ఆదివాసీ నాయకులు
హైదరాబాద్: ‘ మా ఊళ్లో మా రాజ్యం’ పేరుతో ఆదివాసీ పోరాట సమితి నేతలు ఉద్యమానికి పిలుపునిచ్చారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే ప్రధానమైన డిమాండ్‌తో కొన్ని రోజులుగా ఆదివాసీలు పోరాటాలు చేస్తున్నారు. ఈ విషయంపై ఆదివాసీ నాయకులు తెలంగాణ రాష్ర్ట సీఎస్‌తో కూడా గురువారం చర్చించారు. సీఎస్‌తో ఆదివాసీల చర్చలు విఫలమయ్యాయి.
ఎస్టీల జాబితా నుంచి లంబాడా కులస్తులను తొలగించేందుకు వీలు కాదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఆదివాసీ నాయకులు గురువారం రాత్రి నుంచే ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ విషయంపై ఆదివాసీ నాయకులు స్పందిస్తూ..ప్రభుత్వంతో చర్చలు విఫలమయ్యాయని, మా డిమాండ్‌లపై స్పష్టత రాలేదని, జూన్ 2న నిరసనలు తెలుపుతామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment