అనుమతి 20వేలకు.. వచ్చింది 70వేల మంది | case on lambadi meeting conductors | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 15 2017 12:57 PM | Last Updated on Tue, Aug 21 2018 6:00 PM

case on lambadi meeting conductors

హైదరాబాద్: రెండు రోజుల క్రితం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన లంబాడీల ఐక్య వేదిక సభ నిర్వహుకులపై ఎల్‌బీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సభకు 20వేలమంది హాజరుకు అనుమతిస్తే 70వేల మందిని తీసుకువచ్చారని పోలీసులు చెబుతున్నారు. పైగా సభకు వచ్చిన వారికి తగ్గట్లుగా ప్రాథమిక సౌకర్యాలు కూడా కల్పించకపోవడంతో కొందరు బహిరంగ మూత్ర విసర్జన చేశారన్నారు. డీజేకు అనుమతి ఇవ్వకున్నా డీజే వాడారని, నాయకుల ప్రసంగాలలో ప్రభుత్వాన్ని దూషించారని తెలిపారు. ఈ కారణాలతో సభకు అనుమతి కోసం దరఖాస్తు చేసిన తెలంగాణ గిరిజన ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ సురేష్‌పై సిటీ పోలీసు యాక్టులోని 188, 290, 336-76 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement