం చేశాడని ఆరోపించారు. త్వరలోనే లంబాడీల బహిరంగ సభ పెడతామన్నారు. గతంలో ఎస్టీ జాబితాలో 35 కులాలు ఉండేవి. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత 13 కులాలు ఉన్నాయని, అయితే లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగిస్తే ఇప్పుడున్న 6 శాతం రిజర్వేషన్లు కూడా తగ్గిపోతాయని, అందరం కలిసి 10శాతం రిజర్వేషన్ సాధిద్ధామన్నారు. విడిపోవడం వల్ల అందరికీ నష్టమని, కలిసివుండి పోరాటం చేద్దామన్నారు. -
గిరిజనుల రిజర్వేషన్ వివాదంలో సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : గిరిజనుల రిజర్వేషన్ వివాదంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్లో సుప్రీంకోర్టు సోమవారం ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. ఎస్సీ, ఎస్టీ ఉత్తర్వుల సవరణ చట్టం–1976 మేరకు బంజారా, లంబాడా, సుగాలీలను ఎస్టీలుగా గుర్తించడం రాజ్యాంగ విరుద్ధమని, ఆర్టికల్ 342ని ఉల్లంఘించడమేనని, వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ తొలుత హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఈ వివాద పరిష్కారం న్యాయస్థానం పరిధిలో లేదని, పార్లమెంటరీ వ్యవస్థ పరిధిలో ఉందని పేర్కొంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ గోండ్వానా వెల్ఫేర్ సొసైటీ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం ఈ పిటిషన్‌తో పాటు మరికొన్ని పిటిషన్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. ఈ నేపథ్యంలో పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు ఎం. ఎన్.రావు, వికాస్ సింగ్, అల్లంకి రమేశ్ వాదనలు వినిపించారు. బంజారా, లంబాడాలు, సుగాలీ లు గిరిజనులు కాదని, 1976 వరకు పాత ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ జిల్లాల్లో వారిని ఎస్టీలుగా పరిగణించలేదని, ఇతర రాష్ట్రాల నుంచి వారు తెలంగాణకు వలస వచ్చి అక్కడి అసలైన గిరిజనులకు ఉద్దేశించిన హక్కులను కొల్లగొట్టారని పిటిషన్లో పేర్కొన్నారు. అంతకుముందు వారు బీసీ జాబితాలో ఉన్నారని వివరించారు. హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనమైన సందర్భంలో ఆంధ్రా ప్రాంతం మద్రాసు రాష్ట్రంలో ఉందని, ఆ సమయంలో లంబాడా, సుగాలీలను ఆంధ్రా ప్రాంతంలో ఎస్టీలుగా గుర్తించారని, కానీ హైదరాబాద్ స్టేట్‌లో కాదని పిటిషనర్ల తరఫు లాయర్లు వివరించారు. బంజారా సేవా సమితి తరఫున సీనియర్ న్యాయవాదులు రాజీవ్‌ధావన్, ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి తమ వాద నలు వినిపిస్తూ.. పిటిషనర్లు 42 ఏళ్ల అనంతరం ఈ అంశంపై కోర్టును ఆశ్రయించారని, పిటిషన్‌ను తోసిపుచ్చాలని విన్నవించారు. వాదనల అనంతరం పిటిషన్‌పై స్పందించాలంటూ ప్రతివాదులైన కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ,ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రప్రభుత్వాలకు ధర్మాసనం నోటీసులు జారీచేసింది. అనంతరం విచారణ వాయిదా వేసింది. -
మా ఊళ్లో మా రాజ్యం
