reservations issue
-
పై కోర్టుల్లోనూ రిజర్వేషన్లు ఉండాలి
ఉన్నత న్యాయస్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమ్యూనిటీల నుంచి న్యాయమూర్తుల ప్రాతినిధ్యం తగినంతగా లేదు. ఆధిపత్య కులాలకు చెందిన వారికి అందుబాటులో ఉండే వృద్ధి అవకాశాలను వెనుకబడిన వర్గాలకు చెందినవారు పొందడం లేదన్నది వాస్తవం. ఉమ్మడి రాష్ట్ర న్యాయమూర్తుల్లో వీరి ప్రాతినిధ్యం సుమారు ఇరవై శాతమే. అదే సమయంలో జనాభాలో ఇరవై శాతం ఉన్నవారికి హైకోర్టు జడ్జీలుగా సుమారు ఎనభై శాతం ప్రాతినిధ్యం లభించింది. ప్రస్తుతం హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామకంలో ఎలాంటి రిజర్వేషనూ లేదు. ఈ నేపథ్యంలో జడ్జీల నియామకంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమ్యూనిటీలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా మాత్రమే వ్యవస్థాగత వివక్షకు గురవుతున్న కమ్యూనిటీలకు ప్రాతినిధ్యం లేని స్థితిని అధిగమించవచ్చు. భారత ప్రభుత్వం తరపున జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ చైర్పర్సన్ (2013–2016)గా, అదే సమయంలోనే అఖిల భారత వెనుకబడిన వర్గాల సమాఖ్య చైర్‌పర్సన్‌గా వ్యవహరించాను. నా మూడేళ్ల పదవీ కాలంలో దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమ్యూనిటీలకు చెందిన నేతల నుంచి వందలాది ఉత్తరాలను అందుకున్నాను. హైకోర్టుల్లో, సుప్రీంకోర్టులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల నుంచి న్యాయమూర్తుల ప్రాతినిధ్యం తగినంతగా లేని దుఃస్థితిని వారు నా దృష్టికి తెచ్చారు. సుప్రీం కోర్టులో, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాల్లో రిజర్వేషన్లను ప్రవేశపెట్టేలా చూడాలని ఈ వర్గాల ప్రతినిధులు కోరారు. ఆధిపత్య కులాలతో పోలిస్తే సాపేక్షికంగా ప్రతిభా సామర్థ్యాలు తక్కువగా ఉన్న కారణంగానే కోర్టుల్లో వెనుకబడిన వర్గాల ప్రాతి నిధ్యం లేదనేదాన్లో నిజం లేదని వీరి భావన. అణచివేయబడిన కమ్యూనిటీలకు చెందిన యువ న్యాయవాదులకు హై–ప్రొఫైల్ చాంబర్ లేదా సంస్థలో అరుదుగా చోటు లభిస్తోందని వీరు భావిస్తు న్నారు. విజయవంతమైన లాయర్ల కార్యాలయాల్లో వారి సామాజిక వర్గాలకు చెందిన సభ్యుల ఆధిపత్యమే నడుస్తోందని వీరు గమనిం చారు. సీనియర్లు కూడా వారికి విజయవంతమైన లాయర్లు కావడంలో తోడ్పాటు అందిస్తున్నారని వీరి అభిప్రాయం. ఇలా ఎదిగి వచ్చిన లాయర్లలో చాలామంది తర్వాత జడ్జీలుగా మారుతుంటారు. ఆధిపత్య కులాలకు చెందిన వారికి అందుబాటులో ఉండే వృద్ధి అవకా శాలను వెనుకబడిన వర్గాల అడ్వకేట్లు పొందడం లేదన్నది వాస్తవం. న్యాయస్థానంలో ఉన్న జడ్జీల సామాజిక నేపథ్యానికి చెందిన వాడు తమ కేసు వాదిస్తున్న లాయర్ అయితే కేసు త్వరగా విచారణకు వచ్చే అవకాశం ఉందని లిటిగెంట్ పబ్లిక్‌లో ఒక అభిప్రాయం ఉందని నాకు ఉత్తరాలు పంపిన వెనుకబడిన వర్గాల ప్రతినిధులు భావించారు. హైకోర్టుల్లో, సుప్రీంకోర్టులో అమలవుతున్న న్యాయమూర్తుల నియామక ప్రక్రియ... వివక్షకు ముగింపు పలకటం లేదనీ, న్యాయ మూర్తుల నియామకాల్లో కొన్ని సామాజిక బృందాల ఆధిపత్యాన్ని బద్దలు చేయడం లేదనీ వెనుకబడిన వర్గాల ప్రతినిధుల భావన. జ్యుడీషియల్ నియామకాల్లో రిజర్వేషన్లు ప్రస్తుతం ఎగువ, దిగువ స్థాయి జిల్లా న్యాయస్థానాలకు మాత్రమే వర్తిస్తుండటం గమనించాలి. ప్రస్తుతం హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామకంలో ఎలాంటి రిజర్వేషన్ లేదు. బార్, జిల్లా జడ్జీలకు చెందిన అడ్వకేట్లను ఎలాంటి రిజర్వేషన్లు లేకుండానే ఉన్నత స్థానాల్లో నియమిస్తున్నారు. అలాగే హైకోర్టు న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు అడ్వ కేట్లను కూడా రిజర్వేషన్లు లేకుండానే ఉన్నత స్థానాల్లో నియమి స్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియా మకంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమ్యూనిటీలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా మాత్రమే వ్యవస్థాగత వివక్షకు గురవుతున్న కమ్యూనిటీలు ప్రాతినిధ్యం లేని స్థితిని అధిగమించవచ్చనే అభిప్రాయం ఉంటోది. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ప్రాతినిధ్య పరమైన వాస్తవికతను అంచనా వేయడానికి, అవిభక్త ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల సామాజిక నేపథ్యానికి చెందిన డేటాను సేకరించడమైనది. అలాగే విభజన అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులకు చెందిన డేటా కూడా సేకరించడం జరిగింది. అయితే ఈ డేటాను సమర్పించడంలో జడ్జీల సామాజిక నేపథ్యానికీ... వారి ప్రతిభ, పనితీరు లేదా న్యాయ దృక్పథాలు, నిర్ణయాలకు మధ్య సహసంబంధం ఉందని చెప్పే ఉద్దేశం లేదని గమనించాలి. సరైన ప్రాతినిధ్యాలకు హామీ ఇవ్వడానికి రాజ్యాంగబద్ధ న్యాయ స్థానాల్లో రిజర్వేషన్లను కల్పించడాన్ని సమర్థించడమే ఈ డేటా సేకరణ మౌలిక ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా పేరు మార్చిన హైదరాబాద్ కోర్టును రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం, 1956 నవంబర్ 5న నెలకొల్పారు. 1948 సెప్టెంబర్ 17న భారత యూనియన్‌లో హైదరా బాద్ చేరిక తర్వాత, భాషా ప్రాతిపదికన తెలుగుప్రజల కోసం ఏర్పర్చిన రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్. 1956 నుంచి 2014 దాకా హైదరా బాద్ ప్రధాన కేంద్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు హైకోర్టు సేవలం దించింది. 1956లో హైకోర్టు జడ్జీల సంఖ్య 12 కాగా, 2014 నాటికి అది 61కి పెరిగింది. 2014లో రాష్ట్ర పునర్విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రానికీ, విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌కూ ఉమ్మడి హైకోర్టుగా ఇది నాలుగేళ్లపాటు పనిచేసింది. 2018 డిసెంబర్ 26న భారత రాష్ట్రపతి తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ కేంద్రంగానూ, విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌కి అమరావతి కేంద్రంగానూ హైకోర్టులను పునర్ వ్యవస్థీకరించారు. 2019 జనవరి 1న తెలంగాణకు 24 మంది జడ్జీలను, ఆంధ్రప్రదేశ్‌కి 37 మంది జడ్జీలను కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సుప్రీంకోర్టుకు ప్రమోషన్‌పై వెళ్లిన న్యాయ మూర్తుల సంఖ్య 16. వీరిలో ఏడుగురు రెడ్డి కమ్యూనిటీకి చెందిన వారు. ముగ్గురు కమ్మ కమ్యూనిటీకీ, ఇద్దరు బ్రాహ్మణ కమ్యూనిటీకి, ఇద్దరు క్షత్రియ కమ్యూనిటీకి చెందివారు (వీరిలో ఒకరు వెలమ, మరొకరు రాజు). ఒకరు ముస్లిం కమ్యూనిటీకి, ఇంకొకరు షెడ్యూల్డ్ కులానికి చెందినవారు. అంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లిన జడ్జీల్లో ఒక్కరు మాత్రమే ఎస్సీ! ఎస్టీలు, ఓబీసీలకు అసలు అవకాశమే లభించలేదు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రారంభమైనప్పటి నుంచీ ఇంతవరకు 45 మంది ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారు. ఇందులో 16 మంది బ్రాహ్మణ, 5 మంది రెడ్డి, 5 మంది వైశ్య కులానికి చెందినవారు. ముగ్గురు కాయస్థులు, ముగ్గురు క్షత్రియులు (వెలమ, రాజు, రాజ్ పుత్), ఇద్దరు కమ్మవారు, ఇద్దరు ముస్లిం కమ్యూనిటీకి చెందినవారు. మరో ఇద్దరు పంజాబీలు, ఒకరు మాహేశ్వరి, ఒకరు నాయర్, ఒకరు మరాఠా, మరొరు క్రిస్టియన్. వీరిలో ముగ్గురు ప్రధాన న్యాయ మూర్తులు మాత్రమే ఓబీసీలకు చెందినవారు. ఈ ముగ్గురిలో ఒకరు కేరళకు, మరొకరు తమిళనాడుకు చెందిన వారు కాగా ఒకరు తెలం గాణ వాసులు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినవారు ఒక్కరూ లేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు నెలకొల్పినప్పటి నుంచీ నేటి వరకు 253 మంది జడ్జీలు సేవలందించారు. ఇందులో ఓబీసీల నుంచి 43 మంది, ఎస్సీల నుంచి 10 మంది, ఇద్దరు ఎస్టీలు హైకోర్టు జడ్జీలుగా పనిచేశారు. వాస్తవానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 80 శాతం పైగా జనాభా ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలకు చెందినవారే. రెండు రాష్ట్రాల హైకోర్టుల్లో వీరి ప్రాతినిధ్య 21.73 శాతం మాత్రమే. అదే సమయంలో జనాభాలో 20 శాతం కంటే తక్కువగా ఉన్నవారికి హైకోర్టు జడ్జీలుగా 78.26 శాతం ప్రాతినిధ్యం లభించింది. ఈ డేటా ప్రకారం తెలంగాణ హైకోర్టులో ఎస్సీ కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహించినవారు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముస్లిం కమ్యూనిటికీ చెందిన జడ్జి ఒక్కరు కూడా లేరు. వెనుకబడిన వర్గాలు ముస్లింలు, క్రిస్టియన్లకు చెందిన ప్రతిభావంతులు ఎంతోమంది ఉన్నప్పటికీ వీరికి హైకోర్టులోనూ, సుప్రీకోర్టులోనూ న్యాయమైన ప్రాతినిధ్యం లేకుండా పోయింది. (క్లిక్: ముమ్మాటికీ తప్పును సరిదిద్దుకోవాలి) కాబట్టి, జనాభాలోని 80 శాతానికి పైగా వెనుకబడిన వర్గాల కమ్యూనిటీలకు, ఇతర మతపరమైన మైనారిటీ కమ్యూనిటీలకు రాజ్యాంగబద్ధ న్యాయస్థానాల్లో రిజర్వేషన్లు కల్పించాలనీ, వారికి తగిన స్థాయిలో ప్రాతినిధ్యం కల్పించాలనీ వీరు గౌరవ న్యాయ స్థానాలను, భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. ఈ డేటా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమ్యూనిటీల ఆందోళనను నిర్ధారిస్తోంది. హైకోర్టుల్లో, సుప్రీంకోర్టులో జడ్జీల నియామకానికి జాతీయ న్యాయ కమిషన్ ద్వారా తాజాగా శాసనం రూపొందించాలని వీరు కోరుతున్నారు. - జస్టిస్ వి. ఈశ్వరయ్య అధ్యక్షుడు, అఖిల భారత వెనుకబడిన వర్గాల సమాఖ్య, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి -
రిజర్వేషన్ల అమలులో అవకతవకలు
సమ సమాజం, సామాజిక న్యాయం కోసం రాజ్యాంగ నిర్మాతలు – పీడిత, అణగారిన, అణచివేతకు గురైన కులాలకు అధికారంలో వాటా ఇవ్వడానికి ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల అమలులో అధికారులు ఏదేదో సాకుతో రిజర్వేషన్ సూత్రాలకు, సిద్ధాంతాలకు వక్రభాష్యం చెబుతూ నిర్వచిస్తూ తూట్లు పొడుస్తూనే ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సాధికారత కల్పించడానికి ప్రవేశపెట్టిన రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయడానికి ప్రభుత్వంతో చర్చలు జరిపి జీవో నంబర్ 550–జీవో నంబర్ 519 జారీ చేయడం జరిగింది. 1986 నుంచి అనేక సర్క్యులర్స్ జారీ చేశారు. అయినప్పటికీ సుప్రీంకోర్టు తీర్పులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఉత్తర్వులకు రిక్రూట్మెంట్ అధికారులు వక్రభాష్యం చెబుతు ఈ వర్గాల ప్రయోజనాలను, అభివృద్ధిని కాలరాస్తున్నారు. ఇటీవల కాలంలో ఎం.బి.బి.ఎస్ అడ్మిషన్లలో, పంచాయతీరాజ్ సెక్రటరీ పోస్టుల నియామకాలలో, పోలీస్ నియామకాల్లో, టీఎస్పీఎస్సీ ద్వారా జరిగిన టీచర్ రిక్రూట్ మెంట్లో, సాంఘిక సంక్షేమ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా జరిపిన టీచర్ రిక్రూట్మెంట్లో ఎస్సీ,ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ల అమలులో అవకతవకలు,అక్రమాలు జరిగినట్లు వెలుగులోకి వచ్చాయి. దీనిపై బీసీ కమిషన్‌కు, ఎస్సీ/ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదులు వచ్చాయి. రిజర్వేషన్లు అమలులో రిక్రూట్ మెంట్ అధికారులు నాలుగు రకాలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. 1) ఆప్షన్ పేరుమీద – ఉద్యోగాల నియామకాలలో పోస్టు ఆప్షన్ పేరుమీద, శాఖ ఆప్షన్ పేరుమీద, జిల్లా ఆప్షన్ పేరుమీద– కాలేజి అడ్మిషన్లలో కాలేజి ఆప్షన్ పేరుమీద రిజర్వేషన్ల అవకతవకలు–అక్రమాలకు పాల్పడుతున్నారు. 2) రెండవది– లోకల్– నాన్ లోకల్ రిజర్వేషన్లు అమలు చేసేటప్పుడు ఎస్సీ,ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ల అమలులో తప్పుడు విధానం అవలంబిస్తున్నారు. 3) మూడవది– రెండవ లిస్టు– మూడవ లిస్టు ఆ తర్వాత వేసే క్రమంలో స్లై్లడింగ్–రివైజ్ చేయడం లేదు. 4) నాలుగవది–సెలక్షన్ సమయంలోనే సీనియారిటీ పేరుమీద 100 పాయింట్లు రోస్టర్ పాయింట్లలో ఫిక్స్ చేయడం పేరు మీద అన్యాయం చేస్తున్నారు. మొదటి పద్ధతిలో గ్రూప్–1, గ్రూప్–2 రిక్రూట్ మెంట్లలో వివిధ శాఖలలో కలిపి ఎక్కువ కేటగిరీల పోస్టులు ఉండటం వలన పోస్టుల ఆప్షన్ల పేరు మీద పోస్టు–పోస్టుకు రిజర్వేషన్లను వేరు, వేరుగా అమలు చేస్తున్నారు. దీని మూలంగా ఎక్కువ మార్కులు వచి్చన అభ్యర్థులు కూడా ప్రాదాన్యత గల పోస్టులను ఎంపిక చేసుకుంటే రిజర్వేషన్ కేటగిరి క్రిందకు వెళుతున్నాయి. అలాగే సోషల్ వెల్ఫేర్ గురుకుల టిచర్ రిక్రూట్మెంట్ బోర్డు జరిపిన టిచర్ పోస్టులలో కూడా ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, బి.సి వెల్ఫేర్ స్కూళ్ళ టిచర్ల రిక్రూట్ మెంట్లో ఆప్షన్ల పేరు మీద రిజర్వేషన్ వర్గాలకు అన్యాయం జరిగింది. మొత్తం రిక్రూట్‌మెంట్‌ను యూని ట్‌గా తీసుకొని మొత్తం పోస్టుల సెలక్షన్ చేసిన తర్వాత ఆప్షన్‌కు అవకాశం కలి్పంచాలి. కాని సెలక్షన్– ఆప్షన్ ఒకే సమయంలో ఇచ్చి అన్యాయం చేశారు. ఇక రెండవ పద్ధతి తప్పుడు నిర్వచనం చూస్తే లోకల్–నాన్ లోకల్ పేరుమీద రిజర్వేషన్ అమలు చేసే విధానం కూడా లోపభూయిష్టంగా ఉంది. మొదట నాన్ లోకల్–ఆ తర్వాత లోకల్ కేటగిరిలలో–మొదట ఓపెన్ కాంపిటీషన్ భర్తీ చేసిన తర్వాతనే రిజర్వేషన్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాలి. కానీ అలా కాకుండా నాన్ లోకల్ కోటాలో ఓపెన్ కేటగిరి, రిజర్వేషన్ కేటగిరి పోస్టులు భర్తీ చేసిన తర్వాతనే లోకల్ కోటా ప్రారంభించి భర్తీ చేస్తున్నారు. ఇది అన్యాయం. దీని మూలంగా ఎక్కువ మార్కులు ఉన్న రిజర్వుడు అభ్యర్థులు లోకల్ కోటాలో ఓపెన్ కాంపిటిషన్లో వస్తారు. కానీ మొదట నాన్ లోకల్ రిజర్వేషన్ కోటా భర్తీ చేయడంతో ఎక్కువ మార్కులు ఉన్న రిజర్వుడు అభ్యర్థులు నాన్ లోకల్లో రిజర్వేషన్‌లోకి వెళుతున్నారు. ఈ తప్పును సరిదిద్దడం లేదు. ఇక మూడవ పద్ధతిలోని అన్యాయం చూస్తే మొదటి లిస్టు, రెండవ లిస్టు, మూడవ లిస్టులు వేసేటప్పుడు ఈ వర్గాలకు అన్యాయం చేస్తున్నారు. రెండవ లిస్టు, మూడవ లిస్టు వేసేటప్పుడు స్లైడింగ్, రివైజ్ లిస్ట్ లాంటి ప్రక్రియలు చేపట్టకుండా అన్యాయం చేస్తున్నారు. మొదటి లిస్టులో రిజర్వేషన్లో వచి్చన అభ్యర్థులు కొందరు ఎక్కువ మార్కులు ఉన్నవారు. రెండు– మూడవ లిస్టులలో వచ్చే సరికి మార్కులను బట్టి ఓపెన్ కేటగిరికి వెళ్లి పోతారు. కాని అలా రివైజ్ చేస్తూ స్లై్లడింగ్ చేయడం లేదు. దీని మూలంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతుంది. 1992లో విద్యుత్ శాఖ వారు ఏఈ పోస్టుల నియామకాలలో రెండవ లిస్టు సంద ర్భంగా రివైజ్ చేయకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేశారు. ఇక విద్యా సంస్థల అడ్మిషన్లలో కూడా ఎం.బి.బి.ఎస్ అడ్మిషన్లలో కాలేజీ ఆప్షన్ పేరుమీద, పీజీ అడ్మిషన్లలో కోర్సు ఆప్షన్ పేరుమీద అన్యాయం చేస్తున్నారు. నాలుగో పద్ధతిలో అన్యాయం చూస్తే రోస్టర్ పాయింట్ పేరుమీద మెరిట్లో వచి్చన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ అభ్యర్థులను ఇరికించి అన్యాయం చేస్తున్నారు. పాయింట్ టు పాయింట్ ప్రకారం, మెరిట్ మార్కుల ఆధారంగా ఒకటి నుండి సీరియల్‌గా రిక్రూట్ చేయడం వలన ఓసీ పాయింట్లలో ఓసీని– ఆ తర్వాత వచ్చే బి.సి పాయింట్లలో ఎక్కువ మార్కులు వచి్చన బీసీలను రిజర్వేషన్ పాయింట్లలో ఫిక్స్ చేసి అన్యాయం చేస్తూవచ్చారు. దీనిని 1986–87 లోనే గుర్తించి బి.సి సంక్షేమ సంఘం పోరాటం చేయగా మార్పులు–చేర్పులు చేసి సరిదిద్దారు. ఇప్పటికి ఇంకా కొన్ని రిక్రూట్మెంట్ సంస్థలు రోస్టర్‌కు వక్ర భాష్యం చెబుతూ, రిజర్వేషన్లకు గండి కొట్టే కుట్రలు మానుకోవడం లేదు. ఖాళీలు భర్తీ చేసేటప్పుడు మెరిట్ లిస్టు మరియు రిజర్వేషన్ కేటగిరీలో లిస్టు వేరువేరుగా తయారు చేసిన తర్వాత రోస్టర్ కం మెరిట్ ప్రకారం అభ్యర్థుల జాబితాను తయారుచేసి నియామక పత్రాలు ఇవ్వాలి. కానీ అలా కాకుండా రిక్రూట్మెంట్ బోర్డుల నుండి వచ్చిన జాబితానే యధాతధంగా అమలుపరిచి తాము జారీ చేసిన ఉత్తర్వులను వారే తుంగలో తొక్కిపెట్టి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రిజర్వేషన్ల అమ లులో అవకతవకలకు పాల్పడుతున్నారు. వ్యాసకర్త: ఆర్. కృష్ణయ్య, అధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ‘ మొబైల్ : 90000 09164 -
‘మహా’ ప్రభుత్వానికి బాంబే హైకోర్టు చీవాట్లు
ముంబై: ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు ఉన్నాయంటూ పత్రికల్లో ప్రకటనలు జారీ చేసిన మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బాంబే హైకోర్టు చీవాట్లు పెట్టింది. ఈ అంశానికి సంబంధించి పలు పిటిషన్లు కోర్టులో పెండింగ్‌లో ఉన్నా కూడా ఎలా జారీ చేస్తారని తీవ్రంగా మందలించింది. ఇలాంటి బాధ్యతా రాహిత్యమైన చర్యలు మానుకోవాలని, పిటిషన్లను పరిష్కరించేందుకు కోర్టుకు కాస్త సమయం ఇవ్వాలని మండిపడింది. మరాఠాలకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సోమవారం విచారణ ఉందని తెలిసి కూడా ఆదరాబాదరగా ప్రకటన ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నరేశ్ పాటిల్, న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ కర్ణిక్‌లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుపడుతూ బాంబే హైకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్) ఇటీవల దాఖలయ్యాయి. మరాఠాలకు రిజర్వేషన్లపై మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటనలు జారీ చేసిందని పిల్ దాఖలు చేసిన న్యాయ వాది గుణరతన్ సదావర్తి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే మరాఠాల కోసం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతిని ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిందని చెప్పారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది వీఏ థొరాట్ వాదనలు వినిపిస్తూ.. ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తులు మాత్రమే ఆహ్వానించామని, పరీక్ష 2019 జూలైలో ఉంటుందని వివరించారు. అయితే ప్రకటన ఇవ్వాల్సిన తొందరేం వచ్చిందని, ఇందుకు కొద్ది రోజులు ఆగి ఉండాల్సిందంటూ కోర్టు మందలించింది. సాంకేతికంగా ప్రభుత్వానిది తప్పు కాదని, అయితే ఈ సమస్య తీ వ్రత దృష్ట్యా ప్రభుత్వం వేచి చూడాల్సి ఉందన్నారు. పిల్ వేసిన న్యాయవాదిపై దాడి.. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది గుణరతన్ సదావర్తిపై హైకోర్టు వెలుపల దాడి జరిగింది. మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసు అధికారులు తెలిపారు. మరాఠా వర్గానికి చెందిన ఓ వ్యక్తి గుంపులో నుంచి ముందుకు దూసుకొచ్చి ‘ఒక్క మరాఠా లక్షమంది మరాఠాలు’అని నినాదాలు చేస్తూ న్యాయవాదిని కత్తితో పొడిచాడని వివరించారు. అయితే అక్కడున్న న్యాయవాదులు, పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు జల్నా జిల్లాకు చెందిన వైజయంత్ పాటిల్‌గా గుర్తించారు. -
మరాఠాలకు ‘మహా’ వరాలు
ముంబై: విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోసం ఆందోళన చేస్తున్న మరాఠాలను శాంతింపజేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం పలు వరాలు ప్రకటించింది. మరాఠా యువతకు స్వయం ఉపాధి కోసం బ్యాంకులు ఇచ్చే రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీగా ఉండనుంది. ఎంఫిల్, పీహెచ్డీ విద్యార్థులకు ప్రత్యేక ఫెలోషిప్ అందించనుంది. మహారాష్ట్ర రెవిన్యూ మంత్రి చంద్రకాంత్ అధ్యక్షతన మంగళవారం సమావేశమైన కేబినెట్ సబ్‌కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. మరాఠా యువతకు బ్యాంకులు రుణాలకు సంబంధించి అన్నాభూ సాథే ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పథకం కింద బ్యాంకులకు గ్యారెంటీ ఇవ్వాలని నిర్ణయించారు. వార్షికాదాయం రూ.8 లక్షలు దాటని మరాఠా సామాజికవర్గం పిల్లలు వృత్తివిద్యా కోర్సుల్లో చేరితే ఫీజులో 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆర్థిక మంత్రి పాటిల్ తెలిపారు. ఈ జాబితాలో 608 వృత్తివిద్యా కోర్సుల్ని చేర్చినట్లు వెల్లడించారు. విద్య, ఉద్యోగాల్లో 16 శాతం రిజర్వేషన్ కోసం మరాఠాలు గత 11 రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మరాఠాలను మోసం చేయాలనుకోవట్లేదు దుందుడుకుగా లోపభూయిష్టమైన రిజర్వేషన్ చట్టాన్ని తీసుకొచ్చి తమ ప్రభుత్వం మరాఠాలను మోసం చేయాలనుకోవడం లేదని ఆర్థికమంత్రి సుధీర్ తెలిపారు. దీనివల్ల ఆయా చట్టాలను కోర్టులు కొట్టేసే అవకాశం ఉందన్నారు. మరాఠాల రిజర్వేషన్లను కోర్టులో సవాలు చేయలేని విధంగా అన్ని జాగ్రత్తలతో పటిష్టమైన చట్టాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. -
ఆగని మరాఠాల ఆందోళన
ముంబై: మహారాష్ట్రలో మరాఠాల రిజర్వేషన్ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. మరాఠ్వాడా ప్రాంతంలో మంగళవారం జరిగిన వేర్వేరు ఘటనల్లో ఒకరు ఆత్మహత్య చేసుకోగా, మరో 8మంది ఆత్మహత్యకు యత్నించారు. తాజా ఘటనతో ఈ ఆందోళనల్లో మృతి చెందిన వారి సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. బీడ్ జిల్లా వీడా గ్రామానికి చెందిన అభిజీత్ దేశ్‌ముఖ్(35) తన ఇంటి వద్ద చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. లాతూర్ జిల్లా ఔసాలో 8మంది కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించారు. -
మరాఠా ఆందోళనలో మళ్లీ హింస
సాక్షి, ముంబై/పుణె/ఔరంగాబాద్: విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్రలోని పుణెలో మరాఠాలు సోమవారం చేపట్టిన బంద్ హింసాత్మకంగా మారింది. రిజర్వేషన్ల కోసం నాందేడ్, ఔరంగాబాద్ ప్రాంతాల్లో ఇద్దరు మరాఠాలు ఆత్మహత్య చేసుకోవడంతో ఆందోళనకారులు రెచ్చిపోయారు. పుణెలోని చకన్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న 40 బస్సులకు నిప్పంటించారు. మరో 50 బస్సులతో పాటు పలు ప్రైవేటు వాహనాలను పూర్తిగా ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. అయినా అల్లరిమూకలు వెనక్కి తగ్గకపోవడంతో గాల్లోకి కాల్పులు జరిపారు. చివరికి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు 144 సెక్షన్‌ను విధించారు. ఈ ఆందోళనలు షోలాపూర్, ముంబైకి కూడా విస్తరించాయి. దీంతో సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను అధికారులు మోహరించారు. ఫడ్నవిస్ క్షమాపణ కోరుతూ.. రాష్ట్రంలో కొందరు మరాఠాలు హింసకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ క్షమాపణ చెప్పాలని కోరుతూ మరాఠా క్రాంతి మోర్చా అనే సంస్థ పుణె బంద్‌కు పిలుపునిచ్చిందని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బంద్ సందర్భంగా ర్యాలీ నిర్వహించిన ఆందోళనకారులు ఒక్కసారిగా రెచ్చిపోయి ఆస్తుల విధ్వంసానికి దిగారన్నారు. దీంతో పలువురు ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారనీ, కొందరైతే సమీపంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో దాక్కున్నారని వెల్లడించారు. నగరంలో అల్లర్లను అణచేసేందుకు ర్యాపిడ్‌యాక్షన్ ఫోర్స్‌ను రంగంలోకి దించామన్నారు. మరాఠాలకు రిజర్వేషన్ కోరుతూ వారం రోజుల క్రితం ఇదే సంస్థ పుణెలో ఆందోళన నిర్వహించిందన్నారు. గవర్నర్‌ను కలసిన కాంగ్రెస్ మరాఠాల ఆందోళన హింసాత్మక రూపం దాల్చిన నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్ రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుతో సమావేశమైంది. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అశోక్ చవాన్ నేతృత్వంలో గవర్నర్‌ను కలసిన నేతలు.. రిజర్వేషన్ల విషయంలో స్పష్టత ఇవ్వాల్సిందిగా ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఇద్దరి ప్రాణత్యాగం మరాఠాలకు ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 16 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల మరాఠా సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత ఆందోళనలు నిర్వహించాయి. కానీ రాష్ట్రంలో కొన్నిచోట్ల అవి హింసాత్మక రూపం దాల్చడంతో ఆందోళనల్ని విరమించాయి. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వ వైఖరిపై మనస్తాపం చెందిన ఔరంగాబాద్ వాసి ప్రమోద్ జైసింగ్(35).. ఆదివారం రాత్రి ముకుంద్వాడీ ప్రాంతంలో ఓ రైలు ముందు దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఈ విషయాన్ని ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా స్నేహితులకు తెలియజేశాడు. మరోవైపు నాందేడ్‌కు చెందిన మరో వ్యక్తి సోమవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
కేసీఆర్‌దే కపటప్రేమ
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ దీటైన కౌంటర్ ఇచ్చింది. ఈ విషయంలో తమ చిత్తశుద్ధిని నిందించే అర్హత కేసీఆర్‌కు లేదని, బీసీలపై టీఆర్ఎస్దే కపట ప్రేమ అని ఆరోపించింది. తన అసమర్థతను, చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు సీఎం కేసీఆర్ బట్టకాల్చి మా మీద వేసి మమ్మల్ని బదనాం చేయాలనే దుర్మార్గపు ప్రయత్నాలు చేస్తున్నారని విరుచుకుపడింది. నిజంగా సీఎం కేసీఆర్‌కు బీసీ రిజర్వేషన్ల అమలుపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాలని, ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపర్చాలని డిమాండ్ చేసింది. అవసరమైతే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, దామాషా పద్ధతిన బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని, తాము బేషరతుగా మద్దతిస్తామని ప్రకటించింది. బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా తాము కోర్టులో కేసు వేశామని చెప్పడం శుద్ధ అబద్ధమని, అసలు ఆ కేసులకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. ఈ విషయమై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడగా.. మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ, ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ బుధవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. 52 శాతం పెట్టాల్సింది: దాసోజు పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం కేసీఆర్‌కు ఇష్టం లేదని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ‘1999లో 34 శాతం రిజర్వేషన్లు పెట్టి చట్టాన్ని ఆమోదిస్తే 2018లోనూ ఇదే శాతాన్ని పెట్టడం వెనుక ఔచిత్యం ఏంటి? శాస్త్రీయ పద్ధతి కాకుండా పాత చట్టాన్ని కాపీ చేయడం ఏ మేరకు న్యాయం? జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని అనేక వేదికల మీద విజ్ఞప్తి చేశాం. సమగ్ర కుటుంబ సర్వేలో 52 శాతం బీసీలున్నారని చెప్పి 34 శాతం రిజర్వేషన్లు ఉండాలని చట్టంలో ఏ ప్రాతిపదికన పెట్టారు? అంటే మిగిలిన 18 శాతం మందికి రిజర్వేషన్లు అవసరం లేదని అనుకుంటున్నారా?’అని మండిపడ్డారు. ‘ఈ విషయంలో బీసీ ప్రజలు, కుల సంఘాలు లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి చిత్తశుద్ధిని ప్రశ్నించాల్సి ఉంది. 34 శాతం ఎలా ఇచ్చారో కొట్లాడాలి. పోరాటం చేయాలి. బీసీ కులాల వర్గీకరణ జరిగితే ముస్లింలు కూడా సర్పంచ్‌లు, ఎంపీటీసీలయ్యే అవకాశం వస్తుంది’అని పేర్కొన్నారు. ‘స్వప్నారెడ్డి అనే వ్యక్తి కేసు వేశారని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ కేసుతో కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదు. స్వప్నారెడ్డి అంటే కాంగ్రెస్ వ్యక్తి అంటున్నారు. మరి గోపాల్‌రెడ్డి ఎవరు? నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని గున్యాగుల ఎంపీటీసీనా కాదా.. ఆయన టీఆర్ఎస్ సభ్యుడా కాదా చెప్పాలి. మరి మీ సభ్యుడు కేసు ఎలా వేశారు.. మీరేమైనా వేయమని చెప్పారా?’అని ప్రశ్నించారు. కోర్టులెన్ని మొట్టికాయలు వేసినా కేసీఆర్‌కు సిగ్గురాదు: షబ్బీర్, పొంగులేటి కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా కేసీఆర్‌కు సిగ్గురాదని షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ‘2013 ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇప్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. 50 శాతం నిబంధనను పక్కనపెట్టి 61 శాతం రిజర్వేషన్లు అమలు చేశాం. ఇంత పెద్ద సమస్యపై కోర్టులో వాదనలు జరుగుతుంటే అడ్వొకేట్ జనరల్ ప్రభుత్వ పక్షాన ఎందుకు హాజరు కాలేదు. నేను చెప్పిందే చట్టం అని కేసీఆర్ అనుకుంటున్నందునే ఈ సమస్య. ఇప్పటికైనా ఈ విషయంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి’అని వారు డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌వి బోగస్ మాటలు: ఉత్తమ్ ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు. న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తే తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు’అని ఉత్తమ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రిజర్వేషన్లపై బోగస్ మాటలు మాట్లాడుతున్నారంటూ దుయ్యబట్టారు. ఎవరో హైకోర్టులో కేసు వేస్తే ప్రభుత్వం తరఫున సరిగా వాదనలు వినిపించలేక తమపై నెపం మోపుతున్నారని ఆరోపించారు. ‘ప్రతిపక్ష పార్టీలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసి చర్చ లేకుండా పంచాయతీరాజ్ చట్టం బిల్లు ఆమోదింపజేసుకున్నారు. చర్చ జరిగి ఉంటే బాగుండేది. అఖిలపక్షం ఏర్పాటు చేసి ఈ విషయంపై చర్చించాలి. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి’అని డిమాండ్ చేశారు. -
మా ఊళ్లో మా రాజ్యం
హైదరాబాద్: ‘ మా ఊళ్లో మా రాజ్యం’ పేరుతో ఆదివాసీ పోరాట సమితి నేతలు ఉద్యమానికి పిలుపునిచ్చారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే ప్రధానమైన డిమాండ్‌తో కొన్ని రోజులుగా ఆదివాసీలు పోరాటాలు చేస్తున్నారు. ఈ విషయంపై ఆదివాసీ నాయకులు తెలంగాణ రాష్ర్ట సీఎస్‌తో కూడా గురువారం చర్చించారు. సీఎస్‌తో ఆదివాసీల చర్చలు విఫలమయ్యాయి. ఎస్టీల జాబితా నుంచి లంబాడా కులస్తులను తొలగించేందుకు వీలు కాదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఆదివాసీ నాయకులు గురువారం రాత్రి నుంచే ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ విషయంపై ఆదివాసీ నాయకులు స్పందిస్తూ..ప్రభుత్వంతో చర్చలు విఫలమయ్యాయని, మా డిమాండ్లపై స్పష్టత రాలేదని, జూన్ 2న నిరసనలు తెలుపుతామని వెల్లడించారు. -
కాపులకు రిజర్వేషన్ కల్పించాలి
సాక్షి, కొత్తపల్లి: కాపులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించకుండా, బీïసీ–ఎఫ్‌లో చేర్చడం, బిల్లు పెట్టడం వల్ల ఏమీ ఉపయోగం లేదని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. కొత్తపల్లిలో ఉన్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి దొరబాబు ఇంటికి శనివారం అల్పాహారానికి హాజరయ్యారు. అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడుతూ ప్రభుత్వం అసిస్టెంట్ పోస్టులు 700 లకు మొదటి విడతగా నోటిఫికేషన్‌ను విడుదల చేసిందని రెండో విడతగా మరో 700 పోస్టులకు నోటిఫికేషన్ రెండు నెలల్లో విడుదల చేయనుందన్నారు. అలాగే పోలీసు శాఖకు సంబంధించిన పలు ఉద్యోగాలకు అవకాశం కల్పిస్తోందన్నారు. అయితే కాపు యువతీ, యువకులకు సంబంధించి బీసీ–ఎఫ్‌లో చేర్చి అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ పూర్తి స్థాయిలో రిజర్వేషన్ కల్పించడం లేదన్నారు. రాష్ట్రంలో జారీ చేసే పోస్టులకు రాష్ట్రపతి సంతకం అవసరం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ఉద్యోగాలకు మాత్రమే రాష్ట్రపతి సంతకం, పార్లమెంట్ తీర్మానం, కేంద్ర బీసీ కమిషన్ రిపోర్టు కావాలన్నారు. రాష్ట్ర పరిధిలో విడుదల చేసే నోటిఫికేషన్‌కు రాష్ట్రపతి సంతకం లేకుండా అసెంబ్లీలో తీర్మానం చేసి కేబినేట్లో చర్చించినప్పటికీ రిజర్వేషన్ కల్పించకపోవడం వల్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అర్హత లేదన్నారు. కేంద్రానికి పంపుతున్నామనడం ఎంత వరకూ సబబన్నారు. ఇది కేంద్రానికి పంపనవసరం లేదన్నారు. రాష్ట్ర పరిధిలో విడుదల చేసే నోటిషికేషన్‌ను ఆమోదించే సర్వాధికారాలు సీఎంకు ఉన్నాయని, దీనిపైనే ఉద్యోగాలకు రిజర్వేషన్ కల్పించాలని లేఖ రాశానని, ఆయన నిర్ణయం కోసం ఎదురుచూడాల్సి ఉందన్నారు. మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆనాల సుదర్శన్, మండల యువజన అధ్యక్షుడు మారిశెట్టి బుజ్జి, తలిశెట్టి వెంకటేశ్వరరావు ఉన్నారు. -
కాంగ్రెస్ ప్రతిపాదనలకు ఓకే: హార్దిక్ పటేల్
న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే.. పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించటంపై కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనలకు అంగీకరిస్తున్నట్లు పటీదార్ ఉద్యమ (పాస్) నేత హార్దిక్ పటేల్ చెప్పారు. ‘పాస్ కోర్ కమిటీతో సమావేశం తర్వాత రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రతిపాదనలకు అంగీకరించాలని నిర్ణయించాం. గుజరాత్‌లోని మా సామాజిక వర్గంలోని ఇతర నేతలతో దీనిపై చర్చిస్తాం. రాజ్యాంగ పరిధిలోనే పటేళ్లకు రిజర్వేషన్లు కావాలనేది మా లక్ష్యం. రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఫార్ములా బాటలోనే నడిస్తే.. ఇతర సామాజిక వర్గాలకూ ప్రయోజనం చేకూరుతుంది. దీన్నే గుజరాత్ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ చేర్చనుంది.’ అని హార్దిక్ పటేల్ పేర్కొన్నారు. -
పటేళ్లను ఆకట్టుకునేందుకు...
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే మద్దతిస్తామని పటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ స్పష్టం చేసిన నేపథ్యంలో.. తిరిగి పటేళ్లను దగ్గర చేసుకునేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు. గుజరాత్లో పటేళ్లు మొదట్నుంచీ బీజేపీతోనే ఉన్నారని.. ఈ వర్గంలోకి కొందరు మాత్రం రిజర్వేషన్ల పేరుతో పార్టీకి వ్యతిరేకంగా మారారని ప్రధాని పేర్కొన్నారు. గురువారం గాంధీనగర్‌లోని అక్షరధామ్ ఆలయంలోని ‘బొచనసన్‌వాసీ శ్రీ అక్షర్‌పురుషోత్తం స్వామినారాయన్ సంస్థ’ (బీఏపీఎస్) రజతోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడనప్పటికీ.. పటేళ్లు ఆరాధించే స్వామినారాయణ్ వర్గానికి చెందిన స్వామీజీలతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ‘పటేళ్లు ఈ స్వామినారాయణ్ వర్గాన్ని చాలా ఆదరిస్తారు. పటేళ్లు సంప్రదాయంగా, దీర్ఘకాలంగా బీజేపీతో కలిసే ఉన్నారు. కానీ ఇందులోని ఓ వర్గం పార్టీపై వ్యతిరేకతతో ఉంది’ అని మోదీ పేర్కొన్నారు. బీఏపీఎస్ చీఫ్ స్వామీ మహరాజ్ (ఈ ఏడాది ఏప్రిల్‌లో అస్తమించారు) తన జీవిత కాలంలో 1200 దేవాలయాలను నిర్మించారని.. ఇవి కేవలం దేవాలయాలు మాత్రమే కావని సంస్కృతి, ఆధ్యాత్మికత విలసిల్లే కేంద్రాలని ప్రధాని తెలిపారు. తను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు స్వామీ మహరాజ్‌తో.. సరైన సమయంలో ప్రాజెక్టులను పూర్తిచేయటంపై గుజరాత్ అధికారులకు క్లాసులు చెప్పించిన విషయాన్నీ మోదీ గుర్తుచేశారు. కాంగ్రెస్‌కే మా మద్దతు: హార్దిక్ పటేల్ గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే మద్దతుంటుందని పటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ పటీదార్లకు బహిరంగంగానే మద్దతు తెలియజేస్తున్నందునే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ‘ఇప్పుడు మా పటేళ్లంతా బీజేపీ పతనానికే మద్దతు తెలుపుతున్నారు. ప్రజలు తెలివైన వారు. బీజేపీకి ఓటేయవద్దంటే.. ఆ ఓటు ఎవరికి వేయాలో (పరోక్షంగా కాంగ్రెస్‌ను ప్రస్తావిస్తూ) వారికి తెలుసు’ అని అన్నారు. -
గద్దె దక్కదన్న భయంవల్లే..
తెలుగు రాష్ట్రాల ప్రజాసంఘాల జేఏసీ కన్వీనర్ డి.సుభాష్‌చంద్రబోస్ ముద్రగడ ఉద్యమానికి సంఘీభావం కాపులను వెంటనే బీసీల్లో చేర్చాలని డిమాండ్ కిర్లంపూడి : కాపులను బీసీల్లోకి చేరిస్తే ఎక్కడ రాజ్యాధికారం కోల్పోతామో అనే భయం వల్లే చంద్రబాబు ఆ అంశంపై కాలయాపన చేస్తున్నారని తెలుగురాష్ట్రాల ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ డి.సుభాష్ చంద్రబోస్ అన్నారు. మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను ఆదివారం ఆయన కలిసి కాపు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో అలసత్వం వహిస్తున్నారన్నారు. కాపులను బీసీల్లోకి చేర్చే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కాపులను బీసీల్లోకి చేర్చడం వల్ల ఎవరికీ నష్టం చేయకూడదనే విషయం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆనాడే చెప్పారన్నారు. తక్షణమే కాపులను బీసీల్లోకి చేర్చాలని డిమాండ్ చేశారు. కాపులను బీసీల్లోకి చేర్చడం అంశంపై త్వరలో ఉస్మానియా యూనివర్సిటీలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ముద్రగడ ఉద్యమానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు ఇస్తాయన్నారు. ఆయన వెంట ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులు బాలు నాయక్ తదితరులు ఉన్నారు. -
హార్ధిక్ పటేల్‌పై ధ్వజమెత్తిన ఆర్ఎస్ఎస్
పటేల్ (పటీదార్) కులస్తులను ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ రెండు నెలల కిందట ప్రారంభమైన ఉద్యమంపై ఆర్ఎస్ఎస్(రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) తొలిసారిగా స్పందించింది. ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న హార్దిక్ పటేల్ పై తీవ్రస్థాయి విమర్శలు కురిపించింది. పటేల్ ఉద్యమం జరుగుతున్న తీరుపై మండిపడింది. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ జాతీయ అధికార ప్రతినిధి మన్మోహన్ వైద్య సంఘ్ వార్తాపత్రిక 'సాధన'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంస్థ అభిప్రాయాన్ని వెల్లడించారు. సామాజిక సమానత్వాన్ని సాధించేతవరకు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని ఆర్ఎస్ఎస్ స్పష్టంచేసింది. అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్ఛ, డిమాండ్ల కోసం పోరాడే హక్కు అందరికీ ఉంటాయని, అయితే ఒకరు చేసే ఉద్యమం వల్ల జాతీయ సమగ్రతకు ముప్పువాటిల్లుతుందనుకుంటే దానిని తప్పనిసరిగా ఖండించవలసిందేనని సంఘ్ పేర్కొంది. 'మా సత్తా ఏమిటో యావత్ భారతానికి చూపెడతాం.. రావణ లంకను తగలబెడతాం..' అంటూ హార్దిక్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఉదహరించిన ఆర్ఎస్ఎస్.. ఆ వ్యాఖ్యలు దేశభక్తులందరినీ ఆందోళనకు గురిచేశాయిని అంది. హార్దిక్ ఆధ్వర్యంలో ఆగస్ట్ 25న అహ్మదాబాద్‌లో జరిగిన భారీ సభ, అనంతరం చెలరేగిన హింసలో 10 మంది మరణించడం లాంటి పలు అంశాలను కూడా మన్మోమన్ వైద్య ప్రస్తావించారు. కాగా, ఈ ఇంటర్వ్యూ పొందుపర్చిన 'సాధన' ప్రతి సెప్టెంబర్ 19న మార్కెట్ లోకి రానుంది. ఇంటర్వ్యూలోని వైద్య వెల్లడించిన అంశాలు ఆర్ఎస్ఎస్ అభిప్రాయాలేనని మరో అధికార ప్రతినిధి ప్రదీప్ జైన్ స్పష్టం చేశారు.