హైదరాబాద్: ‘ మా ఊళ్లో మా రాజ్యం’ పేరుతో ఆదివాసీ పోరాట సమితి నేతలు ఉద్యమానికి పిలుపునిచ్చారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే ప్రధానమైన డిమాండ్‌తో కొన్ని రోజులుగా ఆదివాసీలు పోరాటాలు చేస్తున్నారు. ఈ విషయంపై ఆదివాసీ నాయకులు తెలంగాణ రాష్ర్ట సీఎస్‌తో కూడా గురువారం చర్చించారు. సీఎస్‌తో ఆదివాసీల చర్చలు విఫలమయ్యాయి. ఎస్టీల జాబితా నుంచి లంబాడా కులస్తులను తొలగించేందుకు వీలు కాదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఆదివాసీ నాయకులు గురువారం రాత్రి నుంచే ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ విషయంపై ఆదివాసీ నాయకులు స్పందిస్తూ..ప్రభుత్వంతో చర్చలు విఫలమయ్యాయని, మా డిమాండ్లపై స్పష్టత రాలేదని, జూన్ 2న నిరసనలు తెలుపుతామని వెల్లడించారు. -
ఉట్నూరు ఉద్రిక్తం
-
అనుమతి 20వేలకు.. వచ్చింది 70వేల మంది
హైదరాబాద్: రెండు రోజుల క్రితం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన లంబాడీల ఐక్య వేదిక సభ నిర్వహుకులపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సభకు 20వేలమంది హాజరుకు అనుమతిస్తే 70వేల మందిని తీసుకువచ్చారని పోలీసులు చెబుతున్నారు. పైగా సభకు వచ్చిన వారికి తగ్గట్లుగా ప్రాథమిక సౌకర్యాలు కూడా కల్పించకపోవడంతో కొందరు బహిరంగ మూత్ర విసర్జన చేశారన్నారు. డీజేకు అనుమతి ఇవ్వకున్నా డీజే వాడారని, నాయకుల ప్రసంగాలలో ప్రభుత్వాన్ని దూషించారని తెలిపారు. ఈ కారణాలతో సభకు అనుమతి కోసం దరఖాస్తు చేసిన తెలంగాణ గిరిజన ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సురేష్‌పై సిటీ పోలీసు యాక్టులోని 188, 290, 336-76 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
సంస్కతీ, సంప్రదాయాలకు ప్రభుత్వం పెద్దపీట
ఖానాపూర్ : అనాదిగా వస్తున్న సంస ్కతీ సంప్రదాయాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని, ప్రతి ఒక్కరూ వారి వారి సంస్కతిని ఆచరించాలని ఎమ్మెల్యే అజ్మీరా రేఖాశ్యాంనాయక్ అన్నారు. మండలంలోని బంజారా గిరిజన తండాల్లో శీతల్ పండుగను మంగళవారం ఘనంగా జరుపుతున్నారు. బంజార సంస్కతీ సంప్రదాయాల్లో భాగంగా ప్రతీ ఏటా ఖరీఫ్‌లో ఆయా గ్రామాల బంజారాలు సీతళాయాడి పూజలను నిర్వహిస్తారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోన్న ఆచారం. ప్రజలు, పశుసంపద ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ గ్రామశివారులోని వేపచెట్టు క్రింద పంట దాన్యాలు, నైవేద్యంగా బోనాన్ని సమర్పిస్తారు. ఏడు దేవుళ్లను అక్కడ ఏర్పరచి ఈ పూజలు చేశారు. పూజ నిర్వహించిన ప్రాంతం నుంచి గొడ్డు, గొద, పశుసంపదను తీసుకెళ్లడంతో పాటు రోజంతా మహిళల పాటల మధ్య వేడుకలు నిర్వహించారు. ఉత్సవాల్లో పాల్గోన్న ఎమ్మెల్యే మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలైన పెంబితాండ, ఇటిక్యాల తండా, లోతొర్యెతండా, తాటిగూడ తదితర చోట్ల జరిగిన కార్యక్రమాలకు ఎమ్మెల్యే హాజరై ప్రత్యేక పూజలు చేయడంతో పాటు సంప్రదాయ నత్యం చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు వి.లలిత, విక్రమ్‌నాయక్, చంద్రబాను, విలాస్, పరుశురాం, అంకం రాజేందర్, పాకల రాంచందర్, రాజగంగన్న, అష్వక్, ఆరె. రాజేందర్, జన్నారపు శంకర్, గొర్రె గంగాధర్, అబినయ్, షకిల్, స్వామి, కిషన్, ఎంఈవో గుగ్లావత్ రాంచందర్ పాల్గొన్నారు.